Comment(s) ...

నాలుగు విభిన్నమైన కథాంశాలతో నవలలు ఒకే బంచ్ లో,కలిపి ఇవ్వడం బావుంది.ఒకేసారి నాలుగు నవలలు చదువుకునే అవకాశం.మీ ఇష్టం వ్యక్తిత్వ వికాసంలో కొత్త కోణాలను చూపించింది.ముఖ్యంగా దేవుడికి రచయితకు మధ్య జరిగే సంభాషణ.అండర్ వరల్డ్ ఒక మాఫియా సినిమా చూస్తున్నట్టు వుంది.
ముఖ్యంగా ఒక అండర్ వరల్డ్ డాన్ ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు చీఫ్ గా చేయడం అనే ఆలోచన కొత్తగా వుంది.చాలా బావుంది.

నాలుగు డిఫరెంట్ సబ్జక్ట్స్ తో ఒకే పుస్తకంలో నాలుగు నవలలు అందించడం చాలా బావుంది.అండర్ వరల్డ్ నవల చదువుటఁటే ఒక ఆక్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది .
పైసా వసూల్ కొత్త కాన్సెప్ట్.కుబేరుడు అప్పు ఇవ్వడం,వడ్డీ ఇవ్వని వైభవ్ ను కారుతో సహా తన లోకానికి తీసుకువెళ్లడం థ్రిల్లింగ్ గా వుంది.దేవుడిని నమ్మని హీరో దేవుడిని నమ్మడానికి చెప్పే రీజనింగ్ కన్విన్సింగ్ గావుంది.
టార్గెట్ నవల క్రైమ్ వెబ్ సిరీస్ చూస్తున్నట్టు వుంది.
మీ ఇష్టంలో దేవుడితో రచయితా సంభాషణ అర్థవంతంగా మనసును కట్టిపడేస్తుంది.
మిక్స్ డ్ ఎమోషన్స్ తో అద్భుతమైన కాంబినేషన్ విజయార్కె " నాలుగు నవలలు",

అపరాధ పరిశోధనలో,థ్రిల్లర్ లో ది బెస్ట్ " రహస్యం" ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.ఉడుముతో డివోచి సర్పంతో కూడా కలిపి కథను నడిపించిన స్టైల్ అఫ్ రైటింగ్ స్కిల్ సూపర్బ్.కొత్త ఐడియా.ఒళ్ళు గగుర్పొడిచే థ్రిల్లర్ స్టోరీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినట్టు వుంది.
ప్రతీకథ రసాస్వాదన .విభిన్నమైన రచన.

మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే కథలు.ప్రతీకథ ఒక హాస్యగుళిక.విభిన్నమైన వైవిధ్యమైన హాస్యకథలు.ఒత్తిడి నుంచి మనల్ని దూరం చేసే కథలు.

ఈ పుస్తకాన్ని ఎంతో ఇష్టంతో మూడుసార్లు చదివాను.చదివి నిజమైన సంతృప్తిని ఇచ్చే ఇష్టమేమిటో తెలుసుకున్నాను.మనల్ని మనం స్కాన్ చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుంది,
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి,అసంతృప్తిని జయించండి..ఈ పుస్తకాల తరువాత మళ్ళీ ఇష్టంగా చదివిన పుస్తకం .

అద్భుతం అనే మాట చిన్నది.ఒక ఫిక్షన్ ను హార్ట్ టచింగ్ గా ఉత్కంఠభరితంగా రాయడం అమేజింగ్ .సెడక్ట్రస్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచేలా ఇస్తుంది.సులోచన పాత్ర కళ్ళకు కడుతుంది."చిన్నపాత్రే కానీ గొత్త తత్వాన్ని చెబుతుంది.అగ్నిహోత్రగా భావించి మేన్ రోబోను ప్రేమించిన షర్మిల పాత్ర ఆసాంతం గుర్తుండిపోతుంది.
కళ్ళముందు హాలీ వుడ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.ఎమోషన్స్, సస్పెన్స్ ,కామెడీ.అన్నీ ఒకే దారంలో అందంగా అమరిన ఎంటర్టైనర్ పూలదండ .

