
భార్యాభర్తలు జీవితంలో కోల్పోతున్న దాంపత్యజీవితాన్ని గుర్తుచేస్తూ,అందులోని స్వీట్ మెమోరీస్ ని ,రొమాన్స్ అవసరాన్ని తెలియజేసే కథలు.ఇలాంటి పార్టనర్ ఉంటే బావుననుకునే కథలు.రొమాన్స్ ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఫీలయ్యే కథలు.ఎక్కడా అసభ్యత లేకుండా అద్భుతమైన భావుకత్వంతో రాసిన కథలు.
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
ఇలాంటి కథలు ఆసక్తిని,వైవాహికజీవితం పట్ల అనురక్తిని కల్గిస్తాయి.బ్యూటిఫుల్ రొమాంటిక్ జర్నీ చేసిన అనుభవాన్ని ఇచ్చిన పుస్తకం" క్యాండిల్ లైట్ శోభనం"
ఇందులోని కొన్ని కథలు. స్వాతి వీక్లీ లో వచ్చినప్పుడు చదివాను.థాంక్యూ కినిగె
రైల్వే స్టేషన్ లో ఎండిపోయిన రొట్టె ( బన్ ) ను కుళాయినీళ్లలో తడుపుకుని తినడం కళ్ళలో నీళ్లు తెప్పించింది.రచయితా ఆత్మస్థయిర్యం,మాటల్లో కాకుండా ప్రాక్టికల్ గా సాధించిన గెలుపు మీకు స్ఫూర్తి.
సర్,మీరు చాలా గ్రేట్,
ఇరవైనాలుగు గంటల్లో చనిపోయే మనిషి మనస్తత్వాన్ని స్కాన్ చేశారు,
ఆమె తిరగబడితే అంటూ..ఆమె లాంటి కథలను చెప్పారు.హేట్సాప్
ఏ పుస్తకాన్ని కన్నడలో చదివే,కన్నడ మూలం తెలుగులో ఇప్పుడే చదువుతున్నా,అద్భుతమైన మోటివేషన్.మాన్చుతూ వున్నా వ్యక్తులనే ఉదాహరణగా చూపిస్తూ చెప్పిన వ్యక్తిత్వవిజయ రహస్యం" మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి"
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో ఉరికొయ్యకు బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయి చట్టబద్ధంగా హత్యచేయబడ్డ నా మృతదేహాన్ని చూడు..."కొద్దీ క్షణాల్లో నల్లటిగుడ్డ అతని మొహం మీద కప్పబడింది.చెక్కతలుపు మీద అతను...లివర్ కదిలింది.ఉరికొయ్యకు అతని దేహం వేలాడింది...
ఈ వాక్యం గుండెను తడిమేస్తుంది.
యువత శక్తిని చాటిచెప్పిన నవల.ప్రేమకు కొత్త అర్థం చెప్పిన నవల.ఆముక్తమాల్యద పాత్రలోని అమాయకత్వం,నిజాయితీ చూస్తే ముచ్చటేస్తుంది.వ్యవస్థను నిలదీసే సంఘటన ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది.ప్రతీ నిరుద్యోగి జైలుకు వెళ్తే, దొంగబాబాల స్వామీజీల తీరును ఎండగట్టి బుద్ధి చెప్పిన కథనం ఆకట్టుకుంటుంది.
*"ఉద్యోగం వస్తే రోజుకో కొబ్బరికాయ కొడతానని నువ్వు మొక్కుకుంటున్నావు...నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుగా వున్న కొబ్బరికొట్టు వాడు ఎదురుచూస్తున్నాడు..అయినా శరీరాన్ని ఇలా ప్యాక్ చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారే .."దెబ్బయేళ్ళ బామ్మ మనవరాలు ఆముక్తమాల్యదతో అంది.చదువుతున్నప్పుడు ఆహ్లాదంగా ఉంటూనే ఆలోచించేలా చేస్తుంది.
.ఉడుత కథ కన్నీళ్లను తెప్పిస్తుంది.ఒక అద్భుతమైన థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.చాలా సంవత్సరాల క్రితమే ఆంధ్రభూమి వీక్లీ లో జడ్జ్ మెంట్ పేరుతో సీరియల్ గా వచ్చినప్పుడే నేను కాలేజీ రోజుల్లోనే చదివాను.ఈ నవల ఎవర్ గ్రీన్.
