Comment(s) ...

సృష్టిలోని ప్రాణికోటికి, ఆరు ఋతువులూ ఎంతో అపురూపం.!
మరి ఆ ఋతువులకేది అపురూపం.?

ఒక్కో ఋతువు, ఒక్కో రకపు అపూర్వమైన అనుభూతిని మన కోసం మోసుకొచ్చి.. పరిమితుల్లేని ప్రేమతో.. ప్రకృతిలో చుట్టి అందిస్తుంటే పరవశంతో మన మనసులు రాజితమవడం.. ఋతువులకు అపురూపం.!

ప్రాణులకూ, ప్రకృతికీ మధ్య.. ఇదో పరస్పరాధారిత ఉద్దీపనం.!

అలా.. ఓ ఋతువులా.. తన మనసులోని భావాల్ని తానే అనుభవించినంత స్వభావసిద్ధంగానూ, స్వచ్ఛంగానూ.. అనుభూతి పరిమళాన్ని ఏ మాత్రం జారిపోనివ్వకుండా అందమైన పదాల్లోకి పట్టి.. మన మనసుల్లోకి నేరుగా, ధారగా ఒంపాలంటే.. ఒట్టి పదవిన్యాసమొక్కటే తెలిస్తే చాలదు.. అందుకు.. ఓ అనునిత్య.. చలితచలన, జ్వలితజ్వలన కవి హృదయం కావాలి.! పాఠకులకూ, కవులకూ మధ్యన.. అలాంటి ఓ పరస్పరాధారిత ఉద్దీపన కలిగించగలిగి తీరాలి.!

కవిత్వానికో రూపమున్నంత అపురూపంగా ఉండే, ఆ ఏడో ఋతువు పేరు - లక్ష్మీ రాధిక.. ఆ ఉద్దీపన పేరు.. వారు రాసిన - "మధూలిక".!

"మధూలిక" చదువుతున్నంత సేపు, చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా మరచిపోయి ఓ అలౌకిక ప్రపంచంలో మన మనసు.. డోలాయమాన స్థితిలో ఓలలాడినప్పుడు.. ఆ ఏడో ఋతువు, మనో చక్షువులకు అతి సమీపంగా.. అత్యద్భుతంగా.. గోచరిస్తుంది.!

కాల విభజన కోసం పుట్టిన ఋతువు కాదది.!

నిజానికి.. సమయాన్ని మనకు తెలిపేవన్నీ కృతకాలో, ప్రాకృతికాలో అవుతాయి.! మనలను, క్షణాల ఎరుకనుండి అలవోకగా దాటించి, అలౌకికానికి ఆవలివైపునున్న అద్భుతాలను.. మన పంచేంద్రియాలకే కాక, హృదయంలో మరిన్ని ప్రత్యేకమైన స్పందన స్థానాలను పుట్టించి మరీ పరిచయం చేసే క్రతువు.. ఆమె కవిత్వం.!

చదువుతుంటే అక్షరాలు ఎవరికైనా అర్థమవుతాయి; అలా అర్థమైంది, కొందరికి అనుభూతిగా మారే అవకాశమూ ఉంది; కానీ ఆ అనుభూతులు మనసు పొరల్లో నిక్షిప్తమైపోయి.. జీవితకాలపు సుగంధంలా ఇక లోలోనే అట్టే అంటిపెట్టుకుని ఉండిపోయి.. నిత్యం హృద్యంగా, రమ్యంగా స్పృశిస్తూ ఉంటే మాత్రం.. అవి ఒట్టి అక్షరాలు కావు; రాసిన వారికి, చదివినవారికి.. అవి అనుభవైకవేద్యాలు.. అంతర్లోక ప్రయాణాలు.!

అతి సున్నితమైన, భావోద్వేగపూరితమైన.. తన మనసు కేంద్రంగా.. అనుభూతి ప్రధానంగా.. తాను అక్షరబద్ధం చేసుకున్న భావ సంచలనాలను క్రమం తప్పకుండా ఫేస్ బుక్ లోనూ, తన బ్లాగు లోనూ రాస్తూ పదుగురితో పంచుకోవడమే కాకుండా.. ఓ చక్కనైన కవితా సంకలనంగా చేసి.. ఇలా సరికొత్త ఋతువు (పుస్తక) రూపంలో పరిచయం చేయాలనే సంకల్పం రాధిక గారిదే అయినా, ఈ ప్రయత్నంలో వారికి సహకరించిన సకల శక్తులకు, వ్యక్తులకు కూడా ప్రణామాలు, అభినందనలు.

ఆసాంతం సాహిత్య విలువలతో, మనసుకు హత్తుకునే వర్ణనలతో, అపురూపమైన విషయ వ్యక్తీకరణలో అడుగడుగునా అరుదైన ప్రకృతిని పరిచయం చేస్తూ, మనసు పలికే భావరాగతాళ సమ్మేళనాలను అనుభూతి పరంగా అర్థమయ్యేలా మాటల్లో తెలపడానికి భాష ఒక్కటే చాలదని తెలిపే భాషలో రచించబడిన "మధూలిక".. నిజంగా సార్థక నామధేయ.! రాసిన లక్ష్మీ రాధిక గారు, సరస్వతీ తనయ.! 🙏

"మధూలిక" - నిజంగా పుస్తక రూపంలో ఉన్న ఏడో ఋతువు.!

వీలు చూసుకుని, మీరూ చదవండి!

రాజ్

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I want a paperback edition of
Nenerigina Nannagaru..Where can I get

A wonderful book ,which is interesting. It takes the reader with it,
K.V.B. Sastry.

మళ్ళీ మళ్ళీ చదవాలని చదివి నవ్వుకోవాలని అనిపించే కథలు ..
*మందహాసం
అస్సాంలోని ఘోస్ ముడి ప్రాంతంలో నివసించే ఒక ఆదివాసీ తెగవారు తమ శత్రువుల మీద పగసాధించడానికి ఓ ప్రయోగం చేశారు. అక్కడ అడవుల్లో దొరికే 'స్కెది' అనే వనమూలికలు పొడిచేసి మధ్యంలో కలిపి యిస్తే అది తాగిన వ్యక్తులు నవ్వలేక చచ్చేవారుట.
* నవ్వు కనబడుటలేదు
ఇరవై నాలుగు సంవత్సరాలుగా నా పెదవులకు అంటిపెట్టుకొనివున్న నా నవ్

Subscribe
Browse