
నన్ను నేను మార్చుకున్న పుస్తకం.ఎన్నో విలువైన విషయాలు.ఎంతో ధైర్యాన్ని కలిగించే వాక్యాలు.వ్యక్తిత్వ వికాసానికి సరైన నిర్వచనం.
ప్రపంచాన్ని ప్రభావితం చేసి దేశాన్ని ఉజ్వల భవిష్యత్తువైపు తీసుకువెళ్తున్న నరేంద్రమోదీ జీవితంలోని స్ఫూర్తిదాయక సంఘటనలు ,విశ్లేషణలతో రాసిన ఈ పుస్తకం ముందు వరుసలో నిలుస్తుంది.ఎందరికో స్ఫూర్తినిస్తుంది."ఒక చాయ్ వాలా సాధించిన విజయం,మోడీ జీవితంలోని ఉద్వేగభరితమైన అనుభవాలను" ఎంత శ్రమకోర్చి ఏర్చికూర్చి అందించారో పుస్తకం చదివితే అర్థమవుతుంది.
ఇలాంటి పుస్తకాలూ ప్రతీఒక్కరూ చదవాలి.ముఖ్యంగా యువత.మోడీని విమర్శించేవారికి ఈ పుస్తకం ఒక సమాధానం. ఈ పుస్తకం ఆసాంతం చదివించేలా ఒక చలనచిత్రాన్ని మోడీ జీవిత దృశ్యాలను కళ్ళముందు నిలిపినట్టు వుంది.
ప్రతీ భారతీయుడికి స్ఫూర్తిని ఇచ్చే పుస్తకం
కష్టాలు బాధలు మర్చిపోయి హాయిగా చదివిస్తూ ఆహ్లాదాల లోకంలో విహరింపజేసే కథలు.ఒక్కో కథ ఒక్కో హాస్యగుళిక
నవ్వుకున్న వాళ్లకు నవ్వుకున్నంత.నాలుకలు మొలిస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో కథ చదివితే నవ్వు తన్నుకువస్తుంది.
ఒక్కరోజు మనసారా నవ్వగలిగితే...నిజంగా నవ్వగలిగితే "నవ్వు" కథ చదివితే తెలుస్తుంది.
ఇలాంటి నవ్వు కథలు,మన దైనందిన జీవితంలోని సమస్యలను దూరం చేసే ఈ కథలు చదివితే ,ఈ పుస్తకంలో చెప్పినట్టు,
"నవ్వడంవల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్లకింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వేవాళ్లు నవ్వనివాళ్లకన్నా ఏడేళ్లు ఎక్కువగా జీవిస్తారట.
రోజుకి సుమారు 15 నిమిషాలు నవ్వితే దాదాపు 40 వరకూ క్యాలరీలు కరుగుతాయట."
ఈరోజుల్లో ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాల అవసరం చాలా వుంది.అసంతృప్తిలో కూడా గుడ్/బ్యాడ్ వుంటాయని నిర్మాణాత్మకమైన అసంతృప్తి,నిరర్థకమైన అసంతృప్తి వుంటాయని సోదాహరణంగా చెప్పిన విధానం బావుంది.అసంతృప్తి కేటలాగ్ చదివితే అర్థమైపోతుంది.
నవల ఆసాంతం ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తిని కలిగిస్తూ ముందుకు సాగింది.ఒక నేరం పరిశోధన మాఫియా విశ్వరూపాన్ని చూపిస్తూనే విభిన్నమైన ముగింపు ఇచ్చారు.
ఒక మాఫియా ప్రపంచం డాన్..గాడ్ ఫాదర్ యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ అయితే అన్న నావెల్ థాట్ చాలా బావుంది.
విభ్రమ పాత్రలో అమాయకత్వం అల్లరి చివరిలో చూపించిన తెగువ పాత్ర ప్రత్యేకతను చాటింది.
దంపతులకు రసానుభూతి కలిగించే రొమాంటిక్ కథలు.ఎక్కడా అసభ్యతకు తావులేకుండా అద్భుతంగా రాసిన కథలు.
మనిషి దేవుడయ్యాడు... కానీ మనిషి తను దేవుడయ్యాకే దేవుడి తత్త్వం అంతరార్థం బోధపడింది,అన్న భావాన్ని రచయిత హృద్యంగా అందమైన బిగిసడలని కథనంతో కళ్ళముందు నిలిపారు.ఒక్కపాత్ర కళ్ళముందు కదలాడింది.ప్రతీకథ ఒక చక్కరకేళీ .ఎన్నో భావోద్వేగాలు కథల్లో ప్రస్ఫుటమయ్యాయి.
