Comment(s) ...

మాయాశిల్పం నవల కొత్తల్కానికి కొత్తప్రపంచానికి తీసుకువెళ్ళింది.మా చిన్నతనంలో చదివిన ప్యాకెట్ సైజు పుస్తకాలు గుర్తుకొచ్చాయి.కథలో కథనంలో కొత్తదనం కట్టిపడేసింది.ముఖ్యంగా మణిమేఘన పాత్ర. మేఘాలు పక్కకు తప్పుకోవడం,చంద్రుడు పక్కకు తప్పుకోవడం జలఖడ్గం ,గంధర్వకన్య శిల్పంగా మారడం,రొటీన్ పగలప్రతీకారాల టీవీ సీరియల్స్ కు భిన్నంగా అక్షరాలతో కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్లిన ఈ నవల ఇప్పటికి ఎన్నోసార్లు చదివాను.పుస్తకరూపంలో కూడా ఉండివుంటే బావుండేది.

విభిన్నమైన కథలు.ప్రతీకథలో మ్యాజిక్ వుంది.కళ్ళముందు ఆయా పత్రాలు కదలాడుతున్నట్టు వుంది.*డాక్టర్స్ నా మొహంమీదికి తెల్లగుడ్డను తీసుకువస్తున్నారు...నా ఆఖరిజ్ఞాపకం వినండి మిత్రులారా? ఆఖరి జ్ఞాపకం (స్వాతి మంత్లీ)
*అందుకే నా యాభయ్యేళ్ళ కోరికను తీర్చుకుని,నా పిల్లలు మనవలు ఏమన్నా,.ఏమనుకున్నా ఐ డోంట్ కేర్....ఇళ్న్తి కథలు చదివి పదిలపర్చుకోవాలి.పదిమందికి చెప్పుకోవాలి.

నాలుగు నవలలు ఒకేసారి చదివే అవకాశం కలిగించిన కినిగెకు ధన్యవాదాలు .అండర్ వరల్డ్ నవల చాలా బావుంది.యాంటీ మాఫియా స్క్వాడ్ అన్నది కొత్త థాట్.పైగా ఒక గాడ్ ఫాదర్ ను ఆ స్క్వాడ్ కు చీఫ్ గా వేయడం కొత్త ఆలోచన.ఒక సినిమా చూస్తున్నట్టు వుంది.పైసా వసూల్ సబ్జెక్టు లాంటి సబ్జెక్టు ఇప్పటి వరకూ రాలేదు.మీ ఇష్టం కొత్తతరహా వ్యక్తిత్వ వికాస రచన.టార్గెట్ నవల సూపర్బ్.

ఇలాంటి విభిన్నమైన నవలలు తెలుగులో అరుదుగా వస్తాయి.2002 లో రాసిన ఈ నవల ఇప్పటికీ గొప్పగా వుంది.షర్మిల పాత్ర సులోచన పాత్ర ( సులోచన పాత్ర చిన్నదైనా ) పాఠకుల మనసులో నిలిచిపోతుంది.మేన్ రోబోలో మొదలైన ఎమోషన్స్ రచయిత అద్భుతంగా రాశారు.రోబో సినిమా కాన ముందే ఒకే వ్యక్తి రెండుపాత్రలను ఆర్మీ ఆఫీసర్ గా మేన్ రోబో గా తీర్చిదిద్దడం హై లెట్ .
ఒక సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలిగించిన నవల మేన్ రోబో.

పట్టువిడవకుండా చదివించే నవల.అతి తక్కువ వ్యవధిలో చక్కని శైలితో ఏడు నవలలు రాసిన శ్రీసుధామయి గారికి అభినందనలు.
ఇప్పటి తరానికి పరిచయం లేని జానపద నవలలు పరిచయం చేస్తున్నారు.జానపద నవలల్లో మీ శైలి అద్భుతం.

