Comment(s) ...

ఈ కథలు మనసును గిలిగింతలు పెడుతూ,దాంపత్యజీవితానికి అర్థం చెబుతున్నాయి.
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.ఇంతకూ ఆ పందెం ఏమిటంటే ..?
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది కథేమిటి?

విజయార్కె నాలుగు నవలల్లో " అండర్ వరల్డ్" ది బెస్ట్ నవల.ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.
కుబేరాయనమః ప్రారంభంలోనే వేలసంవత్సరాల క్రితం శ్రీ వేంకటేశ్వరస్వామి తన్న కల్యాణానికి అప్పు చేయడంతో మొదలుపెట్టి,వైభవ్ కుబేరుడిని అప్పు అడగడం తథాస్తు దేవతలు రికమెండ్ చేయడం,వడ్డీ చెల్లించని హీరో వైభవ్ ను కారుతో సహా తన లోకానికి తీసుకువెళ్లడం,కారు ఆకాశంలో ప్రయాణం చేయడం రచయిత కల్పనాశక్తికి హేట్సాప్
నవ్విస్తూ ఒక ఆహ్లాదభరితంగా కామెడీ సినిమా చూస్తున్నట్టు వుంది.
మీ ఇష్టం పుస్తకం అందరి జీవితాలను కనెక్ట్ చేస్తుంది.
ఒకే పుస్తకంలో నాలుగు నవలలు ఒక మంచి ప్రయోగం.

ఈ సమయంలో ప్రతీఒక్కరూ చదువవలిసిన పుస్తకం "ఒత్తిడిని జయించండి"తక్కువ వెలలో విలువైన విషయాలు చక్కని శైలితో ఆలోచింపజేసే పుస్తకం
ఒత్తిడితో ఓడిపోయేవాళ్లు ఆత్మహత్యకు సిద్ధమయ్యేవాళ్ళు ఈ పుస్తకాన్ని చదవాలి.ధైర్యంతో ఒత్తిడిని జయించాలి .

క్యాన్సర్ గురించి పూర్తిస్థాయి అవగాహన కలిగించే పుస్తకం ఇది.ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ప్రతీఇంట్లో వుండడం ఎంత అవసరమో...ఈ పుస్తకం ప్రతీ ఇంట్లో ఉండడం అంత అవసరం.క్యాన్సర్ గురించి ప్రాథమిక అవగాహన కలిగిస్తుంది.ఉపయోగకరమైన పుస్తకం.

మేన్ రోబో నవల ఏకబిగిన మరోసారి చదివాను.శరీరం గగుర్పొడిచింది.ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.పాత్రల్లో ప్రాణం తొణికిసలాడింది.అగ్నిహోత్ర పాత్ర చూస్తుంటే దేశంకోసం ప్రాణాలు అర్పించిన ఆర్మ్ జవానులు గుర్తొస్తున్నారు.మేన్ రోబో సాహసాలు కళ్లకు కట్టినట్టు వున్నాయి.ఈవిల్ సిటీ నిజంగా ఉందేమో అన్న భ్రమ.సెడక్ట్రస్ పాత్ర మరచిపోలేము.మేన్ రోబో ఎమోషన్స్ యాక్షన్ సన్నివేశాలు సినిమా దృశ్యాలను తలపించాయి.రచయిత శ్రమను గుర్తుచేశాయి. ఆంత్రాక్స్ కథాంశం ఇప్పటి కరోనా కు అన్వయించుకుంటే అద్భుతమైన అడ్వెంచర్ నవలగా అనిపిస్తుంది.షర్మిల ప్రేమ, సులోచన పాత్రలోని డ్రామా నవలలోని ఏ చిన్న అంశాన్ని రచయిత నిర్లక్ష్యం చేయలేదు.ఇలాంటి నవలలు సినిమాలుగా రావలిసిన అవసరం వుంది.

హీరో సుమన్ గురించి ఇంతవరకు తెలియని కొత్తవిషయాలు తెలిసాయి.ధైర్యంగా సమస్యలను ఎదుర్కున్న రియల్ హీరో సుమన్ గారు.తల్లిప్రేమకు కళ్ళలోనీళ్ళు తిరిగాయి.ఇంతమంచి పుస్తకాన్ని అందించినందుకు కినిగెకు ధన్యవాదాలు.