హారర్ కథలని ఇష్టపడేవాళ్లు భయపడుతూనే ఈ కథలు చదివి థ్రిల్ ఫీలవ్వొచ్చు. దెయ్యాల రైలు,ఆ రాత్రి కథలు చదువుతుంటే,ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ప్రతీకథలో కొసమెరుపు బావుంది.
వైయస్సాఆర్ బిడ్డగా,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిమీద వచ్చిన ఈ పుస్తకం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది..నిస్సందేహంగా.అందుకు పుస్తకంలోని ఈ వాక్యాలే నిదర్శనం
వైయస్ విజయమ్మ ఆనందభాష్పాలు
ఉద్విగ్నభరిత సన్నివేశం
తండ్రి అడుగుజాడల్లో
తండ్రి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి
ఎన్నో కష్టనష్టాలకు ఎదురొడ్డి
ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన బిడ్డను చూసిన ఆ తల్లి కళ్ళు కన్నీటి చెలమలు అయ్యాయి.
బిడ్డను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది
గుండెలకు హత్తుకుని ప్రజల హృదయాల్లో నిత్యం నిలిచి ఉండాలని దీవించింది.
కుటుంబం అంతా భావోద్వేగభరితమైంది.
జగన్మోహన్ రెడ్డి కళ్ళు చిరునవ్వుతో చెమర్చాయి.
టక్ టక్ టక్ చదువుతున్నంత సేపు టక్ టక్ టక్ మనే శబ్దం వినిపిస్తూనే వుంది.హారర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఆకట్టుకునేలా వున్నాయి.
ముఖ్యంగా ..
* అమ్మాయి భయంతో పరుగెడుతోంది.తెల్లగా పాలిపోయిన మొహం..భయంకరమైన చూపులు...అమ్మాయి గొంతులోకి కోరల్లాంటి పళ్ళను దించి రక్తంతాగే రక్తపిశాచి ...డ్రాక్యులా.ఇలా వాక్యం మొదలుపెట్టగానే మొహమంతా చెమట పట్టేసింది.
డ్రాక్యులా పేరు వినగానే ఎవరి గుండెయినా దడదడలాడుతుంది.సంవత్సరాలుగా పాఠకులను, ప్రేక్షకులను భయపెడుతున్న పాత్ర . మనిషో రాక్షసుడో తెలియనంత క్రూరత్వం ప్రదర్శించే ఆ డ్రాక్యులా గురించి ....
*ఎప్పుడో మూడువందల సంవత్సరాల క్రితం నాటి మమ్మీ కళ్ళు తెరిస్తే...ఒక్కక్షణం ఒళ్ళు గగుర్పొడుస్తుంది..
మెక్సికోసిటీలో అదే జరిగింది
*నాకు తెలిసి నేను చచ్చిపోయా.. మనిషి కాదు రక్త ‘పిశాచి’ ..వాంపైర్ అంటున్నదెవరు?బొమ్మకు డెడ్ ఫెస్టివల్! *అనుక్షణం ఎవరో వెంటాడుతున్నట్టు....*ఆఫ్రికాలోని మత ఆచారాలు, విశ్వాసాల నుంచి ఏర్పడిందే 'వూడూ' మంత్రవిద్య.*భయంకరమైన దెయ్యాల పండుగ
ఇలాంటి విశేషాలు టక్ టక్ టక్ అనే కథ ..మొత్తంగా నిజంగానే హారర్ ను ఇష్టపడేవాళ్లు భయపడుతూనే చదివేయవచ్చు.
adbhutamaina pustakam.depression lo vunnavallu ottiditho badhapade vallu ee pustakanni tappakundaa chadavali.
అసంతృప్తిని జయించండి పుస్తకం చదివాకా అసలు అసంతృప్తి అంటే ఏమిటో తెలిసింది."సినిమాకు టికెట్ దొరక్కపోవడం,చీరలు నగలు కొనుక్కోలేకపోవడం కాదు.." .అని అర్థమైంది.జీవితంలో అనుకున్నది సాధించడం,లక్ష్యం వైపు దూసుకువెళ్లడమే నిజమైన అసంతృప్తి అని తెలిసింది.నా ఆలోచనాధోరణిని మార్చి అసంతృప్తిని జయించడానికి ముందుకు నడిపిస్తున్న పుస్తకం .