ఒకే పుస్తకంలో నాలుగు నవలలు అందించడం మంచి ప్రయోగం.ఒకేసారి నాలుగు రచనలు చదివే అవకాశం వుంది.అందులోనూ నాలుగు విభిన్నమైన కథాంశాలు.అండర్ వరల్డ్ నవల చదువుతుంటే ఒక మాఫియా థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.
"నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అన్న విభ్రమ డైలాగ్ శ్రీదేవిని జ్ఞప్తికి తెప్పించింది.
టార్గెట్ నవల చదువుతుంటే డ్రగ్స్ కు బానిసైన యువతే కాదు డ్రగ్స్ ను అలవాటు చేసి తీవ్రవాదులు అమాయకులను ఎలా బలి చేతున్నారో అర్థమవుతుంది.పాతికేళ్ల క్రితం రాసిన నవలలోని అంశాలు ఇప్పుడూ కొట్టగానే వున్నాయి.
పైసా వసూల్ సబ్జెక్టు విభిన్నం.కుబేరుడి దగ్గర అప్పుచేసి హీరో,అప్పుకు వడ్డీ చెల్లించనందుకు కారులో వెళ్తున్న వైభవ్ ను అలా గాల్లోకి తీసుకువెళ్లి కిడ్నాప్ చేయడం,నవ్విస్తూ ఆలోచింపజేసే ఆహ్లాదకరమైన నవల.
మీఇష్టం ప్రతీఒక్కరూ చదువవలిసిన వ్యక్తిత్వ వికాసం.ముఖ్యంగా దేవుడికి రచయితకు మధ్య జరిగిన సంభాషణ హైలెట్
రెంట్ ఆప్షన్ కూడా పెట్టి బావుండేది.

రాజకీయ నాయకుల్లో హాస్యచతురత అరుదు..ఎప్పుడూ రాజకీయాలు విమర్శలు దూషణలు..ఇవే అని అనుకుంటారు.
కానీ కేసీఆర్ గారిది విలక్షణ శైలి.
మాటల్లో చతురత హాస్యం వ్యంగం..తెలుగునుడికారం, భాషపట్ల మమకారం
అనుబంధాల పట్ల బంధుత్వాలు పట్ల స్పష్టమైన భావనలు తన వ్యక్తిత్వానికి చిత్రిక పడుతాయి.
ఎంత పనిఒత్తిడిలో వున్నా తనలోని హాస్యచతురత గంభీరమైన వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది
సామెతలతో నవ్విస్తాడు. జీవితసత్యాలు చెబుతాడు.
తప్పుచేస్తే మందలిస్తాడు.
మంచిచేస్తే అభినందిస్తాడు
ప్రతిభ ఉంటే అందలం ఎక్కిస్తాడు.
నిజాయితీ ఉంటే ముందుస్థానంలో నిలబెడుతాడు
విశ్వసనీయతకు పెద్దపీట వేస్తాడు. శత్రువైనా సరే శరణు అంటే కరిగిపోతాడు.
ఇవి ప్రత్యర్థులు సైతం అవుననే అద్భుత విలక్షణ లక్షణాలు.
కేసీఆర్ వ్యక్తిత్వానికి నిలువుటద్దాలు
super sir

ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన వాక్యాలు.
* గెలుపు అంటే ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు .. ఎమోషన్స్‌ను బ్యాలన్స్ చేయడం.. ప్రాక్టికల్‌గా ఆలోచించడం.... గిరి ప్రకాష్ రెడ్డి
*"నేను పోరాటం చేయడమే పెద్ద గెలుపు.. మిగితావన్నీ చిన్న చిన్న గెలుపులు.. పోరాటమే గెలుపు”
ఒక గెలుపు మనకు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది
మరొకటి.. మన గెలుపు మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది.
ఒక గెలుపు నిరర్థకమైనది.. మిమల్ని పతనం వైపు తీసుకు వెళ్ళేది.
నిజమైన గెలుపు గురించి చెబుతూ ఓటమిని విశ్లేషించే ప్రయత్నమే ఈ పుస్తకం

క్యాన్సర్ ని జయించండి పుస్తకం నా ప్రపంచాన్ని మార్చింది.నా భార్యను క్యాన్సర్ బారినుంచి కాపాడింది.క్యాన్సర్ ఎవెర్ నెస్ అవసరాన్ని చెప్పింది.మనం చూపించే నిర్లక్ష్యం మన లేదా మన అయినవాళ్లు ప్రాణాలు.
క్యాన్సర్ గురించి తెలుసుకోవడంలో నిర్లక్ష్యం చేయకండి.క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించే ఈ పుస్తకం ప్రతీఒక్కరూ చదివి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.క్యాన్సర్ని జయించాలి

నవ్వుదేవుడు కూడా ఉంటాడన్న ఆలోచన నవ్వు తెప్పిస్తుంది.ఆలోచించమని చెబుతుంది,నవ్వును మర్చిపోయినవారికి నవ్వుని పరిచయం చేస్తుంది.
అందుకే కాబోలు స్వాతిలో ఈ కథ 10 .000 / ,బహుమతి గెల్చుకుంది,
నవ్వుతూ చదువుతూ చదివాకా కూడా నవ్వుతూ ఉండేలా చేసే కథ నవ్వు దేవుడొచ్చాడోచ్ ..