ఇవి కథలు కావు.దంపతుల రోమాంచితానుభవాలు .దంపతులు పడగ్గదిలో అనుభూతులను భద్రపర్చుకునే మధురోహలు
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.ఇంతకూ ఆ పందెం ఏమిటంటే ..?
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది కథేమిటి?
ఒక్కో కథలో ఒక్కో అనుభవం...దాంపత్యజీవితానికి అర్థం చెప్పే ఎక్సయిటింగ్ రొమాంటిక్ జర్నీ

ఈ పుస్తకం ఏమిటో చెప్పడానికి ఈ మాటలు చాలు...
గెలుపు అంటే అర్థం ఏమిటి? ఓటమికి నిర్వచనం ఏమిటి?
యుద్ధంలో ఒక దేశం గెలవడం గెలుపే.. కానీ ఒక దేశాన్ని ఆక్రమించుకుంటే ఆ గెలుపు నిజమైన గెలుపా?
ఒక కిరాయిహంతకుడు సుపారీ తీసుకుని హత్యచేస్తే అది గెలుపా?
గెలుపు అంటే మనకు ఆనందాన్ని లేదా డబ్బును ఇచ్చేది కాదు.. ఎదుటివారిలో కూడా ఆనందాన్ని కలిగించేదే గెలుపు
రామోజీరావుగారి పేరు తెలియని తెలుగు వాళ్ళే కాదు భారతీయులు కూడా వుండరు. ఆ మాటకొస్తే ప్రపంచమంతా గర్వించే రామోజీ ఫిలిం సిటీ, వార్త సంస్థలు, వేలాదిమందికి ఉపాధి ఇది కదా గెలుపు. రామోజీరావు అన్న పేరు ఈరోజు ఒక గెలుపు చిహ్నం.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడిచేసిన ఉగ్రవాదులది గెలుపే.. కానీ కొన్ని వేలమంది ప్రాణాలు తీసిన ఆ దుశ్చర్య, ఉన్మాదం గెలుపు కాదు... ఓటమితో సమానం.
గెలుపు అంటే మనం ఆనందాన్ని పొందడం కాదు.. మన చుట్టూ అందరూ ఆనందంగా ఉండడం. వాళ్ళను ఆనందంగా సంతోషంగా ఉండేలా చేయడం.
ఒక గెలుపు మనకు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది
మరొకటి.. మన గెలుపు మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది.
ఒక గెలుపు నిరర్థకమైనది.. మిమల్ని పతనం వైపు తీసుకు వెళ్ళేది.
మన మైండ్ సెట్ ను మార్చే అద్భుత పుస్తకం

విద్యార్థులకు ప్రధాని విలువైన సూచనలు
రైతుల గొప్పతనం పిల్లలకు తెలియాలి
తెలుగు నెలలు..మన సంస్కృతులు ,సంప్రదాయాలు
పిల్లలో హింసాప్రవృత్తిని ఖండిద్దాం
పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,విద్యార్థులు తప్పక చదవాల్సిన ఉపవాచకం ఈ పుస్తకం.
ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ పుస్తకాన్ని మీ పిల్లలకోసం చదివి వినిపించండి.

ఈ పుస్తకం నాలోని అసంతృప్తిని నేను గుర్తించేలా చేసింది.నిరర్థకమైన,నిర్మాణాత్మక అసంతృప్తులు అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసింది.
" బిన్‌లాడెన్‌లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రైట్ సోదరులు, గ్రాహంబెల్, ఐన్‌స్టీన్... చరిత్రలో విజయాన్ని సాధించిన ప్రతీ ఒక్కరూ నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించినవారే.
ఓటమిని విశ్లేషించుకోవడం, నిజమైన అసంతృప్తి తెలుసుకోవడం..
నిరర్ధకమైన అసంతృప్తిని వదిలి, నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించడమే నిజమైన గెలుపు."
జీవితాన్ని అద్దంలో చూపించిన పుస్తకం

ఇలాంటి పుస్తకాలు అరుదుగా వస్తాయి.మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో కళ్ళకు కట్టినట్టు కళ్ళముందు జీవితాన్ని చూపించింది.

