Comment(s) ...

భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇంటిమసీ ఉండాలి? మనం కోల్పోతున్నది ఏమిటి? జీవితంలో అతి ముఖ్యమైన దాంపత్య జీవితాన్ని మిస్ చేసుకునేవారికి గుడ్ నైట్ స్టోరీస్ ఒక రిమైండర్ లాంటిది.
రచయిత మాటలు అక్షర సత్యాలు
ఒంటరితనం మనం ఆహ్వానించకపోయినా అనుకోని అతిథిలా,ప్రియమైన శత్రువులా వచ్చినప్పుడు నేనున్నానంటూ ఓ ఆత్మీయస్పర్శ మిమ్మల్ని చుట్టేస్తే...?ఒక గొప్ప అనుభూతి మీ వెన్నంటి ఉంటుంది.
ఉదయం లేచింది మొదలు రాత్రివరకూ కెరీర్, వర్క్.టెన్షన్స్...ఉరుకులు పరుగులు స్వదేశంలో వున్నా,విదేశాల్లో వున్నా.కరెన్సీ ఏదైనా,యాంత్రికమైన జీవితమే...
మీకిష్టమైన లైఫ్ ను లీడ్ చేయడానికి,మీ కలలను నిజం చేసుకోవడానికి ,మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ..మీ జీవితంలోని సగభాగం...ఉదయం నుంచి రాత్రి వరకూ గడిపేస్తారు...
చీకటి ముసుగేసాక ధాత్రిని రాత్రి చుట్టుముట్టాక మీ ప్రపంచంలో మీరూ ,మీ జీవితభాగస్వామి....పడగ్గది .మీ వ్యక్తిగత సామ్రాజ్యం.
ఆ సామ్రాజ్యంలో రాజు రాణి సైన్యమూ సర్వమూ సమస్తమూ మీరే.
ఫీలింగ్స్ ఎమోషన్స్ అనుభవాలు అనుభూతులు కలబోసిన కలర్ ఫుల్ రెయిన్ బో ...
ఆ ఇంధ్రధనుసులో ...
ప్రేమ ఇష్టం కోరిక స్పర్శ మాట అనుభవం అనుభూతి ..సప్తవర్ణాల ఇంధ్రధనుసులో చేరిన మరో వర్ణం రొమాంటిక్ ఫ్లేవర్ మీకు శుభరాత్రి చెబుతుంది.
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో...
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.
నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ ల,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి.
ఈ కథల్లోని కథానాయికలు మీరే..
ఈ కథల్లోని కథానాయకులూ మీరే...
మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునే పాత్రలు సన్నివేశాలు సంఘటనలు అనుభవాలు అనుభూతులు మీ పరం చేసే అక్షరస్వరాల కథలు ఇవి.
ప్రతీ రాత్రి ఈ కథలు చెప్పే కథలు వినండి.
ఈ పుస్తకంలోని చాలా కథలు స్వాతి పత్రికలో వచ్చినవే.రచయితా చేసే ప్రయోగాన్ని ఆదరించి,పాఠకులకు అందించే స్వాతి సంపాదకులకు సద కృతజ్ఞుడిని.దాదాపు యాభైకి పైగా స్వాతిలో నేను రాసిన సరసమైన కథలు ప్రచురించబడ్డాయి.అందులో కొన్ని కథలు ఇవి.
ఒక వెన్నెల రాత్రి,ఒకానొక వర్షం కురిసే రాత్రి...మీ పడగ్గదిలో అగరొత్తులు సన్నజాజులు నీలిరంగు బల్బు మధోరోహలు అన్నింటిని అనుసంధానించే స్పర్శతో పాటు గుడ్ నైట్ స్టోరీస్ కూడా ఉండాలి.మీ అనుభూతులను మీ గుండె గదుల్లో కథలుగా దాచుకోండి.
ప్రతీ అనుభవం ఒక అక్షరమై.
ప్రతీ అనుభూతి ఒక కథై..
ప్రతీ రాత్రి శుభరాత్రిగా మారాలి.
ఈ కథల ప్రపంచంలోకి మీ అనుభవాలను ఆహ్వానించండి

