
ఇంత గొప్పగా నిజాయితీగా రాయడం మీకుమాత్రమే సాధ్యమైంది అన్నంత గొప్ప పుస్తకం " మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి"
*రైల్వే స్టేషన్ లో రోజుల పర్యంతం గడిపి.ఎండిపోయిన రొట్టె(బన్ను)నీళ్లలో తడుపుకుని తిని...తనను తానూ అర్థం చేసుకోవడానికి ఖర్చు చేసిన కన్నీలెన్ని?నిద్రలేని రాత్రులెన్ని?పస్తులున్న రోజులెన్ని? ఆ వ్యక్తి ఈ పుస్తకరచయిత అయితే?
*ఈ పుస్తకాన్ని నా స్వార్థంతో మొదలు పెట్టాను.ఫిక్షన్ కు ఆదరణ తగ్గుతూ వ్యక్తిత్వ వికాస పుస్తకాల ఆవశ్యకత,అమ్మకాలు డిమాండ్ చేస్తోన్న సమయం.
*కేవలం రెండువందల రూపాయల పారితోషికం కోసం పాతికేళ్ల క్రిందట సెక్స్ వర్కర్స్ ను ఇంటర్ వ్యూ చేసిన మొండితనం ...ప్రాణాలతో పందెం...అప్పటి నా అవసరం....ఒకమనిషి జీవన ప్రస్థానాన్ని తెలియజేస్తుంది.ఆర్థిక అవసరం సాహసాన్ని చేయిస్తుంది..చావుతో సైతం పోరాడక తప్పదు అనే సత్యాన్ని చెబుతుంది.ఆ సాహసం/దుస్సాహసం అనివార్యం ..అవసరం .అయింది నాకు.
*ఎవరూ తెలియని భాగ్యనగరంలో అభాగ్యుడిగా అడుగు పెట్టినప్పటి ఫీలింగ్స్...ఒక సినిమా నటుడి ఇంటర్ వ్యూ కోసం నడిచి వెళ్లే పరిస్థితులు...జీవితాన్ని ఎలా జయించాలో చెబుతాయి..,చెప్పాయి...పాఠాలు నేర్పాయి.
*ఎందుకంటే ఇది నా జీవితం..నేను అనుభవించి సాధించి గెలుపు కోసం ఇంకా పోరాడుతున్న నేపథ్యం.
ఇలా ప్రతీ పదం వాక్యం మనల్ని మనం అర్థం చేసుకునేలా చేస్తుంది."చెప్పుకుంటే సిగ్గుచేటు " అధ్యాయం వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తుంది.మిలదీస్తుంది.
గుడ్ నైట్ స్టోరీస్ లో ప్రతీకథ ఒక దాంపత్యజీవిత రహస్యాన్ని చెబుతుంది.దంపతులు కోల్పోయే దాంపత్య అనుభావాలను గుర్తు చేస్తుంది.
రచయిత ఈ చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.
నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ ల,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి.
ఈ కథల్లోని కథానాయికలు మీరే..
ఈ కథల్లోని కథానాయకులూ మీరే...
మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునే పాత్రలు సన్నివేశాలు సంఘటనలు అనుభవాలు అనుభూతులు మీ పరం చేసే అక్షరస్వరాల కథలు ఇవి.
ప్రతీ రాత్రి ఈ కథలు చెప్పే కథలు వినండి.
ఈ పుస్తకంలోని చాలా కథలు స్వాతి పత్రికలో వచ్చినవే.రచయితా చేసే ప్రయోగాన్ని ఆదరించి,పాఠకులకు అందించే స్వాతి సంపాదకులకు సద కృతజ్ఞుడిని.దాదాపు యాభైకి పైగా స్వాతిలో నేను రాసిన సరసమైన కథలు ప్రచురించబడ్డాయి.అందులో కొన్ని కథలు ఇవి.
ఒక వెన్నెల రాత్రి,ఒకానొక వర్షం కురిసే రాత్రి...మీ పడగ్గదిలో అగరొత్తులు సన్నజాజులు నీలిరంగు బల్బు మధోరోహలు అన్నింటిని అనుసంధానించే స్పర్శతో పాటు గుడ్ నైట్ స్టోరీస్ కూడా ఉండాలి.మీ అనుభూతులను మీ గుండె గదుల్లో కథలుగా దాచుకోండి.
ప్రతీ అనుభవం ఒక అక్షరమై.
ప్రతీ అనుభూతి ఒక కథై..
ప్రతీ రాత్రి శుభరాత్రిగా మారాలి.