మళ్ళీ మళ్ళీ చదవాలని చదివి నవ్వుకోవాలని అనిపించే కథలు ..
*మందహాసం
అస్సాంలోని ఘోస్ ముడి ప్రాంతంలో నివసించే ఒక ఆదివాసీ తెగవారు తమ శత్రువుల మీద పగసాధించడానికి ఓ ప్రయోగం చేశారు. అక్కడ అడవుల్లో దొరికే 'స్కెది' అనే వనమూలికలు పొడిచేసి మధ్యంలో కలిపి యిస్తే అది తాగిన వ్యక్తులు నవ్వలేక చచ్చేవారుట.
* నవ్వు కనబడుటలేదు
ఇరవై నాలుగు సంవత్సరాలుగా నా పెదవులకు అంటిపెట్టుకొనివున్న నా నవ్వు కనబడుటలేదు. నా నవ్వును తెచ్చి ఇచ్చినవారికి, లేదా ఆచూకీ తెలిపినవారికి తగిన పారితోషికం ఇవ్వబడును. ప్రియమైన నవ్వూ ..నువ్వెక్కడున్నా వెంటనే తిరిగిరా...నీ కోసం నేను బెంగపెట్టుకున్నాను. ఆ నవ్వు ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది చిరునామాలో సంప్రదించగలరు.
* లాఫింగ్ ట్రీ
వెల్కమ్ టు నవ్వు ఎగ్జిబిషన్...దాదాపు ముప్పైఏళ్ళ క్రిందట 'నవ్వు' అనేది మన బాడీలో...ముఖ్యంగా పెదవుల మీద ఉండేది'' అతను చెప్పడం ఆపి...ఎలా నవ్వాలో తెలియక, మొహం మాడ్చుకొని జనం వైపు చూశాడు.
''ఈజిట్ ట్రూ...నిజమా...నవ్వేలా ఉంటుందబ్బా...'' జనంలో క్యూరియాసిటీ...
నవ్వడంలో గొప్ప రిలాక్సేషన్ ఉంటుందని నవ్వించి నవ్విస్తూ చెప్పిన కథలు .
గుండెలోతుల్లో నుంచి పెదవుల మీదికి నవ్వును తీసుకువచ్చిన ట్వంటీ ఫోర్ క్యారెట్ నవ్వుల కథలు.
*మామగారు వాషింగ్ మిషన్ బదులు వాషింగ్ మిషన్ ల పనిచేసే అమ్మాయిని పంపించాడు.ఆ వాషింగ్ మిషన్ లాంటి అమ్మాయి చేసే పనులకు గిల్లుడు గారి బుర్ర గిర్రున తిరిగిపోయింది.
చదువుతుంటే నవ్వు తన్నుకొచ్చేస్తుంది
*మీ చెల్లెలు...అదే నా భార్య మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషేనా?'' సంశయంగా అడిగాడు.
''అంత ఖచ్చితంగా చెప్పడానికి, దానికన్నా ఎక్కువ నాకొచ్చి చస్తేగా...అది ఎం.బీ.ఏ చేసింది. ఇంగ్లిష్ లో మాస్టర్ డిగ్రీ...కదా..' చాలా క్యాజువల్ గా చెప్పాడు...అయ్యయ్యో...మావయ్య ..
కామెడీతో నవ్వించావు కదయ్యా,,,
*సగం విస్కీ బాటిల్ ని కుళాయి తిప్పి నీళ్లతో నింపేసాడు. బాస్ నిషాలో ఖుషీగా వున్నాడు . మళ్ళీ సగం బాటిల్ అయిపొయింది. ఇదేమిటి ''కిక్కు'' రావడం లేదు అనుకున్నాడు. మళ్ళీ ఆ సగం బాటిల్ తీసుకెళ్లి కుళాయి కింద పెట్టాడు...గృహప్రవేశోపాఖ్యానమ్ ..
పిసినారికి పర్యాయపదం
* మనిషి మరణం లేదు..ప్రపంచంలో నిరాసక్తత .చావుల్లేని ప్రపంచంలో చావుకోసం ఎదురుచూసే బ్రతుకు...ఫాంటసీ లోకి అడుగుపెడితే ?