మేన్ రోబో ఫిక్షన్ థ్రిల్లర్ అయినా మనసును టచ్ చేసింది.ముఖ్యంగా షర్మిల ,సులోచన, సెడక్ట్రస్ పత్రాలు,మేన్ రోబో లో ఫీలింగ్స్ కలగడం ,ముద్దును ఆస్వాదించడం,వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి, సైంటిస్ట్ అగ్నిహోత్రను అచ్చు గుద్దినట్టు మేన్ రోబో గా సృష్టించడం,డ్రామా,మెలోడ్రామా యాక్షన్,ఎమోషన్స్,క్యూరియాసిటీ ,అద్భుతమైన కథనం.
ఒక్కమాటలో చెప్పాలంటే కళ్లముందు సినిమా కనిపించింది.దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితమే ఇంత అద్భుతమైన నవల అడ్వాన్స్ గా వచ్చింది.

పాతికేళ్ల క్రితం ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్..మా . పేవరేట్ సీరియల్ .అముక్త పాత్ర నాకు బాగా నచ్చేసింది.అమాయకత్వం నిజాయితీ ఉక్రోషం కలగలిసిన పాత్ర.మోడ్రన్ బామ్మా పాత్ర చివర్లో కన్నీళ్లు తెప్పిస్తుంది.ఉరికి ముందు సత్యవర్ధన్ మాటలు సమాజాన్ని ఆలోచించేలా చేస్తాయి.సాకేత్ పాత్ర ధీరోదాత్తత ..కళ్లముందు పాత్రలు మనసులో ముద్రించుకుపోయేలా చేస్తాయి.

బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ హ్యూమన్ ఎమోషన్స్. ముఖ్యంగా ఇండియన్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ గురించి గొప్పగా చెప్పిన నవల.ఏలియన్స్ మీద మొదటిసారి తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన నవల క్యూ..ఆమె కనబడుటలేదు.
ప్రహేళిక వాసంతి పాత్రలు తీర్చిదిద్దన విధానం బావుంది.భూమ్మీదికి వచ్చిన ప్రహేళిక శరీరం యాక్సిడెంట్ లో రెండుగా విడిపోయి తిరిగి ఒకటై తాపీగా నడుచుకుంటూ వెళ్లే సన్నివేశం అద్భుతంగా వుంది.

మనకు నచ్చిన కథలను చదువుకునే అవకాశం.కామెడీ.హారర్.క్రైమ్,అడ్వెంచర్,మానవ సంబంధాలు,ఫిక్షన్.జానపద కథ.ఇలా రచయిత అన్ని జోనర్స్ లో ,ప్రముఖ పత్రికల్లో విభిన్నమైన తనదైన శైలితో రాయడం గొప్ప విషయం.ఒక్కో కథలో ఒక్కో ఎమోషన్ .ఉత్కంఠ .కథ చివరివరకూ చదివించే లక్షణం.మనసుకు ఆహ్లాదాన్ని,ఆలోచనను చక్కని కాలక్షేపాన్ని ,అంతకు మించి ఒక గొప్ప ఫిల్ ని కలిగించే కథలు.
స్మార్ట్ టచ్ సరికొత్త పాయింట్ .కథలన్నీ వేటికవే ప్రత్యేకతతో వున్నాయి.

ఒకే రచయిత రాసిన రెండు విభిన్నమైన నవలలు చదివాను.అండర్ వరల్డ్,నిర్ణయం నవలలు.అండర్ వరల్డ్ మాఫియా ప్రపంచాన్ని కళ్ళకు కట్టింది.యస్సార్క్ పాత్ర పట్ల అభిమానం పెరిగింది.కార్తికేయ విభ్రమ పాత్రలు నిజజీవితంలో వున్నట్టే వున్నాయి.ఉంటే బావుండు అన్నట్టున్నాయి.క్లైమాక్స్ ఆలోచన సూపర్బ్.
నిర్ణయం నవల మానవ సంబంధాల విలువలను ప్రశ్నించింది.వృద్ధాప్యం శాపం కాదని దానిని వరంగా ఎలా మార్చుకోవాలో చెప్పింది.త్యాగానికి ఒక హద్దు ఉందని ఆ హద్దును గుర్తు చేస్తుంది.పాజిటివ్ దృక్పథంతో అద్భుతంగా రాసిన ఈ నవల నేను కన్నడ అనువాదం కూడా చదివాను.
పాఠకులను కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్లే రచనలు ఎంత కాలం అయినా నిలిచే వుంటాయనడానికి పాతిక సంవత్సరాల క్రితం వచ్చి ఇంకా పాఠకాదరణ పొందుతున్న ఈ నవలలు ఉదాహరణ.
థాంక్యూ కినిగె

