
ఆహ్లాదంగా చదివించిన జానపద నవల .బాల్యాన్ని చిన్నప్పటి జ్ఞాపకాలను చేతిలో ఇమిడిపోయే ప్యాకెట్ సైజు నవలలను స్ఫురణకు తెచ్చింది.మణిమేఘన పాత్ర చాలా చాలా నచ్చింది.ఆ అమాయకత్వం ఎవరినైనా యిట్టె కట్టిపడేస్తుంది.సాహసాలు మాయామంత్ర విన్యాసాలు మరోకొత్త జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్లారు రచయిత.
విభిన్నమైన వైవిధ్యమైన కథలు.ప్రతీకథ ఒక వెబ్ సిరీస్ లా వుంది.పాత్రలు కళ్ళముందు కనిపిస్తున్నాయి.కామెడీ రొమాన్స్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ అన్ని జోనర్స్ లో కథలు ఇవ్వడం వల్ల పాఠకుల ఛాయిస్ కు అవకాశం వుంది.
మాయాశిల్పం నవల ఎన్నిసార్లు చదివినా కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఎంత రిలీఫ్ గా ఉందొ.ఆ కాలానికే వెళ్ళిపోతే బావుండు అనిపిస్తోంది.క్రైమ్ వయోలెన్స్ రొటీన్ నవలల నుంచి దూరంవచ్చి ఈ నవల చదివాను. మేఘాలు తప్పుకోవడం,గంధర్వ రాకుమారి జలకాలు ఆడుతుందని చంద్రుడు అక్కడినుంచి వెళ్లిపోవడం,చాలా కొత్తగా మనసుకు హాయినిచ్చిన నవల.ఇలాంటి నవలలు మరిన్ని కినిగెలో రావాలి.
గ్రహాంతరవాసి ప్రహేళిక భూమ్మీదికి రావడం,యాక్సిడెంట్ లో ఆమె శరీరం ముక్కలవ్వడం తిరిగి అతుక్కోవడం ,పెళ్ళై తల్లికాబోతున ప్రహేళిక అదృశ్యం,ఆమె కోసం సిద్దార్థ వెతకడం,జర్నలిస్ట్ వాసంతి పాత్ర, నవల ఆధ్యంతం కళ్లముందు సినిమాలా కనిపిస్తుంది.మనసును కట్టిపడేసిన నవల.
భార్యాభర్తల మధ్య వుండవలిసిన రొమాంటిక్ ఇంటిమసీని,మనం నిర్లక్ష్యం చేసే మన ఎమోషన్స్ ని గుర్తుచేసే అద్భుతమైన పుస్తకం.రొమాన్స్ కు సెక్స్ కు మధ్య తేడా చెబుతూ అందమైన భావుకత్వానికి అక్షరాలతో తీర్చిదిద్దిన అపురూప చిత్రం.
ప్రతీకథ మనసును టచ్ చేస్తూ శరీరాన్ని చుట్టేస్తోంది.
మోస్ట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ సిరీస్ .థాంక్యూ విజయార్కె గారూ..థాంక్యూ కినిగె
మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించే నవల.హాయిగా ఈ కరోనా నుంచి,ఈ ఒత్తిళ్ల నుంచి చిన్ననాటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగు నేర్చుకుంటూ అప్పటి కాలంలోకి తీసుకువెళ్లిన నవల " మాయాశిల్పం మాత్రఖడ్గం" మణిమేఘన మేఘాలు చెప్పిన మాట వినడం మాయాశిల్పం మాట్లాడ్డం,అద్భుతమైన ప్రేమ అత్యద్భుతమైన కథనం,వావ్ ,అద్భుతం.అద్భుతమే