
క్యూ నవల అద్భుతమైన నవల.ఒక సైన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.కొత్త కాన్సెప్ట్.గ్రహాంతరవాసుల మధ్య ప్రేమ.హ్యూమన్ ఎమోషన్స్ ని ఇండియన్ సెంటిమెంట్స్ ని ప్రపంచానికే కాదు.గ్రహాంతరవాసులకూ తెలియజేసిన నవల.అధ్యాంత ఉత్కంఠభరితం.వాసంతి ల్యాబ్ లో బందీగా మారడం,రోబోలు ఆమెను వదిలిపెట్టడం,ప్రహేళిక హ్యుమన్యిడ్ రోబోగా రావడం,యాక్సిడెంట్లో ముక్కలై అతుక్కోవడం,స్పైడర్ విమెన్ గా పరిచయం కావడం.ఇలా ప్రతీ ఎపిసోడ్ చదివించే చక్కని కథనం.
ఈ ఆన్ లాక్ డౌన్ లో మనసుకు ఆహ్లాదాన్ని ఫ్రెష్ నెస్ ని అందించిన నవల.కొత్తతరహా నవలకు శ్రీకారం చుట్టిన నవల.
మరణశాసనం,మేన్ రోబో,అండర్ వరల్డ్,క్యాండిల్ లైట్ శోభనం,పైసావసూల్,నవ్వు దేవుడొచ్చాడోచ్..మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి
.ప్రతీ నవల విభిన్నం,ప్రతీ పుస్తకం వైవిధ్యం,.
వ్యవస్థలోని చీకటికోణాలను వెలికితీసిన నవల,నకిలీ స్వామీజీల నిజరూపం తెలియజేసిన నవల.విద్యావ్యవస్థ తీరును ఆవేదనగా ప్రశ్నించిన నవల. మానవతా విలువలను కళ్లకుకట్టిన నవల.ఆముక్తమాల్యద,సాకేత్ ,బామ్మా,సత్యవర్ధన్ శివరాం,కృష్ణస్వామి,ఇవి పాత్రలు కాదు కళ్ళముందు కనిపించే వ్యక్తుల ప్రతిరూపాలు.
మనసును హత్తుకున్న నవల.ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పిన నవల,మార్కెట్లో బంగారానికి,షేర్స్ కు వున్న వున్న విలువ ఇరవయ్యేళ్ళ కృషితో అకుంఠిత దీక్షతో మేధస్సుతో సంపాదించిన డిగ్రీలకు లేదా? అని సూటిగా నిలదీసిన నవల,
ఆధ్యంతం ఆసక్తికరం,ఉత్కంఠభరితం., ఒక చలనచిత్రంగా కళ్ళముందు నిలిపిన మరణశాసనం భావోద్వేగాల మిళితం.
ఒత్తిడి ఎంత ప్రమాదకరమైనదో ఆత్మహత్యల వార్తలు చదువుతుంటే తెలుస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసుకోవడం అవసరం.మనం ఎన్నో అనవసరమైన వాటికోసం డబ్బు ఖర్చుచేస్తాం.మనకు మంచిచెప్పే పుస్తకాలను కొనుక్కోవడానికి ఆలోచిస్తాం.ఈ పుస్తకం చదివి ఒత్తిడి నుంచి ఎలా బయటపడవచ్చో తెలుసుకున్నాను.విలువైన పుస్తకం.అని నా ఉద్దేశం.
యథార్థ సంఘటనల ప్రేరణతో రాసిన హారర్ థ్రిల్లర్ డార్క్ అవెన్యూ.
ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
హైదరాబాద్ లో అప్పట్లో సంచలనం సృష్టించింది.
లాజిక్ తో ఫిక్షన్ కలిపి హారర్ ను ఆసక్తిగా చదివే మా లాంటి పాఠకులకు చక్కని కాలక్షేపం.
భయపడుతూనే భయపెడుతూ చదివించిన నవల.
నవల ముగింపులో కొసమెరుపు బావుంది.
నవల బోర్ కొట్టించకుండా చదివించింది
ఇప్పటికి అయిదారుసార్లు చదివాను.చిన్నప్పటి ప్యాకెట్ సైజు జానపద నవలలు గుర్తొచ్చాయి.మణిమేఘన కళ్ళముందు కనిపిస్తుంది..మేఘాలు తప్పుకోవడం వింత అనుభూతి.మేఘాల మీద ప్రయాణం.." ఇంతకూ నేనెవరు? అని మాయాశిల్పంగా మారిన మణిమేఘన అడగడం..ప్రతీసన్నివేశం అద్భుతం.