ఫాక్ట్ మన ముందు ఫ్యూచర్ లా కనిపిస్తుంది.
*అణిగిమణిగి వుండే భార్య కావాలని ఒకరు/భర్త కావాలని మరొకరు అనుకున్నారు.ఆ తర్వాత ఎవరి ఖర్మ ఎలా కాలిందంటే ?
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత ...
చాలాకాలం తరువాత కథలు చదివి నవ్వుకున్నాం మా ఇంటిల్లిపాది.
ఈ నవల గొప్పతనం గురించి గుండెను హత్తుకున్న కథనం గురించి ఇంతకన్నా ఇంకేం చెప్పగలం
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
ఒక తల్లి నిర్ణయం వెనుక వున్నా గుండెతడికి అక్షరాలా అనువాదం..ఈ నిర్ణయం
పిల్లలు తల్లిదండ్రులను అపురూపంగా చూసుకునేవారు/నిరాదరణకు గురిచేసేవారూ ఈ నవలను చదవాలి.
మీ రచనలు చాలా బావున్నాయి.అభినందనలు
ఒక అందమైన మనసున్న, బావను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి... "బావా.. నిన్ను సినిమా హీరోగా చూడాలని వుంది. నీ బొమ్మ మన టూరింగ్ టాకీస్ లో వస్తే ఈలలు వేయాలని వుంది" అని అమాయకంగా అడిగితే...
"అంతేనా... సరే అయితే.. నీకోసం హీరోని అవుతాను..." అని విజేతగా నిలిచిన కథాంశం అద్భుతం.
విజేత నవలను ఒక వ్యక్తిత్వవికాస పుస్తకంగానూ చదువుకోవచ్చు.ఒక యువకుడు మరదలి కోరిక తీర్చడానికి సినిమా హీరో అవ్వడం..హీరో అయ్యాక అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం...
చిన్న నిర్లక్ష్యంతో వ్యసనాలతో విషాదాంతం చేసుకున్న తారల జీవితాలను కళ్ళముందు ఉంచడం విజేత నవలను ఫీల్ గుడ్ నవలగా నిలిపింది.
అచ్చమైన స్వచ్ఛమైన పల్లె వాతావరణంతో మొదలైన నవల సినిమా ప్రపంచం నీలినీడలను చీకటివెలుగులను ఆవిష్కరించింది.
1997 లో చతురాలో వచ్చిన ఈ నవల ఇప్పటికీ మనసుపొరలను స్పృశిస్తూనే వుంది.
Each story has its own identity
very nice stories
chala samvatsarala kritam ramsey brothers horror cinemalu chusanu.mallee alanti manchi horror navala chadivanu.thank you
క్యాన్సర్ ని జయించండి హెల్త్ ఎన్సైక్లోపీడియా .ప్రతీ న్తలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లా ఉండాలి.క్యాన్సర్ అవేర్ నెస్ ను అందరం గుర్తించాలి.
కొంత సమయాన్ని చిన్ని మొత్తాన్ని ఈ పుస్తకం కోసం వెచ్చిస్తే ఒక జీవితకాలం, మనం ఆరోగ్యంతో ఉండవచ్చు.
ఈ నవల నేను ఆంధ్రభూమిలో చదివాను.ఆ తరువాత పుస్తకరూపంలో దొరకలేదు.ఇప్పుడు కినిగె వల్ల మళ్ళీ చదువగలుగుతున్నా.క్రైమ్ సస్పెన్స్ ఎమోషన్స్ అన్నీ కలగలిసిన నవల.ఈ నవలలో వున్నా ఉగ్రవాదం,డ్రగ్స్ విషవలయం ఇప్పటికీ అలానే వుంది.
