Comment(s) ...

చాలా విలువైన పుస్తకం.ఒత్తిడి ఎంత ప్రమాదమో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో చెప్పిన పుస్తకం.తక్కువ వెలలో కేవలం అరవైరూపాయలకే విలువైన పుస్తకం.సులభశైలిలో ఎన్నో మంచి విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి.

శ్రీసుధామయి గారి హారర్ కథలు మా చిన్ననాటి రోజులను గుర్తు చేసాయి.అప్పటిలో క్లూ,అపరాధ పరిశోధన పత్రికలు పాకెట్ సైజు పుస్తకాలు ఆసక్తిగా చదివేవాళ్ళం.ఉత్కంఠభరితంగా రాసిన కథలు మరోసారి చదివించేలా వున్నాయి.డ్రాకులా,బలికోరే వజ్రాలు ,దెయ్యాలరైలు ప్రతీకథ కథనం బావున్నాయి.కంగ్రాట్స్ .హారర్ ఇష్టపడే వాళ్లకు బెస్ట్ ఛాయస్ " ఘోస్ట్ స్టోరీస్"

super navala.mee anni navallu chadivanu.pachalaloya mayadveepam navalalu chala bavunnayi.keep it up

పైసావసూల్ నవలలో రాసినట్టును జరిగితే కుబేరుడు కనికరిస్తే దేశమంతా సిరిసంపదలే . నవ్విస్తూ ఆలోచించేలా చేసిన ఈ నవల చదువరుల్లో అలా నిలిచిపోతుంది.వైభవ్ కారులో అలా బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నుంచి గాల్లోకి లేచి టేకాఫ్ తీసుకుని కుబేరుడి లోకానికి వెళ్లే సన్నివేశం థ్రిల్లింగ్ గా వుంది.
కారు సరాసరి కుబేరుడి లోకంలో ల్యాండ్ అయ్యింది సేఫ్ గా.
కుబేరుడు చిద్విలాసంగా చూసి "వాట్ అబౌట్ మై వడ్డీ అండ్ అసలు" అని నిలదీసాడు.
* *వెంటనె కృత్తిక "మీ టూ" అంది తనను కూడా ఆశీర్వదించమన్నట్టు కిందికి వంగి
"మీ టూ"అంటే కుబేరుడు అపార్థం చేసుకుని భయపడిపోతారు అన్నాడు లోగొంతుకతో కృత్తికతో
* "మీలోకం కరెన్సీ కాదు..మా ఇండియా కరెన్సీ ...అదీ రద్దైన నోట్లు కాదు.. మోదీ గవర్నమెంట్ కొత్తగా అచ్చుగుద్దిన నోట్లు" చెప్పాడు వైభవ్
* "ఇలా అడుగుతున్నందుకు క్షమించాలి. మీకు బిపి షుగర్ గట్రా ఉన్నాయా? అడిగాడు వైభవ్
" అనగా ..?” అడిగాడు కుబేరుడు
"మా లోకమునందు వుండు మాయరోగములు...జన్యుపరంగా, స్ట్రెస్ పరంగా వచ్చును" అన్నాడు వైభవ్
"మాకు శాపములు తప్ప రోగములు వుండవు.." చెప్పాడు కుబేరుడు
ఇలాంటి డైలాగ్స్ నవ్విస్తూ ఆలోచించేలా చేస్తాయి.
సూపర్బ్ నవల.ఇలాంటి ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలు రావాలి

ఈ వాక్యాలు చదువుతుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.జీవితాన్ని జయించాలని నిజాయితీగా కోరుకునేవారికి సక్సెస్ ను ఎలా చేరుకోవచ్చో చెప్పే పుస్తకం .
మా నాన్నగారి మరణం తరువాత ఆ పేరుతో పాటు పేదరికమే మిగిలింది.
మానవ సంబంధాల కన్నా "మనీ" బంధాలే ఎక్కువని అర్థం అయ్యేసరికి మేము నడివీధిలో నిలబడివున్నాం.
అమ్మ...అక్క...ఇద్దరన్నయ్యలు...ఇద్దరు తమ్ముళ్లు
ఒక పెద్ద పేదరికంతో మా పోరాటం మొదలైంది.
చేతికి అయిదు వ్రేళ్ళయినా ...ఎపుడైనా విడిపోతాయేమో కానీ మా అన్నదమ్ములం..
కలిసే వున్నాం.....కలిసే పస్తులున్నాం
అనుబంధానికి వీడిపోని విడదీయలేని మా తల్లిదండ్రులు కలిపిన బంధం
నిద్ర లేని రాత్రులు...ఆకలితో పస్తులున్న రోజులు
గడిపిన క్షణాలు.. కన్నీటి వేదనలు..... అయినా చలించలేదు.
మా ప్రాణం పద్మక్క
మా ధైర్యం మా పెద్దన్నయ్య
ఇవి అక్షరాలు కావు ..జీవితాన్ని కళ్ళముందు నిలిపిన దృశ్యాలు

డిటెక్టివ్ నవలలు చదివిన రోజులకు తీసుకువెళ్లిన నవల.
డిటెక్టివ్ సిద్దార్థ క్యారక్టరైజేషన్ సూపర్.
మంచి కామెడీ.సస్పెన్స్ తో చదివించే నవల.

