Comment(s) ...

ఎక్సలెంట్ ,నాలుగు విభిన్నమైన నవలలు ఒకే పుస్తకంలో .వేటికవే విభిన్నమైన శైలిలో వున్నాయి.అండర్ వరల్డ్ పైసా వసూల్,టార్గెట్,మీ ఇష్టం, ఒకదానికి ఒక పోటీపడుతూ చదివించాయి.అన్ని ఎమోషన్స్ అక్షరాల్లో ఒదిగిపోయాయి.

మనలోని ఒత్తిడిని తగ్గిస్తూ,కథలతో నవ్విస్తూ " నవ్వు దేవుడిని " సృష్టించిన విజయార్కె గారికి,ఇలాంటి మంచి రచనలను అందిస్తున్న కినిగె వారికి, ఆదరిస్తున్న కినిగె పాఠకులకు వినాయచవితి శుభాకాంక్షలు.
మనసారా నవ్వుకునే ఈ కథలను ప్రతీఒక్కరూ చదవాలి.కాసేపు బాధలను పక్కనపెట్టి శాశ్వతంగా నవ్వుకోవాలి.
నవ్వు దేవుడి కోసం తపస్సు చేసాడు.తనను దేవుడిని చేయమని అడిగాడు.దేవుడు నవ్వుని "నవ్వు దేవుడిని" చేసాడు.అప్పటి నుంచి ప్రపంచంలో వింత మార్పులు..?నవ్వు దేవుడికి గుడులెక్కడ?నవ్వు దేవుడెక్కడ? తెలుసుకోవాలంటే "నవ్వు దేవుడొచ్చాడోచ్" కథ చదవాలి
ఇంకా ఇలాంటి కథలు బోలెడు.
నవ్వేచెట్టు నవ్వించే చెట్టు...కనబడని నవ్వుకోసం కంప్లైంట్ ఇచ్చిన వైనం,జపాన్ బొమ్మ వైఫ్ లా మరహ్..ఆ మొగుడి ఇక్కట్లు...
నవ్వుల మెనూలో కథల వంటకాల ఘుమఘుమలు.ఇకపకలు.నవ్వుకున్నవారికి నవ్వుకున్నంత.

ఇది చాలా విలువైన సమాచారం.ప్రతీఒక్కరూ ఈ పుస్తకం చదవాలి.క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహనా పెంచుకోవాలి.ప్రతీ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలానో ఈ పుస్తకం అలా ఉండాలన్నది నా అభిప్రాయం
దేవుడు మనుష్యులని సృష్టించాడు. ఆ మనుష్యులను అర్థాంతరంగా తీసుకెళ్ళడానికి మృత్యువుని సృష్టించాడు. ఆ మృత్యువు కాన్సర్ ను సృష్టించింది.
కాన్సర్ మనుష్యుల మధ్య అనుబంధాలను, ఆనందాలను హరించి విషాదాన్ని మిగిల్చింది. దేవుడు పశ్చాత్తాపపడి డాక్టర్‌ని సృష్టించాడు.
అప్పుడేం జరిగింది?
కాన్సర్‌ని గుర్తించడం ఎలా?
కాన్సర్ బాధితులను ఓదార్చడమెలా?
నెలలో ఒకరోజు యాభై రూపాయల ఖర్చుతో, వంద పోస్టుకార్డులు కాన్సర్ బాధితులకు పోస్ట్ చేస్తే?
కాన్సర్‌తో పోరాడి గెలిచిన వారు, ఓడినవారు, స్ఫూర్తినిచ్చిన వారు. ఎవరెవరు?
మీకు తెలుసా? తలనుండి కాళ్ళ వేళ్ళ వరకు ఏ భాగానికైన వచ్చే కాన్సర్...
100 రకాలకు పైగా ఉన్నాయి.

ఈ నవల కన్నడ అనువాదం కన్నడ పత్రికలో సీరియల్ గానూ ,నవల రూపంలోనూ ఇరవయ్యేళ్ళ క్రితమే చదివాను ( ఎంఎల్ రాఘవేంద్రరావు కన్నడ భాషలోకి అనువదించారు )
స్వాతి మంత్లీ లో అనుబంధ నవలగా వచ్చిన నిర్ణయం,ఆ వెంటనే కన్నడ పత్రిక రాగసంగమలో ధారావాహికగా,అటుపై మధురప్రకాశన పబ్లికేషన్స్ ద్వారా విడుదలైంది.
ఇప్పటికీ ఈ నవలలోని పరిస్థితులు మారలేదు.ఈ నవల ప్రతిఒక్కరికి ఒక్కోలా వర్తిస్తుంది అని నా నమ్మకం.