ఇప్పటికీ దొంగస్వాములు వున్నారు.ప్రవల్లిక లాంటి అమాయకపు అమ్మాయిలు వున్నారు.ఈ నవలలోని పాత్రలు మనకు ఎక్కడో ఎప్పుడో తారసపడ్డట్టు అనిపిస్తాయి.భీష్మాచార్య యాత్ర హైలెట్
ఎక్కడ ప్రజలు అమయకత్వం ఊపిరి పోసుకుంటుందో అక్కడ అవకాశ వాదం విష సర్పం ఈ వ్యవస్థను విషపూరితం చేయడానికి సిద్దమవుతుంది.ఇది అక్షరసత్యం ,
చాలా మంచికథలు కవితలు,ప్రతీ రచనలో భావం ఉట్టిపడుతుంది.కొంగుచాటు ప్రేమ,నార్త్ అవెన్యూ ,డెత్ సెంటెన్స్ వేటికవే గొప్ప నవలలు.అభినందనలు.మీ నుంచి నార్త్ అవెన్యూ లాంటి థ్రిల్లర్ రావాలని కోరుకుంటున్నాం.
కళ్ళ ముందు యాక్షన్ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా కనిపిస్తుంది.సూర్య రాజశేఖర్ లాంటి నటులు ఈ స్టోరీ లో ఒదిగిపోతారు.ముఖ్యంగా మేన్ రోబో ఎమోషన్స్ సూపర్బ్.సులోచన పాత్ర హైలెట్.
సిబిఐ డిప్యూటీ చీఫ్ గా షర్మిల పాత్రలో మేజిక్ బావుంది.డిస్ట్రాయ్ ఛాంబర్ లో మేన్ రోబో వున్నప్పుడు షర్మిల మాటలు మేన్ రోబో రియాక్షన్ మనసును కట్టి పడేస్తాయి.
ప్రతీరోజు క్యాన్సర్ మరణాలు పత్రికల్లో చూస్తున్నాం.క్యాన్సర్ కు నివారణ ఉందా ? లేదా? అన్న విషయం కన్నా క్యాన్సర్ ను గుర్తించడం,ముందుజాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
కనీసం వందరకాల క్యాన్సర్ ల గురించి తెలుసుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా కలిగింది.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి,క్యాన్సర్ ను గుర్తించి మనం క్యాన్సర్ నుంచి బయటపడడానికి అరవై రూపాయలు వెచ్చించి ఈ పుస్తకాన్ని చదవలేమా?ఆలోచించండి.
మనం ఒక్కరోజు " క్యాన్సర్ అవేర్ నెస్ డే " లు జరుపుకుంటే సరిపోవని నా ఉద్దేశం..అలాగే ఇలాంటి పుస్తకాలు ప్రజల్లోకి వెళ్ళి క్యాన్సర్ గురించిన అవగాహన కలిగించాలి.
కొత్తలోకంలో జానపద కాలంలోకి మేఘాలలో ప్రయాణించిన అనుభూతి.
చాలా బావున్నాయి.బుక్స్ మధ్యలో పెట్టుకుని డిటెక్టివ్ కథలు చదివిన రోజులు గుర్తుకువచ్చాయి.డిటెక్టివ్ సిద్దార్థ పరిశోధన బావుంది.
మేఘాలతో మాట్లాడించడం,చంద్రుడు పక్కకు తప్పుకునేలా చేయడం చాలా బావుంది.ముఖ్యంగా మీరు కాంతారావు గారి గురించి చెప్పడం మనసును హత్తుకుంది సర్ ...
జానపద నవలలు రచయితలను వ్రేళ్లమీద లెక్కించవచ్చు.భాషమీద పట్టు.జానపద నవలాశైలి,వున్న ప్రముఖరచయితలు కొందరే,ఒకప్పుడు జానపద నవలలు మార్కెట్ లోకి వేస్తె పండుగే.అల్లావుద్దీన్ కథలు అరేబియన్ నైట్స్,పేదరాసిపెద్దమ్మ కథలు ..
ఎన్నిసార్లు చదివామో..పిల్లలుగా వున్నప్పుడు మేము చదివాం.ఇప్పుడు మా పిల్లలకు ..మాకూ...అలాంటి జానపద నవలలు కావాలి.
మాయాశిల్పం ..మంత్రఖడ్గం చదువుతుంటే ఒక్కసాగా ముప్పయ్యేళ్ళు వెనక్కి వెళ్ళాను.అద్భుతమైన శైలి.
నా చిన్నప్పుడే విజయార్కె గారి రచనలు చాలా చదివాను.కానీ జానపద నవల తొలిసారిగా చదువుతున్నాను.
మాకోసం మీరు మరిన్ని జానపద నవలలు రాయాలని కోరుకుంటున్నాం .