ప్రారంభంలోనే ఆకట్టుకునే కథనం.ప్రజల అమాయకత్వాన్ని వ్యాపారంగా చేసుకునే స్వామీజీల బండారాన్ని బయటపెట్టే అద్భుతమైన నవల,ప్రతీపాత్రకు ఒక గుర్తింపు.ప్రవల్లిక పాత్ర తీర్చిదిద్దిన విధానం బావుంది.రచయిత ఏ ఇతివృత్తం ఎన్నుకున్నా తనదంటూ వుండే ప్రత్యేకత శైలి కనిపిస్తూనే ఉంటుంది.
" ఎక్కడ ప్రజలు అమయకత్వం ఊపిరి పోసుకుంటుందో అక్కడ అవకాశ వాదం విష సర్పం ఈ వ్యవస్థను విషపూరితం చేయడానికి సిద్ధమవుతున్నది.
ఇరవై సంవత్సరాల క్రితం ఓ చిన్న సంఘటన ఈ దేశ ప్రశాంతతను భస్మీపటలం చేయడానికి ఆయత్తమవుతుంది.
రాత్రి లాకప్ రేప్ లు లాకప్ డెత్ లు లేనట్టున్నాయి. అందుకే పోలీసుస్టేషన్ ప్రశాంతంగా ఉంది. ఇంకా బోణి ఎప్పుడవుతుందో అన్నట్టుగా విసుగ్గా పోలీస్ స్టేషన్ ముందు టీ కొట్టువాడు నిలుచున్నాడు. పోలీస్ స్టేషన్ కేసులే వాడికి ఎక్కువ.
ఇరవై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి అడుగు పెట్టాడు రిటైర్డ్ మేజర్ భీష్మాచార్య. కూడా ఓ అమ్మాయ ఉంది. వయసు ఇరవై ఉంటుంది"
అద్భుతం

మానవ భావోద్వేగాలను పాత్రలుగా మలిచి,చదివించే గుణాన్ని శైలిగా మార్చుకుని తన రచనల్లో వైవిధ్యాన్ని చూపించే విజయార్కె గారి ముద్ర కొట్టొచ్చినట్టు కనిపించే రచన..
అయితే ఇది సన్నివేశాలుగా ఉండడం వల్ల కొంత అసంతృప్తి.ఇదే నవలగా రాసి ఉంటే మరింతగా మాకు సంతృప్తి మిగిలేది.
విజయబాపినీడు గారికి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పంపించిన స్కీరిప్ట్ ను యథాతథంగా అందించడం వల్ల ఇది అనివార్యమని రచయిత పేర్కొండడం గమనార్హం.ఒక సినిమా స్క్రిప్ట్ చదువుతున్నట్ట్టు వుంది.చిరంజీవిగారు ఇలాంటి రెండు పాత్రలను మెజీషియన్ గా ,ఆర్మీ ఆఫీసర్ గా పోషిస్తే అభిమానులకు పండుగే.అబ్రకదబ్ర కథను ( కామెడీ ట్రాక్ ) ను హాసం పత్రిక ద్వారా అందించడం బావుంది.
ఈ కథను నవల రూపంలో చదవలేదనే అసంతృప్తిని ఇదే పుస్తకంలో అదనంగా అందించిన కుబేరాయనమః తీర్చివేసింది.
ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన హాస్యనవల.అల్లరి నరేష్,నిఖిల్ లాంటి వాళ్ళు చేయవలిసిన మంచి సబ్జెక్టు కుబేరాయనమః

పుస్తకాలు జీవితాలు మారుస్తాయా లేదో కానీ జీవితాన్ని మన కళ్ళముందు ఉంచుతాయి.నిర్ణయం నవల ఆ కోవకు చెందినది.మనసును కట్టి కుదిపేసిన నవల
నా కన్నడ స్నేహితురాలు ఈ నవల ( కన్నడంలో జీవనసంధ్య) కన్నడంలో చదివి బావుందని చెబితే..అదీ ఈ నవల మాతృక తెలుగు
( నిర్ణయం ) అని తెలిసి వెంటనే సెర్చ్ చేస్తే కినిగె లో ఇ బుక్ రూపంలో లభ్యమైంది.
తరువాత నా సహాధ్యాయి తన దగ్గరున్న స్వాతి కలెక్షన్స్ లో నుంచి ఈ నవల నా పుట్టినరోజు కానుకగా కానుకగా ఇచ్చింది.
1997 లో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా వచ్చిన ఈ నవలలో నాకు బాగా నచ్చిన అంశం...
త్యాగం పేరుతో పెద్దయ్యాక కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద దాష్టీకాన్ని ప్రదర్శిస్తే కన్నప్రేమ అని సహించాలా? ఉహూ తిరగబడాలని కన్విన్సింగ్ గా చెప్పడం.
ఇప్పటికీ ఈ నవల .పిల్లలను తల్లిదండ్రులను ఆలోచింపజేస్తుందని నా విశ్వాసం
శ్మశానాన్ని వృద్ధుల ఆశ్రమంగా తీర్చిదిద్దిన తీరు.
కలెక్టర్ కూతురు తన బామ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో కలుసుకున్న సందర్భం...
కంటికి కన్నీటితెరను తెప్పించింది.
ఈ నవల వచ్చినప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు.,
ఇప్పుడు విశ్రాంత జీవితంలోకి వచ్చాక ఆలోచిస్తే ఇంత మంచి నవలను అప్పుడు మిస్సయ్యాను అనిపిస్తుంది.
ఇది ఒక వ్యక్తిత్వవికాసపుస్తకం ,
అందరూ చదవాలి చదివి ఒక్కసారి వుద్ధాశ్రమాలకు వెళ్లి ఈ పుస్తకం గురించి చెప్పిరావాలి.
పిల్లలకు తల్లిదండ్రులకు ఈ పుస్తకం ఇవ్వండి.వాళ్లకు జీవితాన్ని పరిచయం చేయండి.

