Comment(s) ...

సైన్స్ ఫిక్షన్ లో విజయార్కె గారు గొప్ప నవలలు రాశారు. అయన ఏ నవల రాసినా లోతుగా పరిశోధించి, పరిశీలించి పాఠకుల గుండెను తాకేలా రాస్తారు. ఆ కోవలోకి వస్తుంది ఈ 'నరుడా ఏమి నీ కోరిక' నవల. శైలి అద్భుతంగా ఉంది. నవల ఎత్తుగడ, కథను మలుపులు తిప్పిన విధానం అమోఘం. ఊపిరి బిగపట్టి చదివించే గుణం ఈ నవలకు ఉంది. కీప్ ఇట్ అప్.
- మోహనరావు దురికి (రచయిత, దర్శకుడు)

జానపద సాహిత్యం అంతరించిపోతున్న నేటి హైటెక్ యుగంలో అడపా చిరంజీవిగారు 'ముసుగు వీరుడు' జానపద నవల రాయడం మెచ్చుకొదగ్గ విషయం. జానపద సాహిత్యంలో ఇతనికి పోటీ ఎవరు లేరు అనొచ్చు. ఎందుకంటే మరిచి పోయిన కాలనీ మళ్ళి గుర్తుకు తెచ్చి నేటి కాలానికి ముడివేసి పాఠకుడిని మంత్రముగ్దుడ్ని చేయడం అంత సులువు కాదు. వంట తెలిసిన వాడు గడ్డిపోచతో కూడా ఉలువ చారు చేసి తినిపించగలడు. 'ట్రంప్ కార్డు' లాంటి సంచలనాత్మక నవలను రాసి 'కలం తిరిగిన' (చేయి తిరిగిన కాదు) ఈ రచయిత అసాధ్యుడు.
- మోహనరావు దురికి (రచయిత, దర్శకుడు)

నాకు తెలిసి జాలాది రత్న సుధీర్ గారు ప్రముఖ కవి, రచయిత. అతను మొదటిసారి 'సెల్ఫ్ హెల్ప్' మీద 'విజయానికి ఏడు సూత్రాలు' పుస్తకం రాయడం, అందులోను ప్రపంచాన్ని ఏలుతున్న ధనవంతులు ఎలా ఆ స్థాయికి ఎదిగారో వివరిస్తూ వ్యాసాలు రాయడం చాలా మంచి ప్రయత్నం. లోగడ ఇతను - యువకులు ఎలా విజయం సాధించాలో వివరిస్తూ 'టిప్స్' ఇస్తూ 'ఇంస్ట్రా గ్రామ్' లో పలు ప్రసంగాలు చేశారు. ఆ వీడియోలు వైరల్ గా మారి వేలాది యువకుకు అతనికి ఫాన్స్ గా మారారు. చాలామంది ఆయన ప్రసంగాలను రికార్డ్ చేసుకుని - వాటిని ఆచరించి విజయం సాధిస్తున్నారు. ఈమధ్య ఐ. ఏ. ఎస్ కు సెలెక్ట్ అయిన ఓ అబ్బాయి తనకు జాలాది రత్న సుధీర్ ప్రసంగాలు ప్రేరణ అని చెప్పాడు. ఆయన చెప్పిన విజయానికి ఏడు సూత్రాల లోంచి కేవలం రెండింటిని మాత్రమే ఆచరించాను - మరో ఐదు పాటించి ఉంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు సెలెక్ట్ అయ్యేవాడిని అన్నాడు. ఇలాంటి ప్రేరణనాత్మక పుస్తకాలను యువకులు కచ్చితంగా చదవాలని నేను ప్రగాడంగా నమ్ముతున్నాను.
- మోహనరావు దురికి (రచయిత, దర్శకుడు)

