
నిర్ణయం నవల కాదు,ఒక జీవితం.వృద్ధాప్యాన్ని శాపంగా భావించవద్దని చెప్పే శాసనం.పిల్లల నిర్లక్ష్యాన్ని బాధ్యతారాహిత్యాన్ని నిలదీసిన ప్రయత్నం.కళ్లముందు ఆవిష్కరించిన కావ్యం.ఈ పుస్తకాన్ని జీవితంలా చదవాలి.ఒక వ్యక్తిత్వవికాసాన్ని కళ్ళముందు నిలిపిన ఈ నవల ఒక మంచి ప్రయత్నం.
రహస్యం కథ ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తలపించింది.డివోచి సర్పం కూడా రహస్యంలో కీలకలైన పాత్ర పోషించడం రచయిత కల్పనాశక్తికి జేజేలు .ఒక ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది.ఇటీవల పొరుగురాష్ట్రంలో జరిగిన సంఘటన ఛాయలు ఆసక్తికరంగా ఇందులో కనిపించాయి.
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
*ఉద్యానవనంలో ఎవరో ప్రవేశించినట్టు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది.
కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడుతాయి. ...అయినా ఏమిటీ వైపరీత్యం
*అప్పుడే వెన్నెల భూమ్మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చిన వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద ప్రసరించింది. మరుక్షణం పెద్ద వెలుగు.... మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నంచింది మణిమేఘనగా మారిన మాయాశిల్పం
ఆనాటి జానపద ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే మాయాశిల్పం మంత్రఖడ్గం చదవల్సినే/
ఎన్నిసార్లు చదివినా మళ్లీమళ్లీ చదవాలి అనిపించే నవల
మనం ఏమిటో తెలుసుకోవడానికి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక అద్దం లాంటిది.ఇందులో ఎక్కడెక్కడో ఉన్నవారి అనుభవాలు కాకుండా రచయిత స్వీయ అనుభవాలు వ్యక్తిత్వవికాస కథనంతో అందించడం బావుంది.రైల్వే స్టేషన్లో రచయిత ఎదుర్కున్న చేదుఅనుభవం కళ్ళు చెమర్చేలా చేస్తుంది.
చెప్పుకుంటే సిగ్గుచేటు వ్యవస్తలోని లోపాలను నిలదీస్తుంది.
*భర్తలను/భార్యలను పడగ్గదిలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వారిని మనమెలా అర్థం చేసుకోవాలి?
*ఓడిపోవడం అంటే గెలవకపోవడం కాదు...ఓడినా తిరిగి గెలుపుకోసం ప్రయత్నించకపోవడం.' లాంటి వాక్యాలు మనల్ని వస్తావా ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి.
కరోనా ఒత్తిడిలో " నవ్వుదేవుడొచ్చాడోచ్" కాసేపు ఒత్తిడిని మరిచిపోయేలా చేసింది.అన్నికథల్లో నవ్వు అంతర్లీనంగా వుంది.చదువుతున్నప్పుడు,చదివాకా,మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు కూడా పెదవుల మీదికి నవ్వొచ్చేస్తుంది.నిజంగా నవ్వుదేవుడు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్లజంట్ గా అనిపించింది.స్వాతి వీకెల్లీలో పదివేల బహుమతి వచ్చిన కథగా ఈ కథ చదివాను.అలాగే నవ్వు,కనబడుటలేదు,లాఫింగ్ ట్రీ,కథలన్నీ చదివి ఒత్తిడిని మరిచిపోయేలా వున్నాయి.
Wonderful stories
A mind-boggling narrative
Every story touches the heart
Each character has its own identity
good night .
hats off
నవల చదువుతుంటే రచయిత సమాచారాన్ని ఎంతో శ్రమకోర్చి సేకరించి,నవలలో పొందుపర్చినట్టు తెలుస్తుంది.హారర్ నవల రాయడం కత్తిమీద సాము లాంటిదే.యథార్థసంఘటనలతో ఆసక్తిగా భయాన్ని నేపథ్యంగా తీసుకుని రాసిన డార్క్ అవెన్యూ చాల బావుంది.తీశ్మార్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.
పుస్తకరచయిత చెప్పిన ఈ మాటలు అక్షరాల నిజాలు.గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల జీవితాన్ని స్వీట్ నిఘ్త్స్ గా మారుస్తుంది.
" చీకటి ముసుగేసాక ధాత్రిని రాత్రి చుట్టుముట్టాక మీ ప్రపంచంలో మీరూ ,మీ జీవితభాగస్వామి....పడగ్గది .మీ వ్యక్తిగత సామ్రాజ్యం.
ఆ సామ్రాజ్యంలో రాజు రాణి సైన్యమూ సర్వమూ సమస్తమూ మీరే.
ఫీలింగ్స్ ఎమోషన్స్ అనుభవాలు అనుభూతులు కలబోసిన కలర్ ఫుల్ రెయిన్ బో ...
ఆ ఇంధ్రధనుసులో ...