భార్యాభర్తలు ఏకాంతంలో చదువుకునే చక్కని కథలు.
వెన్నెల్లో విహరిస్తున్నట్టు,అద్భుతమైన కథలను ఊహల రెక్కలతో ఆకాశంలో విహరించేలా చేసినకథలు
విభ్రమ,అందాలక్రీడ,క్యా సీన్ హై...
విభిన్నమైన రొమాంటిక్ ఫ్లేవర్ వున్న కథలు
ప్రతీ కథకు ఒక రొమాంటిక్ ఫ్లేవర్.
హేట్సాప్

చంద్రబాబునాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఈ పుస్తకంలో మీ విజయగాథ ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది.మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి.తెలుగుప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి.స్వర్ణాంధ్రను అద్భుతరాష్ట్రంగా తీర్చిదిద్దాలి.
యువతకు ఒక వ్యక్తిత్వవికాస పుస్తకం

ఇరవైఏడేళ్ల క్రితం వచ్చిన ఈ నవలలోని డ్రగ్స్ అంశం ఇప్పటికీ యువతను పక్కదారి పట్టిస్తున్నాయి.ఈ నవల ఇప్పటికీ ఈ తరానికీ యువతరానికి పనికివస్తుంది.దేశభక్తి ఎమోషన్స్ నిజాయితీ ఈ నవలలోని కీలకమైన అంశాలు.సినిమాగా రూపుదిద్దుకోవలిసిన సబ్జెక్టు.ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక చక్కని సందేశం వున్న నవల.

అమ్మా !
నమస్కారం
మీరు రాసిన పుస్తకం " నేను క్యాన్సర్ ని జయించాను " చదివాను.మనస్సు భారమైంది.మా అమ్మగారు క్యాన్సర్ తోనే కాలం చేసారు. మీరు క్యాన్సర్ ని ఎలా ఎదుర్కొన్నారో చదువుతుంటే కన్నీళ్ళొచ్చాయి.ఇలాంటి పుస్తకం ఆ రోజుల్లో ఉంటే మా అమ్మగారికి ,మాకు ఎంతో ధైర్యంగా ఉండేది.,
" మీలా మరొకరు ధైర్యాన్ని కోల్పోవద్దని " ఈ పుస్తకాన్ని రాసిన నేపథ్యం బావుంది.మీ తలవెంట్రుకలు రాలిపోతున్నప్పుడు మీరు పడ్డ బాధ,మీ అమ్మగారి ఆవేదన మీ అక్షరాల్లో ప్రస్ఫుటమైంది.
మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలి.
ఈ పుస్తకాన్ని ప్రతీఒక్కరూ చదవాలి.జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి.దురదృష్టవశాత్తు క్యన్సర్ బారిన పడితే " ఆ క్యాన్సర్ ని " తరిమివేసేందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది.

అల్లరి నరేష్ వైభవ్ పాత్రకు సరిగ్గా టైలర్ మేడ్ పాత్రలా సరిపోతాడు.దేశ ఆర్థిక పరిస్థితికి,నిరుద్యోగుల ఆర్థిక సమస్యలకు ,ఉపాథికల్పనకు భేషైన కాన్సెప్ట్.

కొద్ది సమయాన్ని వెచ్చించి ఈ నవల చదవండి.గంధర్వలోకం ఉజ్వలసామ్రాజ్యం అడవులు మాట్లాడే సింహం..మాటవిని తప్పుకునే మేఘాలు. .అన్నీ చూసేయండి..చదువుతూ...
విజయార్కె గారి నవలలు విభిన్నం..వినూత్నం...అది జానపదం అయినా కామెడీ( నవ్వు దేవుడొచ్చాడోచ్ , బూచాడమ్మా బూచాడు ) అయినా,హారర్ ( టక్ టక్ టక్ ) రొమాన్స్ ( గుడ్ నైట్ స్టోరీస్ , క్యాండిల్ లైట్ శోభనం ) క్రైమ్ (టార్గెట్ ...789 ) సైన్స్ ఫిక్షన్
( క్యూ.మేన్ రోబో ) అయినా...మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించే శైలి .