యథార్థముగా జరిగిన సంఘటనల ఆధారంగా రాసిన హారర్ నవల డార్క్ అవెన్యూ చాలా బావుంది. రాత్రివేళ చదవాలంటే భయం వేసింది.హారర్ నవలలని ఇష్టపడేవారికి బాగా నచ్చే నవల .హారర్ కు సంబంధించిన మరింత సమాచారం కూడా ఇస్తే ఇంకా బావుండేది.

పిల్లల చేత తల్లిదండ్రులు చదివించవలిసిన పుస్తకం,ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ పుస్తకాన్ని ఒక పాఠంలా చెప్పాలి.చందమామ కథలా చదివివినిపించాలి.i .వాళ్ళచేత చదివించాలి.ఇలాంటి పుస్తకాలు పిల్లల మేథోవికాసాన్ని పెంపొందిస్తాయి.

ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించే నవల.పిల్లలేకాదు పెద్దలచేత కూడా చదివించే నవల.ప్రతీఒక్కరినీ బాల్యంలోకి మణిమేఘన దగ్గరికీ తీసుకువెళ్లే నవల.

మన జీవితాల;అను ప్రభావితం చేసి మనల్ని విజయం వైపు నడిపించే అరుదైన పుస్తకాల్లో " మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి " ముందు వరుసలో ఉంటుంది.
ఇరవైనాలుగు గంటల ముందు చనిపోతాడని తెలిసినప్పుడు ఆ మనిషి ఫీలింగ్ ఎలా ఉంటుంది ?
మనల్ని మనం అర్థం, చేసుకోవడం అంటే ఏమిటి ?
ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో పుస్తకరచయిత అనుభవించిన సంఘటనలు మనసుల్ని కదిలిస్తాయి.జీవితం అంటే ఏమిటో అర్థం చెబుతుంది.

జానపద నవలలు అరుదుగా వస్తున్నాయి.ఆనాటి అద్భుత ప్రపంచాన్ని,పిల్లలేకాదు పెద్దలు సైతం చదివే జానపద నవలలు ఇప్పుడు కినిగెలో ప్రత్యక్షం కావడం ఆనందాన్ని కలిగిస్తుంది.
శ్రీసుధామయి జానపద నవలలోని శైలి ,వర్ణన మాయలు మంత్రాలు పచ్చల లోయవైపు తీసుకువెళ్తున్నాయి.
మళ్ళీ జానపద నవలా వైభవం తిరిగిరావాలి.

మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలు లేదా,ప్రాచీన చరిత్ర తిరగేయాలి...అనే పరిస్థితి వస్తుంది..
ఈ ఒక్కవాక్యం చాలు మనం ఎందుకు ఈ కామెడీ కథలు చదవాలో చెప్పడానికి.
కథల్లో హాస్యం,కథనంలో ఆహ్లాదం,కథాంశంలో వైవిధ్యం వెరసి మన పెదవులమీద చిరునవ్వు.మెదడుపొరల్లో ఆలోచనల హరివిల్లు.
దైనందిన జీవితంలోని చికాకులను తరిమేసి , నుంచి దర్జాగా నవ్వించే కథలు ..
నవ్వు కథల్లోని వెరైటీలను ఆస్వాదించాలి అంటే ఈ పుస్తకం చదవాలి..అని నా ఫీలింగ్.

క్యూ ఇప్పటికి పదిసార్లు చదివాను.మళ్ళీ చదువుతున్నాను.అరవై రూపాయల ఖర్చుతో క్యూ గ్రహానికి వెళ్లొచ్చిన ఫీలింగ్.అంతేకాదు ప్రహేళికను కలుసుకున్నాను .సిద్దార్థ ఫీలింగ్స్ తెలుసుకున్నాను.
ఈ సృష్టిలో గ్రహాంతరవాసులు కనిపెట్టలేనిది ఇండియన్స్ సెంటిమెంట్..మన ఎమోషన్స్ ..అని గట్టిగా నమ్ముతున్నాను.
ఒక సైన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.ముఖ్యంగా భర్తను వదిలివెళ్లే ముందు ప్రహేళిక ఫీలింగ్స్ సూపర్బ్.
నవల అంటే మనసును కుదిపేసే ఒక ఎమోషన్ అని అర్థమైంది.క్యూ నవల చదివేక.

