Comment(s) ...

సెక్స్ కు రొమాన్స్ కు మధ్య వున్న తేడాను సున్నితంగా చెబుతూ దంపతుల మధ్య వుండే రొమాంటిక్ ఇంటిమసీని చెప్పిన మోస్ట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీస్ .ప్రతీకథలో అద్భుతమైన అర్థవంతమైన శృంగార భావోద్వేగాలు.దంపతుల పడగ్గదిలో తప్పక వుండవలిసిన పుస్తకం.

ఒక మాఫియా థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంది
"నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అంది శ్రీదేవి గుర్తొచ్చి విభ్రమ
"నేను లైవ్ కవర్ చేస్తుంటాను. నువ్వు గోళీసోడాల బండితో రెడీగా వుండు.."
ఇలాంటి సంభాషణలు కళ్ళముందు దృశ్యాలను కనిపించేలా చేస్తున్నాయి.
వృత్తిలో ఎవ్వర్నీ లెక్క చేయకుండా ఎన్‌కౌంటర్ చేసిన సిట్ ఆఫీసర్ కార్తికేయకు గాడ్ ఫాదర్ ఎవరో తెలిసింది...
అప్పుడేం జరిగింది ?
ఒక్కసారిగా గాడ్ ఫాదర్ ఎవరో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ
మాఫియా సామ్రాజ్యాన్ని కనిసైగతో శాసించే గాడ్ ఫాదర్ ఒక బార్‌లో పనిచేయవలిసిన అవసరం ఏమిటి ?
చక్రాల కుర్చీకే పరిమితమైన అతను మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడు..?
మొట్టమొదటిసారిగా యాంటీ మాఫియా స్క్వాడ్‌కు అతను చీఫ్ ఎలా అయ్యాడు..?
ఈ ప్రశ్నలకు సమాధానం కోసం నవల చదవాలని అనిపించేలా రాసిన నవల అండర్ వరల్డ్.

పట్టువిడవకుండా చదివించిన నవల.
"ఉరితీసే ముందు నా చివరికోరిక ఒకేఒకటి..నేను ఉరికొయ్యకు వేలాడుతోన్న దృశ్యాన్ని నా మిత్రుడు చూడాలి.... సత్యవర్ధన్
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో ఉరికొయ్యకు బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయి చట్టబద్ధంగా హత్యచేయబడ్డ నా మృతదేహాన్ని చూడు..."కొద్దీ క్షణాల్లో నల్లటిగుడ్డ అతని మొహం మీద కప్పబడింది.చెక్కతలుపు మీద అతను...లివర్ కదిలింది.ఉరికొయ్యకు అతని దేహం వేలాడింది...
మరణానికి ముందు మిత్రుడు రాసిన ఉత్తరం అతడిని యుద్ధభూమి వైపు నడిపించింది...
*నువ్వు నన్ను ప్రేమించినా...ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను..ఇది ఫిక్స్...చెప్పాడు సాకేత్ ఆముక్తమాల్యదతో.
*"ఉద్యోగం వస్తే రోజుకో కొబ్బరికాయ కొడతానని నువ్వు మొక్కుకుంటున్నావు...నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుగా వున్న కొబ్బరికొట్టు వాడు ఎదురుచూస్తున్నాడు..అయినా శరీరాన్ని ఇలా ప్యాక్ చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారే .."దెబ్బయేళ్ళ బామ్మ మనవరాలు ఆముక్తమాల్యదతో అంది.
* బాబాలు స్వామీజీలు ప్రజల బలహీనతలతో ఆడుకునే వ్యవస్థలో నుంచి పుట్టుకువచ్చిన పుట్టగొడుగు కృష్ణస్వామి కి పరమభక్తురాలు అముక్త...అక్కడ ఆ ఆశ్రమంలో జరిగే తంతు చూసేక ఎలా రియాక్టయింది?
ఇలా ప్రతీ వాక్యం కథను ముందుకు నడిపిస్తుంది.రెండున్నర దశాబ్దాల క్రితం చదివిన నవల ఇప్పుడు మళ్ళీ చదివినా ఇప్పుడే రాసిన నవలలా వుంది.

