Comment(s) ...

Thank u soo much Sridhar garu for your valuable time n expressing cute views about Madhulika..😊

Thank u soo much Raj Reddy garu for taking your precious time n reading my book. N thanx for d wonderful response 😊

“ ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి “ ఒక సినిమా పాట లో నాగార్జున సిమ్రాన్ ని ఈ ప్రశ్న అడుగుతాడు
అందమైన అమ్మాయి కనబడితే ఎంతో కొంత ప్రేమ భావనలు కలగడం సహజం .కానీ మొత్తం ప్రేమభావనలే అమ్మాయి రూపాన్ని సంతరించుకొని ఎదురుబడితే అప్పుడు కలిగే అద్భుతమైన ఆనందాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు

వేల కవిత్వాలని హృది లో రగిలించగల ఓ యువతి తనే ఒక ప్రణయకావ్యంగా మారితే ,పరిమళాలు వెదజల్లే ఒక తెల్ల గులాబీ తనే కావ్య సుమ మాలికని అల్లితే ,చిరుకవితల చందనాలు జల్లితే ,చూడాలో చదవాలో తెలియని ఒక పరవశం మనకి కలిగితే ,
ప్రతి అక్షరం పది లక్షల అనుభూతులైతే ,ప్రతి మాటా తీయని మధురోహల వెల్లువై తాకితే ఆకాశాన్ని అంటే ఆనందం మన గుప్పెడు గుండెల్లో ఎలా సర్దుకుంటుంది ?ఇంత ఆనందాన్ని కలిగించిన వ్యక్తికి మాటల్లో అభినందనలు ఎలా చెప్పుకుంటుంది
“ నిన్నూ నన్నూ కలపమని నేల జారే నక్షత్రమేదో కోరుకొని ఉంటుంది “
ఇది త్రివిక్రమ్ రాసింది కాదు .సిరివెన్నెల హృదయంలో చిగురించిన మాటల తొలకరి అంతకన్నా కాదు
ఎద లోతుల్ని స్పృశిస్తూ సాగే ఇలాంటి వాక్యాలు వ్రాయాలంటే కళ్ళకి కలిగే తడిని అర్ధం చేసుకోగల ఒక ప్రేమ మయ హృదయం ఉండాలి ..ఇలాంటి అక్షరాద్భుతాలు ఎన్నో ఒక చోటే వెతుక్కోవాలి
సుమధుర కవితల సమాహారం “మధూలిక” రచయిత్రి శ్రీమతి లక్ష్మీ రాధిక గారికి భాష తెలుసు , శృతి తెలుసు, స్మృతి తెలుసు ,కవిత్వపు అందచందాలు తెలుసు ..మాటలని పొందిక గా అమర్చి మనసులని ఎలా దోచుకోవాలో తెలుసు
వీణాపాణి ,పలుకుల రాణి ఆ సరస్వతిని వశపరచుకొని సుమధుర అక్షర సంగీతాలను పలికించడమూ తెలుసు

“ సరుగుడు చెట్ల సవ్వళ్ళ లా ఆ చూపుల చిలిపిదనాలు “
“కనురెప్పల గమకం ఏ తమకం దగ్గర ముగుస్తుందో “
పైన రెండూ రాధిక గారి కవితల్లో నాకు బాగా నచ్చిన కొన్ని ఆణిముత్యాలు
మెడలో వేసుకున్న ముచ్చటైన నగ ఎంత ఆనందాన్ని ఇస్తుందో ,మదిని దోచుకునే మాటలు కూడా అంతే ఆనందాన్ని ఇస్తాయి .ప్రేమ తెలియని వాళ్ళని ప్రేమ లో పడేయడం ,విరహం ఎరుగని వాళ్ళని తాపం తో రగిలించడం రాధిక గారికి వెన్న తో పెటిన విద్య
ఒక కవితలో తను “ మనసుకి చలేస్తుందని తెలిసే వీలుందా నీకిప్పటికైనా” అని అడుగుతారు
రాధిక గారూ ఈ అనన్య సామాన్య కవితారూపకల్పనకీ ,ఈ అక్షర శిల్పానికీ , ఈ సృజనాత్మక ప్రేమ భావనలకీ ఈ అందమైన ఊహలకీ నమస్సుమాంజలి
ఘనీభవించే చలినీ , తాపంతో రగిలించే వేడినీ మూడక్షరాలతో సృష్టించగలరు
మీరు నిస్సందేహంగా ప్రణయ కవితా శారద ,సువిమల విద్యా విశారద

ఈ కావ్య కళా నైపుణ్యానికి ఏ కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇస్తే బాగుంటుందో నాకు తెలియదు .మీ గురించి వ్రాయడానికి ఎంత సమయమూ చాలదు
ముఖ పుస్తకపు ప్రపంచం లో మాలిన్యం తెలియని అక్షర సౌందర్యం మీరు ,విరహ వేదం మీరు ,ప్రణయ నాదం మీరు

ఇంకొక కవితలో మీరు “ విరహమవుతున్నా వానొచ్చిన ప్రతి సారీ “ అంటారు .మీ సంగతి తెలియదు కానీ మీ కవిత చదివిన ప్రతి సారీ నేను ప్రేమనై పోతుంటాను

" కొత్తగా రెక్కలోచ్చెనా" అని స్వర్ణ కమలం సినిమా లో వెంకటేష్ భానుప్రియని అడుగుతాడు

కళ ని ఆస్వాదించడం మొదలు పెట్టినప్పుడు కలిగే ఆనందానుభూతి అది

మీ కవితలు చదువుతున్నప్పుడుమనసుకి రెక్కలు వచ్చిన అనుభూతి .ప్రేమ భావాలను మోసుకుంటూ వినీల ప్రేమాకాశం లో అది విహరిస్తుంది

గుప్పెడు గుండె మీ ప్రేమ కవితలని మోసుకొని ఒక గువ్వై మీ చుట్టూతే తిరుగుతుంటుంది . దాన్ని తడితే అది పలికేది మీ కవితే

ఈ తమకం మీరు మాకు "మధూలిక" రూపం లో ఇచ్చిన అందమైన కానుక

అభినందనలతో

శ్రీధర్

Ramani Veni garu..Many thanx for the Lovely Review on my book. Thanx for downloading it n reading every poem and I'm feeling the joy of your expression in every poem your explained. Thanx a Ton for such a Wonderful response.

Regards
Laxmi Radhika

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I want a paperback edition of
Nenerigina Nannagaru..Where can I get

A wonderful book ,which is interesting. It takes the reader with it,
K.V.B. Sastry.

మళ్ళీ మళ్ళీ చదవాలని చదివి నవ్వుకోవాలని అనిపించే కథలు ..
*మందహాసం
అస్సాంలోని ఘోస్ ముడి ప్రాంతంలో నివసించే ఒక ఆదివాసీ తెగవారు తమ శత్రువుల మీద పగసాధించడానికి ఓ ప్రయోగం చేశారు. అక్కడ అడవుల్లో దొరికే 'స్కెది' అనే వనమూలికలు పొడిచేసి మధ్యంలో కలిపి యిస్తే అది తాగిన వ్యక్తులు నవ్వలేక చచ్చేవారుట.
* నవ్వు కనబడుటలేదు
ఇరవై నాలుగు సంవత్సరాలుగా నా పెదవులకు అంటిపెట్టుకొనివున్న నా నవ్

Subscribe
Browse