తండ్రీకూతుళ్ల మధ్య సెంటిమెంట్,అంతకు మించిన ఎమోషన్స్, మోపెడ్ హీరోతో మాట్లాడ్డం,
అడుగడుగునా సస్పెన్స్ థ్రిల్లర్ ..రావు రమేష్ నయనతార లాంటి వాళ్ళు తండ్రీకూతుళ్ల కారెక్టర్లు పోషిస్తే ,మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అవుతుంది.
1992 లో వున్న ఉగ్రవాద సమస్య,డ్రగ్స్ మాఫియా ఇప్పటికీ ఉండడం విచారకరం

కాన్సర్ ని జయించిన సోనాలి బింద్రే మాటలు ..
( ఈనాడు సౌజన్యంతో)
ముంబయి: బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జులైలో ఆమె తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్తున్నట్లు తెలిపారు. అక్కడే ఆమెకు కొన్ని నెలలపాటు చికిత్స జరిగింది. అయితే ఈ క్రమంలో ‘చనిపోతానేమో’ అనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని సోనాలి చెప్పారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘నా ఉదర భాగంలో క్యాన్సర్‌ కణాలు పూర్తిగా వ్యాపించి ఉన్నాయని స్కాన్‌ ద్వారా తెలిసినప్పుడు, బతికే అవకాశం కేవలం 30 శాతం ఉందని న్యూయార్క్‌ వైద్యులు చెప్పినప్పుడు.. మా గుండె పగిలింది. కానీ చనిపోతాననే ఆలోచన నాకు రాలేదు. పూర్తిగా కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని మాత్రం అర్థమైంది. కానీ ప్రాణాలు పోతాయని మాత్రం ఎప్పుడూ భయపడలేదు’.

‘ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు నా బలం అయ్యారు. ఇప్పుడు నేను నా శరీరంపై ఎక్కువ దృష్టిపెడుతున్నా. చిన్నచిన్న మార్పుల్ని పట్టించుకుంటున్నా. ఇది ఓ కొత్త ప్రయాణం. క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా.. ఎక్కువ జాగ్రత్త అవసరం, సపోర్ట్‌ అవసరం. మీ చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండేలా చూసుకోండి. ఇది ప్రేమ, అనురాగం పొందాల్సిన సమయం’ అని సోనాలి చెప్పారు.

కథలు చదువుతుంటే జీవితాలను చదువుతున్నట్టు వుంది.మనస్సుకు ఆహ్లాదాన్నే కాదె మెదడుకు పదును పెడుతూ జ్జీవితంలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చెబుతుంది.మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది.
ఇందులో చాలా కథలు స్వాతి వీక్లీ లో చదివాను.విజయార్కె గారి కథల్లోని వైవిధ్యం ,అద్భుతమైన కథనం ప్రత్యేకం.

క్యూ నవల చదవడం మొదలు పెట్టాక నేను ప్రహేళికతో ప్రయాణం చేశాను.
ఇంత విభిన్నంగా ముసుకు హత్తుకునేలా,మైండ్ బ్లోయింగ్ అనే మాటకు సరైన అర్థాన్ని చెప్పేలా నవల వుంది.
నిజం చెప్పాలంటే కళ్ళముందు సినిమాలా దృశ్యాలు కనిపిస్తున్నాయి.
" మనం కనిపెట్టలేనిది ఏదైనా ఉందా? అని గ్రహాంతరవాసులు ,భూమి మీదికి వచ్చి మన దేశానికి వచ్చి,మనం కనిపెట్టలేనిది " వున్నది " అని తెలుసుకుని ప్రహేళికను హ్యూమనాయిడ్ రోబో గా పంపించడం,
సిద్ధార్థ ఆమె ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం
ఆ తరువాత ప్రహేళిక కనిపించకుండా పోవడం
సిద్దార్థ ఆమెకోసం అన్వేషించడం
ఆమె గ్రహాంతరవాసి అని తెలియడం
ఆమె కోసం గ్రహాంతరవాసులు గాలించడం
ఒక్కో మలుపు .ఊహించని ట్విస్ట్
భావోద్వేగాలను ఇంత అద్భుతంగా రాసిన రచయిత విజయార్కె గారికి హేట్సాఫ్ .
పన్నెండేళ్ల కిందటే ఇలాంటి నవల ఊహించి రాయడం గ్రేట్.
ప్రారంభం నుంచి చివరి వరకూ ఊపిరి సలుపనివ్వని ఉత్కంఠ