'' కాస్టింగ్ కౌచ్ ''
( స్త్రీ లైంగిక దోపిడీ)
కథలు
ఈనాడు అందరి నోటా వినిపించే మాట ఒక్కటే - కాస్టింగ్ కౌచ్. అంటే స్త్రీ లైంగిక దోపిడీ. ఆమెకు ఇష్టం లేకున్నా మగాడు ఆమెను నయాన్నో - భయాన్నో, బ్లాక్ మెయిల్ చేసో, తేనెపూసిన కత్తితోనో లోబరుచుకునే నీచమైన సంస్కృతి. ఇది అన్ని రంగాలల్లోనూ ఉంది. సినిమా రంగానికి ప్రత్యేక మీడియా ఉంది కాబట్టి ముందుగా బయటపడింది. మన దేశాన్ని కూడు, గూడు, గుడ్డ దారిద్ర్యము కంటే ‘ సెక్స్’ దారిద్ర్యమే పట్టి పీడిస్తోంది.
కాస్టింగ్ కౌచ్ - స్త్రీ లైంగిక దోపిడీకి కారణం ఒక్కటి కాదు, ఏ ఒక్కరూ కాదు. కర్ణుడి పుట్టుకకు కారణం ఒక్కటే. కాని చావుకు కారణాలు వంద. అలాగే ఆడవాళ్ళు సినిమా రంగానికి రావడానికి కారణం ఒక్కటే - గ్లామర్ ఫీల్డ్. వాళ్ళు లైంగిక దోపిడీకి గురికావడానికి కారణాలు వంద. మహాభారతం చెపితేకాని కర్ణుడు చావుకు గల కారణాలు అర్థం కావు. అలాగే సినిమా రంగం గురించి చెపితే కానీ స్త్రీ లైంగిక దోపిడీకి గల కారకులు, కారణాలు అర్థం కావు.
సినిమా రంగాన్ని దూరం నుంచి చూసి రాయడం వేరు - సినిమా రంగంలో పని చేసు, చూసిన విషయాలు రాయడం వేరు. 1995లో విడుదలైన 'టాప్ లేచి పోద్ది' సినిమాకు కథ, మాటలు రాశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రవితేజా, మంచు విష్ణు, శివాజీ, సుమన్, సురేష్, అలీ లాంటి ప్రముఖ హీరోలు మొదలుకొని 12 సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశాను. అలాగే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, అల్లు అర్జున్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర లాంటి సుప్రసిద్ధ హీరోల సినిమాలు కలుపుకుని 62 సినిమాలకు 'గోస్ట్ రైటర్' గా పని చేశాను (ఆ సినిమాల మెయిన్ రైటర్లు బాధ పడతారని ఆ సినిమా పేర్లు చెప్పలేక పోతున్నాను. క్షమించండి) నాకున్న ఈ అనుభవంతో, నేను కళ్లారా చుసిన కొని పచ్చి నిజాలను కథల రూపంలో మీకు అందిస్తున్నాను.
కేవలం సినిమారంగం గురించే కాకుండా అన్ని రంగాల గురించి దారా వాహిక కథలు మీకు అందిస్తున్నాను. ఎవరినో కించపరచాలనీ, ఎవరినో బాధ పెట్టాలని కాదు. ఎవరినైనా నొప్పిస్తే ముందుగానే క్షమాపణలు చెపుతున్నాను.
మన www.kinige.comలో e-book కొని చదవండి. J.P. PUBLISHERS, Vijayawada నుంచి బుక్ తెప్పిచ్చుకోండి. లేదా
www.kahaniya.com లో రోజుకో కథను చావండి. https://www.kahaniya.com/profile… లో రోజుకో కథను చావండి. మొదటి కథ 'ఉలి చెక్కని శిల్పం' చదవడానికి ఇక్కడ క్లిక్క్ చేయండి..
https://www.kahaniya.com/s/casting-cou…/uli-chekkani-shilpam

కృతజ్ఞలతో .....
మీ
భవదీయడు
మోహన రావు దురికి
(అంతర్జాతీయ రచయిత)

మన వాళ్లలో ఎన్ని రకాల ''అక్రమ సంబంధాలు'' ఉన్నాయో మీకు తెలుసా? తెలుసు కోవాలంటే వెంటనే ''నీతిమాలినవాళ్ల నీతి కథలు’’ చవండి - చదివించండి. పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

నమస్కారం. మీరు వ్రాసిన వచనానువాదం చాలా బాగుంది. కావ్యంలో ఉన్న విషయం ఇదీ అని తెలుసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది. మీ కృషికి అభినందనలు, కృతజ్ఞతలు. -మురళి నందుల.

Pls enable rent option for this book

హాలీవుడ్ స్టైల్ లో నవల ప్లజంట్ గా నడిపించడంలో రచయిత్రి సక్సెస్ అయ్యారు.సిద్దార్థ సుగాత్రి మధ్య నడిచే సీన్స్ కొత్తగా వున్నాయి.నవల అప్పుడే అయిపోయిందా ?అనే ఫీలింగ్ కలిగింది.నిడివి తక్కువగా ఉండడం కొంత నిరాశకు గురి చేసింది.
అపరాధ పరిశోధనల్లో ఈ మధ్య వచ్చిన నవలల్లో డిఫరెంట్ ప్లజంట్ నవల అని చెప్పవచ్చు.

సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుంది.ముఖ్యంగా హీరో అనగానే ఆరడుగుల ఆజానుభావుడు గాల్లో ఎగిరి ఫైట్ చేయడం అని కాకుండా వీల్ చైర్ ( చక్రాల కుర్చీ ) కి పరిమితమైన వ్యక్తి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించడం ఆ పాత్ర శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లినట్టు వుంది.అదే వ్యక్తి అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ "యాంటీ మాఫియా" కు చీఫ్ గా మారి ముల్లును ముల్లుతూనే తీయాలి అన్నట్టు మాఫియాను ధీ కొట్టే పాత్రగా మార్చ

Subscribe
Browse