Comment(s) ...

హీరో సుమన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .
మీరు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే.ఆంధ్రభూమిలో " జైలుగోడల మధ్య హీరో సుమన్" వస్తున్నప్పుడు పత్రికవాళ్ళు నిర్వహించిన పోటీలో భాగంగా షూటింగ్ స్పాట్ లో మీతో కలిసి లంచ్ చేసే అవకాశం కలిగిన కొద్దిమంది పాఠకుల్లో మా సిస్టర్ ఒకరు.మీరు అందరిని పలకరించడం,పేరు పేరునా ఆప్యాయయంగా పలకరించడం మా సిస్టర్ చెబుతూ ఉండేది.
చిన్నబాబుతో మిమల్ని చూడాలని వచ్చింది.ఆ అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్ వేర్ లో జాబ్.
మీ కైండ్ నెస్ చాలా గ్రేట్ సర్.మీ కివితం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది.ఎందరికో ధైర్యానికి ఇస్తుంది.
జైలు గోడలమధ్య హీరో సుమన్ " ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం" ఇది నిజం.

బాధలన్నీ మరిచిపోయి మనఃస్ఫూర్తిగా నవ్వించిన కథలు.కథల్లోని పాత్రలు,పలికించిన హాస్యం అందించిన ఆహ్లాదం వెలకట్టలేనిది.విభిన్నమైన కథలతో మళ్లీమళ్లీ చదవాలని అనిపించినా కథలు.లాక్ డౌన్ లో ఒత్తిడిని తగ్గించి కొత్తప్రపంచానికి తీసుకువెళ్లిన " నవ్వు దేవుడొచ్చాడోచ్ "ఈ పుస్తకం రూపంలో వచ్చాడు.
నవ్వు కనబడుటలేదు,అనే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇస్తే అనే ఆలోచన చదవడానికి ఆసక్తికరంగా వుంది.
మనకు ఎందరో దేవుళ్లున్నారు,కానీ నవ్వుదేవుడు లేడు,విజయార్కె గారు సృష్టించిన నవ్వు దేవుడికి స్వాగతం చెబుతూ నవ్వుదేవుడు మన ఇళ్లలోనే ఉండేలా చేసుకుందాం.
ప్రతీకథ హాస్యంలో రంగరించిన మిఠాయి.ఇంతమంచి పుస్తకాన్ని అందించిన కినిగెకు ధన్యవాదాలు.విజయార్కె గారి రచనాశైలి అద్భుతం .వీటిని ఎవరైనా వెబ్ సిరీస్ గా తీస్తే పాఠకులకు ప్రేక్షకులకు నవ్వుల పండుగే.

మాయాశిల్పం మంత్రఖడ్గం చదివి ఆ ఫీలింగ్ లో నుంచి బయటకు రాలేకపోయాను.నేను మణిమేఘన దగ్గరే ఆగిపోయాను.అద్భుతమైన వర్ణన కళ్ళముందు గంధర్వలోకాన్ని నిలియింది.వర్చువల్ ప్రపంచంలోకి రచయిత మమ్మల్ని తీసుకువెళ్లాడు.నిజంగా మేఘాలు రాకుమారిని చూసి తప్పుకున్నట్టే వుంది.
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
అద్భుతమైన రచనాశైలికి వందనం.ఇలాంటి జానపద నవలలు మరెన్నో మీరు మాకు అందించాలి.

ఇపుడే ఈటీవీలో సుమన్ గారి ఇంటర్ వ్యూ చూసాను.దాదాపు ఇరవైఎనిమిదేళ్ళ క్రితం చదివిన "జైలుగోడల మధ్య హీరో సుమన్" సీరియల్ గుర్తొచ్చింది.అప్పుడు ఆంధ్రభూమిలో వచ్చినప్పుడు నేను కాలేజీ స్టూడెంట్ ని.సుమన్ అంటే విపరిమితమైన క్రేజ్ ఉండేది యూత్ లో.
ఒక పాపులర్ హీరో కేవలం ఆరోపణలతో జైలుగోడల మధ్య గడిపిన కొద్దిపాటి జీవితం విషాదకరమైనది.
అయినా ధైర్యంగా తన నిజాయితీని నిరూపించుకున్నారు."జైలుగోడల మధ్య హీరో సుమన్" ఒక వ్యక్తిత్వ వికాసపుస్తకమే.
ఈ పుస్తకం చదివితే జీవితంలో చాలా పెద్దవిగా భావించే సమస్యలు ఎంత చిన్నవో అర్థం అవుతుంది.
ఈ సీరియల్/ పుస్తకం నా జీవితంలో పాజిటివ్ ఎనర్జీని కలిగించింది