షర్మిల ప్రేమలో పడ్డ మేన్ రోబో ఫీలింగ్స్ వర్ణించిన తీరు అద్భుతం.మేన్ రోబో అగ్నిహోత్ర అనుకుని ప్రేమించిన షర్మిల '" తను పేమించింది మేన్ రోబోను " అని తెలిసినప్పుడు ఒక్కక్షణం గుండె లయ తప్పింది.సులోచన పాత్ర సగటు అమ్మాయిల స్వగతం." దేవుడా అమ్మాయిలను పొడుగ్గా పుట్టించు లేదా విశాలమైన హృదయమున్న మగాళ్లను సృష్టించు " అన్న ఫీలింగ్" హార్ట్ టచింగ్ గా వుంది.
సైన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.

చదివిన ప్రతీసారి కొత్తగానే అనిపిస్తుంది.మళ్ళీమళ్ళీ చదవాలని అనిపిస్తుంది.ఆముక్తమాల్యద పాత్ర చాలా బావుంది.ప్రారంభంలో ఉడుత కథ కన్నీళ్లు తెప్పించింది.

అపరాధ పరిశోధన నవలల్లో వుండే కిక్కే వేరు.అడుగడుగునా ఆసక్తి ఉత్కంఠ కలగలిసి ఉంటాయి.దానికి కామెడీ తోడైతే మరింత బావుంటుంది.శ్రీసుధామయి డిటెక్టివ్ సిద్దార్థ నవల చదువుతుంటే అలాంటి ఫీలింగ్ కలిగింది.స్కూల్ రోజుల్లో చదివిన పుస్తకాలు.మళ్ళీ అలాంటి డిటెక్టివ్ లు తగ్గిన సమయంలో ఆ లోటును తీర్చినట్టు ఈ నవల.
కామెడీ పరిశోధన ఆసక్తి ఉత్కంఠ మంచి రచనాశైలి వెరసి డిటెక్టివ్ సిద్దార్థ.

మీ నవలలు చాలా బావుంటాయి .ముఖ్యంగా జానపద నవలల్లో మీ స్టైల్ ప్రత్యేకం .ఊహాలోకంలో విహరింపజేసిస్తాయి కంగ్రాట్స్ .జానపద నవలలను మళ్ళీ పాఠకుల ముందుకు తీసుకువస్తున్న కినిగెకు అభినందనలు డిటెక్టివ్ సిద్దార్థ లాంటి నవల మళ్ళీ రాయండి.

ఒక రచయిత పుస్తకాన్ని పాఠకుల దగ్గరికి,పాఠకుల మనస్సులోకి మస్తిష్కంలోకి చేర్చడానికి కంటిచెమ్మను సృష్టించడానికి,ఆలోచనలను రేకెత్తించడానికి, పడే తపన శ్రమ ఇష్టం" మీ ఇష్టం " లో కనిపించి పాఠకులను ఇష్టపడేలా చేసింది.

మణిమేఘన పాత్ర అద్భుతం.ఆమె అమాయకత్వం,అందం ,రెండూ పాఠకులను కట్టి పడేస్తాయి.
విజయసింహుడి సాహసాలు ,మేఘాలు పక్కకు తప్పుకోవడం, కొలనులో వున్న మణిమేఘనను చూసి చంద్రుడు మేఘాల చాటుకు వెళ్లడం,
సాహసాలు మనసును హత్తుకునే సన్నివేశాలు.
విజయార్కె గారి సృజనకు అభినందనలు

కొన్ని కథలు మమ్మల్ని కట్టిపడేశాయి.
మరికొన్ని కవితలు మమ్మల్ని చుట్టేశాయి.
డెత్ సెంటెన్స్ నార్త్ అవెన్యూ కొంగుచాటుప్రేమ నేను కాన్సర్ ని జయించాను
మీ రచనల్లో వైవిధ్యం మీ అక్షరాల్లా .
అభినందనలు

