Comment(s) ...

విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్.ప్రతీపాత్రకు ఒక ఐడెంటిటీ ఉండేలా రాసారు రచయిత.ఎమోషన్స్ ఉత్కంఠ నవలను ఆసాంతం చదివేలా చేసింది.చివరలో ఇచ్చిన ట్విస్ట్ కొత్తగా వుంది.ఒక మాస్ సినిమాకు కావలిసిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా వున్న నవల.

మూడు దశాబ్దాలకు పూర్వమే మత్తుమందుల ప్రమాదాన్ని డ్రగ్స్ కు సంబంధించిన అంశాన్ని తీసుకుని ఒక థ్రిల్లర్ నవలగా రాయడం గొప్ప విషయం.తన కూతురు అని తెలియక తండ్రిగా నాటకమాడి కూతురిని ఉరి శిక్ష వరకు నడిపించుకువెళ్లి తీరా తన కూతురే అని తెలిసాక సిబిఐ చీఫ్ గా అతను తీసుకున్న నిర్ణయం చాలా కన్విన్సింగ్ గా చెప్పారు రచయిత.

నవ్వడం కన్నా నవ్వించడం క్లిష్టమైన ప్రక్రియ,కండరాలు కదిలి,నవ్వు పెదవులపై వచ్చి,మనసు ప్రశాంతంగా మారేలా చేసే నవ్వుల కథలు " నరుడా ఏమి నీ కోరికలో" బీపీల్డు వున్నాయి.ఉద్ఫహరణకు..మగాహంకారంతో " అలవాటుగా భార్యను "ఒసే దేభ్యపు మొహం దానా ?అనబోయాడు.వాయిస్ ఎగ్జిట్ అవ్వక ముందే అతని నాలుక రెండు పార్టులైంది...ఓ బుల్లినాలుక మొలుచుకొచ్చింది...నగరమంతా నాలుకల ఫీవర్ మొదలైంది...వైరస్ లా...నాలుకలు మొలుస్తూనే వున్నాయి..నాలుకలు మొలుస్తున్నాయి కథలో హాస్యంతో పాటు ఆలోచనా కలిగించింది.
నవ్వడం పేద్ద గొప్పేమిటి?అన్నాడతగాడు ... "అయితే ఒకరోజంతా పాచిపోయిన పేస్ట్ లా కాకుండా కోల్గేట్ పేస్ట్ యాడ్ లా నవ్వి చూపించమంటూ.....సవాలు విసిరింది సుస్మిత...పందెం మొదలైంది..అతగాడికి నవ్వడం కూడా ఎంత కష్టమో తెలిసొచ్చింది..హౌ..ఎలా? నవ్వు కథ చదివితే(నే) తెలుస్తుంది.నవ్వడం ఎంత కష్టమో...
పై ఫొటోల్ని వ్యక్తి ని నేను కొనుక్కున్న కారణంగా అన్ని హక్కులు నాకే చెంది వున్నాయి,ఇట్టి వ్యక్తితో లింకులు గట్రా పెట్టుకున్న,నా అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నా చట్టప్రకారం శిక్షార్హులు ..ఇట్లు మిసెస్ ముక్కంటి..ఆ దెబ్బతో నగరంలో చాలా మంది మొగుళ్ళ జీవితాల్లో హుధూద్ తుఫాన్ వచ్చింది..ఎందుకో తెలుసుకోవాలంటే " అల్ రైట్స్ రిజర్వ్ డ్" కథ చదవాలి.
ఇలాంటి బోల్డు కథలు బోలెడు నవ్వులతో |నరుడా ఏమి నీ కోరిక"

