
మనపూర్తిగా నవ్వాలనుకుంటూ,టీవీ నవ్వులు ఇంటర్నెట్ గజిబిజి నుంచి మీ బిజీ లైఫ్ నుంచి జాలీ మూడ్ లోకి రావాలనుకుంటే ఈ కథలు చదవండి.
" ఈనాడు" కథ నాలుకలు మొలుస్తున్నాయిలోలా మీ నాలుకలు పెరగడం లేదుగా ?
పాతాళభైరవి ప్రత్యక్ష్యమైతే ఏం కోరుకుంటారో ఈ ఇష్టం ...
ఇంకా మూడవనగరం సైబరాబాద్ ఏర్పడని రోజుల్లో జంటనగరాల్లో రోడ్డుమీద గుర్రాలు.ఎడ్లబండ్లు...పెట్రోలు బ్యాంకులు మూతబడి గుగ్గిళ్ల స్టాండ్లు అయ్యాయి.స్కూటర్లు కార్లు సమస్త ద్విచక్ర త్రిచక్ర చతురుచక్ర వాహనాలు తుక్కులో అమ్ముడుపోతున్నాయి...ఈ నగరానికిఏమైందో తెలుసుకోండి ?
మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలూ లేదా,ప్రాచీన చరిత్ర తీయగేయాలి..అనే పరిస్థితి రాకూడదు కదా...అనుకుంటే సరదాగా నవ్వుకోవడానికి,నవ్వుకుంటూ ఆలోచించుకోవడానికి నవ్వుల ప్రిస్క్రిప్షన్ విజయార్కె గారి " నరుడా ఏమి నీకోరిక ?
నిరర్థకమైన వాటికోసం కూడా ఎంతో డబ్బు వెచ్చిస్తాం..కానీ మన ఆరోగ్యాన్ని గుర్తించేలా చేసి కాన్సర్ ప్రమాదాన్ని సూచించే విషయాలు వున్న పుస్తకం కోసం కొంత సమయాన్ని వెచ్చించి ఈ పుస్తకాన్ని చదవలేమా? ఒక్కసారి ఆలోచించండి.ఈ పుస్తకం నాకే కాదు మా మిత్రులకు కూడా ఉపయోగపడింది.వారిని ఎలర్ట్ చేసింది.వారి కుటుంబంలో ఒకరికి వున్న క్యాన్సర్ ని ముందే గుర్తించేలా చేసింది.
గ్రహాంతరవాసితో ప్రేమలో పడ్డ హీరో ...పెళ్లయ్యాక తన (హీరో సిద్ధార్థ) ప్రతిరూపం ఆమె (గ్రహాంతరవాసి)కడుపులో రూపుదిద్దుకున్నాక కనిపించకుండా అదృశ్యమైన ప్రహేళిక...?ఈ ప్రపంచంలో కనిపెట్టలేనిది ఏమిటి?అనే గ్రహాంతరవాసుల అన్వేషణ..వాళ్ళు కనిపెట్టలేకపోయినది ఏమిటో తెలిసాక మన మనసులో భావోద్వేగానికి గురవుతాయి.ఒక సినిమా చూస్తోన్న అనుభూతి.అక్షరాల వెంట కళ్ళను పరుగెత్తించే థ్రిల్లర్ క్యూ...
పెచ్చుపెరిగిపోతోన్న కిడ్నాప్ ల నుంచి మన పిల్లలను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరి మీద వుంది.ఉదయం స్కూల్ కు వెళ్లిన బిడ్డ సాయంత్రానికి తిరిగిరాకపోతే ఆ తలిదండ్రుల గుండెకోత వర్ణనాతీతం.ప్రతీ ఒక్కరూ చదవవలిసిన పుస్తకం ...కిడ్నాపర్లున్నారు జాగ్రత్త.
"జైలుగోడల మధ్య హీరో సుమన్" ఒక స్టార్ హీరో ఎలా పరిస్థితుల మధ్య చిక్కుకుపోయింది..ఎలా పోరాడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నది కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.ఆంధ్రభూమి వీక్లీ లో అప్పుడు సంచలనం సృష్టించింది.ఈ పుస్తకం వ్యక్తిత్వవికాసకోణంలో చూస్తే వ్యక్తిత్వవికాస పుస్తకంలా అనిపిస్తుంది.
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం నిర్దోషిగా బయటకు రావడం ...వెనుక వున్న నేపథ్యం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది.