స్తీవాద పత్రిక 'భూమిక'

Streevada Patrika Bhumika
ఇప్పుడే ఈ ప్రింట్ మాగజైన్ చందా ఇక్కడే కినిగెపై ఆన్లైనులో కట్టండి, నేరుగా ప్రతి సంచికా పబ్లిషరునుండే మీ ఇంటికి తెప్పించుకోండి!

Choose your subscription from below options
Description

భూమిక గురించి

భూమిక ప్రారంభ సంచిక 1993 జనవరి నెలలో విడుదలైంది. సుదీర్ఘమైన ఈ పదిహేనేళ్ళ ప్రయాణం వెనుక మాకెన్నో అనుభవాలున్నాయి. ఒక ప్రత్యామ్నాయ పత్రికగా, ఒక సీరియస్ మాగజైన్‌గా భూమికను బతికించుకుకోవడానికి మేము పడిన శ్రమ, సంఘర్షణ మాటల్లో వర్ణించలేనిది. అయితే ఈ రోజున తెలుగులోనే కాక యావత్ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా `భూమిక’ ప్రాచుర్యం పొందడం మాకెంతో గర్వకారణమైన విషయం. మేము పడిన కష్టానికి, ఖర్చు చేసిన కన్నీళ్ళకి తగిన ప్రతిఫలం లభించిన తృప్తి దొరికింది.

భూమిక నేపథ్యం:

1980 దశాబ్దంలో తెలుగు సాహిత్యంలోకి వెల్లువలా దూసుకొచ్చిన స్త్రీవాదం, సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్ని ప్రభావితం చేసింది. తెలుగు దినపత్రికలో స్త్రీల పేజీలను ఏర్పాటు చేయవలసిన అనివార్య పరిస్థితిని స్త్రీవాదం కలగచేసింది. ఈ పేజీల నిండా స్త్రీవాద కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యేవి. స్త్రీవాద సిద్ధాంత చర్చలు తీవ్ర స్థాయిలో జరిగేవి. ఉధృతంగా సాగిన స్త్రీవాద ఉద్యమాలు, ప్రచారంలోకి వచ్చిన స్త్రీవాద ఆలోచనలు ,స్త్రీల సాహిత్యంలో వస్తున్న పరిణామాలు ఇవన్నీ కూడా భూమిక ఆవిర్భావానికి కారణలయ్యాయి. అలాగే ప్రచార వ్యవస్థలో స్త్రీల సమస్యలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వటం, వార్తా పత్రికలలో స్త్రీల శీర్షికలు నడవటం లాంటివి ఎక్కువైనప్పటికీ ఇవన్నీ కూడా పితృస్వామిక విలువల మూస పద్ధతులకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా వుండడం కన్పిస్తుంది. దీనివల్ల ఒక పక్క స్త్రీల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కన్పించినా, అణిచివేతకు మూలమైన విలువల పునాది మాత్రం యధాతధంగానే వుండి పోయింది. ఏ అంశం మీది చర్చలైనా పితృస్వామిక భావజాలానికి సమ్మతమా, కాదా అనే దానికి లోబడి మాత్రమే ఉండేవి. స్త్రీల వాస్తవ సమస్యల చిత్రణకోసం, స్త్రీల దృష్టికోణం నుంచి స్త్రీ సమస్యను అంచనా వెయ్యడం కోసం ఒక సమగ్ర పత్రిక అవసరం చాలా వుందని భావించి `భూమిక’ రూపకల్పన చేయడం జరిగింది.

ISSN 2347 - 7369 Streevada Patrika Bhumika

Contact: bhumikahyd@gmail.com

Language:
Telugu
శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక ప్రజాసాహితి మాసపత్రిక దర్శనమ్ మాస పత్రిక స్తీవాద పత్రిక 'భూమిక' వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక మన ఆరోగ్యం కుటుంబ ఆరోగ్య సంక్షేమ మాసపత్రిక మిసిమి మాసపత్రిక
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

the free pdf preview's option are bad. we can't judge a book by just seeing some first 10 pages.
at least the contents have to be present and 5-10 pages of the 1st or 2nd chapter also have to be there.

the preview's option on kinige are bad. we can't judge a book by just seeing some first 10 pages.
at least the contents have to be present and 5-10 pages of the 1st or 2nd chapter also have to be there.

It is not downloadable.

Sir how to read online

Please send satya harichandra book

Subscribe
Browse