Comment(s) ...

కేసీఆర్ గారి ఉద్యమస్ఫూర్తిని వ్యక్తిత్వాన్ని చక్కగా విశ్లేషించారు.కేసీఆర్ మార్క్ మతాల తూటాలు..." తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ చచ్చుడో " తెలంగాణ ఉద్యమానికి దూసుకువచ్చిన తూటాలు.వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా కేసీఆర్ రాజకీయ ప్రజా ఉద్యమ జీవితాన్ని వివరించిన తీరు చాలా బావుంది.కేసీఆర్ అభిమానులే కాదు ముందుతరం రాజకీయనాయకులకు ఒక సిలబస్ లాంటిది.
ప్రముఖరచయితగా జర్నలిస్ట్ గా విజయార్కెగారి శైలి పరిశీలనాత్మక కథనం విశ్లేషణ చాలా బావుంది.సహరచయితతో ముందుమాటలో చెప్పింది నూటికి నూరుపాళ్ల్లు నిజం

అద్భుతమైన భావుకత్వం..అనిర్వచనీయమైన రొమాంటిక్ ఫీలింగ్స్ ...భార్యాభర్తల మధ్య వుండవలిసిన రొమాంటిక్ ఎమోషన్స్ ను అక్షరాల్లోకి ట్రాన్స్ లేట్ చేసినట్టు...గ్రేట్..దంపతులు అమ్మాయిలు అబ్బాయిలు ( కాబోయే దంపతులు ) చదవవలిసిన సరసమైన కథలు.

పుస్తకాలు జీవితాలను మారుస్తాయా ? అన్న ప్రశ్నకు సమాధానం విజయార్కె గారి " అసంతృత్తిని జయించండి " పుస్తకం చదివాకా కానీ నాకు తెలియలేదు.
నిర్మాణాత్మకమైన , నిరర్థకమైన అసంతృతులు ఎలా వుంటాయో అసంతృప్తి అనే గదిలోకి వెళ్లి చూసాక అర్థమైంది.
ఈ పుస్తకంలో ఏముంది ? అని ప్రెజహ్హ్నిస్తే నా సమాధానం " జీవితం వుంది " జీవితంలో అసంతృప్తిని గుర్తించి ఎలా జయించాలో వుంది.
ఎలాంటి అసంతృప్తి ని మనం జయించాలో వుంది.
ఈ పుస్తకాన్ని కన్నడంలో చదివి బావుందని చెప్పిన వసుకు ( వసుమతికి ) కృతజ్ఞతలు
ఇంత పుస్తకాన్ని అందించిన కినిగె కు థాంక్స్

" నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ లా ,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి.
ఈ కథల్లోని కథానాయికలు మీరే..
ఈ కథల్లోని కథానాయకులూ మీరే...
మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునే పాత్రలు సన్నివేశాలు సంఘటనలు అనుభవాలు అనుభూతులు మీ పరం చేసే అక్షరస్వరాల కథలు ఇవి.
ప్రతీ రాత్రి ఈ కథలు చెప్పే కథలు వినండి."
అశ్లీలతకు తావులేకుండా సెక్స్ కు రొమాన్స్ మధ్య తేడాను అర్థాన్ని చెప్పిన రోమాంచిత కథనాలు.
ఈ వాక్యాలకు ఫిదా అయ్యాను...అద్భుతమైన రొమాంటిక్ ఫీల్..రొమాన్స్ ఇంత గొప్పగా ఉంటుందా..అనిపించే ఈ కథలు స్వాతి వీక్లీలో చాలా వరకు చదివాను.ఒకేసారి అన్ని కథలు చదవడం థ్రిల్ గా వుంది.థాంక్యూ...కినిగె...

చిన్నప్పటి ప్రపంచంలోకి తీసుకువెళ్లారు...జానపద నవలలు చదివేవారికి తప్పక నచ్చే నవల...ముఖ్యంగా క్లైమాక్స్...రాజులు కత్తియుద్ధాలు మంత్రతంత్రాలు..గుడ్ అటెంప్ట్ ...కీపిటప్

రియల్లీ వండర్ ఫుల్ బుక్...రెండుసార్లు చదివాను..ముఖ్యంగా విభ్రమ పాత్ర బావుంది..ఒక టీవీ రిపోర్టర్ ఎలా ఉండాలో చెప్పేలా వుంది.యస్సార్కె పాత్రలో బిగ్ బి కనిపించారు..ఆ పాత్ర నిడివి మరింత పెంచి ఉంటే బావుండేది...ముఖ్యంగా ఒక గాడ్ ఫాదర్ ను యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ గా నియమించే ఐడియా ..అదిరిపోయింది...విజయార్జి గారు మీ నుంచి మరిన్ని ఇలాంటి నవలలు రావాలి.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

నమస్కారం. మీరు వ్రాసిన వచనానువాదం చాలా బాగుంది. కావ్యంలో ఉన్న విషయం ఇదీ అని తెలుసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది. మీ కృషికి అభినందనలు, కృతజ్ఞతలు. -మురళి నందుల.

Pls enable rent option for this book

హాలీవుడ్ స్టైల్ లో నవల ప్లజంట్ గా నడిపించడంలో రచయిత్రి సక్సెస్ అయ్యారు.సిద్దార్థ సుగాత్రి మధ్య నడిచే సీన్స్ కొత్తగా వున్నాయి.నవల అప్పుడే అయిపోయిందా ?అనే ఫీలింగ్ కలిగింది.నిడివి తక్కువగా ఉండడం కొంత నిరాశకు గురి చేసింది.
అపరాధ పరిశోధనల్లో ఈ మధ్య వచ్చిన నవలల్లో డిఫరెంట్ ప్లజంట్ నవల అని చెప్పవచ్చు.

సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుంది.ముఖ్యంగా హీరో అనగానే ఆరడుగుల ఆజానుభావుడు గాల్లో ఎగిరి ఫైట్ చేయడం అని కాకుండా వీల్ చైర్ ( చక్రాల కుర్చీ ) కి పరిమితమైన వ్యక్తి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించడం ఆ పాత్ర శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లినట్టు వుంది.అదే వ్యక్తి అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ "యాంటీ మాఫియా" కు చీఫ్ గా మారి ముల్లును ముల్లుతూనే తీయాలి అన్నట్టు మాఫియాను ధీ కొట్టే పాత్రగా మార్చ

Subscribe
Browse