తల్లిని దత్తత తీసుకున్న అమ్మను కదరా కథ గానీ, వృద్ధ్యాప్యం పిల్లలకు,యవ్వనం తల్లిదండ్రులకు మారిపోయే వరాన్ని కోరుకున్న " ఆస్తు ఆస్తు " కథకానీ,బామ్మ లాలిపాట కథ,కథలన్నీ రచయిత సృజనాత్మకతకు పట్టం కట్టేలా వున్నాయి.మంచి కథల సమాహారం,ఈ కథల పుస్తకం.
పియస్ .నిజమే కంచిలో కూడా కనిపించని కథలు ఇవి.
తీశ్మార్ గురించి చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.వయసు తొంభైతొమ్మిది. పొడవాటిగడ్డం.ఎప్పుడూ ఎర్రగా వుండే కళ్ళు.ఆ ప్రాంతంలో దొరికే ఆకుపసర్లతో తయారయ్యే ఒక ద్రవపదార్థమే అతని ఆహారం అంటారు.ఇలా తీశ్మార్ గురించి వర్ణిస్తుంటే అలా చదువుతో ఉండిపోయాం.
హీత్రోచీ భాష ,జంగానియా అంటే ఆత్మలు ప్రేతాత్మలు తిరిగేచోటు అని అర్థం.అని చెప్పడం, కొన్నిచోట్ల రీజనింగులు ఇవ్వడం లాజిక్ లు చెప్పడం,చాలా బావుంది మేడం.డార్క్ అవెన్యూ సినిమాగా వస్తే చూడాలని వుంది.
సెక్స్ కు రొమాన్స్ కు వున్న తేడాను ఈ గుడ్ నైట్ స్టోరీస్ లో గమనించవచ్చు.కొత్తగా పెళ్ళైనవాళ్లు.నుంచి దాంపత్యం చివరి మజిలీలో ( వృద్ధాప్యంలో ) వున్న దంపతుల వరకు చదివే కథలు.
అన్నీ సరసమైన కథలే.జీవితంలో రొమాన్స్ అవసరాన్ని,ఎమోషన్స్ ని టచ్ చేసే హార్ట్ టచ్ రొమాంటిక్ కథలు.
శ్రీసుధామయి గారు మీ జానపద నవలలు అన్నీ బావుంటాయి.చక్కని శైలి.చ్చిన్నప్పటి విఠలాచార్య సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.ప్యాకెట్ సైజు పుస్తకాలు చదివే అలవాటు.ఇపుడు అలాంటి నవలలు రాసేవారు తక్కువే.భిట్లాడేవి బేతాళ మాంత్రికుడు నవల చాలా బావుంది.అభినందనలు .మీరు ఇలాంటి జానపద నవలలు మరిన్ని రాయాలి.
మేన్ రోబో నవల ఆసాంతం ఉత్కంఠభరితంగా వుంది. సెడక్ట్రస్ ,సులోచన షర్మిల పాత్రల్లో వైవిధ్యంవుంది మేన్ రోబో ఫీలింగ్స్ ,కథనం సూపర్బ్.ఒక హాలీవుడ్ సినిమా తెలుగులో చూస్తున్నట్టు వుంది.
ఈ నవల గురించి ఈ మాటలు చాలు...అద్భుతమైన నవల
ఉరితీసే ముందు నా చివరికోరిక ఒకేఒకటి..నేను ఉరికొయ్యకు వేలాడుతోన్న దృశ్యాన్ని నా మిత్రుడు చూడాలి.చెప్పాడు సత్యవర్ధన్
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో ఉరికొయ్యకు బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయి చట్టబద్ధంగా హత్యచేయబడ్డ నా మృతదేహాన్ని చూడు..."కొద్దీ క్షణాల్లో నల్లటిగుడ్డ అతని మొహం మీద కప్పబడింది.చెక్కతలుపు మీద అతను...లివర్ కదిలింది.ఉరికొయ్యకు అతని దేహం వేలాడింది...
ఈ వ్యవస్థలోని లోపాలకు అతని మరణమే ...మరణశాసనం కావాలి...ఆ క్షణమే వర్షం మొదలైంది...
మరణానికి ముందు మిత్రుడు రాసిన ఉత్తరం అతడిని యుద్ధభూమి వైపు నడిపించింది...
