
తల్లిదండ్రుల త్యాగానికి అర్థం లేనప్పుడు ఆ బిడ్డలకు త్యాగం చేయడంలో అర్థంలేదనే పరమార్థాన్ని చక్కగా చెప్పిన నవల.స్వాతి మంత్లీ లో ఈ నవల చదివా,ఆ నవల మిస్సయింది.తరువాత కొంతకాలం తరువాత కన్నడంలో ఈ నవల రాగసంగమ పత్రికలో లో సీరియల్ గా వచ్చిందని,కన్నడంలో నవలగా కూడా వచ్చిందని ఓ మిత్రుడు చెప్పడంతో సంతోషపడ్డాను.ఇప్పుడు కినిగె ద్వారా మరోసారి ఈ నవలను చదువుతున్నాను.
తల్లిదండ్రులను ప్రేమనించేవారు.నిర్లక్ష్యంగా వదిలేసేవారు అందరూ చదవవలిసిన నవల
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
ఇలాంటి మాటలు ఈ నవలలో గుండెతడిని సృష్టిస్తాయి.
అస్సాంలోని ఘోస్ ముడి ప్రాంతంలో నివసించే ఒక ఆదివాసీ తెగవారు తమ శత్రువుల మీద పగసాధించడానికి ఓ ప్రయోగం చేశారు. అక్కడ అడవుల్లో దొరికే 'స్కెది' అనే వనమూలికలు పొడిచేసి మధ్యంలో కలిపి యిస్తే అది తాగిన వ్యక్తులు నవ్వలేక చచ్చేవారుట.మందహాసం కథలో ఈ విషయం చదివి ఆశ్చర్యపోయాను.నవ్విస్తూనే ఎన్నో నిజాలను చెప్పిన కథ.నవ్వు గొప్పతనాన్ని తెలియజెప్పిన కథ.
నవ్వు దేవుడి కోసం తపస్సు చేసాడు.తనను దేవుడిని చేయమని అడిగాడు.దేవుడు నవ్వుని "నవ్వు దేవుడిని" చేసాడు.అప్పటి నుంచి ప్రపంచంలో వింత మార్పులు..?నవ్వు దేవుడికి గుడులెక్కడ?నవ్వు దేవుడెక్కడ? తెలుసుకోవాలంటే "నవ్వు దేవుడొచ్చాడోచ్" కథ చదవాలి
ఇరవై నాలుగు సంవత్సరాలుగా నా పెదవులకు అంటిపెట్టుకొనివున్న నా నవ్వు కనబడుటలేదు. నా నవ్వును తెచ్చి ఇచ్చినవారికి, లేదా ఆచూకీ తెలిపినవారికి తగిన పారితోషికం ఇవ్వబడును.కావాలంటే " నవ్వు కనబడుటలేదు" కథ చదవండి.
ప్రతీకథలో హాస్యం పెదవులపై విరబూసే ఆయుష్షును ఇస్తుంది.
మనసుపొరలను తాకిన నవల.డ్రామా ఎమోషన్స్ ఉత్కంఠ మనుష్యుల బాలఃనతలతో ఆదుకునే స్మామీజీల వికృతరూపం సత్యవర్ధన ఉరికొయ్యకు వేలాడుతూ కథానాయకుడికి చేసిన వేడుకోలు,సంవత్సరాల కష్టపడి సంపాదించిన సర్టిఫికెట్స్ విలువను నిలదీసిన సంఘటన,ఆముక్తమాల్యద అమాయకత్వం,బామ్మ వ్యక్తిత్వం, ఇలా ప్రతీ అంశం,సంఘటన కథనం అద్భుతం...అనే మాట చాలాచిన్నది.హాస్యంలో విషాదం,మాటల్లో ధైర్యం,అక్షరాల్లో అనుభూతి,.అన్నీ కలిస్తే మరణశాసనం నవల.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించే నవల.
ఇంట్రెస్టింగ్ నవల.డిటెక్టివ్ సిద్దార్థ అందరికి నచ్చుతాడు.థ్రిల్లింగ్ ఎక్సయిట్మెంట్ .విభిన్నమైన అపరాధ పరిశోధన నవల
తేజారాణి గారూ
మీ నవలలు అంటే చాల ఇష్టం.ముఖ్యంగా డెత్ సెంటెన్స్ ,కొంగుచాటుప్రేమ. నేను కాన్సర్ ని జయించాను.విభిన్నమైన సబ్జక్ట్స్,
మీరు సృష్టించిన పాత్రల్లో జీవం ఉట్టిపడుతుంది.
