Comment(s) ...

ప్రతీఏడుగురిలోఒకరుఒత్తిడికిగురవుతున్నారు.ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ మధ్య సెలబ్రిటీల విషాద ఉదంతాలు విషాదకరం.ఒత్తిడిని జయించండి నిస్సందేహంగా మంచి పుస్తకం. ఈ సమయంలో ఈ పుస్తకాన్ని ప్రతీ ఒక్కరూ చదవాలి.

ఈ కథలు ఎవర్ గ్రీన్.మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కథలు.ఇలాంటి దంపతులు వుంటారా?నిజ్జంగా ఇలా ఉంటే ఎంత బావుండు...థాంక్యూ సర్
ఎప్పటికప్పుడు కొత్తగా,కొంగ్రొత్తగా మీ రొమాంటిక్ మెనూ ను మార్చుకోండి.కొత్త ఇష్టాలు సరికొత్త ఊహలు..ఆలోచనలు..కబుర్లు...మీ ఏకాంతంలో నేపథ్యసంగీతం కావాలి.
*ఆ దంపతులకు శోభనం రాత్రి
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.ఇంతకూ ఆ పందెం ఏమిటంటే ..?
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది కథేమిటి?

చాలామంచి పుస్తకం.ఒకవిధంగా వ్యక్తిత్వవికాసరచనకు ఏమాత్రం తీసిపోని పుస్తకం.కేసీఆర్లోని నాయకత్వలక్షణాలు తన విజయానికి దోహదపడ్డ వ్యక్తిత్వలక్షణాలు చక్కగా విశ్లేషించారు.రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తిత్వవికాస రచనగా కూడా చదువుకోవచ్చు.కేసీఆర్ అభిమానులకు ఈ పుస్తకం ఉగాదికానుకే.

సూపర్ ...తులసిదళం తరువాత మళ్ళీ అలాంటి టెంపోతో ఉత్కంఠ కలిగించిన నవల.తీశ్మార్ పాత్ర చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడించింది.ఇటీవల ఇలాంటి సంఘటనలు జరిగాయి.హారర్ ను ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చుతుంది.

జానపద నవలల్లో సరికొత్త ఒరవడి.మళ్ళీ రాజులకాలంలోకి తీసుకువెళ్లిన " మాయాశిల్పం మంత్రఖడ్గం "
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
సమ్మోహనం అద్భుతం ..ఒక్కోసన్నివేశం చదువరుల్లో అలా నిలిచిపోతుంది.

వేణుమాధవ్ గారికి ,
జీవితాన్ని జయించండి పుస్తకం చదివాకా మా కళ్ళలో నీళ్లు తిరిగాయి.ఒకవ్యక్తి పాతాళాన్ని చీల్చుకుని సక్సెస్ శిఖరాన్ని ఎలా చేరుకోవాలి చెప్పడానికి మీరే ఒక ఉదాహరణ.ఈ పుస్తకం చదివాకా ఆకాంక్ష క్యాటరింగ్ గొప్పతనం గురించి తెలుసుకున్నాను.డబ్బులు అందరూ సంపాదిస్తారు.పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ అందర్నీ మోటివేట్ చేయడం మీలాంటి వారే చేయగలరు.గ్రేట్ సర్.
మీ నుంచి మీ అనుభవాలనుంచి మరిన్ని రచనలు రావాలని కోరుకుంటున్నాం.

