
ఉత్కంఠభరితంగా వుంది .యస్సార్కె పాత్ర పవర్ ఫుల్ గా వుంది.ఒక మాఫియా డాన్ గాడ్ ఫాదర్ ,యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ అవ్వడం అద్భుతమైన కాన్సెప్ట్.డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.విభ్రమ పాత్ర శ్రీదేవిని గుర్తుకు తెప్పిస్తుంది.కేవలం హీరో పక్కన వుండే పాత్ర కాకుండా కథలో కీలకమైన పాత్రగా తీర్చిదిద్దడం బావుంది.
మనిషి దేవుడైతే ఎలా ఉంటుంది/?అన్న ఊహ మన జీవితాన్ని మన కళ్ళముందు నిలిపి సృష్టిరహస్యాన్ని మానవజన్మ సార్థకతను తెలియజేస్తుంది.ఇందులోని ప్రతీకథ మనతో కనెక్ట్ అవుతుంది.
తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే పిల్లలకు తల్లిదండ్రుల వార్ధక్యం వచ్చి,తల్లిదండ్రులకు పిల్లల యవ్వనం రావడం అన్న ఆలోచన రచయిత సృజనాత్మకత ,కనులు చెమ్మగిల్లే తత్వబోధ అర్థమవుతాయి.
సూపర్...
ఉదయమంతా అలసట ...వృత్తిపరమైన వ్యక్తిగతమైన సమస్యలు...వాటిని పడగ్గది బయటే వదిలేయండి.
స్పా లకు వెళ్లినా,విహారయాత్రలకు వెళ్లినా ఎంత ఖర్చుచేసినా లభించని గొప్ప అనుభవం..అనుభూతి మీ ఇద్దరి కలయికలోనే వుంది.
కౌగిలిని మించిన గొప్ప సెక్యూర్డ్ ఫీలింగ్ మరోటి ఉంటుందా?
వ్యాయామంతో ఖర్చుచేసే క్యాలరీలు రొమాన్స్ తో ఖర్చు చేయండి.అనుభవాలను రొమాంటిటిక్ మెమోరీస్ గా డిఫాజిట్ చేసుకోండి.అనుభూతి ఫ్రీజర్ లో మీ కలయికలు భద్రపర్చుకోండి.
ఈ ధాత్రిలో ప్రతీ రాత్రి మీదే ..ప్రతీ పగలు ప్రతీ క్షణం..ఒకరి సమక్షంలో మరొకరు సేద తీరండి..కలయిక శయ్యపై విశ్రమించండి.
ప్రతీ రాత్రి శోభనరాత్రి కావాలి ...
ఎప్పటికప్పుడు కొత్తగా,కొంగ్రొత్తగా మీ రొమాంటిక్ మెనూ ను మార్చుకోండి.కొత్త ఇష్టాలు సరికొత్త ఊహలు..ఆలోచనలు..కబుర్లు...మీ ఏకాంతంలో నేపథ్యసంగీతం కావాలి.
*ఆ దంపతులకు శోభనం రాత్రి
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.ఇంతకూ ఆ పందెం ఏమిటంటే ..?
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది కథేమిటి?
ప్రతీ కథలో రొమాంటిక్ ఫ్లేవర్ హార్ట్ టచింగ్ గా వుంది.భార్యాభర్తల మధ్య వుండవలిసిన రొమాంటిక్ ఇంటిమసీని అవసరాన్ని గుర్తు చేసే బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీస్ .
నవలలు మళ్ళీ చదవాలనే ఆసక్తిని కలిగించింది .ఆసాంతం ఆధ్యంతం ఉత్కంఠభరితంగా వుంది.
చాలా మంది దంపతులు కోల్పోతున్న వ్యక్తిగత దాంపత్య జీవితాల గురించి కథల్లో పాత్రలతో ఆవిష్కరించిన హార్ట్ టచ్ రొమాంటిక్ స్టోరీస్ .ప్రతీ కథ మనసును శరీరాన్ని టచ్ చేస్తుంది.మనం ఏం మిస్సవుతున్నామో చెబుతుంది .దంపతుల బెడ్ రూమ్ లో వుండవలిసిన బెస్ట్ రొమాంటిక్ సిరీస్ .
నవల చదవడం మొదలుపెట్టాక మరోప్రపంచంలోకి వెళ్ళిపోయాను.వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి.అగ్నిహోత్ర పాత్ర,రాష్ట్రపతిని అగ్నిహోత్ర కాపాడే సాహసం,ఆంత్రాక్స్ ప్రకంపనలు ( ఇప్పుడు కోవిడ్ చూస్తుంటే అప్పటి సంఘటనలు గుర్తొస్తన్నాయి) మేన్ రోబో ని క్రియేట్ చేయడం,షర్మిల క్యారెక్టర్,సులోచన పాత్ర.,మేన్ రోబో తో ప్రేమలో పాడడం,క్లైమాక్స్ లో గాల్లో వేలాడుతూ " డు యు లవ్ మీ? అని అడగడం..మాటలో చెప్పలేని ఫిలింగ్.ఇంత అద్భుతంగా నవల రాసిన రచయితకు అభినందనలు.
మేన్ రోబో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాం.
ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ని ఇంత బాగా పొయెటిక్ గా,అద్భుతంగా రాయగలరా? ప్రహేళిక పాత్ర అద్భుతం.ప్రతీ సన్నివేశంలో ఉత్కంఠ ఉద్వేగం ఆసక్తి వున్నాయి.ఒక ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.
ఒక ధ్యానంలా మాయాశిల్పం -మంత్రఖడ్గం నవల చదివాను. కరోనా భయాన్ని వదిలేసాను.ప్రశాంతంగా ఈ నవల చదువుతూ అక్షరాలతో మెడిటేషన్ చేశాను.మణిమేఘన మాయాశిల్పంగా మారడం,కొలనులో జలకాలాట,మేఘాలు పక్కకు తప్పుకోవడం,కథానాయకుడి సాహసం,జలఖడ్గం,చితవిచిత్ర దృశ్యాలు,అద్భుతమైన భాష,పాఠకులను కొత్తలోకంలోకి మాయాశిల్పం ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది.ఈ నవల పుస్తకరూపంలో కూడా ఉండివుంటే బావుండేది.కళ్ళముందు చిన్ననాటి జ్ఞాపకాలను తీసుకువచ్చిన నవల.డిప్రెషన్ లో వున్నవారికి ఆహ్లాదాన్ని అందించే ఆక్సిజన్.ఈ నవల.ఇలాంటి మరిన్ని నవలలు మమల్ని అలరించాలి.పైసా వసూల్ ..కుబేరాయనమః తరువాత బాగా నచ్చిన నవల మాయాశిల్పం-మంత్రఖడ్గం.