Comment(s) ...

1979 లో రాసిన నా తొలి జానపద నవల... అప్పుడు ప్రచురణలో నేను చూడలేకపోయిన నవల..
దాదాపు నలభయ్యేళ్ల తరువాత తిరిగి రాసిన నవల... మాయాశిల్పం... మంత్రఖడ్గం,
ఈ నలభయ్యేళ్ల కెరీర్‌లో ఎన్ని నవలలు రాసినా... జానపద నవల రాయలేకపోయాను...
సైన్స్ ఫిక్షన్ క్యూ.. థ్రిల్లర్ మేన్ రోబో, క్రైమ్, కామెడీ రొమాన్స్ హారర్, మానవసంబంధాలు... వ్యక్తిత్వ వికాసం, ఆటో బయో గ్రఫీ (జైలు గోడల మధ్య హీరో సుమన్) డెబ్భైకి పైగా నవలలు దాదాపు ఆరువందలపైగా కథలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, తెలుగు కన్నడ భాషల్లో వచ్చిన నా రచనలు.. మీ అభిమానానికి చిహ్నాలు.
అయితే నాకు ఇష్టమైన జానపద రచన నేను రాయలేదన్న అసంతృప్తి అలానే ఉండిపోయింది. నాలుగు దశాబ్దాలు వెనక్కి వేళ్తే ప్యాకెట్ సైజు చిన్న పిల్లల పుస్తకాలు బాలభారతి బుజ్జాయి వసంతబాల లాంటి సంస్థల నుంచి వచ్చే జానపద నవలలు ఉర్రూతలూగించిన కాలం. కత్తియుద్ధాలు, మాయలు మంత్రాలు, సాహసాలు.. రాజులూ అప్పటి ఆ వాతావరణం అద్భుతంగా
ఆ తరువాత జానపద నవలకు ఆదరణ తగ్గుతూ, ఫిక్షన్ క్రైమ్ తరువాత వ్యక్తిత్వ వికాసం ఇలా ట్రెండ్ మారుతూ వచ్చినా జానపద నవలల పరిమళం నా వెంటే వుంది.
నలభయ్యేళ్ళ క్రిందట... ఒక పబ్లిషర్ వచ్చాడు. మూడువందల రూపాయలకు నవల రాసే ఒప్పందం(ఇంకా అంతకు తక్కువే అనుకుంటా). అప్పుడు నవల వెల పావలా అర్థ రూపాయి అలా ఉంటూ వచ్చింది. నవలల అద్దె పది నయాపైసలు.
నవల నోట్ బుక్‌లో రాసిచ్చాక మళ్ళీ కనిపించని ప్రచురణకర్త.
కానీ ఆ నవల నాకు గుర్తు.. ఎందుకంటే నేను రాసిన నా తొలి జానపద నవల.
ఆ నవలపేరు "మాట్లాడే మాయాశిల్పం" అది ప్రచురిస్తానని తీసుకువెళ్ళిన పబ్లిషర్స్ నవల ప్రచురించలేదు.
ఆ నవలే ఇప్పడు కొన్ని మార్పులతో "మాయాశిల్పం... మంత్రఖడ్గం" పేరుతో మీ ముందుకు వచ్చింది.
విఠలాచార్య సినిమాలు ఎన్ఠీఆర్, కాంతారావులు జానపద కథానాయకులు.. రాజనాల, త్యాగరాజు, ముక్కామల, యస్వీఆర్ లాంటి ఉద్దండులు ప్రతినాయకులు.
బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోనే జురాసిక్ పార్క్‌ను మించిన టెక్నాలజీ...
హైద్రాబాద్‌లో 1990 ప్రాంతంలో విద్యానగర్‌లో ఒక మాములు ఇంట్లో ఉన్న కాంతారావు గారిని సినిమా జర్నలిస్ట్‌గా కలిసాను. వ్యక్తిగతమైన ఇష్టం అభిమానంతో.
ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోలో.. రాజనాల గారిని కలిసాను. అప్పట్లో పిల్లాపెద్దాలను ఉర్రూతలూగించిన జానపద సినిమాల గురించి మాట్లాడుకున్నాము.
చిన్నపిల్లలు కాదు పెద్దలూ ఇష్టంగా చదివే జానపద నవలల ప్రాభవం మళ్ళీ మొదలైంది.
***
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
*ఉద్యానవనంలో ఎవరో ప్రవేశించినట్టు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది.
కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడుతాయి. ...అయినా ఏమిటీ వైపరీత్యం
*అప్పుడే వెన్నెల భూమ్మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చిన వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద ప్రసరించింది. మరుక్షణం పెద్ద వెలుగు.... మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నంచింది మణిమేఘనగా మారిన మాయాశిల్పం
ప్రముఖరచయిత విజయార్కె జానపద నవల
మాయాశిల్పం... మంత్రఖడ్గం
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రతిష్టాత్మక ప్రచురణ.

మాయాశిల్పం నవల పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి, మీ స్పందనకు కామెంట్స్ కు ధన్యవాదాలు.మీ అభిమానమే టాప్ టెన్ లో నిలిపింది.విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు " మాయాశిల్పం-మంత్రఖడ్గం " నవల ఎన్నో వారాలు టాప్ టెన్ లో ఎదో ఒక స్థానంలో నిలిచి మీ అభిమానాన్ని చూరగొంది.జానపద నవలల పట్ల ఆదరణ తగ్గలేదని మీ ఆదరణే చెబుతుంది.పాఠకులను జానపద నవలా ప్రపంచంలోకి తీసుకువెళ్లే జానపద నవలల కినిగెలో మీ కోసం ప్రత్యేకంగా అందించింది మేన్ రోబో పబ్లికేషన్స్.
హారర్ కామెడీ, ,క్రైమ్ ,థ్రిల్లర్,మానవసంబంధాలు,రొమాన్స్ ,మీకు నచ్చిన జోనర్ లో మీ అభిమాన రహాయితల నవలలు చదువుకోవచ్చు.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

worst experience. After downloading the file type is really difficult to get as pdf. I will never use this again and will not recommend to anyone

nice to read with a new wave of middle age lover story.

I buys tis deyyala dibba book for rent... But link was not opened... Plz solve my problem..

Subscribe
Browse