మనం ఏమిటో తెలుసుకోవాలని అనుకునే ప్రతీఒక్కరూ చదువవలిసిన పుస్తకం .ముఖ్యంగా తాను చనిపోతానని తెలిసినప్పుడు మనిషి ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసినప్పుడు " జీవితం " అంటే ఏమిటో అర్థం అయ్యింది.

నవ్వును మర్చిపోయి కృత్రిమమైన సంతోషం కోసం పబ్స్ కు వెళ్లి,ప్రమాదకరమైన పబ్జీ గేమ్స్ ఆడి నిరర్థకమైన సంతోషాన్ని వెతుక్కునేవారు ఈ పుస్తకం చదివి మనసారా నవ్వుకోవచ్చు.ఆహ్లాదాన్నే కాదు ఆలోచనను కలిగించే బెస్ట్ కామెడీ స్టోరీస్.ముఖ్యంగా స్వాతిలో బహుమతి పొందిన రెండు కథలు...నవ్వు కనబడుట లేదు,నవ్వు దేవుడొచ్చాడోచ్ ...
" నవ్వు దేవుడి కోసం తపస్సు చేసాడు.తనను దేవుడిని చేయమని అడిగాడు.దేవుడు నవ్వుని "నవ్వు దేవుడిని" చేసాడు.అప్పటి నుంచి ప్రపంచంలో వింత మార్పులు..?నవ్వు దేవుడికి గుడులెక్కడ?నవ్వు దేవుడెక్కడ? "
ఈ ఆలోచనే ఫెంటాస్టిక్ గా వుంది.

థాంక్యూ కినిగె
అరవై రూపాయల రెంట్ ఆప్షన్ తో ఆరు జానపద నవలలు చదివే అవకాశం ఇచ్చారు.ఒకప్పటి జానపద వైభవాన్ని మళ్ళీ మాకు అందిస్తున్నారు.అన్ని పుస్తకాలు అద్భుతంగా వున్నాయి.ముఖ్యంగా శ్రీసుధామయి గారి శైలి నాటి రాజుల కాలాన్ని కళ్ళముందు నిలిపాయి.
జ్వాలాముఖి నవలలో పులిమీద చిలుక స్వారీ ,మాయాద్వీపంలో మాయక్షుడు, భూమి పొరలను చీల్చుకుని మాయాదర్పణం పైకి రావడం,,అక్షరాల ఇంద్రజాలం.

ఈ మధ్యకాలంలో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అపరాధ పరిశోధన ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చుతుంది.
నా పేరు స్వాప్నిక... ఈ రోజు ఉదయం వంశీకృష్ణ అనే వ్యక్తి నన్ను చంపడానికి మా ఇంటికి వచ్చాడు, ఫోటో ఇన్స్పెక్టర్ చేతికి ఇచ్చి చెప్పిందామె
ఒక చిన్న సంభాషణతోనే కథలో ఆసక్తి పెంచారు.కీపిటప్

కొన్ని నవలలు మనసుతో చదవాలి.మస్తిష్కంతో చదవాలి.అలాంటి నవల " గుప్పెడంత ఆకాశం "
ఈ నవలలో జీవితం వుంది.ఒకమ్మాయి పోరాటం వుంది." కొండ అద్దమందు చిన్నగానే " కనిపిస్తుంది..
గుప్పెడంత ఆకాశం పాఠకుల గుండెల్లో అలానే ఉండిపోతుంది.

చాలా చాలా బావుంది.ముఖ్యంగా వెన్నెల్లో మాయాశిల్పం మణిమేఘనగా మారు యువరాజును " నేనెవరు ?మీరెవరు ?అని ప్రశ్నించిన తీరు...కొలనులో కనిపించే చంద్రుడు పక్కకు తప్పుకోవడం...సాహసాలు..రచయిత చెప్పినట్టు సరికొత్త జానపద కాలానికి పాఠకులను తీసుకువెళ్ళిన నవల.

కొత్త ఆలోచనను మాత్రమే కాదు ఆహ్లాదాన్ని అందించిన నవల.ఎందుకంటే కుబేరుడి దిగివచ్చి అప్పు ఇస్తే శ్రీనివాసుడు సాక్షిగా ఉంటే.కుబేడు ఎలా అప్పు వసూల్ చేసుకుంటాడు..వడ్డీలేని అప్పు ఎలా ఇచ్చాడు ? అన్న పాయింట్ కొత్తగా వుంది.నవ్వుకుంటూ ఆలోచించేలా చేసిన నవల.సినిమా చూస్తున్నట్టు వుంది.మూస సినిమాలు వదిలి ఇలాంటి సబ్జక్ట్స్ తో సినిమాలు తీస్తే తెలుగులో విభిన్నమైన సినిమాలు వస్తాయి.

