Comment(s) ...

పాత్రల వ్యక్తిత్వాన్ని అత్యద్భుతంగా చిత్రించిన నవలా చిత్రం మరణశాసనం.ఆంధ్రభూమిలో ఈ నవల జడ్జ్ మెంట్ పేరుతో ధారావాహికంగా వచ్చింది.అందులో ప్రారంభ వాక్యాలు నాకు ఇంకా గుర్తున్నాయి".ఉడుత కథతో మొదలుపెట్టి,సత్యవర్ధన ఉరి సన్నివేశంతో కథను మలుపుతిప్పిన విధానం అద్భుతం.ఈరోజు మార్కెట్ లో షేర్ల విలువలు బంగారం విలువను చెప్పినట్టు ఒక విద్యార్ధి సాధించిన పట్టా ,సాధించిన గోల్డ్ మెడల్ విలువ చెప్పమని,సత్యవర్ధన్ భార్య ప్రశ్నించిన తీరు వ్యవస్థలోని విషాదాన్ని చూపిస్తుంది.
అముక్త మాల్యద పాత్రలో అమాయకత్వం ఆ తరువాత నకిలీ స్వామీజీల పట్ల ఎదురుతిరిగిన సంఘటనలు పాఠకులను ఆకట్టుకుని కళ్ళముందు కదలడేలా చేస్తాయి.

" ఈ ప్రపంచంలో సైన్స్ కూడా కనిపెట్టలేనిది..మనకన్నా ఎంతో అడ్వాన్స్ లో వున్న ఏలియన్స్ కూడా కనిపెట్టలేక భూమ్మీదికి వచ్చి పరిశోధన చేయడం " అనే కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్..ప్రహేళిక పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.గ్రహాంతర ప్రేమకథ అందులోని అంతరార్థం జర్నలిస్ట్ వాసంతి పాత్ర,సిద్దార్థ పాత్ర రూపకల్పన తెలుగు సాహిత్యంలో కొత్తదనం .

ఇలాంటి నవలలు అరుదుగా వస్తుంటాయి.మా పిన్ని అప్పట్లో స్వాతి రెగులర్ గా ఇష్టంగా చదివేది.చిన్నప్పుడు పిల్లలు గుండెల మీద కాలితో తన్నినా ఆ బిడ్డ కాలికి ఎక్కడ నొప్పి కలిగిందో అని బాధపడే తల్లి మనసు,ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యాక కృతఘ్నుడై గెండెలా మీద తన్నితే భరించాలా,ఎదురు తిరిగి ఆ బిడ్డలకు గుణపాఠం చెప్పాలా? నిర్ణయం నవలలోని ప్రధానపాత్ర ఈ విషయాన్నే చర్చిస్తుంది.
స్మశానాన్ని అనాథలకు ఆసరా ఇచ్చే శరణాలయంగా మార్చిన సన్నివేశాలు ,వాసంతి పాత్ర ,ప్రతీపాత్ర గొప్పగా ఉంటుంది.కరోనా సమయంలో మానవత్వాన్ని మరిచిన విషాద సంఘటనల నేపథ్యంలో ఈ నవల మానవత్వం విలువలను గుర్తు చేస్తుంది.

లాక్ డౌన్ లో నేను చదివిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.మాఫియా మరణ మృదంగాన్ని కళ్ళకు కట్టిన నవల. ఎమోషన్స్ అడ్వెంచర్ ,ఏకబిగిన చదివించే కథనం.జర్నలిస్ట్ పాత్ర హైలెట్.

మాయాశిల్పం అద్భుతమైన నవల .ఒక మంచి నవల,మనసుకు దగ్గరైన నవల.నవల చదువుతూ,బాల్యంలోకి వెళ్ళిపోయాను కథనం వర్ణన పాత్రలు కళ్ళముందు కనువిందు చేసాయి.మణిమేఘన మనసులో ముద్రించుకుపోయింది.విజయుడు అమ్మాయిల గుండెల్లో వుండిపోయాడు.ఇలాంటి నవలలు మరిన్ని రావాలి.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Sir iam unable to read the book Karma what i purchased today, kindly help me.

Could not open the book after buyin got for rent

Hi sir i want to meet u sir
Ur place... And phone number sir

ఆహ్లాదంగా చదివించిన జానపద నవల .బాల్యాన్ని చిన్నప్పటి జ్ఞాపకాలను చేతిలో ఇమిడిపోయే ప్యాకెట్ సైజు నవలలను స్ఫురణకు తెచ్చింది.మణిమేఘన పాత్ర చాలా చాలా నచ్చింది.ఆ అమాయకత్వం ఎవరినైనా యిట్టె కట్టిపడేస్తుంది.సాహసాలు మాయామంత్ర విన్యాసాలు మరోకొత్త జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్లారు రచయిత.

విభిన్నమైన వైవిధ్యమైన కథలు.ప్రతీకథ ఒక వెబ్ సిరీస్ లా వుంది.పాత్రలు కళ్ళముందు కనిపిస్తున్నాయి.కామెడీ రొమాన్స్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ అన్ని జోనర్స్ లో కథలు ఇవ్వడం వల్ల పాఠకుల ఛాయిస్ కు అవకాశం వుంది.

Subscribe
Browse