ఒక మంచి నవల చదువుతున్నట్టు,ఒక మంచి సినిమా చూస్తున్నట్టు వుంది.
ముఖ్యంగా విజేత అనే మకుటానికి సరైన అర్థం చెప్పిన నవల,
సినిమా హీరో కావడమే లక్ష్యం కాకుండా తన మరదలి గెలిపించడమే గమ్యంగా హీరోను తీర్చిదిద్దిన విధానం బావుంది.
నవలలో ఒకనాటి మేటినటుడు రాజనాల రేఖామాత్రంగా కనిపించి కంటతడి పెట్టిస్తాడు.
ఒక నర్తకి విషాదాంతం మనసును కుదిపేస్తోంది.
ఇలాంటి నవలలు మనల్ని మనసుతోపాటు ప్రయాణించేలా చేస్తాయి.
ఈ నవల చదివిన ప్రతీ ఒక్కరూ విజేతే.
ఒక విధంగా వ్యక్తిత్వవికాసాన్ని నేర్చుకున్నట్టు వుంది.

కథలు లేవని చెప్పేవన్నీ కథలే.కథలు లేకపోతే ఈ కథలు విజయబాపినీడు గారి లాంటి డైరెక్టర్ ఎందుకు ఎంపిక చేస్తారు.హీరోలు ఎప్పుడూ మూసపోసినట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి విభిన్నమైన పాత్రలు పోషిస్తే బావుంటుంది.
మెగాస్టార్ ఇమేజ్ కు మెజీషియన్ పాత్ర సరిగ్గా సరిపోతుంది.,ముఖ్యంగా చిన్నారులు త్వరగా ఆ పాత్రకు కనెక్ట్ అవుతారు,
ఇదే పుస్తకంలో మెగాస్టార్ ను సైంటిస్ట్ పాత్రలో చూడాలని అనుకుంటున్నారా? అని క్యూ నవలలోని పాత్ర గురించి చెప్పడం బావుంది.
ఎందుకంటే చిరంజీవి గారు సైంటిస్ట్ పాత్ర పోషించిన దాఖలాలు లేవు.అందులోనూ గ్రహాంతర వాసుల కథ,
మేన్ రోబో నవలలోని " మేన్ రోబో " పాత్ర కూడా బావుంటుంది,
కుబేరాయనమః నవల చాలా బావుంది.
ఒకే నవలలో ఇన్ని కథలు..విషయాలు రీడబులిటీ చెడకుండా చెప్పిన విధానం సూపర్బ్ .

అద్భుతమైన పుస్తకం.డిప్రెషన్ లో వున్నవాళ్లు,ప్రతీ చిన్న విషయానికి కృంగిపోయేవాళ్లు ఈ పుస్తకం చదవాలి.జీవితాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో తెలియజేసిన పుస్తకం.

డిఫరెంట్ సబ్జెక్టు .కుబేరుడు ప్రజలకు అప్పు ఇవ్వడం అనే కాన్సెప్ట్ చాలా బావుంది.హీరో అనాథల కోసం దర్శనం క్యూలో నిలబడి ఆ ప్రసాదాన్ని అనాథలకు తీసుకొచ్చి ఇవ్వడం..తనని నమ్మని హీరోకు కుబేరుడిని అప్పు ఇవ్వమని చెప్పడం థానే సాక్షిగా ఉండడం,మనవాళ్ళు ఇలాంటి సబ్జెక్టుతో సినిమాలో తీసేరోజు అవాలని ఆ శ్రీనివాసుడ్ని ప్రార్థిద్దాం .థాంక్యూ కినిగె..

డిఫరెంట్ సబ్జెక్ట్ థ్రిల్లింగ్ నేరేషన్..సూపర్బ్ నవల...ముఖ్యంగా సెడక్ట్రస్ సులోచన పాత్రలు.. మేన్ రోబో ను డిస్ట్రాయ్ చేయబోయే సమయంలో షర్మిల ఫీలింగ్స్...అద్భుతం.హాలీ వుడ్ మూవీ చూస్తున్నట్లుంది.