గెలుపు అంటే ఓటమిని అర్థం చేసుకోవడం..ఓటమి అంటే గెలుపునకు అర్థం తెలుసుకోవడం .
ముఖచిత్రం మీద వున్న అక్షరాలు అక్షరసత్యాలు .మిమ్మల్నిమీరు అర్థం చేసుకోండి,అసంతృప్తిని జయించండి.మీ ఇష్టం,పుస్తకాల తరువాత ,మరో మంచి పుస్తకం" గెలుపు..ఓటమి"
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి..కన్నడంలో చదివిన నా మిత్రుడు చెప్పిన ఒకేఒకమాట బాగా గుర్తుంది." ఈ పుస్తకం నా జీవితాన్ని పాజిటివ్ దృక్పథం వైపు నడిపించింది. "
గిరిప్రకాష్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీ,వారి అభిప్రయాలు స్ఫూర్తిని కలిగించేలా వున్నాయి. రామోజీరావు గారి గురించి ప్రస్తావించడం చక్కని ఆలోచన.వారి సక్సెస్ స్టోరీ ఎందరికో ప్రేరణ.సుమన్.మహేష్ భగవత్,ఇలా మనకు తెలిసిన సెలబ్రిటీస్ గురించి ,వారి సక్సెస్ గురించి తెలియజేయడం అద్భుతం.మన కళ్ళముందు కనిపించే ప్రత్యక్ష స్ఫూర్తిప్రదాతలు .
ప్రతీఒక్కరూ చదవవలిసిన పుస్తకం " గెలుపు ఓటమి "
ఎందుకంటే ఓటమి గురించి అర్థమైతే గెలుపు మన స్వంతం అవుతుంది.

హారర్ కథలను అంటే చాలా ఇష్టం.భయపడుతూనే చదివేవాడిని చిన్నప్పుడు.ఇప్పటికీ ఆ భయం,ఇష్టం అలానే వున్నాయి.
వించెస్టర్ మిస్టరీ హౌస్ మిస్టరీ 1860 గురించి మొట్టమొదటిసారి తెలుసుకున్నాను.
సారా వించెస్టర్ అనే శ్రీమంతురాలైన వితంతువు. వించెస్టర్ రైఫిల్స్ కంపెనీ యజమాని భార్య ఆవిడ. భర్తనూ కూతుర్నీ పోగొట్టుకున్న సారా ఎప్పుడూ విచారించగా ఉండేది. ఎందుకిలా జరిగిందంటూ ఆమె ఒక తాంత్రికురాలిని కలిసింది. ఆ తాంత్రికురాలు అంతా తన కళ్లతో చూసినట్టుగా... ' మీ ఆయన కంపెనీలో తయారుచేసే రైఫీళ్ల కారణంగా చనిపోయిన వారి ఉసురు మీ కుటుంబానికి తగిలింది వారి ఆత్మలు మీపై పగబట్టాయి ' అని చెప్పింది.
వాటిని శాంతిపజేయాలంటే సారా తన ఇంటిని వదిలిపెట్టి పడమటి దిశగా ప్రయాణించి ఓ కొత్త ఇంటిని కట్టాలని ... జీవితాంతం అలా కట్టిస్తూనే ఉండాలని చెప్పిందట.
ఇలాంటి ఆసక్తికరమైన సమాచారంతో హారర్ ను ఇష్టపడేవాళ్ళకు టక్ టక్ టక్ బాగా నచ్చుతుంది

విఠలాచార్య గారి సినిమా చూస్తున్నట్టు వుంది.జానపద నవలలు మళ్ళీ మా ముందుకు తీసుకువచ్చిన కినిగెకు ధన్యవాదాలు.శ్రీసుధామయి గారి కలం నుంచి మరిన్ని జానపద నవలలు రావాలని కోరుకుంటున్నాం.