ప్రేమ ఇష్టం కోరిక స్పర్శ మాట అనుభవం అనుభూతి ..సప్తవర్ణాల ఇంధ్రధనుసులో చేరిన మరో వర్ణం రొమాంటిక్ ఫ్లేవర్ మీకు శుభరాత్రి చెబుతుంది.
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో...
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.
నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ ల,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి.
ఈ కథల్లోని కథానాయికలు మీరే..
ఈ కథల్లోని కథానాయకులూ మీరే..."
మానసికోల్లాసానికి కాలక్షేపానికి ఎన్నో కథలు చదువుతాం.
భార్యాభర్తల మధ్య శూన్యాన్ని మిగిల్చే దాంపత్యజీవితం గురించి ,నిస్సారమయ్యే మధురోహల గురించి బయటకు చెప్పుకోలేక సతమతమయ్యే దంపతులకు క్యాండిల్ లైట్ శోభనం నిస్సందేహంగా ఒక గొప్ప ఎమోషన్..చక్కని పరిష్కారం.
జీవిత భాగస్వాములు కలిసి చదువుకునే " ది బెస్ట్ రొమాంటిక్" మెమోరీస్ ఈ కథలు
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
చదువుతుంటే కళ్ళముందు అందమైన భావోద్వేగాలు కదలాడుతున్నాయి
ఈ పుస్తకం ప్రతీఒక్కరూ చదవాలి.క్యాన్సర్ అవేర్ నెస్ తప్పనిసరి.క్యాన్సర్ ను ఎలా గుర్తించవచ్చో,క్యాన్సర్ ను జయించే ప్రయత్నానికి సపోర్టింగ్ గా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది,
విభిన్నమైన కథాంశం,వాణిజ్యవిలువలతో సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం.ఇది నవల రూపంలో ఉంటే మరింత బావుండేది.
సబ్జెక్టు బావుంది.ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు చిరంజీవి రెండు పాత్రలు వేస్తే బాగా నచ్చుతుంది.మెజీషియన్ పాత్ర పిల్లలను ఆకట్టుకుంటుంది.
అబ్రకదబ్ర కథలోని సుధాకర్ పాత్ర కొత్తగా వుంది .ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు.కుబేరాయనమః నవలిక బావుంది.ఇది ఆంధ్రభూమి మాసపత్రికలో నవలగా వచ్చింది.
మంచి ప్రయోగం.ఒకేసారి ఆరుజానపద నవలలు చదివే అవకాశం కలిగింది.ముఖ్యంగా రెంట్ ఆప్షన్ ఇచ్చారు.థాంక్యూ...
ప్రారంభంలోనే ఆకట్టుకునే శైలి.విడవకుండా చదివించే కథనం.
పిల్లలను పెద్దలను చదివించే నవలలు.అభినందనలు
మీ ఇష్టం నా చదివాక మన ఇష్టం ఎలా ఉండాలో తెలిసింది.మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి పుస్తకం తరువాత నాకు బాగా నచ్చిన పుస్తకం, " మీ ఇష్టం "
" మీ ఇష్టం పూర్తి చేయడానికి ముందు..ఉపసంహారం ప్రారంభిస్తూ.... అప్పుడు చూసాను. మంచుపొర వెనుక ఓ దివ్య తేజస్సును... ఎన్నో నిద్రలేని రాత్రిళ్ళను చూసిన నా కనులకు భ్రమా? వాస్తవమా? భ్రమలాంటి వాస్తవమా? ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.
ఆ దివ్యతేజస్సు నాతోపాటు లోపలికి వచ్చింది. తలుపు వాటంతటవే మూసుకున్నాయి. గదిలోని లైటు క్రమక్రమంగా అంతర్ధానమవుతోంది. లైటు వెలుతురు స్థానంలో దివ్యతేజస్సు కిరణాలు...
‘‘ఎవరూ?’’
‘‘నేను దేవుడ్ని...’’
‘‘దేవుడా?
నువ్వు... నువ్వున్నావా?’’
నా అనాలోచిత ప్రశ్న...
ఆ తర్వాత..?
దేవుడికి రచయితకు మధ్య ఏం జరిగింది?"
ఈ వాక్యాలు పాఠకులను వెంటాడుతాయి.మన ఇష్టాన్ని అన్వేషించమని చెబుతాయి.
శ్రీసుధామయి జానపద నవలలు ప్రత్యేకంగా ఉంటాయి.మాయాక్షా అన్న పేరు మాంత్రికుడి వర్ణన గమ్మత్తయిన సంఘటనలు చిన్ననాటి రోజుల్లోకి తీసుకువెళ్లాయి.జ్వాలాముఖి మంత్రాలదీవి ఇప్పటికీ నా పేవరెట్ నవల.ఈ నవల ఆంధ్రభూమిలో చదివాను.
సెంటిమెంట్ దేశభక్తి యాక్షన్ ఎమోషన్స్ కామెడీ సస్పెన్స్ అన్నీ వున్న ఎంటర్టైనర్ టార్గెట్ 789 .ఆంధ్రభూమిలో ఈ నవల చదివినప్పుడే థ్రిల్ ఫీలయ్యా.