ఇందులోని కథలు చదివాకా మనిషి దేవుడయ్యాడు.కానీ..ఎందుకో అర్థం అయ్యింది.ఇవి మంచి కథలు మాత్రమే కాదు మనసును హత్తుకునే కథలు.ఆస్తు ఆస్తు కథ థ్రిల్లింగ్ గా ఉంది.పిల్లల యవ్వనం వృద్ధులకు,వృద్ధుల వృద్ప్యం పిల్లలకు వచ్చే వరం ఇచ్చిన దేవుడికి ,ఇలాంటి కథ రాసిన రచయితకు శతకోటి వందనాలు.అన్ని కథల్లో కొత్తదనం కనిపిస్తుంది.
*యాభై సంవత్సరాలకు పైబడిన వాళ్ళు "బామ్మా లాలిపాట డాట్ కామ్ "కు కావలెను...పత్రికలో వచ్చిన ఆ ప్రకటన వెనుక వున్న ఆంతర్యం ఏమిటి ?ఇలాంటి డాట్ కామ్ లు ఉంటే...?
*నేను చేసిన చివరిహత్య నా త...మ్ము...డి...ని ..ఆ మంగళసూత్రం ఎగ్జిబిట్ గా కోర్ట్ లో వుంది..ఈ అన్నయ్య రక్తప్రక్షాళనతో నా చెల్లెలి పెళ్ళి కానుకగా అందించండి...ప్లీజ్ హేంగ్ మీ
*కోట్లాది సంపద వున్న బాస్ ఓ అనాథ అయిన వృద్ధురాలిని తల్లిగా దత్తత తీసుకున్నాడు.తన స్టాఫ్ కు పరిచయం చేస్తూ అందరూ తమ తల్లులతో వచ్చి తన తల్లి చేతుల మీదుగా నగదు బహుమతి అందుకోవాలని కండిషన్ పెట్టాడు.కపర్థి అద్దెతల్లితో వెళ్ళాడు.బాస్ తల్లి "అతడే (కపర్థి) తన కొడుకని తెలిసినా తెలియనట్టే వుంది...ఎందుకు?
*మీకు ఇల్లు కావాలా?ఆ పక్షులకు గూడు కావాలా?తేల్చుకోమని చెప్పిన కొడుకు మతాలకు ఆ తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ఏమిటి?ఆ తల్లిదండ్రుల త్యాగాన్ని చూసిన ఆ పక్షులు ఏం చేసాయి?
స్నేహితులకు మనసైనవారికి ఇవ్వవలిసిన మంచి కానుక ఈ పుస్తకం

జానపద సాహిత్యం మీద మమకారాన్ని పెంచే నవల.రాజులు గంధర్వులు కాల్పనిక జగత్తులో ఊయలలూపిన నవల.ముఖ్యంగా మణిమేఘన పాత్ర,మేఘాలు పక్కకు తప్పుకోవడం,జలఖడ్గం ,పులిమీద స్వారీ పిల్లలలు పెద్దలను చదివించేలా చేసిన నవల.పుస్తకరూపంలో ఉంటే మరింత బావుండేది.

సరసమైన కథలకు సరసమైన అర్థం చెప్పిన రొమాంటిక్ మెమోరీస్ ను పాఠకులకు అందించే కథలు.అసభ్యతకు తావు లేకుండా భావోద్వేగాలను కలిగించే కథలు.
*ఆ దంపతులకు శోభనం రాత్రి
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి క "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.ఇంతకూ ఆ పందెం ఏమిటంటే ..?
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది కథేమిటి?
చదివిస్తూ,దాంపత్యజీవిత రహస్యాలను అనుభూతులను విడమర్చి చెప్పిన కథలు.

దాంపత్యజీవితంలో దంపతులు కోల్పోయే స్వీట్ మెమోరీస్ ను గుర్తుచేసే గుడ్ క్వాలిటీస్ ఉన్న గుడ్ నైట్ స్టోరీస్.ఇలాంటి భార్య/భర్త ఉంటే బావుండని అనిపించే అద్భుతమైన సరసమైన రొమాంటిక్ స్టోరీస్.తలుపుచాటు సిగ్గు,క్యా సీన్ హై,అందాల క్రీడ,ఏమి వింతమోహమో,అర్థం కానీ ఆమె,ముచ్చట్లాట ప్రతీ కథ రోమాంచితం.ఎమోషన్స్ తో కనెక్ట్ అయ్యే బ్యూటిఫుల్ స్టోరీస్.

అసంతృప్తికి అర్థం చెప్పిన పుస్తకం.అసంతృప్తిని జయిస్తే జీవితంలో ఎంతో ఇతుకు ఎదగవచ్చు అనిపిస్తుంది.వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన పుస్తకం,రచయిత తన అనుభవాలను జోడిస్తూ చేసిన విశ్లేషణ అద్భుతంగా వుంది.జీవితమే ఒక అనుభవాల విశ్వవిద్యాలయం కదా.ఇలాంటి పుస్తకాలను చదివితే జీవితం అంటే ఏమిటో తెలిసి వస్తుంది.