ప్రపంచంలో మాఫియా కనిపించని క్షణానికి అంకితం అన్న రచయితా తొలిపలుకులోనే అద్భుతం దాగి వుంది.మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఏకబిగిన చదివించింది.సస్పెండ్ క్రైమ్ ఎమోషన్స్ ఉత్కంఠ తరువాత ఏం జరుగుతుంది అన్న ఉత్సుకత అన్నీ కలిసిన నవల.సిట్ ఆఫీసర్ కార్తికేయ జర్నలిస్ట్ విభ్రమ యస్సార్కె పాత్రలు కళ్ళముందు నిలిచాయి.సరదాగా ఉంటూనే విభ్రమ పాత్ర ఆలోచింపజేస్తుంది.జర్నలిజం పట్ల గౌరవం పెరుగుతుంది.మంచి క్రైమ్ థ్రిల్లర్ ,సినిమా చుస్తున్న భావన కలిగింది నవల చదువుతుంటే.

మాయాశిల్పం చదువరులను కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్ళింది.ఇలాంటి జానపద నవలలు ఇప్పుడు రాసేవారిని వ్రేళ్లమీద లెక్కించవచ్చు.చందమామ కథలా ,అమ్మజోలపాటలా వుంది.తెలుగుభాష మీద అభిమానాన్ని,జానపద నవలల మీద మక్కువను.సాహిత్యం పట్ల ఆసక్తిని అభిమానాన్ని పెంచేలా వుంది.కథనంలో కొత్తదనం బావుంది.
శృంగారాన్ని వీరత్వాన్ని భయానకాన్ని మంత్రతంత్రాలను ,అలనాటి రాచరికాన్ని,రాజ్యాలను ,పులి చేసే విన్యాసాలను..బాలన్స్ చేస్తూ కళ్ళు నవల వెంట పరుగులు తీసేలా వుంది.మేఘాలు తప్పుకోవడం,చక్కని ఆలోచన.నవల అలా చదువుతుంటే సమయం తెలియనంత బాగా వుంది.మనసుకు కళ్ళకు రిలీఫ్.చందమామ బాలమిత్ర వసంతబాల బొమ్మరిల్లు...వీటిలోటును తీర్చేలా చేసింది.ఇలాంటి నవలలు కినిగెలో మరిన్ని రావాలి.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

నమస్కారం. మీరు వ్రాసిన వచనానువాదం చాలా బాగుంది. కావ్యంలో ఉన్న విషయం ఇదీ అని తెలుసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది. మీ కృషికి అభినందనలు, కృతజ్ఞతలు. -మురళి నందుల.

Pls enable rent option for this book

హాలీవుడ్ స్టైల్ లో నవల ప్లజంట్ గా నడిపించడంలో రచయిత్రి సక్సెస్ అయ్యారు.సిద్దార్థ సుగాత్రి మధ్య నడిచే సీన్స్ కొత్తగా వున్నాయి.నవల అప్పుడే అయిపోయిందా ?అనే ఫీలింగ్ కలిగింది.నిడివి తక్కువగా ఉండడం కొంత నిరాశకు గురి చేసింది.
అపరాధ పరిశోధనల్లో ఈ మధ్య వచ్చిన నవలల్లో డిఫరెంట్ ప్లజంట్ నవల అని చెప్పవచ్చు.

సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుంది.ముఖ్యంగా హీరో అనగానే ఆరడుగుల ఆజానుభావుడు గాల్లో ఎగిరి ఫైట్ చేయడం అని కాకుండా వీల్ చైర్ ( చక్రాల కుర్చీ ) కి పరిమితమైన వ్యక్తి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించడం ఆ పాత్ర శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లినట్టు వుంది.అదే వ్యక్తి అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ "యాంటీ మాఫియా" కు చీఫ్ గా మారి ముల్లును ముల్లుతూనే తీయాలి అన్నట్టు మాఫియాను ధీ కొట్టే పాత్రగా మార్చ

Subscribe
Browse