ఈ కథల ప్రపంచంలోకి మీ అనుభవాలను ఆహ్వానించండి.
నవ్వును ఇష్టపడని వారు వుంటారా? అయినా సరే నవ్వకుండా మూతి బిగించుకుంటారు.
" నరుడా ఏమి ని కోరిక" చదివాకా నవ్వకుండా ఉండలేకపోయాను.నవ్వు గొప్పతనాన్ని మరోసారి గుర్తించాను.మనం వెచ్చించే డబ్బుల్లో మనసారా నవ్వు కోసం,నవ్వుకోవడం కోసం ఇలాంటి పుస్తకాలు చదివితే " ఆహ్లాదం ఆనందం ఆత్మ సంతృప్తి కలుగుతాయి,"
పుస్తకం చాలా వాల్యుబుల్ .
నాలుకలు మొలుస్తున్నాయి,ఖర్మ కాలింది నవ్వు..ఇలా ఎన్నో కథలు.అన్నీ నవించేవే,మనసులో దిగులును దూరం చేసేవే..మీరూ ఓసారి చదివిచూడండి.
చాలా మంచిపుస్తకం చదివిన ఫీలింగ్ కలుగజేసిన పుస్తకం " నరుడా ఏమి నీకోరిక?"
no words..
marvelous novel
Everyone who neglects parents should read this novel.
thrilling navala.reserch chesi rasinattu vundi.teeshmaar patra bayanni kaliginchelaa vundi.chalaklam taruvatha manchi horror navala chaduvutunnanu
ఆధ్యంతం ఆసక్తికరం...ఏకబిగిన చదివించిన నవల
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
*ఉద్యానవనంలో ఎవరో ప్రవేశించినట్టు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది.
కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడుతాయి. ...అయినా ఏమిటీ వైపరీత్యం
*అప్పుడే వెన్నెల భూమ్మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చిన వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద ప్రసరించింది. మరుక్షణం పెద్ద వెలుగు.... మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నంచింది మణిమేఘనగా మారిన మాయాశిల్పం.
ఒక్కసారి మణిమేఘనను చూడాలని వుంది.
అనగనగా ఒక మనస్సు కథ మనసున్న ప్రతీఒక్కరి కథలా మా మనస్సులను హత్తుకుంది.నార్త్ అవెన్యూ లాంటి థ్రిల్లర్ డెత్ సెంటెన్స్ లాంటి సస్పెన్స్ ఎప్పుడెప్పుడు లాంటి రొమాంటిక్ థ్రిల్లర్ రాసె మీ రచనలు ఎవర్ గ్రీన్ .అభినందనలు మేడం.
మానవ జీవితాల్లోని వివిధ పార్శ్వాలను స్పృశించే మీ రచనలు బావుంటాయి.
దాంపత్య జీవితంలోని మధురమైన ఘట్టాలను అలకలను అర్థం చేసుకోవడాలను అర్థవంతంగా చూపించిన నవల " శ్రీ ౭శ్రీమతి " అభినందనలు ధన్యవాదాలు.
క్యాన్సర్ మీద మీరు చేసిన పోరాటానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాం.ఒక రచయిత్రిగా బాధ్యతగా ఈ పుస్తకాన్ని రాయడం మీ గొప్పతనం.చాలా మంచిపుస్తకం.
వెరీ ఇంట్రెస్టింగ్
డిటెక్టివ్ స్టోరీస్ మళ్ళీ మాకు అందిస్తున్నందుకు
థాంక్స్ టు కినిగె..
థాంక్స్ టు శ్రీసుధామయి
ఒక్కో కథ ఒక్కో జీవితాన్ని పరిచయం చేస్తుంది. మనసును తట్టిలేపే పదజాలం ప్రదర్శించిన ఇంద్రజాలం..మనిషి దేవుడయ్యాడు ..కానీ...
*వృద్ధులైన ఆ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యాన్ని పిల్లలకు,పిల్లల యవ్వనాన్ని తమకు ఇవ్వమని దేవుడిని కోరుకున్నారు...ఆ వింత కోరిక తో ప్రపంచమే తల్లకృందులైంది." ఈ ఒక్కకథ చాలు కథాప్రపంచాన్నిమన ముందు ఆణిముత్యమై నిలిచిందని చెప్పడానికి .. ..మానవతా విలువలను కన్నవాళ్ళ ఆవేదనను ఆ దేవుడు ఆలకించి ఎందుకు వరమిచ్చాడో చెప్పడానికి
సెక్స్ కు రొమాన్స్ కు మధ్య వున్న వ్యత్యాసాన్ని...రొమాంటిక్ మెమోరీస్ ని కళ్ళకు కట్టినట్టు పాత్రలు కళ్ళముందు కదలాడినట్టున్నాయి.ఆపిల్ చెట్టు కథలో సైంటిస్ట్ సృష్టించిన ఆపిల్ దంపతులకు దాంపత్యజీవిత రహస్యాన్ని ,పరమార్థాన్ని చెబుతుంది.ఇవి కథలు కావు..దంపతులు పదిలంగా చదివి మనసులో దాచుకుని ఆచరించవలిసిన అద్భుతాలు.
