Comment(s) ...

"మంచుపొర వెనుక ఓ దివ్య తేజస్సును... ఎన్నో నిద్రలేని రాత్రిళ్ళను చూసిన నా కనుల‌కు భ్రమా? వాస్తవమా? భ్రమలాంటి వాస్తవమా? ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.
ఆ దివ్యతేజస్సు నాతోపాటు లోపలికి వచ్చింది. త‌లుపు వాటంతటవే మూసుకున్నాయి. గదిలోని లైటు క్రమక్రమంగా అంతర్ధానమవుతోంది. లైటు వెలుతురు స్థానంలో దివ్యతేజస్సు కిరణాలు...
‘‘ఎవరూ?’’
‘‘నేను దేవుడ్ని...’’
‘‘దేవుడా?
నువ్వు... నువ్వున్నావా?’’
నా అనాలోచిత ప్రశ్న...
ఆ తర్వాత..?
దేవుడికి రచయితకు మధ్య ఏం జరిగింది?
ఆసక్తికరమైన ప్రారంభం.వ్యక్తిత్వవికాస రచనలో కొత్త ఒరవడి ఈ పుస్తకం.

హారర్ ను ఇష్టంగా చదివేవారికి ఖచ్చితంగా నచ్చుతుంది.డెబ్బై ఎనభై ప్రాంతాల్లో హారర్ డిటెక్టివ్ క్రైమ్ పుస్తకాల హవా నడిచింది.అద్దె లైబ్రరీలో పుస్తకాలూ తీసుకునేవాళ్ళం. డ్రాక్యులా సృష్టికర్త ...ఎవరో తెలుసా?
*ఎప్పుడో మూడువందల సంవత్సరాల క్రితం నాటి మమ్మీ కళ్ళు తెరిస్తే...ఒక్కక్షణం ఒళ్ళు గగుర్పొడుస్తుంది..
మెక్సికోసిటీలో అదే జరిగింది..లాంటివో విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి,విదేశాల్లో ఇలాంటి నమ్మకాలు తక్కువేమీ కాదు.ఇంట్రెస్టింగ్ గా చదివించే పుస్తకం.టక్ టక్ టక్ కథ చాలా ఏళ్ళ క్రితమే ఆంధ్రజ్యోతిలో చదివిన గుర్తు.
ఆఫ్రికాలోని మత ఆచారాలు, విశ్వాసాల నుంచి ఏర్పడిందే 'వూడూ' మంత్రవిద్య.*భయంకరమైన దెయ్యాల పండుగ..ఇలా *హారర్ సాహిత్యాన్ని" ఆసక్తిగా చదివే పాఠకులకు బాగా నచ్చుతుంది.

సరసమైన కథలకు అర్థం చెప్పిన రొమాంటిక్ స్టోరీస్.అసభ్యతకు తావు లేకుండా హార్ట్ టచ్ గా ఉన్న శృంగార కథలు
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.ఇంతకూ ఆ పందెం ఏమిటంటే ..?
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది కథేమిటి?
ప్రతీకథలో అందమైన రొమాంటిక్ ఫ్లేవర్.

నవల చదువుతుంటే కళ్ళముందు దృశ్యాలు కనిపించేలా రాయడం గొప్ప శైలి.ప్రతీపాత్ర కళ్ళముందు కనిపిస్తుంది.కనికట్టు చేస్తుంది.డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ నవల.ఒక మాఫియా అండర్ వరల్డ్ డాన్ యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ గా మారి మాఫియాను ఏరి పారేయడం నవలలోని గొప్ప ట్విస్ట్.
దానికి సంబంధించిన నేపథ్యాన్నిరచయితా కారణాన్ని చెప్పిన తీరు బావుంది.

డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో ఈ మధ్య విరివిగా వస్తున్నా పత్రికవార్తలను చూస్తే వీటి తీవ్రత అర్థమవుతోంది.ముప్పయేళ్ల క్రితమే రచయిత డ్రగ్స్ నేపథ్యంతో రాసిన టార్గెట్ నవల చాలా బాగుంది.

మనసులోని బాధలను మటుమాయం చేసే హాస్యకథలు. ఆహ్లాదభరితంగా ఆలోచనాత్మకంగా ఉన్న కథలు.

ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన సరసమైన నాణ్యమైన కథలు.భార్యాభర్తల మధ్య పెరిగిపోతున్న దాంపత్యజీవితాన్ని దగ్గరి చేసి దాంపత్యజీవితానికి హృద్యంగా రోమాంచితంగా అర్థం చెప్పిన కథలు.
క్యాండిల్ లైట్ శోభనం,ఆపిల్,ఆరు తొమ్మిది శుభరాత్రి,ఓన్లీ ఫర్ యువర్ సేక్ ఇ., రొమాన్స్ ,ప్రతీకథ ఒక అందమైన భావాన్ని ,దాంపత్య జీవితంలో గొప్పదనాన్ని తెలియజేస్తుంది.