అద్భుతమైన పుస్తకం.చిన్నసమస్యలకే చావే మార్గం అనుకునేవారికి ఈ పుస్తకం ఎన్నో విషయాలను నేర్పుతుంది.ఒక మంచి బయోపిక్ తీయాదానికి సరిపడా జీవితం వుంది ఈ పుస్తకంలో.
దాదాపు ఇరవై ఏడేళ్ల క్రిందట ఆంధ్రభూమి వీక్లీ లో ఈ సీరియల్ చదివాను.ఇప్పుడు ఒకేసారి చదివే అవకాశం వచ్చింది.థాంక్స్ టు కినిగె...
ఒక పేరున్న స్టార్ జీవితంలో జరిగిన ఈ సంఘటన క్రైమ్ సీరియల్ ను తలపించింది.
అర్థరాత్రి అరెస్ట్,కన్నతల్లి ఫీలింగ్స్,
ఏసీ లో యాక్షన్ కట్స్ మధ్య బిజీగా వుండే హీరో ఒకేసారి జైలుగోడల మధ్య గడుపవలిసి రావడం విచారకరం.
సుమన్ నిజజీవితంలో కూడా హీరోగా వున్నారు.జైలు నుంచి నిర్థోషిగా బయటకు వచ్చారు.
ఇలాంటి కథలు బయోపిక్స్ గా రావలిసిన అవసరం వుంది.
హేట్సాప్ సుమన్ గారూ ..
విజయార్కె గారు రాసిన ఈ సీరియల్ అప్పట్లో సంచలనం సృష్టించింది.

beautiful pleasant entertainer ...with fantastic message

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

In how many parts is padma puranam written?

ధైర్యాన్ని చెబుతూ ఒత్తిడిని జయించండి అని చెప్పే ఈ పుస్తకం తప్పక చదవాలి,
ఒత్తిడి మనకు తెలియకుండానే మన ప్రాణాలు తీసిస్తుంది.ఇలాంటి సమయంలో ఈ పుస్తకం ఎంతోగాను ఉపయోగపడుతుందని నమ్మకం.ఒత్తిడి ఎన్ని రకాలుగా ఉంటుందో,ఒత్తిడిని ఎలా జయించవచ్చునో ఉదాహరణలతో స్వానుభవాలతో రచయిత చెప్పిన మాటలు ఇప్పటి ఈ కరోనా పరిస్థితుల్లో ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి.ఒత్తిడికి నివారమార్గాలు ఒత్తిడికి సంబం

నేను నా బాల్యంలోకి వెళ్లి చదివిన నవల.నా చుట్టూ వున్నా ప్రపంచాన్ని రణగొణధ్వనులను కాలుష్యాన్ని మరిచిపోయి హాయిగా చదువుకున్నాను.నవల చదువుతూ గంధర్వలోకానికి వెళ్ళాను.మేఘాలను పలకరించాను.మణిమేఘనా సౌందర్యాన్ని చూసాను.ఎక్కడా అసభ్యతకు తావులేని శృంగారం ,మనసుకు హాయించే వర్ణనలు,మరోలోకానికి తీసుకువెళ్లే అద్భుతకథనం,ఇలాంటి జానపద నవలలు ఈ తరం పాఠకులకు పరిచయం చేసిన రచయితకు కినిగెకు ధన్యవ

ప్రస్తుత పరిత్తితుల్లో ఇలాంటి పుస్తకాల అవసరం వుంది.అపోహలను అనవసర భయాలను ఒత్తిడికి గురిచేసి మనల్ని ప్రమాదంలోకి నెట్టే ఒత్తిడిని ఎలా జయించాలో చెప్పే పుస్తకం తప్పనిసరిగా ఇప్పుడు చదవాలి.ఈ ప్రపంచంలో నా నీడ పడినచోట ప్రెశాంతత కరువవుతుంది..అని ఒత్తిడి తో రచయిత చెప్పించిన మాటలు అక్షరసత్యాలు.

ఒక ధ్యానంలా మాయాశిల్పం -మంత్రఖడ్గం నవల చదివాను. కరోనా భయాన్ని వదిలేసాను.ప్రశాంతంగా ఈ నవల చదువుతూ అక్షరాలతో మెడిటేషన్ చేశాను.మణిమేఘన మాయాశిల్పంగా మారడం,కొలనులో జలకాలాట,మేఘాలు పక్కకు తప్పుకోవడం,కథానాయకుడి సాహసం,జలఖడ్గం,చితవిచిత్ర దృశ్యాలు,అద్భుతమైన భాష,పాఠకులను కొత్తలోకంలోకి మాయాశిల్పం ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది.ఈ నవల పుస్తకరూపంలో కూడా ఉండివుంటే బావుండేది.కళ్ళముందు చిన

Subscribe
Browse