నాకు బాగా నచ్చిన నవల.చిన్నప్పటిరోజులు గుర్తుచేసుకుని చదివాను..అద్భుతమైన రచనాశైలి.
" అప్పుడు నవల వెల పావలా అర్థ రూపాయి అలా ఉంటూ వచ్చింది. నవలల అద్దె పది నయాపైసలు "
ఇది నిజం .మా అమ్మ చెబుతూ ఉండేది.మొన్నటివరకూ ఆ పుస్తకాలు ఉండేవి.మళ్ళీ చాలా కాలానికి ఒక మంచి నవల చదివాను.
మార్వలెస్ ..నవలగురించి చెప్పడానికి మాటలులేవు.ఏకబిగిన వదలకుండా చదివించే అద్భుతమైన రచనాశైలి.సెడక్ట్రస్ పాత్ర చదువుతుంటే ఒళ్ళు జలదరించింది.షర్మిల ఫీలింగ్స్ ,మేన్ రోబో లో ఎమోషన్స్ ...అక్షరాల వెంట కళ్ళను పరుగెత్తించేలా చేసే కథనం..ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు వుంది.న్నీ ఎమోషన్స్ ను బ్యాలన్స్ చేస్తూ రాసిన " ది బెస్ట్ నవల మేన్ రోబో " అని నా ఫీలింగ్.
ఇప్పటికి నాలుగుసార్లు చదివాను.చదివిన ప్రతీసారి ఇదే ఫీలింగ్..విజయార్కె గారి క్యూ నవల తరువాత బాగా నచ్చిన నవల ఇది.
భూతాలదీవి..బేతాళ మాంత్రికుడు ...పట్టువిడవ కుండా చదివించే నవల,శ్రీసుధామయి నవలల్లోని చదివించే లక్షణం మిక్కిలిగా వుంది.మీ కలం నుంచి మరిన్ని జానపదనవలలు డిటెక్టివ్ సిద్దార్థ లాంటి నవలలు రావాలని కోరుకుంటున్నాం..
ఇలాంటి డిఫెరెంట్ సబ్జెక్టుతో సినిమా తీస్తే ఇంకా బావుంటుంది,ప్లజంట్ గా చదివించే నవల
అద్భుతమైన జానపద నవల" .జ్వాలాముఖి మంత్రాలదీవి " వరుసలో నాకు నచ్చిన నవల మణిద్వీప రహస్యం.చిన్నప్పటి రోజులను బాలమిత్ర చందమామ కథలను ,జేబులో ఇమిడే జానపద నవలల పరిమళాలను గుర్తుకు తెచ్చిన నవల.ఇంత మంచి నవల రాసిన రచయిత్రి శ్రీసుధమయి గారికి ,ఇ బుక్ గా అందించిన కినిగెకు ధన్యవాదాలు
ఊపిరి సలపనివ్వని ఉత్కంఠ ను దృశ్యకావ్యంగా అందించిన నవల " క్యూ " అనడంలో సందేహం లేదు.సైన్స్ ఫిక్షన్ ను ఇంత అద్భుతంగా రాయవచ్చా ? భావుకత్వం సెంటిమెంట్స్ ఎమోషన్స్ సైన్సుకు అంతుచిక్కని ప్రశ్నలా ? క్యూ గ్రహం ఒక ప్రశ్నార్థకం ..ప్రహేళిక ఒక పజిల్ ..ఎమోషన్స్ సెంటిమెంట్స్ ? ఎవరూ కనిపెట్టలేని ,క్యూ గ్రహానికి అంతుచిక్కని ఒక ప్రశ్న ప్రహేళికకు సమాధానంగా మారితే..నవల ఆధ్యంతం అత్యద్భుతం.తెలుగులో ఇలాంటి నవల రావడం మహాద్భుతం.
వాసంతి పాత్ర కూడా ఎంతో బావుంది .ప్రహేళిక ఎందుకు కనిపించకుండా పోయింది అనే చిక్కుముడు విడిపడ్డాక.ఆ కారణం తెలిసాక మనసుకు మెలిక పడింది.
ఒక డిటెక్టివ్ నవల ఒక థ్రిల్లర్ కలిపితే క్యూ నవల