"నువ్వు మరో ఇరవైనాలుగు గంటల్లోగా చనిపోతావని" దేవుడు చెప్పాడు.
ఆ క్షణం నుంచి అతనిలో అంతర్ఘర్షణ మొదలైంది.ఇప్పటివరకు తాను ఎవరిని బాధపెట్టాడో,ఎవరికీ తను అపకారం చేసాడో వారిని ఆఘమేఘాల మీద పిలిపించాడు.చాలాకాలం తర్వాత భార్యతో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్ళాడు.కలిసి టిఫిన్ చేసాడు.చాలాకాలం తర్వాత భార్యను దగ్గరికి తీసుకున్నాడు ఆ రాత్రి.అప్పుడు భార్య కళ్ళలో కనిపించిన కన్నీటి మెరుపును చూసాడు.
తన గడువుకు కొద్ది క్షణాల ముందు అతను దేవుడిని వేడుకున్నాడు...
"నా తప్పులు సరిదిద్దుకోవడానికి నన్నునేను అర్థం చేసుకోవడానికి మరికొంత ఆయుష్షును ఇవ్వమని...
కానీ అప్పటికే ...
చదవడం మొదలుపెట్టాక ఒక జీవితాన్ని చదువుతున్నట్టు వుంది.అద్భుతమైన పుస్తకం.నా ఆలోచనావిధానాన్ని మార్చిన పుస్తకం." నన్ను నేను అర్థం చేసుకునేలా చేసిన పుస్తకం "

నవల పేరు చూడగానే చదవాలనిపించేలా వుంది.ముఖ్యంగా అప్పటి రాజులు మాయలు మంత్రాలు ఆ వాతావరణం కళ్లకు కట్టినట్టు వుంది.
శ్రీసుధామయి గారి జానపద నవలలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి.

ఒకప్పటి డిటెక్టివ్ నవల సాహిత్యాన్ని కళ్ళముందుకు తీసుకువచ్చిన శ్రీసుధామయి గారికి అభినందనలు.
డిటెక్టివ్ కథల్లోని ముఖ్యలక్షణం ణొన్ స్టాప్ గా చదివించడం.ఆసక్తి కలిగించే కథనం,ఉత్సుకత కలిగించే సన్నివేశాలు.
ఇలాంటి లక్షణాలతో చదివించే కథలు రాయడం చాలా కష్టం.
రచయిత్రి ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.
డిటెక్టివ్ సిద్దార్థ లాంటి మరిన్ని నవలలు రావాలి.

*నగరంలో సంచలనం..మనుష్యుల నుంచి భరించలేను దుర్గంధం....అదీ కొందరిలోనే..ఎవరా కొందరు?ఎందుకా దుర్గంధం? ఈ కథ ఈనాడులో చదివిన గుర్తు.కథాపేరు ప్రక్షాళన అనుకుంటాను.అద్భుతమైన కాన్సెప్ట్.ఇలాంటి కథలు రాయడంలో విజయార్కె గారిది విభిన్నమైన స్టయిల్.
అద్భుతమైన కథనం,కథావస్తువులు,మనిషి పక్షి,వాంటెడ్ బామ్మ లాలిపాట డాట్ కామ్ లాంటి కథలు మెచ్చుతునకలు

అద్ఫ్భూతమైన విశ్లేషణ
బిన్‌లాడెన్‌లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రైట్ సోదరులు, గ్రాహంబెల్, ఐన్‌స్టీన్... చరిత్రలో విజయాన్ని సాధించిన ప్రతీ ఒక్కరూ నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించినవారే.
ఓటమిని విశ్లేషించుకోవడం, నిజమైన అసంతృప్తి తెలుసుకోవడం..
నిరర్ధకమైన అసంతృప్తిని వదిలి, నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించడమే నిజమైన గెలుపు.
ప్రతీఒక్కరూ చదవవలిసిన పుస్తకం