ముచ్చట్లాట , తలుపుచాటు సిగ్గు,ఏమి వింత మోహమో..క్యా సీన్ హై .అందాల క్రీడ ,ఒక్కో కథ ఒక్కో అనుభూతి.
భార్యాభర్తలు మిస్సయ్యిన రొమాంటిక్ ఫీలింగ్స్ ను విజువలైజ్ చేసినట్టు వున్నాయి. జీవితంలో దాంపత్యజీవితం ఇంపార్టెన్స్ ను కళ్ళకు కట్టిన కథలు.
ఈ కథలు చదివితే దంపతులకు ప్రతీ రాత్రి గుడ్ నైట్.అవుతుంది.

ప్రతిక్షణం భయపెడుతూనే ఆసక్తిగా చదివించే లక్షణం వున్న నవల డార్క్ అవెన్యూ.క్లైమాక్స్ ట్విస్ట్ . రచయిత్రి టాలెంట్ ని తెలియజేసింది.
తీశ్మార్ పేరులోనే భయం కనిపించింది.ఇలాంటి సంఘటన ఒకటి హైద్రాబాద్ లో జరిగినట్టు గుర్తు.లాజిక్ హారర్,రెంటిని బాలన్స్ చేసిన ఈ నవల రాత్రుళ్ళు చదవకండి.

రొటీన్ లైఫ్ నుంచి జానపద ప్రపంచములోకి తీసుకువెళ్లిన " మాయాశిల్పం-మంత్రఖడ్గం " అద్భుతమైన నవల.
అందులోని పాత్రలు కళ్ళముందు దృశ్యాలుగా కనిపిస్తున్నాయి.చిన్నప్పుడు చుసిన జానపద సినిమాలు గుర్తొస్తున్నాయి.
మణిమేఫన నిజంగా ఎక్కడో గంధర్వ లోకంలో వున్నట్టే వుంది.
మేఘాలు తప్పుకోవడం...అద్భుతమైన ఆలోచన..వర్ణన...మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించే నవల.

ఈ పుస్తకాన్ని ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.జీవితాలను ప్రభావితం చేసి పాజిటివ్ దృక్పథాన్ని ,మనమేమిటో మనం తెలుసుకోవడాన్ని తెలియజేసిన పుస్తకం.జీవితంలో ఎవరెవరో పడ్డ కష్ఠాలు సాధించిన విజయాలు కాదు.పుస్తకరచయిత స్వానుభవాలు కళ్లకుకట్టి కంటినీరును తెప్పిస్తుంది.మనమేమిటో తెలుసుకునే వివేకాన్ని ఇస్తుంది.

పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన బావమరదళ్ళ ప్రేమ
మరదలి కోసం సినిమా హీరో కావాలని హైద్రాబాద్ కు వచ్చిన కథానాయకుడు
సినిమా పరిశ్రమలో వున్నా ఎగుడుదిగుడులను కళ్ళకు కట్టిన సన్నివేశాలు
హీరోగా మారి తాను విజేతగా నిలిచి మరదలిని గెలిపించిన కథానాయకుడు తీసుకున్న నిర్ణయం...
ఈ నవలలో ఈ నాలుగు మూలస్థంబాల మధ్య నిర్మించిన కథనం అనే సినీ ప్రేమనగర్ ..
అద్భుతం

నేను బాల్యంలోకి వెళ్లి చదివాను.మళ్ళీ వర్తమానంలోకి వచ్చి చదివాను.మేఘాలు తప్పుకోవడం,సింహం మీద పిల్లాడు స్వారీ చేయడం,కొలనులో గంధర్వకన్య జలకాలాడుతుందని చంద్రుడు తప్పుకోవడం..అద్భుతమైన మ్యాజిక్ ...

అన్నీ విభిన్నమైన కథలే.కథలు చదివాక మనల్ని కథల తాలూకూ పాత్రలు ప్రశ్నిస్తాయి.నిలదీస్తాయి.
*వృద్ధులైన ఆ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యాన్ని పిల్లలకు,పిల్లల యవ్వనాన్ని తమకు ఇవ్వమని దేవుడిని కోరుకున్నారు...ఆ వింత కోరిక తో ప్రపంచమే తల్లకృందులైంది
స్వాతిలో వచ్చిన ఈ కథ ఇప్పుడు ఈ కథల పుస్తకంలో చేరి మరెన్నో కొత్తకథలను కలిపి వినిపిస్తుంది.చదివేలా చేస్తుంది
ఈ పుస్తకం.ప్రతీ ఎమోషన్ ఒక జీవితసత్యాన్ని విడమర్చి చెబుతుంది.
విజయార్కె గారి రచనల్లోని శైలి ప్రత్యేకం ఎంచుకునే సబ్జక్ట్స్ విభిన్నం

నవల చాలా బావుంది.శైలి బావుంది.ముఖ్యంగా కథను నడిపించినతీరులో రచయిత్రి ప్రతిభ కనిపించింది.కనుమరుగైన జానపద నవలలను మళ్ళీ వెలుగులోకి తీసుకువస్తున్న కినిగెకు అభినందనలు.