మీ కలం నుంచి మరిన్ని జానపద నవలలు రావాలి .
అద్భుతం ...మన ఆలోచనలను ప్రశ్నించే పుస్తకం
గెలుపు అంటే అర్థం ఏమిటి? ఓటమికి నిర్వచనం ఏమిటి?
యుద్ధంలో ఒక దేశం గెలవడం గెలుపే.. కానీ ఒక దేశాన్ని ఆక్రమించుకుంటే ఆ గెలుపు నిజమైన గెలుపా?
ఒక కిరాయిహంతకుడు సుపారీ తీసుకుని హత్యచేస్తే అది గెలుపా?
గెలుపు అంటే మనకు ఆనందాన్ని లేదా డబ్బును ఇచ్చేది కాదు.. ఎదుటివారిలో కూడా ఆనందాన్ని కలిగించేదే గెలుపు
రామోజీరావుగారి పేరు తెలియని తెలుగు వాళ్ళే కాదు భారతీయులు కూడా వుండరు. ఆ మాటకొస్తే ప్రపంచమంతా గర్వించే రామోజీ ఫిలిం సిటీ, వార్త సంస్థలు, వేలాదిమందికి ఉపాధి ఇది కదా గెలుపు. రామోజీరావు అన్న పేరు ఈరోజు ఒక గెలుపు చిహ్నం.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడిచేసిన ఉగ్రవాదులది గెలుపే.. కానీ కొన్ని వేలమంది ప్రాణాలు తీసిన ఆ దుశ్చర్య, ఉన్మాదం గెలుపు కాదు... ఓటమితో సమానం.
* గెలుపు అంటే ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు .. ఎమోషన్స్‌ను బ్యాలన్స్ చేయడం.. ప్రాక్టికల్‌గా ఆలోచించడం....
ఒక గెలుపు మనకు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది
మరొకటి.. మన గెలుపు మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది.
చాలా సంవత్సరాల తరువాత నా చిన్నతనంలోకి వెళ్ళిపోయి,ఆనాటి మహత్తరమైన జానపద నవల చదివిన అనుభూతికి లోనయ్యాను.
" మాయాశిల్పం...మంత్రఖడ్గం" జానపద నవల సాహసాలను మంత్రతంత్రాలను టక్కుటమారా విద్యలను అంతకు మిక్కిలి అనతి రాజరికాన్ని జానపద నవలా వైభవాన్ని కళ్ళముందుకు తీసుకువచ్చినందుకు విజయార్కె గారికి ధన్యవాదాలు.
ముఖ్యంగా మేఘాలు పక్కకు తప్పుకోవడం,చంద్రుడు నీటికొలను నుంచి వైదొలగడం..లాంటి సన్నివేశాలు అద్భుతం.
కంటికి అక్షరాల విందును ఆహ్లాదాలతో సహా అందించిన నవల.
ఇలాంటి నవలలు మరిన్ని మీ కలం నుండి జాలువారాలి
ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.కళ్ళ ముందు పాత్రలు కదలాడుతున్నాయి.మేన్ రోబో సాహసాలు చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.మేన్ రోబో అగ్నిహోత్ర అనుకుని ప్రేమించడం చదువుతుంటే " వాట్ నెక్స్ట్ " అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది.అద్భుతమైన నవల,
నేను క్యాన్సర్ ని జయించాను పుస్తకాన్ని చదివితే ఒక జీవితాన్ని చదివినట్టు వుంది.గుండె బరువెక్కింది .క్యాన్సర్ ని ఎదిరించి మనోనిబ్బరంతో జయించి.తనలా క్యాన్సర్ తో బాధపడేవారికి ధైర్యాన్ని ఇచ్చేలా పుస్తకాన్ని రాసిన తేజారాణి తిరునగరిగారికి నమస్సుమాంజలి .
ప్రతీఒక్కరూ చదువవలిసిన పుస్తకం ఇది
మండువేసవిలో మంచు తెరల్లాంటి కథలు అందించిన రచయిత్రి తేజారాణి తిరునగరి గారికి ధన్యవాదాలు.
కథలు మనసును కట్టిపడేశాయి.
కవితలు మానవ జీవితంలోని వివిధకోణాలను స్పృశించాయి..
మీ కలం నుంచి మరిన్ని రచనలు రావాలి.
ఇలాంటి మంచి పుస్తకాలు అందిస్తున్న కినిగేవారికి ,
మేన్ రోబో పబ్లికేషన్స్ వారికీ కృతఙ్ఞతలు.