
ఇందులో ఏమున్నాయో పట్టికలా ఇస్తే అనువుగా వుండేది.
నేను వెతుకుతున్న "బ్రాహ్మణీకం" ఇందులో లేదు.
నరేష్ గారు,
మీరిప్పటి వరకూ తెలియదు. ఇకమీదటేప్పుడు మిమ్మల్ని మరచిపోలేను.
"తెరా నామ్ ఏక్ సహారా?!" ఒక అద్భుత కావ్య గానం. ప్రేమ కథా పానం.
మళ్ళీ మళ్ళి చదవాలన్న మనసు ఉబలాటం ఆపుకోలేకున్నాను.
అద్భుతమైన రచన! రచన అనొచ్చా! అది మీ హృదయ గానం. మీరయితే వందశాతం అక్షరాల్లోకి వంపారు, పాఠకుడిగా నేనెంత తాగుతానో చూడాలి.
ఎవరి రివ్యూలు, ముందుమాటలూ, వెనుక మాటలూ చదవకుండా దీన్ని చదివా.
మొదట ప్రతివాక్యంలో వున్న సిమిలీలు గడాగడా చదివే నా అలవాటుకు పదే పదే బ్రేకులు వేస్తుంటే మరీ ఇంతగానా అని విసుగు వచ్చింది.
అయితే ఆ తర్వాత అందులో లీనమయిపోయా.. చివరికంటా చదవకుండా మనసాపుకోలేకపోయా. తను అనుభవంచకుండా ఇలా రాయడేలని దృడ నిశ్చయానికి వచ్చా. చివరలో తెలిసింది అది తన కథే అని. అప్పుడు మరింతగా హృదయం నీరయిపోయింది.
అద్భుతమైన కథనం. ప్రతివాక్యమూ ఓ కవిత్వం. ఎన్నని వాక్యాలు అండర్లైను చేసుకోను, పుస్తకమంతా అవే అయితే!
కినిగెలో eBook చదివా. కానీ అసలు బుక్కు తెప్పించుకొని మన అలమరాలో వుంచుకోవాల్సిన పుస్తకం.
కథ సామాన్యమైందే .. అయితే భావాలను వెలిబుచ్చిన తీరు, గాడత.. వావ్ అది ప్రేమ కథా గానం!...
నామిని "మిట్టోరోడి కథలు" చదివినప్పటి నుండి ఆయన కథలు ఏవీ మిస్ కాకూడదని ఒట్టు పెట్టుకున్నా.
అంతగా నచ్చుతాయి ఆయన రచనలు నాకు.
ఇప్పుడు "మూలింటామే" కినిగెలో దొరుకుతుందని తెలియగానే ఎంత పని ఒత్తిడిలో వున్నా వెంటనే కొనడం చదవడం అయిపోయింది. మళ్ళీ చదవాలి, మళ్ళి మళ్ళీ చదవాలి.
అదొక పల్లె భారతం. నూటపద్దెనిమిది పుటల్లో ఎన్నెన్ని పాత్రలు, ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని కుట్రలు, ప్రేమలు, పంతాలు, సంభందాలు...
పల్లెల్లో మనుషుల స్వభావాలని, మంచినీ, చెడ్డనీ, అమాయకత్వాన్నీ, కోపాలనీ, ప్రేమలని...అన్నిటినీ సిరాగా మార్చి అక్షరాలుగా ఒలికించారు నామిని గారు.
రాయలసీమ వారికయితే త్వరగా ఆ మాండలికము అర్థమవుతుంది. మిగతావారు కేవలం ఒకటో రెండో పేజీలు చదివి బెదిరిపోకండి. కథలోకి మీరు లీనమయ్యాక మీరే రాయలసీమ వాసులయిపోతారు. అది వేరొక మాండలికంలో వున్నదన్న సంగతే మరచిపొతారు.
ఇది అన్యాయం. NRI కాపీకి RI కాపీకి ఇంత తేడానా?
NRIలలో కూడా సాహిత్యాభిరుచిలో ధనికులై, ధనంలో బీదలై వుంటారయ్యా!
ఇది అన్యాయం. NRI కాపీకి RI కాపీకి ఇంత తేడానా?
నాకిదే కావాలి. ఇది ఇండియాలో మాత్రమే ఎందుకమ్ముతున్నారు?
అధ్బుతమైన కథలు.
ఇందులో నా బాల్యం కనపడ్డది, నా వూరు, ఆ రైతులు, ఆ వెతలు అన్నీ కళ్ళ ముందు కదిలాయి.
ఇందులో కొన్ని కథలు మైనారిటీ కథలయితే కొన్ని మైనారిటీ పాత్రలున్న మెజారిటీ కథలే! ప్రతి కథ ముగింపు జల్లు మనిపిస్తుంది. కళ్ళు నీళ్ళతో నిండిపోతాయి.