Description


"నీ ఆటలే ఆడుతాం.... నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ.... జై తెలుగు తల్లీ!!"
------
మీ కోసం ఓ సరికొత్త తెలుగు ఆట జోడించు!

* * *

"జోడించు" (త్వరగా జోడించు జతపరచి ఉంది!)


♣ భారతదేశంలో ఎక్కడికైనా కినిగె నుంచి తెప్పించుకోండి.
♣ మీ పిల్లలకు ఇవ్వగల అత్యుత్తమ కానుక ఈ "జోడించు" ఆట.
♣ మీ పాఠశాలకు ఇవ్వదగ్గ యోగ్యమైన బహుమతి ఈ "జోడించు" ఆట.
♣ మీ కమ్యూనిటీ హాల్లో, మీ ముందుగదిలో తప్పక ఉండాల్సిన ఆట ఈ "జోడించు"

* * *

"జోడించు" - పదాల మాయాజాలం

ప్రపంచంలో మొట్టమొదటి "పూర్తి" తెలుగు పదాల ఆట


★ తెలుగు పదాలతో మునుపెన్నడూ ఆడనట్లు ఆడగలిగే ఆట!
★ భాషాజ్ఞానాన్ని తెలివితేటలను పెంపొందించే ఆహ్లాదకరమైన ఆట!!
★ పదాలను జోడించడంలో ఎనలేని సరికొత్త సవాళ్ళు!!!

★ తెలుగు బోధించడానికి, నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన పరికరం కూడా!!!!

* * *

ఇలా తెలుగు నేర్చుకుంటూ తెలివితేటలను పెంపొందించుకోవడం ఎంతో ఆహ్లాదకరం!

"జోడించు" - మహా సరదాగా తెలుగు పదాలతో రకరకాలుగా ఆడుకునే ఆట. ఈ విద్యాపరమైన ఆటలో క్రొత్త క్రొత్త సవాళ్ళను ఎదుర్కొంటూ భాషాజ్ఞానంతో పాటు, తర్కించే శక్తి కూడా పెరుగుతుంది. "జోడించు" ఆడుతున్నప్పుడు ఆసక్తికరమైన చర్చలతో క్రొత్త విషయాలు నేర్చుకునే సావకాశాలెన్నో ఎన్నెన్నో! ఇంక అసలు సంగతి: అంతా తెలుగే. అందుకే కానీయండి, మీ విద్యార్ధులను/పిల్లలను, ఈ పదాల మాయాజాలంలో ముందుకు సాగిపొమ్మనండి!

ఈ ఆటలో భాషలో ఉన్న ఏ అక్షరమైనా (గుణింతములు, సంయుక్తాక్షరములతో సహా) చేయొచ్చు!

ఎలా ఆడటం?

పది సంవత్సరాలు పైబడిన పిల్లలు ఇద్దరు నుంచీ నలుగురు వరకూ ఈ ఆట ఆడవచ్చు.
1. ఆటగాళ్ళు మూడు రకాల బిళ్ళలు (అచ్చులు, హల్లులు; గుణింతం ఒత్తులు; ఒత్తులు) వాడి పదాలు చెయ్యాలి.
2. ఆటగాళ్ళు వంతులు తీసుకుంటూ ఆట బోర్డుపై ముందే ఉన్న పదములకు జోడించి పదాలు చెయ్యాలి.
3. ఆటగాళ్ళు పదములను, బిళ్ళల పాయింట్లను బోనస్ గళ్ళను తెలివిగా వాడుతూ, వీలైనన్ని ఎక్కువ పాయింట్లు సంపాదించేందుకు ప్రయత్నించాలి.

* * *

ఈ జోడించు ఆటలోనే, "త్వరగా జోడించు అనే మరో చిన్న ఆట ఉంది. మీరు కేవలం "త్వరగా జోడించు" ఆటనే కొనాలనుకుంటే ఇక్కడ నొక్కండి.

కాపీరైట్, పేటెంట్ హక్కులు:


© 2010 Out-Box Edutainment Pvt. Ltd.
Patents Granted and pending: PCT/IN2007/000472; US 12/421,807; GB2455697; SL 152359
www.jodinchu.in