
ఒక్కసారైనా ఈ నవల చదవాలి.మనం ఎక్కడున్నాం? మానవ సంబంధాలు ఏమవుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం,పరిష్కారం ఈ నవలలో వున్నాయి.ఈ నవల తెలుగులో కన్నడలో కూడా చదివాను.అద్భుతమైన నవల.
అదృశ్యవనం టైటిల్ చూడగానే చదివేయాలనేట్టు వుంది.అతి తక్కువ వ్యవధిలో రచయిత్రి ఏడు జానపద నవలలు రాయడం రికార్డు.మిగితా నవలలు చదివాను.పచ్చలలోయ,భూతాదేవి బేతాళ మాంత్రికుడు,ముఖ్యంగా జ్వాలాముఖి మంత్రాలదీవి నవలలు చాలా బావున్నాయి.జానపద నవలలు అచ్చ తెలుగులో సరళమైన భాషలో చాలా బావున్నాయి.
మళ్ళీ జానపద నవలలను ఇప్పటితరానికి పరిచయం చేస్తున్న కినిగెకు ధన్యవాదాలు.రచయిత్రికి అభినందనలు.
అగ్నిహోత్ర ,మేన్ రోబో రెండుపాత్రలు హృదయాన్ని హత్తుకున్నాయి.థ్రిల్లర్ నవల థ్రిల్ కలిగించింది.సిబిఐ డిప్యూటీ చీఫ్ షర్మిల పాత్ర ఎంతో సరదాగా సాగుతూనే అడ్వెంచర్ దారిలో వెళ్లడం రచయిత క్రియేటివిటీ.మేన్ రోబో ను డిస్ట్రాయ్ ఛాంబర్ లోకి తీసుకువెళ్ళినప్పుడు సైంటిస్ట్ కు షర్మిలకు మధ్య సంభాషణ మనసును టచ్ చేసింది.
అగ్నిహోత్ర గా భావించి షర్మిల మేన్ రోబోను ముద్దు పెట్టుకోవడం,మేన్ రోబో ఫీలింగ్స్ గ్రేట్.సెడక్ట్రస్ పాత్ర హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దారు రచయిత.
హెలికాఫ్టర్ నుంచి వేలాడుతూ :" డు యు లవ్ మీ" అనిఅడగడం అద్భుతం.
మేన్ రోబో నవల చదవడం ఒక గొప్ప ఫీలింగ్ .ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు వుంది.
రహస్యం కథ చదువుతుంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.డబ్బు ఎవరితోనైనా ఎంత పనైనా చేయిస్తుందనిపిస్తుంది.నిధి కోసం జరిగిన నేరంలో ప్రతీ సంఘటన రచయితా ఉత్కంఠభరితంగా రాసారు.ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.డివోచి పాము సన్నివేశం ఆ సర్పం కూడా ఓ పాత్రగా మారి కథకు కీలకంగా మారడం రచయిత సృజనాత్మకతే .
స్లీపర్ కోచ్ సున్నితమైన భావోద్వేగాలను స్పృశించింది.రొమాంటిక్ స్టోరీని ఇంత అద్భుతంగా రాయగలరా?యుద్ధాన్ని రొమాన్స్ ని బాలన్స్ చేసే వర్ణన సూపర్బ్.
అక్షరాల వెంట కళ్ళు పరుగెత్తించిన పుస్తకం.
ఎందరికో స్ఫూర్తిని కలిగించే పుస్తకం " జైలు గోడలమధ్య హీరో సుమన్" సుమన్ గారికి తల్లిమీద వున్న ప్రేమ తలుచుకుంటుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి.జైలులో ఖైదీలు సుమన్ ను గౌరవించినతీరు సుమన్ వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతుంది.ధైర్యంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
ప్రతీ చిన్న విషయానికి నిరాశ నిస్పృహలకు లోనయ్యేవాళ్ళు,ఆత్మహత్యే పరిష్కారం అనుకునేవాళ్లు ఈ పుస్తకాన్ని చదివాలి.
తెలుగుభాష మీద జానపద నవలల మీద మమకారాన్ని పెంచేలా చేసిన నాకు బాగా నచ్చిన నేను చదివిన మొదటి జానపద నవల" మాయాశిల్పం మంత్రఖడ్గం" ఇంగ్లీష్ మీడియం చదువులు ,నాకు ఊహ తెలిసేనాటికే జానపద నవలల కనుమరుగు ,చిన్నప్పుడు మా బామ్మ దగ్గర చిట్టిచిట్టి పిల్లల నవలలు చూసాను.ఇప్పుడు మొదటిసారి నవల చదివాను.
నవల చదువుతున్నంత సేపు గంధర్వలోకంలో ,జానపద కాలంలో ఉండిపోయాను.మణిమేఘనా పాత్రను తీర్చిదిదిన తీరు అమోఘం.ఆ పాత్రలో అమాయకత్వం,చదువుతుంటే ముచ్చటేసింది.నిజంగా గంధర్వలోకంలో మణిమేఘనా వున్నట్టే అనిపించింది మేఘాలు పక్కకు తప్పుకోవడం,నేనెవరిని అని అని మణిమేఘన అడగడం,మాయాశిల్పంగా మారడం ,మన్త్రికుడు దొంగచాటుగా కీటకంగా మారి గాంధర్వ లోకంలోకి ప్రవేశించడం,ఉత్కంఠ భరితంగా వుంది.
యువరాజు విజయసింహుడి పాత్ర రాబిన్ హుడ్ సాహసాలను తలపించాయి.నవలను చదువుతూ కొత్తప్రపంచంలోకి వెళ్ళిపోయాను.
అద్భుతమైన ఫాంటసీ ,అత్యద్భుతమైన జానపద నవల.