ప్రతిమనిషి జీవితంలో అసంతృప్తి ఉంటుంది.ఆ అసంతృప్తి నిర్మాణాత్మకంగా ఉంటే,విజయం మనవైపే ఉంటుంది అన్న ప్రాక్టికల్ థింకింగ్ ను అందించిన పుస్తకం.మనషి జీవితంలో ఎన్ని రకాలైన అసంతృప్తులు ఉన్నాయో సోదాహరణంగా రచయిత వివిరించిన తీరు బావుంది.తన అనుభవాలను విశ్లేషిస్తూ వ్యకిత్వ వికాసానికి కొత్తకోణాన్ని జోడించారు.కన్నడభాషలోనూ వచ్చిన ఈ పుస్తకం చదువరులను ఆలోచింపజేస్తుంది.

తెలుగులో కొత్త తరహా నవల.ఒక నవల ఎలా రాయాలో ఎంత అద్భుతంగా రాయాలో తెలియజేసిన నవల.పాత్రలన్నీ సజీవంగా కళ్ళముందు నిలుస్తాయి.హాలీవుడ్ సినిమా రేంజ్ లో నవల వుంది.ఉత్కంఠభరితమే కాదు పాఠకులను వెంటాడే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.

అపరాధ పరిశోధన నవలల్లో భిన్నమైన నవల.కథనం పరుగులు పెట్టించింది.నిడివి తక్కువ వుంది.అయినా నవల ఆసక్తి సడలకుండా చదివిస్తుంది.మరికొన్ని పేజీలు ఉంటే బావుండేది.

గ్రహాంతరవాసుల మీద వచ్చిన విభిన్నమైన నవల.క్యూ గ్రహం నుంచి వచ్చిన ప్రహేళికను సైంటిస్ట్ సిద్దార్థ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం,హ్యూమన్ ఎమోషన్స్ ను గ్రహాంతర వాసులు ప్రయోగాల పేరుతో ప్రహేళిక గర్భంలో ఊపిరిపోసుకుంటున్న బిడ్డను చంపాలని అనుకోవడం,చిత్రంగా ఏలియన్ హ్యుమానాయిడ్ రోబో అయిన ప్రహేళికలో ఎమోషన్స్ సెంటిమెంట్స్ మొదలవ్వడం,ఆమె కనిపించకుండా పోవడం,సిద్దార్థ్జ అన్వేషణ,జర్నలిస్ట్ వాసంతి పరిశోధన,ప్రహేళిక శరీరం రెండుగా చీలిపోయి అతుక్కోవడం,ఊహించని మలుపులతో ఉత్కంఠభరితంగా రాసిన రచయిత గొప్పతనం క్యూ నవలలో కనిపిస్తుంది.పదహారేళ్ళ క్రితం వచ్చిన ఈ నవలలో మాదిరి ఈ మధ్య సోఫియా అనే హ్యుమానాయిడ్ రోబోను సైంటిస్టులు సృష్టించడం గమనార్హం..మేన్ రోబో క్యూ రెండు విభిన్నమైన నవలలు.

ఈ నాటి యువత ఈ నవల చదవాలి.ఒక్కోఅక్షరం రచయిత మనసుపెట్టి రాసారు.కృతఘ్నులు అయినా పిల్లలకు చెంపపెట్టు ఈ నవల.
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
ఇలాంటి సంభాషణలు హృదయం వున్నవాళ్లను కంటతడి పెట్టిస్తాయి.ఈ నవల స్వాతి అనుబంధ నవలగా చదివాను. కొడుకులు చదవాల్సిన నవల.

పెద్దలు పిల్లలు హాయిగా చదువుకునే నవల.తెలుగు భాషను మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి జానపద నవలలు రావడం శుభపరిణామం.

నేటి యువతరానికి ఈ నవల ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. అద్భుతమైన రచనాశైలి.పాఠకుల హృదయాల్లో నిలిచిపోయే పాత్రలు.మనిషి జీవితంల్ని ఎమోషన్స్ ను చక్కగా ప్రజంట్ చేసారు రచయిత.ఆముక్తమాల్యద పాత్ర మన పక్కింటి అమ్మాయిలా అనిపిసుంది.ఆలోచించేలా చేస్తుంది.స్వామీజీల చీకటి చరిత్రలను ఇన్నేళ్ళైనా మనం చూస్తూనే వున్నాం.మార్పు ఎప్పుడో ఒకప్పుడు మొదలవుతుందని ముప్పయేళ్ల క్రితమే చెప్పిన ఈ నవల ఆహ్లాదాన్ని ఆలోచనను కలిగిస్తుంది .

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి పబ్జి లాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడే అవకాశం ఇవ్వడం కన్నా ఇలాంటి ఆహ్లాదకరమైన సాహసోపేత నవల చదివించాలి.తెలుగు చదవడం మర్చిపోతున్న వాళ్లకు,జానపద నవలలు పరిచయం లేని వారికీ ఈ నవల కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.తెలుగు భాష మీద అభిమానాన్ని,జానపద నవలల పట్ల ఆసక్తిని పెంచుతుంది.
ఒక సరికొత్త ఫాంటసీలోకి ఊహాప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల మాయాశిల్పం...మంతఖడ్గం .

Don't miss!
Free goodies!
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

How can we download purchased book

I tried to read your book online but couldn't succeed madam. Please send link or soft copy to my WhatsApp madam.

Rangachari, Hyderabad

Where is the buy option on all the books ?

Subscribe
Browse