ఆపిల్ కథ చదువుతుంటే నిజంగా ఇలాంటి పరిశోధన,ఇలాంటి సంఘటన జరిగిందా? అన్నట్టు వుంది.భార్యాభర్తల మధ్య వుండే సున్నితమైన అందమైన రొమాంటిక్ ఫీలింగ్స్ ని అక్షరాల్లో కథల ద్వారా అందించిన క్యాండిల్ లైట్ శోభనం దంపతుల పడగ్గదిలో తప్పక వుండవలిసిన పుస్తకం అని నా ఫీలింగ్,
అందమైన పోయెట్రీ లా వుంది.

అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ .ప్రహేళిక పాత్ర ఆద్యంతం ఆసక్తిని కలిగించింది.హ్యూమన్ ఎమోషన్స్ ను ఇండియన్ సెంటిమెంట్స్ ను కనిపెట్టడానికి క్యూ గ్రహం ప్రహేళికను పంపించడం డిఫరెంట్ థాట్ .కనిపించకుండా పోయిన ప్రహేళికను వెతికే ఎపిసోడ్,హీరో సిద్దార్థ కు ప్రహేళిక గ్రహాంతరవాసి అని తెలియడం..ప్రతీ సన్నివేశం ఎక్సయిటింగ్ గా వుంది.

తను నమ్మని దేవుడు తనని నమ్ముకున్న అనాథలకు అన్నం పెడుతున్నాడని,ఆ దేవుడినే నమ్మడం,సాక్షాత్తు
ఆ దేవదేవుడే కుబేరుడి ద్వారా అప్పు ఇప్పించడం,ఆ అప్పును వైభవ్ తీర్చే విధానం,కృత్తిక క్యారెక్టర్ ,హాస్యం ఆలోచన ఆహ్లాదం..
వైభవ్ కారుతో సహా ఫ్లై ఓవర్ నుంచి కుబేరుడి లోకానికి వెళ్లడం గమ్మత్తైన అనుభూతి...
కొసమెరుపుగా నిజ్జంగా ఇలా జరిగితే ఎంత బావుంటుందన్న ఆలోచన..వెరసి పైసా వసూల్...పాఠకుల మనసులను వసూలు చేసి రచయితకు ఇచ్చేసింది.
నరుక్కునే సినిమాలు రోయిన్ సినిమాలు తీసే దర్శ నిర్మాతలు హీరోలు ఇలాంటి కథలను సినిమాలుగా తీస్తే వసూళ్ల వర్షమే.

షర్మిలా ...నువ్వు అగ్నిహోత్ర అనుకుని మేన్ రోబో ను హగ్ చేసుకున్నప్పుడు మేన్ రోబో సైతం స్పందించిన ఆర్థ్రత ,చూపించిన ఎమోషన్ అక్షరకు అందనిది...మనసును పట్టి కుదిపేసే థ్రిల్లర్ ..సులోచన పాత్ర ఒక కొత్త డైమెన్షన్ ...ఆమె ఎత్తు ఆమె జీవితాన్నే ప్రశ్నించడం రచయితా సృజనాత్మకత ..నభూతో నభవిష్యతి..ప్రతీపాత్రకో ఐడెంటిటీ ..ప్రతీపధంలో బ్యూటీ .హేట్సాఫ్ మేన్ రోబో .

దాంపత్యజీవితంలో వ్యక్జ్తిగత ప్రపంచంలో పడగ్గదిలో నిస్సారమై నిర్వీర్యమైపోతోన్న రోమాంచితానుభవాలను అక్షరాల్లోకి అనువదించిన కథలు ఇవి.ముఖ్యంగా ఆపిల్ కథలోని సిద్దార్థబసు కనిపెట్టిన ఆపిల్ ను కనిపెట్టే సైంటిస్ట్ ఉంటే ఎంత బావుంటుంది ? భార్యల మనసుల్ని అర్థం చేసుకునే భర్తలు ఎక్కడ?
ప్రతీకథలో భావోద్వేగం..ఎమోషనల్ టచ్...
ఇందులో ప్రతీ కథానాయకుడు కలల రాకుమారుడు..
శుభరాత్రి క్యాండిల్ లైట్ శోభనం ..ప్రతీ కథ భార్యాభర్తలు మిస్సవుతున్న పర్సనల్ రొమాంటిక్ లైఫ్ ను గుర్తు చేస్తున్నాయి.
ఈ పుస్తకంలోని కథలు మనసును హత్తుకున్నాయి.