*నువ్వు నన్ను ప్రేమించినా...ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను..ఇది ఫిక్స్...చెప్పాడు సాకేత్ ఆముక్తమాల్యదతో.
*"ఉద్యోగం వస్తే రోజుకో కొబ్బరికాయ కొడతానని నువ్వు మొక్కుకుంటున్నావు...నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుగా వున్న కొబ్బరికొట్టు వాడు ఎదురుచూస్తున్నాడు..అయినా శరీరాన్ని ఇలా ప్యాక్ చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారే .."దెబ్బయేళ్ళ బామ్మ మనవరాలు ఆముక్తమాల్యదతో అంది.
* బాబాలు స్వామీజీలు ప్రజల బలహీనతలతో ఆడుకునే వ్యవస్థలో నుంచి పుట్టుకువచ్చిన పుట్టగొడుగు కృష్ణస్వామి కి పరమభక్తురాలు అముక్త...అక్కడ ఆ ఆశ్రమంలో జరిగే తంతు చూసేక ఎలా రియాక్టయింది?
రంగస్థలమ్మీద నటించే అతను జీవిత రంగస్థలంమీద యుద్ధం మొదలుపెట్టాడు..మారణశాసనాన్ని పునర్లిఖిస్తున్నాడు.
ప్రతీకథలో వైవిధ్యం వుంది..అన్ని రకాల జోనర్లలో కథలు ఇవ్వడం బావుంది.నంబర్ థర్టీన్ హారర్ కథ ,నగరంలో సంచలనం, రిటైర్డ్ పోలీస్ అధికారుల అనుమానాస్పద మరణాలు. మైండ్ గేమ్ కథ ,నీలోని నేనే, నాలోని నువ్వు
రొమాంటిక్ స్టోరీ,అడ్వెంచర్ @ డెత్ వ్యాలీ,చైనా కరోనా కామెడీ కథ ,మరణానికి ముందు,ప్రతీకథ ఉత్కంఠ భరితం,ఒకే జోనర్ లో కాకుండా అన్ని జోనర్లలో ప్రముఖ పత్రికల్లో వచ్చిన ఈ కథలు షడ్రసోపేత విందు.
సెంటిమెంట్స్,ఎమోషన్స్ ను కనిపెట్టడానికి క్యూ గ్రాహం ప్రహేళికను పంపించడం,సైంటిస్ట్ సిద్ధార్థను ట్రాప్ చేయడం,అతని ద్వారా ప్రహేళిక గర్భం దాల్చడం,ఆ తరువాత అనూహ్యమైన మలుపు,ప్రహేళిక అదృశ్యం..ఆమె కోసం సిద్దార్థ అన్వేషణ,జర్నలిస్ట్ వాసంతిని సిద్దార్థ ల్యాబ్ లో రోబోలు బంధించడం,అంతర్యామి విలనిజం..ప్రతీ పాత్ర ప్రత్యేకత కలిగి వుంది,కథనం కళ్లను పరుగుపెట్టించింది.ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టు వుంది.
విభిన్నమైన కథల పుస్తకం.ఎవరికీ నచ్చిన జోనర్ లో వాళ్ళు వాళ్లకు నచ్చిన కథ చదువుకోవచ్చు.హారర్ క్రైమ్ అడ్వెంచర్ కామెడీ జానపద కథ ,ఇలా పాఠకులకు షడ్రసోపేత అక్షరాల విందు అందించిన రచయితకు కృతఙ్ఞతలు.కినిగెకు ధన్యవాదాలు.
నేను నా బాల్యంలోకి వెళ్లి చదివిన నవల.నా చుట్టూ వున్నా ప్రపంచాన్ని రణగొణధ్వనులను కాలుష్యాన్ని మరిచిపోయి హాయిగా చదువుకున్నాను.నవల చదువుతూ గంధర్వలోకానికి వెళ్ళాను.మేఘాలను పలకరించాను.మణిమేఘనా సౌందర్యాన్ని చూసాను.ఎక్కడా అసభ్యతకు తావులేని శృంగారం ,మనసుకు హాయించే వర్ణనలు,మరోలోకానికి తీసుకువెళ్లే అద్భుతకథనం,ఇలాంటి జానపద నవలలు ఈ తరం పాఠకులకు పరిచయం చేసిన రచయితకు కినిగెకు ధన్యవాదాలు.తెలుగుభాష మీద మమకారాన్ని,జానపద నవలల మీద ఇష్టాన్ని పెంచిన నవల" మాయాశిల్పం-మంత్రఖడ్గం" .