భార్యాభర్తల మధ్య వుండే అందమైన గిల్లికజ్జాలు జీవితం విలువలను అందంగా చెప్పారు రచయిత్రి.అభినందనలు ఇంత మంచి నవల అందించినందుకు కినిగెకు కృతఙ్ఞతలు.

superb...నవల చాలా బావుంది.కానీ రేటు చాలా ఎక్కువ

గొప్ప ఫీల్ వున్న నవల...ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్లుంది.గ్రేట్ అటెంప్ట్ ఏలియన్స్ మీద ఎమోషన్స్ మీద వచ్చిన డిఫరెంట్ నవల,కొత్త పాయింట్ .అద్భుతమైన శైలి.

చదవడం మొదలుపెట్టాక చివరివరకూ చదివించింది.కళ్ళముందు సినిమా కనిపించింది.యస్సార్కె పాత్ర విభ్రమ పాత్ర నవలకు హైలెట్.టీవీ చానెల్ రిపోర్టర్ గా విభ్రమ తీసుకున్న నిర్ణయం...ఒక ఇన్సిడెంట్ జరిగితే స్పందించే రియాక్షన్ సూపర్బ్..ముఖ్యంగా " ఏ బహుత్ అన్యాయ్ హాయ్ " డైలాగ్ శ్రీదేవిని గుర్తుకు తెప్పించింది.
యాంటీ మాఫియా స్క్వాడ్ ఆలోచన అదిరిపోయింది.నిజంగా ఇలా జరిగితే బావుండు...అండర్ వరల్డ్ ...గాడ్ ఫాదర్ చాలా చాలా బావుంది.

గుడ్ నైట్ స్టోరీ చదువుతుంటే శోభాడే రచనలు గుర్తొచ్చాయి.అశ్లీలానికి తావు లేకుండా భార్యాభర్తలు అబ్బాయిలు అమ్మాయిలుచదువుకునే ప్లజెంట్ స్టోరీస్.రొమాన్స్ కు సెక్స్ కు తేడాను చూపించిన అద్భుతమైన కథలు.స్వాతి సపరివార పత్రికలో విజయార్కె గారి కథలను ఇలా పుస్తకరూపంలో చూడడం బావుంది.
ముఖ్యంగా తలుపుచాటు సిగ్గు,క్యా సీన్ హాయ్,విభ్రమ,ఏమి వింత మోహమో కథలు మనసును కథలు టచ్ చేసాయి.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి పబ్జి లాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడే అవకాశం ఇవ్వడం కన్నా ఇలాంటి ఆహ్లాదకరమైన సాహసోపేత నవల చదివించాలి.తెలుగు చదవడం మర్చిపోతున్న వాళ్లకు,జానపద నవలలు పరిచయం లేని వారికీ ఈ నవల కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.తెలుగు భాష మీద అభిమానాన్ని,జానపద నవలల పట్ల ఆసక్తిని పెంచుతుంది.
ఒక సరికొత్త ఫాంటసీలోకి ఊహాప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల మాయాశిల్పం...మంతఖడ

నవలలో ప్రతీపాత్ర కళ్ళముందు కనిపించి ఎమోషన్స్ ని ప్రదర్శిస్తుంది.ఉత్కంఠభరితంగా చదివించే లక్షణం వున్నా నవల,ఒక హాలీ వుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది.సులోచన పాత్ర పాఠకులను వెంటాడుతుంది.సెడక్ట్రస్ పాత్ర మనసును ద్రవింపజేస్తుంది.
షర్మిల పాత్ర కొత్తగా వుంది.ప్రేమ సన్నివేశాల్లో రచయిత సృష్టించిన భావుకత్వం గొప్పగా ఉంటుంది.మేన్ రోబో పాత్ర ఇరవయ్యేళ్ళ క్రితం ఇం

Finally pdf downloded in aldiko classic app
Thank you...

నేటి యువతకు స్ఫూర్తిని కలిగించే పుస్తకం.పార్టీలతో ,రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం,ఒక చందమామ కథలా.ఎక్కడా బోర్ కొట్టకుండా చదివించే శైలి .మోదీ జీవితంలోని సంఘటనలను విశ్లేషించిన తీరు బావుంది.

I'm not able to download the rented book. Payment has been made.

Subscribe
Browse