ఇలాంటి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి.మరికొందరిని ముందుకు నడిపిస్తాయి.నిస్తేజంగా వుండే యువతకు,నిరాశతో ఉండేవారికి ఈ పుస్తకం ఒక స్ఫూర్తిబాట.కృషి ఉంటే రుషులు మహాపురుషులు దేశాధినేతలు అవుతారని చెప్పే గొప్ప పుస్తకం.మోదీ జీవితాన్ని విశ్లేషించిన తీరు రచయిత పరిణితిని,తెలియజేస్తుంది.ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకంగా కూడా భావించవచ్చు.

ఎందరో ప్రముఖులను, పేదవారిని నా,నీ అనే బేధం లేకుండా బలి తీసుకుంటున్న క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి ,క్యాన్సర్ నిర్ధారణ అయితే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో,వివరంగా ప్రామాణికంగా వివరించిన తీరు ప్రశంసనీయం.క్యాన్సర్ మన దరికి రాకుండా ముందుజాగ్రతగా గుర్తించడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

నవల చివరివరకూ ఆసాంతం ఆసక్తికరంగా చదివించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.మేన్ రోబో "నభూతో నభవిష్యతి " ఒక యంత్రంలో భావోద్వేగాలకను సృష్టించే క్రమంలో వచ్చే సన్నివేశాలు హృద్యంగా వున్నాయి.షర్మిల పాత్ర సరదాగా ఉంటూనే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు.సులోచన పాత్ర మెరుపులా మెరిసినా సులోచన మాట్లాడిన మాటలు చదువరుల హృదయాలను స్పృశిస్తాయి.అగ్నిహోత్ర పాత్ర మేన్ రోబో పాత్ర రెండూ అద్భుతం.ఆంత్రాక్స్ నేపథ్యంలో వచ్చిన ఈ నవల ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాను గుర్తు చేసింది.
ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.216 పేజీల ఈ నవల కేవలం అరవై ( 60 / ) కే ( డిస్కౌంట్ లో ) అందించడం అభినందనీయం.
ఈవిల్ సిటీ సృష్టి రచయిత సృజనాత్మకతకు అద్దం పడుతుంది.ఈ నవల చదివాకా ఆ ప్రపంచంలో నుంచి బయటకు రావడానికి సమయం పడుతుంది.ముఖ్యంగా డిస్ట్రాయ్ ఛాంబర్ లో షర్మిల మేన్ రోబో మధ్య సన్నివేశం అత్యద్భుతం

కొత్తరకమైన ప్రేమకథ.ఆహ్లాదంగా వుంది.రణగొణధ్వనులకు దూరంగా స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉండాలో రాసారు.నేను క్యాన్సర్ ని జయించండి చదివాను.మీ స్వీయ అనుభవాన్ని ధైర్యంగా ఇతరులకు చెప్పిన విధానం చాలా బావుంది.మీ రచనలు ఎందరికో ధైర్యాన్ని కలిగిస్తాయి.ఆ స్వరస్వతీదేవి కృప మీ మీద వుంది.

మద్రాస్ లో సుమన్ కు అప్పట్లో చాలా ఫాలోయింగ్ ఉండేది.సుమన్ అరెస్ట్ వార్త అప్పట్లో సంచలనం.రకరకాల వార్తలు రూమర్లు వచ్చాయి.ఆంధ్రభూమి వీక్లీ లో జైలు గోడలమధ్య హీరో సుమన్ చదివాక సుమన్ గారి పట్ల అభిమానం పెరిగింది.ఒక నిర్దోషి బాధ తెలిసింది. సుమన్ ను అభిమానులకు మరింత దగ్గర చేసిన సీరియల్ చాలా ఏళ్ళ తర్వాత చదవడం జరిగింది. సుమన్ జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం లాంటిది.

