Comment(s) ...

రాజకీయ నాయకులకు ప్రేరణ కలిగించే ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో వున్నాయి.ఒక సామాన్యుడు ఒక చాయ్ వాలా దేశానికి ప్రధాని కావడం వెనుక ఉన్న కృషి,నిజాయితీ సేవాభావం ప్రతీఒక్కరికీ ఆదర్శం.ఇలాంటి పుస్తకాలు చరిత్రలో నిలబడతాయి.కొన్ని సంఘటనలను విశ్లేషించిన తీరు చాలా బావుంది.రచయిత ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

సరిక్రొత్త కథాంశం .తెలుగులో ఇటవంటి నవల చదవలేదు.నిజంగా ఇలా జరిగితే బావుంది,అనిపించేలా వుంది.సిద్దార్థ పాత్ర ,ప్రహేళిక,హ్యుమానాయిడ్ రోబో గా అనిపించలేదు,మన పక్కింటి అమ్మాయిలా అనిపించింది.ప్రహేళిక భూమ్మీద దిగినప్పుడు యాక్సిడెంట్ లో ఆమె దేహం రెండుముక్కలై తిరిగి అతుక్కోవడం హాలీ వుడ్ సినిమా దృశ్యంలా కళ్ళముందు కనిపించింది.నవల మొత్తం ఉత్కంఠభరితంగా వుంది.జర్నలిస్ట్ వాసంతి పాత్ర సూపర్బ్.

మాయాశిల్పం మంత్రఖడ్గం అద్భుతమైన నవల.మిగితా జానపద నవలకు భిన్నంగా సరికొత్త ప్రపంచాన్ని కళ్ళకు కట్టిన నవల,మణిమేఘన పాత్ర ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.సాహసాలు మేఘాలు మాట్లాడుకోవడాలు ,మాయాశిల్పంగా మారిన మణిమేఘన సన్నివేశాలు రచయితా సృజనాత్మకత అద్దం పట్టాయి.మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే నవల.

ప్రతీకథ ఆహ్లాదాన్ని కలిగిస్తూనే మనసును కుదిపేస్తోంది.ప్రముఖ పత్రికల్లో వచ్చిన ఈ కథలు ఒక వ్యక్తిత్వ వికాస పాఠాలుగా చదువరుల మనస్సులో నిలిచిపోతాయి.ముఖ్యంగా ఆస్తు ఆస్తు,మనిషి.పక్షి,ప్లీజ్ హ్యాంగ్ మీ,నుదుట సూర్యోదయం,జ్ఞానం ,మనిషి దేవుడయ్యాడు,కానీ కథలు.

ఇంట్రెస్టింగ్ గా చదివించిన నవల.బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏకబిగిన చదివించిన నవల.మంచి థ్రిల్లర్ అంతకు మించి ఎమోషనల్ హార్ట్ టచ్ నవల.

పగలు ప్రతీకారాలు లాంటి రెగ్యులర్ క్రైమ్ మాఫియా నవలలకు భిన్నంగా ఈ నవల వుంది.వీల్ చైర్ నుంచే మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ ..గాడ్ ఫాదర్ పాత్రలో ఎన్నో షేడ్స్ వున్నాయి.ఎమోషన్స్ వున్నాయి.ఉత్కంఠభరితంగా నవల సాగింది.ఒక మాఫియా అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ యాంటీ మాఫియా చీఫ్ గా మారి మాఫియా ప్రపంచాన్ని కూకటివేళ్లతో పెకిలించి విధంగా పాత్రను మౌల్డ్ చేయడంలో రచయిత తన సృజనాత్మకత చూపించారు.
విభ్రమ పాత్రను అల్లరిగా అమాయకత్వంగా చూపిస్తూనే చాలా మెచ్యూర్డ్ గా మైండ్ గేమ్ తో అన్యాయాలకు మాఫియా అరాచకాలకు ఎదురుతిరిగిన నేపథ్యం సూపర్బ్.
ఈ సీరియల్ నవల పాతికేళ్ల క్రిందటే ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో సీరియల్ గా చదివిన గుర్తు.
ఒక పూర్తిస్థాయి విభిన్నమైన మాఫియా ఎంటర్టైనర్ అండర్ వరల్డ్ నవల.

రొమాన్స్ హారర్ క్రైమ్ అడ్వెంచర్ జానపద కామెడీ హ్యూమన్ టచ్ ఇలా ఎవరికీ నచ్చిన కథలు వాళ్ళు చదువుకోవచ్చు.ముఖ్యంగా స్మార్ట్ టచ్ కథ.స్మార్ట్ భూతం ప్రత్యక్షం కావడం ,రొమాన్స్ కు పాస్ వర్డ్ ,ఒక క్రిమినల్ మైండ్ గేమ్ ,చైనా కరోనా ,మన జీవితాలతో ఆటాడుకునే యాప్స్ ,మరీ ముఖ్యంగా పొద్దున్నే వచ్చి అలారం లా మనుష్యులను నిద్రలేపి ఆలోచన ,ఇలా అన్ని ఎమోషన్స్ ను అందించిన కథల పుస్తకం .బోల్డు కథలు .బోల్డు ఎంటర్టైన్మెంట్ స్మార్ట్ టచ్@ హార్ట్ టచ్

చాలా ఇన్ఫర్మషన్ వుంది. నవల మొదటినుంచి చివరి వరకు చదివించేలా చేసింది. అగ్నిహోత్ర పాత్ర చదువుతుంటే దేశభక్తి కళ్ళు చెమర్చేలా చేస్తుంది.మేన్ రోబో పాత్ర .చిరస్థాయిగా నిలుస్తుంది.హాలీ వుడ్ సినిమా చూస్తున్నట్టు వుంది.నవల చదువుతుంటే.షర్మిల పాత్ర ,సులోచన పాత్ర తీర్చిదిద్దిన విధానం సూపర్.

మీరు రాసిన పుస్తకం నేను క్యాన్సర్ ని జయించాను చదువుతుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి.ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో క్యాన్సర్ ను జయించారు.మీ ధైర్యాన్ని పాఠకులకు కూడా ఈ పుస్తకం ద్వారా పంచారు.చక్కని భాష చక్కని భావ వ్యక్తీకరణ.ధన్యవాదాలు అభినందనలు.

ఆంగ్ల నవల స్థాయిలో రాసారు.ఎర్విక్ పాత్ర ,అనిరుద్ర పాత్ర కళకు కట్టినట్టుగా రాసారు.ఉపిరి సలపనివ్వని ఉత్కంఠ .నవల ఆసాంతం చదివించేలా వుంది.ఒక నవల ఇంత బాగా రాయవచ్చు అని రాసి చూపించారు.అభినందనలు.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Not downloaded please solve this problem

Great one.Thanks for uploading.

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి పబ్జి లాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడే అవకాశం ఇవ్వడం కన్నా ఇలాంటి ఆహ్లాదకరమైన సాహసోపేత నవల చదివించాలి.తెలుగు చదవడం మర్చిపోతున్న వాళ్లకు,జానపద నవలలు పరిచయం లేని వారికీ ఈ నవల కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.తెలుగు భాష మీద అభిమానాన్ని,జానపద నవలల పట్ల ఆసక్తిని పెంచుతుంది.
ఒక సరికొత్త ఫాంటసీలోకి ఊహాప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల మాయాశిల్పం...మంతఖడ

Subscribe
Browse