
ప్రతీకథలో వైవిధ్యం వుంది.
*ఎన్నో రాత్రుళ్లు కూడా మీ చేతివ్రేళ్ళు నిరంతరాయంగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని టచ్ చేస్తూనే ఉంటాయి... ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని ఒకానొక చరవాణి మీ జీవితంలో సృష్టించే శూన్యత మీకు అర్థమవుతుందా?ఎమోషన్స్ ఫీలింగ్స్ వున్న మీ భార్యను ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు
భర్తలు చెప్పలేని సమాధానం.. భార్యలకు అర్థం కాని సందేహం... ఈ సందేహానికి సమాధానం... స్మార్ట్ ఆన్సర్ ఏమిటి?
స్మార్ట్ ఫోన్ భూతం ఇచ్చిన వరం ఏమిటి? స్మార్ట్ ఫోన్ కథలో చదవండి.
* నాకు ఇప్పుడు రెండే ఆప్షన్స్ వున్నాయి. ఒకటి మీ కోరిక తీర్చడం, మరొకటి, ఆగి చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం ఏమిటి? సంభవామి యుగేయుగే
*నగరంలో సంచలనం, రిటైర్డ్ పోలీస్ అధికారుల అనుమానాస్పద మరణాలు.
ఎందరినో తన పోలీస్ దర్పంతో భయపెట్టిన ఆ రిటైర్డ్ పోలీసు అధికారికి ఒక అజ్ఞాతవ్యక్తి భయాన్ని పరిచయం చేసాడు. తను కనిపించకుండా భయాన్ని చూపించే సాహసం చేసాడు. తీరా ఆ అజ్ఞాతవ్యక్తి కనిపించాక..? మైండ్ గేమ్
* వేనవేల భావాల పరిమళాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న నా సందేహానికి ఒక చిన్న స్పర్శ సమాధానం అయ్యిందా?
మీరోడి నన్ను గెలిపించారా? నేను మీ చరణాగతిని.. మీ స్మరణాగతిని, మీ గుండెసవ్వడికి ఆకృతిని.. నేను మీ కృతిని... నీలోని నేనే, నాలోని నువ్వు
* అతని బదులు అతను సృష్టించిన మాస్టర్ రోబో డెత్ వ్యాలీకి వెళ్ళింది. అతను తనలాంటి రోబోను సృష్టించాడు. డెస్త్ వ్యాలీ జరిగిన ప్రమాదాన్ని మాస్టర్ రోబో ఎలా ఎదుర్కొంది ? అడ్వెంచర్ @ డెత్ వ్యాలీ
*దేవుడు అతని కోరికను మన్నించి ఇరవై నాలుగు గంటల ముందు అతనికి మరణం గురించి చెప్పాడు.
చాలాకాలం తరువాత భార్యను దగ్గరికి తీసుకున్నాడు.
కాంతిమతికి తను చేసిన అన్యాయం గుర్తుకు వచ్చి పిలిపించాడు.
మరణానికి ముందు, మరణ రహస్యం తెలిసాక అతని జీవితం మా...రి...పో...యిం....ది... మరణానికి ముందు
*చైనా నుంచి వచ్చి చచ్చిన కరోనా," తెగబడిన తమ చైనావాడి వక్రబుద్ధి " చూసి కరోనా, బూమరాంగ్‌లా మారింది. దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎత్తైన చైనా గోడమీది నుంచి దొంగలా దూకేసి కాళ్ళూ, నడుం ఎట్సెట్రా విరగ్గొట్టుకున్న కరోనా ముక్కుతూ మూలుగుతూ లేచింది....... చైనా కరోనా
* అది ఫ్యూచర్ టెన్స్లోని ఒకానొక రోజు...యాప్స్ అనబడే అప్లికేషన్స్ జనం మీద ఎటాక్ చేసి వారి ఆలోచనలను పిండిమరలా ఆడిస్తోన్న పోయేకాలం... ఆకలేసిన, కాలుబయటపెట్టాలన్నా, ఇంటికి పెయింట్ వేయించాలన్నా వంటికి మసాజ్ చేయించుకోవాలన్నా ఒక్కటేమిటి సర్వ పైత్యాలకు ఒకే ఒక దివ్య ఔషధం మా యాప్.. అని యాపులు విర్రవీగుతోన్న వర్తమానం... ఫ్యూచర్ టె(సె)న్స్ @యాప్స్
*సకల విఘ్నాలు తొలిగించే వినాయకుడు కాసింత విచారంగా కూచున్నాడు. ఆరేళ్ళ ధన్వి వంక చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదు. ధన్వి... ఓహో... అదా విషయం
* మనం మన పిల్లలకు కథలు చెబుతున్నామా? నీతికథలు, చిన్నారులలో తెలివిని మరింత పెంపొందించేకథలు, బుద్ధికుశలత తెలియ
అద్భుతమైన నవల.మణిమేఘన పాత్ర అద్భుతం.ఎక్కడా విసుగు లేకుండా ఆహ్లాదంగా చదివించిన నవల.
తెలుగులో ఇంత అద్భుతమైన రొమాన్సుతో ఎక్కడా అశ్లీలం లేకుండా భావోద్వేగాలతో భార్యాభర్తల మధ్య వుండే రొమాన్స్ ను బ్యూటిఫుల్ గా రాసిన రచయితకు ధన్యవాదాలు.థాంక్యూ సర్.మీ కథలు స్వాతిలో చాలా చదివాను.ఇటీవల వచ్చిన అద్భుతః అద్భుతం.గుడ్ నైట్ స్టోరీస్ భార్యాభర్తల ఎమోషన్స్ కు అక్షరూపం.ఏమి వింతమోహమో ,తలుపుచాటు కథలు ,అర్థం కానీ ఆమె కథలు నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి.
చాలా విభిన్నమైన నవల.కొత్త కథాంశం..ఏలియన్స్ మీద వచ్చిన డిఫరెంట్ థ్రిల్లర్.ప్రతీపాత్ర ఒక ప్రత్యేకత సంతరించుకుంది.నవల చివరివరకు ఉత్కంఠభరితంగా సాగింది.ఇలాంటి సబ్జెక్టు నాకు తెలిసే ఇదే మొదటిది అయి ఉంటుంది.ప్రహేళిక పాత్ర,జర్నలిస్ట్ వాసంతి పాత్ర రెండూ హైలెట్.సిద్దార్థ పాత్ర అద్భుతంగా వుంది.