Comment(s) ...

అద్భుతమైన కథల సమాహారం.మనసుతో చదివే మంచి కథలు.పాఠకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.

ఎవరికీ నచ్చిన కథ వాళ్ళు చదువుకునే అవకాశం స్మార్ట్ ఫోన్ కథల పుస్తకంలో వుంది.రొమాన్స్ ఇష్టపడే వాళ్ళు స్మార్ట్ టచ్ కథ చదువుకోవచ్చు.క్రైమ్ కథ ఇష్టపడే వాళ్ళు మైండ్ గేమ్ చదువుకోవచ్చు,కామెడీ కథ ఇష్టపడే వాళ్ళు చైనా కరోనా ,ఫ్యూచర్ టె(సె)న్స్ @యాప్స్ కథ చదువుకోవచ్చు. ,మనసును కదిలించే కథ చదువుకోవాలని అనుకునే వాళ్ళు,మరణానికి ముందు,సంభవామి యుగేయుగే కథ చదువుకోవచ్చుఅడ్వెంచర్ కథను ఇష్టపడే వాళ్ళు.అడ్వెంచర్ @ డెత్ వ్యాలీ,చిన్నారులు ఇష్టపడే జానపద బాలల కథ ఇష్టపడేవాళ్లు మహామంత్రి ఎంపిక “చదువుకోవచ్చు.,మొత్తంగా రకరకాల ఎమోషన్స్ జోనర్స్.బోల్డు కథలు .తక్కువ వెల లో విలువైన కథలు.వెల కట్టలేని కథలు.ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందించే కథలు .ఓ సారి ట్రై చేసి చూడండి.

జేమ్స్ హాడ్లీ చేజ్,నవలలను అభిమానించని పాఠకులు ఉండరు.తెలుగులో ఆరుద్ర ,గిరిజా శ్రీభగవాన్,విశ్వప్రసాద్ కొమ్మూరి సాంబశివరావు,మధుబాబు లాంటి గొప్ప రచయితలు రచయితలు ,రాసిన డిటెక్టివ్ నవల్స్ ఒక స్వర్ణయుగం.అడుగడుగునా ఉత్కంఠతో చదివించేవి.
ఇప్పుడు డిటెక్టివ్ నవలలు రాసేవాళ్ళు చదివేవాళ్ళు తక్కువయ్యారు.ఇలాంటి సమయంలో డిటెక్టివ్ సిద్దార్థ చదివాను.ఆకట్టుకునే కథనం.నవల చదువుతుంటే విజువలైజ్డ్ గా సినిమా చూస్తున్నట్టు వుంది.సుగాత్రి పాత్ర సిద్దార్థ పాత్రలు నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ లా వున్నాయి.ఈ నవలలో డేవిడ్ జేమ్స్ హారర్ అవసరమా? అనిపించింది కానీ రచయిత్రి తెలివిగా కథలో ఇమిడ్చారు.కన్విన్సింగ్ గా రాసారు.ఒక ప్లజంట్ డిటెక్టివ్ నవల చదువుతున్నట్టు అనిపించింది. చాలా చిన్న నవల.మరిన్ని పేజీలు ఉండాల్సింది.

మానవత్వం ఉనికిని అనుబంధాలను ప్రశ్నిస్తూ,వార్థక్యానికి అసలైన నిర్వచనం చెబుతూ,ధైర్యాన్ని స్ఫూర్తిని నింపిన నవల.కొత్త అల్కోచనతో ఎందరికో ధైర్యాన్ని కలిగించే నవల.
ఈ మాటలు హృదయాన్ని స్పృశిస్తాయి.వాస్తవాన్ని మనముందు ఉంచి కన్నీళ్లు తెప్పిస్తాయి.కనీసం ఒక్కసారైనా కంటతడి పెడదాం.
'దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది.
*అక్కడున్న సమాధులను కదిలిస్తే ఎన్ని కథలు వెతలుగా చెబుతాయో, అక్కడ తగలబడుతున్న చితులను అడిగితే ఎన్ని కన్నీళ్ళను అక్షరాలుగా అనువదిస్తాయో...?
**అదో స్మశానం ..దాన్ని అనుకుని శరణాలయం..స్మశానమే వారికి దేవాలయం...

నేటి యువతకు స్ఫూర్తిని కలిగించే పుస్తకం.పార్టీలతో ,రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం,ఒక చందమామ కథలా.ఎక్కడా బోర్ కొట్టకుండా చదివించే శైలి .మోదీ జీవితంలోని సంఘటనలను విశ్లేషించిన తీరు బావుంది.

నరేంద్ర మోదీ పుస్తకం భావితరాలకు ఒక కరదీపిక.ఒక చాయ్ వాలా దేశ ప్రధానిగా,ప్రపంచస్థాయి నాయకుడిగా,యువతను,ప్రజలను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా స్ఫూర్తిగా ఎలా నిలిచారో వివరణాత్మకంగా విశ్లేషిస్తూ రాసిన పుస్తకం.ప్రతీఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలి.ఒక వ్యక్తి సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎలా ఎదగవచ్చో చూపిన వ్యక్తిత్వ వికాస పుస్తకం .

ఏకబిగిన చదివించిన నవల.ఆసాంతం ఉత్కంఠభరితం. సెడక్ట్రస్ పాత్ర మనసును మెలిపెట్టేసింది.మేన్ రోబో షర్మిల మధ్య ప్రేమ డిస్ట్రాయ్ ఛాంబర్ లో మేన్ రోబో,అగ్నిహోత్ర నేపథ్యం. మొత్తంగా నవల చదువుతుంటే హాలీ వుడ్ సినిమా చూస్తన్నారు వుంది.

అద్భుతమైన జానపద నవల.రక్తపాతాలు ప్రేమలు టీవీ సీరియల్స్ లో అతి,వీటికి దూరంగా కొత్తలోకంలో విహరింపజేసిన నవల.మణిమేఘన పాత్ర కళ్ళముందు కనిపించింది.మేఘాలు పక్కకు తప్పుకోవడం ,పులి మాట్లాడ్డం అన్నీ కొత్తదనంతో అద్భుతమైన శైలితో తీర్చిదిద్దిన రచయితకు ధన్యవాదాలు.

Don't miss!
Free goodies!
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

kinige is careless, never reply and fix the issue

Dear sir I want book of భారతీయ గణిత శాస్త్ర చరిత్ర both parts. My phone number is 7780766097. Pl advice

I don't understand how to read free pdf or how to buy the book

Subscribe
Browse