Comment(s) ...

వచనంలో భారతం పుస్తకాలు రాయడం ముందు మెచ్చుకోదగింది. పిల్లలచే చదివించవలసిన అవసరం ఈ పుస్తకం సూచిస్తుంది. పఠనకు ఇలాంటి పుస్తకాలు ఒక దారిని చూపిస్తాయి. మానవుడికి మానవధర్మాన్ని ధార్మిక తత్త్వాన్ని చూపించేది మహాభారతం. ఇది సర్వకాల సర్వావస్థలలో ఆచరణీయం కదా....
-కొత్తపల్లి రాములు
యం. ఏ. తెలుగు(పిహెచ్.డి)

ఈ పుస్తకానికి ప్రివ్యూలో ఒక పేజీనే పెట్టి మమ్మల్ని నిరాశ పరిచారు. కవిపుంగవుల కలాల కా౦తిని కనిపించకుండా చేశారు కినిగేవారు. మమ్మల్ని కిమ్మనకుండా కూడాచేశారు. ఏమైనా స్వీయ గ్రంధాలయంలో ఉండదగినది అయి ఉండవచ్చు. రచయితల సేకరణకు ధన్యవాదాలు.
-కొత్తపల్లి రాములు, యం.ఏ. తెలుగు, (పిహెచ్.డి)

పరిశోధనకు ఈ పుస్తకం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. వైవిధ్యమైన విషయాలతో వ్యాసాలు రాయడం డా.జె. సీతాపతిరావు జిజ్ఞాసకు ప్రతీకగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఆచార్య పరిమి రామనరసింహం గారు చక్కగా సమీక్షించారు. న స్త్రీ స్వాతంత్ర మర్హతి ఒక ఆణిముత్యం. ద్రౌపదిని చక్కని శోధనతో విశ్లేషణ చేశారు. శేషేంద్ర వైచిత్రి మరో అంశం. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలను ఆలోచింపజేస్తూ పాఠకుడికి కిట్టుబాటు అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు. పుస్తక పాఠకులకు పరిశోధన స్థితిని చూపించడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. తొలి ప్రయత్నంలో మంచి పుస్తకాన్ని అందించిన సీతాపతిగారు ప్రశంసనీయులు. మరిన్ని పరిశోధన వ్యాసాలు, సృజనాత్మక పుస్తకాలు రావాలని ఆకాంక్ష.
-కొత్తపల్లి రాములు యం.ఏ., (పిహెచ్.డి)

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

ఒక చాయ్ వాలా అత్యున్నత భారతదేశానికి ప్రధాని కావడం వెనుక ఉన్న నిజాయితీ నిబద్దత దేశవిభక్తి ఇలా ఎన్నో కోణాలను స్ఫూర్తిదాయకమైన ఘట్టాలను విశ్లేషిస్తూ రాసినతీరు ప్రశంసనీయం,స్ఫూర్తిదాయకం,నేటి రాజకీయనాయకులకు యువతకు రేపటి భవితకు ఈ పుస్తకం ఒక మార్గదర్శకం అవుతుంది.దిశానిర్దేశం చేస్తుంది.

నేటి యువతరానికి ఈ నవల ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. అద్భుతమైన రచనాశైలి.పాఠకుల హృదయాల్లో నిలిచిపోయే పాత్రలు.మనిషి జీవితంల్ని ఎమోషన్స్ ను చక్కగా ప్రజంట్ చేసారు రచయిత.ఆముక్తమాల్యద పాత్ర మన పక్కింటి అమ్మాయిలా అనిపిసుంది.ఆలోచించేలా చేస్తుంది.స్వామీజీల చీకటి చరిత్రలను ఇన్నేళ్ళైనా మనం చూస్తూనే వున్నాం.మార్పు ఎప్పుడో ఒకప్పుడు మొదలవుతుందని ముప్పయేళ్ల క్రితమే చెప్పిన ఈ నవల ఆహ్లాదాన

Not able to download even after payment...can anyone help???

జేమ్స్ హాడ్లీ చేజ్,నవలలను అభిమానించని పాఠకులు ఉండరు.తెలుగులో ఆరుద్ర ,గిరిజా శ్రీభగవాన్,విశ్వప్రసాద్ కొమ్మూరి సాంబశివరావు,మధుబాబు లాంటి గొప్ప రచయితలు రచయితలు ,రాసిన డిటెక్టివ్ నవల్స్ ఒక స్వర్ణయుగం.అడుగడుగునా ఉత్కంఠతో చదివించేవి.
ఇప్పుడు డిటెక్టివ్ నవలలు రాసేవాళ్ళు చదివేవాళ్ళు తక్కువయ్యారు.ఇలాంటి సమయంలో డిటెక్టివ్ సిద్దార్థ చదివాను.ఆకట్టుకునే కథనం.నవల చదువుతుంటే విజు

సమాజాన్ని జాగృతపరిచే నవల.యువత ఆశయాలకు నిలువుటద్దంలా నిలిచిన నవల.ఈ నవల 1992 లో అనుకుంటాను.ఆంధ్రభూమి వీక్లీలో సీరియల్ గా చదివాను.అప్పుడే విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన నాలాంటి వాళ్లకు ఈ నవల ఒక ఇన్స్పిరేషన్ .ఏదోలా బ్రతికేయడం కాదు.ఇదిగో ఇలా బ్రతికేయాలి అని చెప్పే నవల.ఒక వ్యక్తిత్వవికాసాన్ని నవలగా అందించిన రచన.హీరో పాత్ర మన పక్కింటి అబ్బాయిలా ఉంటూనే మనకు కొండంత ధైర్యాన్ని ఆకాశమ

Subscribe
Browse