Comment(s) ...

మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు సడలిపోని ఉత్కంఠ .అద్భుతమైన కథనం.సత్యవర్ధన్ పాత్ర సమాజాన్ని ప్రశ్నిస్తుంది.సాకేత్ పాత్ర ప్రపంచానికి నిర్వీర్యమై నిస్పృహలో వున్న వ్యవస్థకు ధైర్యాన్ని ఇస్తుంది.ఆలోచన కలిగిస్తుంది.ఒక కొత్త ఆలోచన,నవ్యమైన కథాంశం.బామ్మ పాత్ర హైలెట్.అముక్త అమాయకత్వంలోని ఫ్రెష్ నెస్ కొత్తదనంగా వుంది ఆ పాత్ర తీరుతెన్నులు.,స్వామిజీ లాంటివాళ్లు ఈ నవల వచ్చి మూడుదశాబ్దాలు అయినా ఇంకా వున్నారు.ఆహ్లాదం ఆలోచన ఎమోషన్స్ అన్నీ పుష్కలంగా వున్న నవల. సూపర్బ్ !

మనసును కట్టిపడేసే కథలు.దంపతులు అలోచించి ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఈ కథలు అద్దంలో కనిపిస్తాయి.
అన్నిపనులు చేసుకుంటున్నాం.తినడం,డబ్బు సంపాదించడం.సినిమాలు షికార్లు వాట్సాప్ చాట్ లు.
కానీ మనసుకు శరీరానికి మన ఎమోషన్స్ కు ఒక అర్థం చెప్పే అద్భుతమైన రొమాన్స్ ను దూరమయ్యే దంపతులు తప్పక చదివాల్సిన కథలు " గుడ్ నైట్ స్టోరీస్ " అని నా ఉద్దేశం.

హాలీ వుడ్ స్టైల్ నవల.షర్మిల పాత్ర ,మేన్ రోబో పాత్ర పాఠకులను ఒక పట్టాన మర్చిపోనివ్వవు. ఈవిల్ 1 ,ఈవిల్ 2 నిజంగా కళ్ళముందు కనిపిస్తున్నాయి.వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడికి,ఆంత్రాక్స్ కు ముడిపెట్టి రాసిన ఈ థ్రిల్లర్ ఇంగ్లీష్ సినిమా చుసిన ఫీలింగ్ కలిగిస్తుంది.మేన్ రోబో ,షర్మిల మధ్య రొమాన్స్ హార్ట్ టచింగ్ గా ఉంది .క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
2002 లో రాసిన ఈ నవల ఇప్పటి కరోనా కు సరిగ్గా సరిపోతుంది.
ఒక యాక్షన్ మూవీ చూస్తున్నట్టుగా వుంది. సెక్స్ బానిస సెడక్ట్రస్ ఎపిసోడ్ ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.సులోచన పాత్ర నవలలో హైలెట్

ఒక హాలీ వుడ్ సినిమా చూస్తున్నట్టు వుంది.నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి కాన్సెప్టు తో నవలలు రాలేదు.ఉత్కంఠ ఉద్వేగం వేగంగా చదివించే లక్షణం ,నవల చివరివరకూ ఏకబిగిన చదివించింది.

ఇలాంటి నవలలు చదివాక ఎంతకాలం అయ్యింది.ఈ నవల స్వాతి మంత్లీ లో నా పెళ్ళైన కొత్తలో చదివాను .నేనూ నవలలోని వస్క్అంతి క్యారక్టర్ లా ఫీలయ్యేదానిని.వైదేహి లాంటి మాతృమూర్తులకు వందనం.ఆ నవల చదివాకా నేను మా అత్తయ్యను అమ్మలా చూసుకోవాలనుకున్నాను.న కూతురిని వాసంతిలా పెంచాలనుకున్నాను.బెంగుళూరులో వుండే నా కన్నడ ఫ్రెండ్ కు ఈ నవల గురించి చెబితే తనకు తెలుగు చదవడం రాదని ఫీలయ్యింది.
ఆ తరువాత ఈ నవల కన్నడ పత్రిక రాగసంగంలో సీరియల్ గా రావడమే కాదు,నవలగా కూడా ( జీవనసంధ్య పేరుతో అని గుర్తు ) వచ్చింది.ఒక తెలుగు రచయిత రాసిన నవల రెండు భాషల్లో రావడం సంతోషకరమైన విషయం.నవలలో కథ గొప్పతనం.రచయిత శైలి,గుండెను పట్టి కుదిపేసే సంభాషణలు.
'దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
ఇలాంటి మాటలు మనసును స్పృశిస్తాయి.
ఈ నవల పుస్తకరూపంలో దొరికితే బావుండేది.
కక్షలు కార్పణ్యాలు రాక్తపాతాల నవలల మధ్య జీవితాన్ని కళ్ళముందు నిలిపే అద్భుత పుస్తకం.

ధైర్యాన్ని చెబుతూ ఒత్తిడిని జయించండి అని చెప్పే ఈ పుస్తకం తప్పక చదవాలి,
ఒత్తిడి మనకు తెలియకుండానే మన ప్రాణాలు తీసిస్తుంది.ఇలాంటి సమయంలో ఈ పుస్తకం ఎంతోగాను ఉపయోగపడుతుందని నమ్మకం.ఒత్తిడి ఎన్ని రకాలుగా ఉంటుందో,ఒత్తిడిని ఎలా జయించవచ్చునో ఉదాహరణలతో స్వానుభవాలతో రచయిత చెప్పిన మాటలు ఇప్పటి ఈ కరోనా పరిస్థితుల్లో ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి.ఒత్తిడికి నివారమార్గాలు ఒత్తిడికి సంబంధించిన సర్వేలు,సులభంగా ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా రాసిన ఈ పుస్తకం చాలా విలువైనది అని నమ్ముతున్నాను.

చిన్నప్పుడు అమ్మమ్మ ఒళ్ళో కూచుని విఠలాచార్య జానపద సినిమాలు చూసాను.టూరింగ్ టాకీసులో ఉక్కపోతతో కూడా సినిమా చూస్తూ అందులో లీనమైపోయేవాళ్లు ప్రేక్షకులు.మాయాశిల్పం నవల చదువుతుంటే కళ్ళముందు గంధర్వలోకం కనిపిస్తుంది.మేఘాలు పలకరిస్తున్నాయి.ఉద్యానవనంలో చల్లగాలి మమ్మల్ని చుట్టుముడుతుంది.అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల.మణిమేఘన కల్పితపాత్ర అంటే నమ్మబుద్ధి కావడం లేదు.ఎక్కడో యువరాజు వుండేవున్నట్టు వుంది.అక్షరాలతో సృష్టించిన అద్భుత మాయాప్రపంచం " మాయాశిల్పం-మంత్రఖడ్గం"

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

i want to buy this book

respecter sir have some books ?of kurnool jilla kathalu to purposce of research

hi sir kindly share the link.. Thank you so much for giving this knowledge to us

దంపతులకు రసానుభూతి కలిగించే రొమాంటిక్ కథలు.ఎక్కడా అసభ్యతకు తావులేకుండా అద్భుతంగా రాసిన కథలు.

Subscribe
Browse