చిన్నపుడు చదివిన ప్యాకెట్ సైజు డిటెక్టివ్ పుస్తకాలు గుర్తొస్తున్నాయి.భయపెట్టే కథలు భయపెడుతూనే చదవాలని అనిపిస్తాయి అని ఈ కథలు చదువుతుంటే అనిపిస్తుంది.ఇలాంటి కథలు రాసే రచయితలు ఇప్పుడు అరుదు. హారర్ ను ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చే కథలు.

చక్కని చిక్కని కథలు .అపరాధపరిశోధన హారర్ హాస్యం,హ్యూమన్ టచ్ ,సాహసం,ఇలా ప్రతీకథ ఆసక్తిదాయకంగా ఉత్కంఠభరితంగా వున్నాయి.ఒకే పుస్తకంలో ఇన్ని వైవిధ్యభరితమైన కథలు చదివే అవకాశం కలిగింది.ధన్యవాదాలు స్మార్ట్ టచ్ చదివాకా దంపతులు కోల్పోతున్నది ఏమిటో అర్థమవుతుంది.కొత్త ఆలోచనతో రాసిన కథ.
యాప్స్ వచ్చాక మనలో బద్ధకం ఎలా పెరిగిపోతుందో చెప్పే కథ ఫ్యూచర్ టె(సె)న్స్ @యాప్స్,కరోనా గురించి రాసిన కథ చదివాకా మనసు ఆలోచించడం మొదలు పెడుతుంది.
ప్రతీ కథలో కొత్తదనం ,చక్కని శైలి .పేరుకు తగ్గ కథల పుస్తకం.

డిటెక్టీవ్ నవలలు చదివేవాళ్ళకు విపరీతంగా నచ్చుతుంది.ముఖ్యంగా సిద్దార్థ సుగాత్రి మధ్య వచ్చే సన్నివేశాలు,రైటర్ నవలను నడిపించిన తీరు చాలా బావుంది.గుడ్ అటెంప్ట్

క్యూ నవలకు ధీటుగా ఉన్న నవల..ఇందులో ఉన్న ఆంత్రాక్స్ పాయింట్ ఇప్పటి కారొనకు దగ్గరగా ఉన్న.ఒకప్పటి చైనావాళ్ళ జీవియుధాల ప్రయోగం ఆసక్తిగా వుంది.మేన్ రోబో.షర్మిల మధ్య ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా రాసారు రచయిత .ఈవిల్ 1 ఈవిల్ 2 సిటీస్ గురించి,వర్ణన బావుంది.థ్రిల్లర్స్ క్రైమ్ ఫిక్షన్ ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చుతుంది.waiting for manrobo part 2

తెలుగులో వచ్చిన డిఫరెంట్ నవల.ఎమోషన్స్ ఉత్కంఠ చక్కని కథనం ఉన్నాయి.గ్రహాంతరవాసుల మధ్య నడిచిన థ్రిల్లర్ ప్రేమకథ.గ్రహాంతరవాసులకు సంబంధించిన ఎన్నో విశేషాలు అందించారు రచయిత.ఒక హాలీవుడ్ చిత్రాన్ని చూస్తున్నట్లుంది.తెలుగులో ఇలాంటి నవలాచిత్రాలు రావాలి. ఫ్యాక్షన్ క్రైమ్ బదులు

ఏకబిగిన చదివించిన నవల.నవలలోని ప్రతీపాత్ర మన కళ్ళముందే కనిపిస్తుంది.కథను మలుపు తిప్పే పాత్రలు తప్ప అనవసరమైన వర్ణనలు సన్నివేశాలు లేవు.ఒక వ్యక్తిత్వవికాస రచన,ఒక మంచి నవల కలిపి చదివినట్టుంది.
సత్యవర్ధన్,సాకేత్,ఆముక్తమాల్యద పాత్రలు చదువరుల మనసులో నిలిచిపోతాయి. ప్రతిమనిషిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే నవల.ఆలోచించేలా చేసే నవల.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Print book kavali sir

Very Good Poems on Abdul Kalam SIR. SIR we miss you.

వ్యక్తిత్వ వికాసానికి,జీవితంలో ఎదగడానికి,ప్రపంచాన్ని చదవడానికి పనికివచ్చే పుస్తకం ...మీ ఇష్టం.!

Subscribe
Browse