"క్యాన్సర్ ని జయించండి చదివాను.చదివినంతసేపు ఏడుస్తూనే వున్నాను.మా సోదరి క్యాన్సర్ తో మరణించారు.పుస్తకంలో రచయిత గారు రాసిన " చిరునవ్వుతో నిష్క్రమించిన పద్మక్క' అధ్యాయం చదువుతున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు.
ఈ పుస్తకం ఒక ఇరవయ్యేళ్ల క్రిందట వచ్చి ఉంటే,నేను చదివి ఉంటే " మా సోదరిని బ్రతికించుకునేవాడినేమో."
కాలక్షేపము కోసం ,పనికిరాని క్షణికానందం కోసం మనం ఎంతో సమయాన్ని,డబ్బును వృథా చేస్తాం.కానీ మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే ,విన్నవించే ఇలాంటి పుస్తకాలను చదివేది ఎంతమంది ?
" దేవుడు మనుష్యులని సృష్టించాడు. ఆ మనుష్యులను అర్థాంతరంగా తీసుకెళ్ళడానికి మృత్యువుని సృష్టించాడు. ఆ మృత్యువు కాన్సర్ ను సృష్టించింది" విజయార్కె గారు రాసిన ఈ వాక్యం నూటికినూరుపాళ్లు నిజం
"తలనుండి కాళ్ళ వేళ్ళ వరకు ఏ భాగానికైన వచ్చే కాన్సర్...100 రకాలకు పైగా ఉన్నాయి."అన్న విషయం ఈ పుస్తకం చదివేవరకూ తెలియదు
ఈ పుస్తకం ఖచ్చితంగా మనకు క్యాన్సర్ పట్ల అవగాహనా కలిగిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని హెచ్చరిస్తూనే
అంతేకాదు క్యాన్సర్ ను ఎదురించే ధైర్యాన్ని ఇస్తుంది
పుస్తకరచయితలకు శతకోటి ప్రణామాలు
దయచేసి ఏ పుస్తకాన్ని ప్రతీఒక్కరూ చదవండి.ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలానో ,ఈ పుస్తకం అలా ఆరోగ్యదర్శినిలా ఉపయోగపడుతుంది.
ప్రతీ ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు అయోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.
"క్యాన్సర్ అనే పదం వైద్య నిఘంటువులో లేని రోజు రావాలని పుస్తకరచయితలు " డాక్టర్ మోహనవంశీ ,విజయార్కె " గార్లు కోరుకున్న రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం.

ఒక క్రైమ్ నవలను మనసుకు హత్తుకునే థ్రిల్లర్ నవలలా కళ్ళముందు నిలిపిన నవల శత్రుసంహారం.ఈ నవలను ఆంధ్రభూమిలో శ్రీయాల్ గా వస్తున్నప్పుడే చదివాను.
ఈ నవలలో చెప్పినట్టు ఇప్పటికే బాబాలు దొంగస్వాములు ఉంటూనే వున్నారు.
ప్రవల్లిక పాత్ర స్వరూపం బావుంది.
" నిద్ర పట్టడంలేదు ప్రవల్లికకు...ఈ రెండు మూడు రోజులుగా అనీజీగా వుంది.
ఎత్తులు, వాటికి పైఎత్తులు..రక్తపాతాలు ...ఎందుకో మనసంతా అనీజీగా వుంది."
ప్రవల్లికలోని అంతర్ఘర్షణ రచయితా వర్ణించిన విధానం చాలా బావుంది.

అత్యున్నత సాంకేతిక విలువలతో ఒక హాలీ వుడ్ మూవీ చూస్తున్నట్టు వుంది.షర్మిల పాత్ర సులోచన పాత్ర,మేన్ రోబో ను డిస్ట్రాయ్ ఛాంబర్ లో వేస్తానన్నప్పుడు షర్మిల ఫీలింగ్స్,డెవిల్ సిటీ,చక్కని కథ అందుకుతగ్గ వాతావరణం,
నో ఫ్లైయింగ్ జోన్ లో విమానం ఎగరడం,అగ్నిహోత్ర కాపాడ్డం,ఒక గొప్ప సైంటిస్ట్ ను పిచ్చివాడిగా ముద్ర వేయడం,అదే సైంటిస్ట్ మేన్ రోబో ను సృష్టించడం ,ఆ మేన్ రోబో ప్రపంచాన్ని కాపాడ్డం,
ఒక మంచి సందేశాన్ని అద్భుతమైన కథనంతో ఏ ఎమోషన్ ని మిస్సవ్వకుండా అందించిన రచయితకు అభినందనలు.
రజనీకాంత్ రోబో కాంట్రావర్సీ ఈ నవల చదివాకా అర్థమైంది.ఒకే హీరో రెండు పాత్రలు పోషించే ప్రక్రియ విజయార్కె గారి నవలలో కొత్తగా చూపించారు.రోబో పాత్రలో,అగ్నిహోత్ర పాత్రలో ,
బాలకృష్ణ రాజశేఖర్ లాంటి హీరోలు కొత్తదనం కోసం ప్రయత్నించవచ్చు.రొటీన్ సినిమాలకు భిన్నంగా..
సెడక్ట్రస్ పాత్ర హార్ట్ టచింగ్ .

ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది
పైసా వసూల్ అలాంటి నవల,
ముఖ్యంగా కథావస్తువు.విభిన్నమైన కథాంశం..మంచి రచనాశైలి.భావుకత్వం హాస్యం సామాజికస్పృహ ఆలోచనాత్మక సంభాషణలు.
దేవుడిని నమ్మని కథానాయకుడు ( హీరో) తిరుపతిలో స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్ లో నిలబడి అక్కడ స్వమివారి దర్శనానికి వేచివున్న భక్తులకు దేవస్థానం అందించే ఉప్మా అనాథపిల్లల కోసం తీసుకువెళ్తూ " ఇంతమంది అనాథలా ఆకలి తీర్చిన నువ్వు దేవుడివే" అనడం అర్థవంతం గా వుంది
తనని నమ్మని భక్తుడికి ...
స్వయానా శ్రీవేంకటేశ్వరుడే పూచీదారుడిగా హీరో వైభవ్ కు అప్పు ఇప్పించడం, వడ్డీ ఎలా వసూల్ చేసుకోవాలో హీరో చెప్పడం...
ఇవ్వన్నీ చదివితేనే బావుంటుంది,
కుబేర టీవీ ఛానెల్స్ బ్యాంక్స్ రెస్టారెంట్స్ ,,,,ఆలోచన బావుంది.
ఒక ఆరోగ్యకరమైన హాస్యచిత్రాన్ని చూసినట్టు వుంది.
మన దర్శక నిర్మాతగాలు హీరోలు ఇలాంటి చక్కని హాస్య చిత్రాలు చేస్తే బావుంటుంది.

డిఫరెంట్ సబ్జెక్టు .ఇంతవరకు ఇలాంటి సబ్జెక్టు చదవలేదు అనడం అతిశయోక్తి కాదు.గ్రహాంతరవాసి ప్రేమలో ఇండియన్ సైంటిస్ట్.
ప్రపంచంలో తమ గ్రహం కనిపెట్టని హ్యూమన్ ఎమోషన్స్ సెంటిమెంట్స్ కోసం ఆరా తీయడం కోసం ప్రహేళిక అనే గ్రహాంతరవాసి రావడం...
తను గర్భం దాల్చగానే అదృశ్యం అవ్వడం..
కనిపించకుండా పోయిన తన భార్య గురించి వెతుకులాట,,,
ముఖ్యంగా .గ్రహాంతరవాసి ప్రహేళిక ఎంట్రీ అదిరింది.ట్రక్కు ధీ కొనడం.ముక్కలైన ఆమె శరీరం తిరిగి అతుక్కుని తాపీగా లేచి నడుచుకుంటూ వెళ్లడం...
రొటీన్ సబ్జక్ట్స్ తో సినిమాలు చేసే హీరో దర్శక నిర్మాతలు ఇలాంటి విభిన్నమైన థ్రిలర్స్ వైపు ఓ లుక్కేయడం మంచిది.
సినిమా చూస్తున్న అనుభూతి.ఒక్కసారి చదవడం మొదలుపెడితే వదిలిపెట్టనివ్వని కథనం

ఒక్కసారిగా కాలాన్ని వెనక్కి తీసుకువెళ్లిన అద్భుతమైన జానపద నవల,.ముఖ్యంగా మేఘాలు పక్కకు తప్పుకోవడం,చంద్రుడి ప్రతిబింబం కొలను నుంచి వైదొలగడం..
యువరాజు సాహసాలు..మణిమేఘన " నేనెవరు మీరెవరు " అని మాయకంగా ప్రశ్నించడం..
ఇంత మంచి నవల అందించిన విజయార్కె గారికి,కినిగె వారికీ ,మేన్ రోబో పబ్లికేషన్స్ ధన్యవాదాలు.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I pay amount for Kalam kathalu but the book was not downloaded

I pay amount but not download the book

i want to buy this book

respecter sir have some books ?of kurnool jilla kathalu to purposce of research

hi sir kindly share the link.. Thank you so much for giving this knowledge to us

Subscribe
Browse