నయనతార లక్ష్మి మంచు లాంటివాళ్లు ఇలాంటి పాత్రలు పోషిస్తే మంచి థ్రిల్లర్ అవుతుంది.అప్పటి డ్రగ్స్ ఉగ్రవాదుల బెడద ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం విషాదకరం.
ఎవరైతే తన కూతురు అని నాటకం ఆడి మరణం వైపుకు తీసుకువెళ్లాడో ఆ వ్యక్తి నిజంగా తన కూతురే అని తెలిసినప్పుడు సిబిఐ చీఫ్ ఫీలింగ్స్ సూపర్బ్
ఇప్పటికి రెండుసార్లు చదివాను.ర్వీక్ పాత్ర దగ్గరే ఆగిపోతున్నాను.అంతగా కదిలించిన పాత్ర.ర్వీక్ నిజంగా ఉన్నదా? ఉంటే ఎక్కడుంది?ఆసాంతం పట్టు వదలకుండా చదివించిన నవల.మీ కలం నుంచి మరిన్ని ఇలాంటి నవలలు రావాలి.
సీరియల్ గా వచ్చినప్పుడు ఏ ఒక్కరోజూ మిస్సవ్వలేదు.
మా ఇంటిల్లిపాది ఈ నవల చదివింది.అన్ని వర్గాల పాఠకులతో చదివించే నవల రాసారు,ధన్యవాదాలు మేడం.
ఇలాంటి విభిన్నమైన కథలు అరుదుగా వస్తుంటాయి.కుబేరుడు అప్పు ఇవ్వడం..ఏడుకొండలవాడు సాక్షిగా ఉండడం ఆ డబ్బును ఎలా వసూలు చేసుకోవాలో చెప్పడం.
వడ్డీ ఇవ్వని వైభవ్ ను కారుతో సహా పైకి తీసుకువెళ్లిన కుబేరుడి తెలివితేటలూ , ,అనాథశరణాలయం.దేవుడిని నమ్మని హీరో, అద్భుతమైన కథాకథనం .ఆహ్లాదకరమైన సందేశాత్మక హాస్యనవల.పాతికేళ్ల క్రితం ( ఆంధ్రభూమిలో ) నేను చదివిన కుబెరయ నవలకు సీక్వెల్ కాబోలు.
కుటుంబ విలువలకు పట్టం కట్టిన నవల.సాధారణంగా సవతితల్లి అంటే గయ్యాళిలా విలన్ లా చూపిస్తారు.కానీ సవతితల్లి అమ్మలా కూడా చూసుకుంటుందని చెప్పారు..గ్రేట్.
కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ విషయాన్నీ విస్మరించడం వల్లే కాపురంలో కలతలా, కళ్ళల్లో కన్నీటి నలకలు.
ఈ వాక్యం ఎవర్ గ్రీన్ ...
super novel
super stories ..ఆసక్తికరమైన కథలు .ఉత్కంఠభరితంగా వున్నాయి
" మాయాశిల్పం..మంత్రఖడ్గం " నవల మమ్మల్ని గంధర్వలోకానికి తీసుకువెళ్ళింది.
మణిమేఘన మాటలు ముద్దుముద్దుగా వున్నాయి.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నించిన మణిమేఘనను చూస్తుంటే శ్రీదేవి కళ్ళముందు కదలాడింది.
కథనం దృశ్య ప్రదానంగా మారి కళ్ళముందు దృశ్యాలను ఆవిష్కరించింది.
కాంతారావు గారిని మీరు కలుసుకున్న సందర్భం వివరిస్తుంటే మనస్సు అర్త్త్రమైంది .నాకు ఇష్టమైన జానపద కథానాయకుడు.
ఇంత మంచి నవల అందించినందుకుకు ధన్యవాదాలు.
జైలుగోడల మధ్య హీరో సుమన్ పుస్తకము చదివాకా నాలో కొంత పాజిటివ్ మార్పు వచ్చింది.." నా సమస్యే చాలా పెద్దది,..నేనే కష్టాలు పడుతున్నాను " అనే భ్రమలో నుంచి బయత్యకు వచ్చా..అంత పెద్ద స్టార్ " సుమన్ గారి నేటిభారతం,తరంగిణి సితార సినిమాలు వచ్చిన సమయంలో నేను చాలా చిన్న...అంత గొప్ప స్టార్ కూడా నిందను భరించాడు.కానీ ఆత్మవిశ్వాసంతో నిర్దోషిగా బయటకువచ్చాడు .ఒక వ్యక్తిత్వవికాస పుస్తకాన్ని ఒక థ్రిల్లర్ నవలను చదువుతున్నట్టు అనిపించింది .థాంక్యూ విజయార్కె గారూ.థాంక్యూ సుమన్ జీ..థాంక్యూ కినిగె.
Beautiful Novel చాలాకాలం తరువాత యద్దనపూడి స్టైల్ నవల చదివినట్టుంది.
కనుమరుగవుతున్న జానపద నవలలకు పూర్వప్రాభవం...అద్భుతమైన నవల జ్వాలాముఖి...మంత్రాల దీవి