హై వే నెం 13 చదువుతుంటే డ్రాక్యులా క్యాజిల్ కు వెళ్లి అందులోనే ఉన్నట్టుంది.క్లైమాక్స్ సూపర్బ్ ...నవల కాస్త పెద్దగా ఉంటే బావుండేది.రచయిత్రి కథతో పాటు పాఠకులను డ్రాక్యులా క్యాజిల్ కు తీసుకువెళ్ళింది.
superb ...
" మనం మన జీవితంలో ఏం కోల్పోతున్నామో..కోల్పోయేవరకు తెలియదు ." నాకు ఈ పుస్తకం చదివేదాకా తెలియలేదు..ఇది నిజం.. .ఇందులో అతిశయోక్తి లేదు.కన్నడంలో ఈ పుస్తకాన్ని చదివిన మిత్రుడు చెప్పాక..ఇంతకాలానికి చాలా ఏళ్ళ తరువాత ఈ పుస్తకాన్ని తెలుగులో చదువుతున్నాను..కన్నడభాష నాకు రాని కారణంగా..."మిమ్మల్నిమీరు అర్థం చేసుకోండి " పుస్తకరూపంలో కూడా ఉండివుంటే ఇంకా బావుండేది.
" ఇరవైనాలుగు గంటల ముందు చనిపోతానని .." ఏ మనిషికైనా తెలిస్తే ఎలా ఉంటుంది ..అన్న ఆలోచన వస్తే..అది నిజమైతే ఈ ప్రపంచమే బావుంటుందేమో..ముఖ్యంగా ఈ పుస్తకరచయిత తన జీవితాన్ని అర్థం చేసుకున్న తీరు..రైల్వే స్టేషన్ లో గడిపిన సంఘటన కళ్ళ వెంట నీరు తెప్పించింది.అద్భుతం ఇంతమంచి పుస్తకం మాకు అందించినందుకు కృతజ్ఞతలు.
*"ఉద్యోగం వస్తే రోజుకో కొబ్బరికాయ కొడతానని నువ్వు మొక్కుకుంటున్నావు...నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుగా వున్న కొబ్బరికొట్టు వాడు ఎదురుచూస్తున్నాడు..అయినా శరీరాన్ని ఇలా ప్యాక్ చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారే .."దెబ్బయేళ్ళ బామ్మ మాటలు ఆహ్లాదపరుస్తూనే ఆలోచింపజేస్తాయి....చాలా మంచి నవల..ఎమోషన్స్ ఎంటర్టైన్మెంట్ మెసేజ్ ..చదువరులను సాహితీప్రపంచంలోకి తీసుకువెళ్లే థ్రిల్లర్.సాకేత్ అముక్త సత్యవర్ధన్ స్వామీజీ పాత్రలు హైలెట్ ...
wonderful,,.marvellous
ఈమధ్య చదివిన నవలల్లో నాకు బాగా నచ్చిన నవల అండర్ వరల్డ్ ...వృత్తిరీత్యా వివిధ దేశాలకు వెళ్లడం వల్ల ఈ నవల మిస్సయ్యాను.యస్సార్కె పాత్ర చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు.ఇంకా నిడివి పెంచి ఉంటే బావుండేది.బహుశా పార్ట్ 2 రాద్దామనుకున్నారేమో... ఇలాంటి గాడ్ ఫాదర్ ఉంటే బావుందనిపించింది.యాంటీ మాఫియా కు చీఫ్ అనే కాన్సెప్ట్ బావుంది.ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు.. ఇరవయ్యేళ్ల క్రితం కాలేజీ లో చదువుకునే రోజుల్లో సీరియల్ ప్రకటన చూసాను..ఇప్పుడు ఇ.బుక్ చదివాను.నైస్ అటెంప్ట్ విజయార్కె సర్...విభ్రమ పాత్ర సింప్లి సూపర్బ్ ...ఇలాంటి పాత్రను సీనియర్ హీరోస్ చేసే విభిన్నంగా ఉంటుంది..మూస సినిమాలకు భిన్నంగా..