పైసావసూల్ పైసా వసూల్ చేసే నవలే.ఇలాంటి ఫాంటసీ నవలలు పాఠకులను ప్లజంట్ మూడ్ లోకి తీసుకువెళ్తాయి.రచయిత పాత్రలను డిజైన్ చేసిన తీరు బావుంది.విజయార్కె గారి అర్చనలు చిరపరిచితాలే.వారి రచనల్లోని మెరుపు మార్క్ చెదిరిపోదు.కృత్తిక పాత్ర వైభవ్ పాత్ర ద్భుతంగా డిజైన్ చేసారు.కుబేరుడు ప్రజలకు అప్పు ఇవ్వడం.తిరిగి దానిని ఎలా వసూల్ చేసుకున్నాడో చెప్పిన విధానం కళ్ళకు కట్టినట్టు ఇలా జరిగితే బావుండు అన్నట్టు వుంది.
రెండు వారాల క్రితం ఈనాడు లో వారి కథ భం భం భయం చదివాను.అదే స్టైల్ అదే చరిష్మా.

జానపదాల నవలా ప్రపంచంలో సరికొత్త నవల ...మహాతలం మాయాదర్పణం .చిన్నపుడు చాలా ఇష్టంగా చదివే జానపద నవలలు అంతే ఇష్టంగా చదివిస్తున్నాయి శ్రీసుధామయి నవలలు.మాయామంత్రాలు టక్కుటమారా విద్యలు ,చదివించే మంచి శైలి.కీపిటప్ .

ఒక్కోసారి ఎంత గొప్పవాళ్ళైనా కష్టాలపాలు కాక తప్పదు అనడానికి హీరో సుమన్ జీవితం ఒక ఉదాహరణ.అయితే నిర్థోషిగా జైలుగోడల మధ్య గడపడం( విచారణ సమయంలో రిమాండ్ లో )విచారకరం.తన మీద పడ్డ నిందను తొలిగించుకుని చీకటి నిందను చీల్చుకుని వెలుగులోకి వచ్చాడు సుమన్.అతను నిర్థోషి అని న్యాయస్థానం తేల్చిచెప్పింది.ఆ స్వామి వారి కృప నిజాయితీ ఈ రెండు ఉండడం వల్లే అన్నమయ్యలో శ్రీవేంకటేశ్వరుడి పాత్రను పోషించే భాగ్యం కలిగింది కాబోలు.
ఆంధ్రభూమిలో పాతికేళ్ల క్రితం సీరియల్ గా వచ్చినప్పుడు ..ఈ సీరియల్ ద్వారా మొత్తం ప్రపంచానికి మరోసారి సుమన్ నిర్థోషి అని తెలిసింది.జైలులో గడిపిన జీవితం సుమన్ లో ఎంతో మార్పు తెచ్చిందని ఈ పుస్తకం ద్వారా అర్థం అయ్యింది.తనను తాను మరింత దృఢంగా మార్చుకున్నాడు.ఖైదీలు కూడా సుమన్ ను గౌరవించడం సుమన్ వ్యక్తిత్వానికి నిదర్శనం.వ్యక్తిత్వపు విలువలు జీవితాన్ని ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.

మళ్ళీ నవలా యుగంలో ట్రావెల్ చేసినట్టుంది .విభ్రమ మా పక్కింటి అమ్మాయి అయితే బావుండు అన్నట్టుంది.నిజంగా యాంటీ మాఫియా స్క్వాడ్ కు యస్సార్కె చీఫ్ అయితే బావుండు అన్నట్టు వుంది.నవల లీనమై పాత్రలతో మమేకమయ్యా... ఆర్జీవీ సర్కస్ 3 మళ్ళీ ఇలాంటి సబ్జెక్టు తో తీస్తే చూడాలని వుంది.అభిషేక్ అమితాబ్ ఐశ్వర్యారాయ్...జయబాధురి...
ఇలాంటి టీవీ ఛానెల్స్ ఇలాంటి ( విభ్రమ )యాంకర్ రిపోర్టర్స్ మనక్కావాలి.అండర్ వరల్డ్ మా హృదయాల్లో నిలిచిపోయే నవల.

Don't miss!
Free goodies!
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I tried to read your book online but couldn't succeed madam. Please send link or soft copy to my WhatsApp madam.

Rangachari, Hyderabad

Where is the buy option on all the books ?

Writing style should be In past tense. But this author is writing in future tense.

Sir call me once 9550083704

Subscribe
Browse