ఒక హాలీవుడ్ సినిమాను చూస్తున్నంత థ్రిల్లింగ్ గా వుంది నవల.నాకు తెలిసి మొదటిసారి వైవిధ్యమైన ద్విపాత్రాభినయానికి ఈ నవలలోని రోబో పాత్ర ప్రేరణ అవుతుంది రచయితా ఊహాశక్తికి మేథాశక్తి కి హేట్సాప్ .
అగ్నిహోత్ర ,మేన్ రోబో రెండుపాత్రలు అద్భుతం.డిస్ట్రాయ్ చాంబర్ లో షర్మిల ఫీలింగ్స్, షర్మిల మేన్ రోబో ను అగ్నిహోత్రగా భావించి ముద్దు పెట్టుకున్న సన్నివేశాలు అత్యద్భుతం.రోబో కాంట్రావర్సీ చూసాక మేన్ రోబో నవల గొప్పతనం అర్థమైంది.ముఖ్యంగా సులోచన పాత్ర...సెడక్ట్రస్ పాత్రలు మనల్ని వెంటాడుతాయి

జైలుగోడల మధ్య హీరో సుమన్...ఒక వ్యక్తిత్వవికాస పుస్తకానికి ఏమాత్రం తీసిపోనిది.ఒక పాపులర్ హీరో అనుకోకుండా జైలుగోడల మధ్య గడపవలిసి వచ్చినప్పుడు గుండె నిబ్బరాన్ని కోల్పోకుండా నిలబడడం గొప్ప విషయం.సుమన్ గారి నిర్థోషిత్వానికి ఈ పుస్తకం అద్దం పడుతుంది.ఇలాంటి పుస్తకాలు రాయడం..జరిగిన విషాదాన్ని పాస్తాకుల హృదయాలకు హత్తుకునేలా రాసిన విజయార్కె గారు ,బోల్డ్ గా తన జీవితంలో ( జైలుగోడల మధ్య) జరిగిన విషయాలను చెప్పిన సుమన్ గారు ఈ పుస్తకానికి నిజమైన హీరోలు.

ఆపిల్ ఈ-రొమాన్స్ ఆపిల్ లాంటి కథలు చాలా సంవత్సరాల క్రితమే స్వాతిలో చదివాను..ఫెంటాస్టిక్ రొమాంటిక్ స్టోరీస్.సరసమైన కథలకు అర్థాన్ని చెప్పే బెస్ట్ స్టోరీస్...భార్యాభర్తలు ఇలా రొమాంటిక్ గా జీవించవచ్చా ? ఇలా ఉంటే ఎంత బావుంటుంది..అన్న ఆలోచన వస్తుంది
క్యాండిల్ లైట్ శోభనం కథలు చదివాక.
లైఫ్ పార్టనర్ తో ఏకాంతంలో ఈ కథలు చదువుతుంటే ఆరుబయట వెన్నెల్లో విహరిస్తున్న ఫీలింగ్.
విజయార్కె గారి గుడ్ నైట్ స్టోరీస్ తరువాత బాగా నచ్చిన పుస్తకం క్యాండిల్ లైట్ శోభనం.

సర్కార్ ( అమితాబ్..రామ్ గోపాల్ వర్మ ) సినిమా చూస్తున్నట్టుగా వుంది అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ యాంటీ మాఫియా చీఫ్ గా మారడం అన్న కాన్సెప్ట్ బావుంది.ముఖ్యంగా " ఏ బహుత్ అన్యాయ్ హాయ్ " అన్న విభ్రమ డైలాగ్, టీవీ ఛానెల్స్ ఎలా ఉంటే బావుంటుందో చూపించిన తీరు హైలెట్ హేట్సాప్ ...

క్యూ నవల గురించి చెప్పడానికి no words ..." డియర్ ప్రహేళిక నీకోసం సిద్దార్థ వెతుకుతున్నాడు.నువ్వెక్కడున్నా ..నువ్వు ఏలియన్ అయినా ,...నువ్వు తన ప్రాణం.నీ వల్ల రెండు గ్రహాలు ఒక్కటవుతాయి.నీకోసం మేమంతా ఆ ప్రభువును వేడుకుంటున్నాం ..." నవల చదువుతుంటే చెప్పలేని ఫీలింగ్ .అడుగడుగునా సస్పెన్స్ థ్రిల్లింగ్ ..ఎక్సయిట్మెంట్ ..ప్రహేళిక ఫీలింగ్ చదువుతుంటే మన ఇండియన్స్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఎంత గొప్పవో కదా అనిపిస్తుంది.సినిమా చూస్తున్నట్టే వుంది.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Sorry sir, I hope, It will be available today. I sent both the parts together for review. May be a delay from Kinige.

Very good research Sir
Unfortunate that Government miserably failing to protect Telugu language and heritage

next part eppudande...suspnse cinemani interval daka chusi wait cheyyamane elaa??

@leelavathimaddi...avunandi mayakankanam naku baga nachhindi, abhisarudi mantradandam next part kosam waiting...madhubabu garanthati writer kavalani sanjike garini ashirvadistunnanu.

Subscribe
Browse