పిల్లలు వున్న ప్రతీ ఇంట్లో ఈ నవల ఉండాలి.ఈ నవల పిల్లలు చదవాలి.తల్లిదండ్రుల మానసిక సంఘర్షణ అర్థం కావాలి.మనసును కట్టిపడేసే నవల.ఒక తల్లి నిర్ణయం వ్యవస్థనే ప్రశ్నించింది.మానవత్వాన్ని నిలదీసింది.అద్భుతమైన నవల ,
విజయార్కె గారి రచనలు...
మరణశాసనం,మేన్ రోబో ,క్యూ,టార్గెట్,పైసావసూల్...కుబేరాయనమః ..మనిషే దేవుడయ్యాడు...కానీ... నవ్వు దేవోడిచ్చాడోచ్,టక్ టక్ టక్ ,మీ ఇష్టం...ఇలా మీ నవలలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఊపిరి సలపనివ్వని సస్పెన్స్ .చక్కని చిక్కని కథనం,
తర్జని ఎర్విక్...అనిరుద్ర సమీర్...కృష్ణస్వామి ముఖర్జీ..శ్యామ్యూల్ విక్కీ ఆల్బర్ట్...ఇవి పాత్రలు కావు..ఇది నిజం.
ఎర్విక్ పాత్ర అద్భుతం,.కళ్ళ ముందు సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
మీ మరో నవల నార్త్ అవెన్యూ సూపర్బ్ ఇలాంటి నవలలు మీరు మరెన్నో రాయాలి.

ఇంట్రెస్టింగ్ గా చదివించిన పుస్తకం.టక్ టక్ కథ ఆంధ్రజ్యోతిలో చదివిన గుర్తు.డ్రాక్యులాల గురించి మంచి ఇన్ఫర్మేషన్ .
"కొన్ని కథలకు నో ఎండ్
హారర్ కథలకు ,ఆసక్తి కలిగించే సంఘటనలు..విచిత్రవార్తలకు నమ్మలేని నిజాలకు ఒళ్ళు గగుర్పొడిచే సంగతులకు నో ఎండ్.
నో ఎండ్ అనే అక్షరాలు కీ బోర్డు మీద టైపు చేస్తుంటే మూడుసార్లు పవర్ పోయింది.సరిగ్గా "నో ఎండ్" అని టైపు చేస్తున్నప్పుడే...
ఇది కాకతాళీయమే కావచ్చు.
అర్థరాత్రి పదకొండున్నరకు స్క్రిప్ట్ ఫినిష్ చేసాక...ఓ నల్ల పిల్లి కంప్యూటర్ టేబుల్ పక్కనుంచి మ్యాప్ అంటూ నావైపు చూసి పరుగెత్తడం యాదృశ్చికమే కావచ్చు.
కిందికి వచ్చి బైక్ స్టార్ట్ చేయగానే హెడ్ లైట్ వెలుతురులో ఒక్కసారిగా ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించి,కనిపించి మాయమవ్వడం భ్రమే కావచ్చు.
కానీ మనం ఆలోచిస్తే ప్రతీది మనకు ...మన నమ్మకానికి అనుగుణంగా విజువలైజ్ అవుతుందేమో..."
రచయిత చెప్పిన ఈ వాక్యాలు ఆలోచింపజేస్తాయి.
పుస్తకం చదివింపజేస్తుంది.

క్యాన్సర్ గురించి కనీస అవగాహనకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.ఎన్నో పనికిరాని,మనకు అవసరంలేని,నిరుపయోగమైన విషయాల మీద ఆసక్తి చూపించే మనం ,మన జీవితాన్ని మనకు తెలియకుండానే కబళించే క్యాన్సర్ మహమ్మారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం.
దయచేసి ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదివి క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి.క్యాన్సర్ ను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

హాలీవుడ్ సైన్స్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ చూస్తున్నట్టు వుంది.సెడక్ట్రస్ పాత్ర మనసును మెలిపెడుతుంది . హార్ట్ టచింగ్ ఎమోషనల్ వండర్
" మేన్ రోబో ' ఇలాంటి నవలలు సినిమాలుగా తెరకెక్కితే సూపర్బ్ గా ఉంటుంది.
హీరో రాజశేఖర్ కు సూటయ్యే పాత్ర మేన్ రోబో ద్విపాత్రిభినయం.

కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
" ది లీడర్ " పుస్తకం కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి అద్దం పట్టింది.
" ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఫార్మూలా....కొత్త విషయం... ప్రపంచగమనాన్ని మారుస్తుంది.
ఒక స్వాతంత్ర్య పోరాటం దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఒక వ్యక్తి సాధించిన విజయం వ్యవస్థకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఆలోచన అభివృద్ధికి, కృషి సాధనకు పట్టుదల గెలుపుకు దారితీస్తుంది."
ఈ వాక్యాలు అక్షసత్యాలు.ఇది ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీ కాదు..ఒక వ్యక్తిత్వవికాస గ్రంథం.కేసీఆర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి..అందులో ఎలాంటి లక్షణాలను స్వీకరించాలో చెప్పారు.
కాలక్షేపానికి కాకుండా జీవితంలో ఎలా ఎదగాలి ఎలా లీడర్ గా మారవచ్చో చెప్పే పుస్తకం.

పైసావసూల్ నవల కొత్త కాన్సెప్ట్ .కొత్తదనంతో కూడిన కథాంశంతో కుబేరుడే అప్పులిస్తే,తిరిగి వడ్డీ ప్లస్ అసలు ఎలా వసూలు చేసుకోవాలో హీరో చెప్పడం ,సాక్షాత్తు ఏడుకొండలవాడే సాక్షిగా ఉండడం ..సూపర్ సబ్జెక్టు,
కామెడీతో పాటు సీరియస్ గా అలోచించి ఆహ్లాదంగా నవ్వుకునే నవల,
ఎప్పుడూ పగలు ప్రతీకారాలు ఒకే సబ్జెక్టు ను తిప్పితిప్పి చెప్పడంకన్నా రచయితలు ఇలాంటి కొత్త సబ్జక్ట్స్ అటెంప్ట్ చేయాలి.
అల్లరి నరేష్ లాంటి హీరోలకు సరిగ్గా సరిపోయే ఎంటర్టైనర్ పైసావసూల్.

మేన్ రోబో పబ్లికేషన్స్ నుంచి వచ్చే నవలలు విభిన్నంగా ఉంటాయి.జ్వాలాముఖి మంత్రాలదీవి,, ఇప్పుడు మణిద్వీప రహస్యం...ఇలాంటి నవలలు మరిన్ని రావాలి.శ్రీసుధామయి గారికి అభినందనలు

ఒక పాపులర్ సినిమా హీరోకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా? కంటతడి పెట్టించింది.జైలులో అమ్మ గురించి ఆలోచిస్తూ నిద్రలో ఉలిక్కిపడి లేచిన సుమన్ లో తల్లిని గొప్పగా ప్రేమించే కొడుకు కనిపించదు.చాలా విలువైన విషయాలను నుభవాలను తెలియజేసి కొత్త బ్రతుకు పాఠాలను కళ్ళముందు నిలబెట్టిన పుస్తకం.ప్రతీచిన్న విషయానికి నిరాశతో కూరుకుపోయే ప్రతీఒక్కరూ చదువవలసిన పుస్తకం.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

i paid amount of 333 for meerey numerology book. But it's not downloaded. Showing URLLink, it has nothing.

ఈ కరోనా సమయంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఒత్తిడి నుంచి బయటకు రప్పించిన పుస్తకం.ఒత్తిడి ఎంత ప్రమాదకరమో ఆ ఒత్తిడిని నుంచి ఎలా బయటపడవచ్చో చెప్పే ఈ పుస్తకం చదవడం వసరం అన్నది నా ఉద్దేశం.ఇందులో కొన్ని వాక్యాలు నాకు .ప్రేరణ కలిగించాయి.
జీవితం చాలా విలువైనది.తాత్కాలికమైన బలహీనతకు ఒత్తిడికి లోను కాను..అని మొదటగా ప్రమాణం చేయండి .
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
డాన్సు పాటలు పద్డడ

Hello Sanjike, any new book is coming from you

Kavitalu Anni alochimpachesevigaa unnaayi. Kavayitri bhaavam baagundi.

rayalaseema yaasa tho koodina e pustakam chaala bagundhi
bandi narayanaswamy gaariki paadaabhi vandanamulu chaaala baaaga rasaru

Subscribe
Browse