ఈ నవలలో బాబాల గురించి దొంగస్వాముల గురించి రాసింది అక్షరసత్యం.ఇప్పటికీ ప్రజల అమాయకత్వం ఉపిరిపోసుకుంటూనే అమాయకుల ఉసురు తీస్తోంది.రీడబులిటీ వున్న నవల .ఆసక్తిగా చదివించే కథనం.ప్రవల్లిక పాత్ర తీర్చిదిద్దిన విధానం బావుంది.దాదాపు రెండు దశాబ్దాలకు ముందే ఈ నవల ఒక ప్రముఖ దినపత్రికలో సీరియల్ గా చదివిన గుర్తు.

మనసారా హాయిగా నవ్వుకునే ఆహ్లాదకరమైన హాస్యం..ఆలోచింపజేసే కథనం...సన్నివేశాలు...,కొత్తదనానికి సరికొత్త అర్థం చెప్పిన సబ్జెక్టు...నిజంగా కుబేరుడు ఇలా చేస్తే,,,వైభవ్ లాంటి వాళ్ళు ఎందరికో ఇన్స్పిరేషన్ అవుతారు.కృత్తిక పాత్ర బావుంది.

సరదాగా చదివిస్తూ సీరియస్ గా ఆలోచింపజేస్తూ కొత్తదనంతో థ్రిల్లింగ్ ని కలిగించిన నవల కొంగుచాటు ప్రేమ...ఇలాంటి రచనలు అరుదుగా వస్తాయి.

" ఇరవైనాలుగు గంటల ముందు చనిపోతానని .." ఏ మనిషికైనా తెలిస్తే ఎలా ఉంటుంది ..అన్న ఆలోచన వస్తే..అది నిజమైతే ఈ ప్రపంచమే బావుంటుందేమో..ముఖ్యంగా ఈ పుస్తకరచయిత తన జీవితాన్ని అర్థం చేసుకున్న తీరు..రైల్వే స్టేషన్ లో గడిపిన సంఘటన కళ్ళ వెంట నీరు తెప్పించింది.అద్భుతం ఇంతమంచి పుస్తకం మాకు అందించినందుకు కృతజ్ఞతలు.

సమ్మోహనం అద్భుతం తెలుగులో నేను చదివిన నవలల్లో " ది బెస్ట్ " నవల.ఎమోషన్స్ గురించి ఏలియన్స్ గురించి ప్రేమ గురించి రాసిన గొప్ప థ్రిల్లర్ ..సూపర్ .ఆమె కనబడుటలేదు..,అన్న విషయాన్నీ డైజెస్ట్ చేసుకోవడం ఎంత కష్టమో..ఆమె కనబడ్డాక ఏం జరిగిందో తెలిస్తే తట్టుకోవడం అంతే కష్టం అనిపించింది.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Unable to download, even after payment 3 times, this is not good that even after payment if we dont get to read

Pls enable rent option for this book

హాలీవుడ్ స్టైల్ లో నవల ప్లజంట్ గా నడిపించడంలో రచయిత్రి సక్సెస్ అయ్యారు.సిద్దార్థ సుగాత్రి మధ్య నడిచే సీన్స్ కొత్తగా వున్నాయి.నవల అప్పుడే అయిపోయిందా ?అనే ఫీలింగ్ కలిగింది.నిడివి తక్కువగా ఉండడం కొంత నిరాశకు గురి చేసింది.
అపరాధ పరిశోధనల్లో ఈ మధ్య వచ్చిన నవలల్లో డిఫరెంట్ ప్లజంట్ నవల అని చెప్పవచ్చు.

సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుంది.ముఖ్యంగా హీరో అనగానే ఆరడుగుల ఆజానుభావుడు గాల్లో ఎగిరి ఫైట్ చేయడం అని కాకుండా వీల్ చైర్ ( చక్రాల కుర్చీ ) కి పరిమితమైన వ్యక్తి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించడం ఆ పాత్ర శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లినట్టు వుంది.అదే వ్యక్తి అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ "యాంటీ మాఫియా" కు చీఫ్ గా మారి ముల్లును ముల్లుతూనే తీయాలి అన్నట్టు మాఫియాను ధీ కొట్టే పాత్రగా మార్చ

Could hv been better
1. Too short
2. SRK turning into Godfather not explained properly. is it so easy?
3. In many places, Writer jumps from one situation to another unconvincingly
One time reading.

Subscribe
Browse