నా చిన్నప్పుడు వసంతబాల పిల్లల నవలలు చదివాను.కాశీమజిలీ కథలు ఇష్టంగా చదివేదానిని.చాలాకాలం తరువాత ,
" మాయాశిల్పం.మంత్రఖడ్గం " జానపద నవల చదివాను.నేను చిన్నపిల్లనై పోయాను.ఎంతబావుందో నవల.మా పిల్లలకు నవల చదివి వినిపించాను.
" మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నించింది. మణిమేఘనగా మారిన మాయాశిల్పం " ఇలాంటి వాక్యాలు చదువుతుంటే కళ్ళు అక్షరాలా వెంట మనసు జానపద కాలం వెంట పరుగెత్తింది
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
అద్భుతమైన కథనం.
థాంక్యూ కినిగె.

రచయిత రాసిన ఈ వాక్యాలు చదువరుల గుండెల్లో నిలిచిపోతాయి.ప్రతీఒక్కరిని చదివింపజేస్తాయి.

అద్భుతమైన విశ్లేషణ.దంపతులు తప్పకుండా చదువవలిసిన కథలు
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో...
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.

సర్ ,
రియల్లీ వండర్ ఫుల్ బుక్.బిజీ జీవితంలో మేమేం కోల్పోతున్నామో ఈ పుస్తకంలో ప్రతీ అక్షరం చెబుతుంది.ముఖ్యంగా ఇరవైనాలుగు గంటల్లో చనిపోతానని తెలిసినప్పుడు ఆ మనిషి తపనే జీవితానికి నిర్వచనం చెబుతుంది.మీరు రైల్వే స్టేషన్ లో గడిపిన అనుభవం కంటతటది పెట్టించింది.ఈ పుస్తకం ఎవర్ గ్రీన్.ధన్యవాదాలు సర్

చతురలో విజేత నవల జులై 1997 లో చదివాను.
ఒక అందమైన మనసున్న, బావను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి... "బావా.. నిన్ను సినిమా హీరోగా చూడాలని వుంది. నీ బొమ్మ మన టూరింగ్ టాకీస్ లో వస్తే ఈలలు వేయాలని వుంది" అని అమాయకంగా అడిగితే...
"అంతేనా... సరే అయితే.. నీకోసం హీరోని అవుతాను..." అని సినిమా రాజధానికి వెళ్లి, అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగి... హీరోగా తన సినిమా అంతా చూస్తుంటే, తను మాత్రం... ఒక నిర్ణయం తీసుకున్నాడు...
ఈ నవల ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు చదువుతున్నా అదే ఫ్రెష్ ఫీలింగ్..అదే ఎమోషన్
పల్లెటూరు నేపథ్యంలో అందమైన బావమరదళ్ళ స్వచ్ఛమైన ప్రేమకథ.
" గెలిచేవాడు కాదు గెలిపించేవాడే నిజమైన విజేత" అని చెప్పిన నవల

పెళ్ళైన దంపతులు తప్పక చదవవలిసిన నవల,
ఒకరినొకరు అపార్థాలు లేకుండా అన్యోన్యంగా ఎలా ఉండవచ్చో చెప్పే మంచి నవల,
అపార్థాలతో కుళ్లూకుతంత్రాలతో సాగే టీవీ సీరియల్స్ కన్నా ఇలాంటి ఆహ్లాదంగా వున్నా నవల మిన్న .

క్యాన్సర్ తో పోరాడి గెలిచి,తన గెలుపును ఇతరులకు స్ఫూర్తిని ధైర్యాన్ని కలిగించేలా " నేను క్యాన్సర్ ని జయించాను " పుస్తకాన్ని రాసిన తేజారాణి తిరునగరి గారు అభినందనీయులు.
ఈ పుస్తకం ఎందరికో ధైర్యాన్ని ఇస్తుంది .

తేజారాణి గారి " కొన్ని కథలు...మరికొన్ని కవితలు "చదివాను." జీవితానికి అర్థం చెప్పే కథలు..మనసును హత్తుకునే కథలు,మీ అమ్మగారి గురించి రాసింది చదువుతుంటే కన్నీళ్లు వచ్చాయి.మీరు ఇలాంటి మరెన్నో కథలు ,కవితలు రాయాలి.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I pay amount for Kalam kathalu but the book was not downloaded

I pay amount but not download the book

i want to buy this book

respecter sir have some books ?of kurnool jilla kathalu to purposce of research

hi sir kindly share the link.. Thank you so much for giving this knowledge to us

Subscribe
Browse