
ఆహ్లాదాన్ని ఉత్కంఠని కలిగించే నవలలు.మీ ఇష్టం ప్రతీఒక్కరు తమని తాము స్కాన్ చేసుకునే పుస్తకం.ముఖ్యంగా దేవుడితో రచయితా సంభాషణ కళ్ళకు కట్టినట్టు వుంది.
వావ్ ...గ్రేట్ ఒకే పుస్తకంలో విజయార్కె గారి నాలుగు నవలలు ఇవ్వడం మంచి ప్రయోగం.దాదాపు రెండు నవలల ఖరీదులో నాలుగు నవలలు అందించడం పాఠకులకు గిఫ్ట్ లాంటిదే.ఒకే పుస్తకం ద్వారా నాలుగు నవలలు చదువుకోవచ్చు.అందులోనూ ఒకటి మాఫియా,మరొకటి ఫాంటసీ కామెడీ,ఇంకోటి క్రైమ్,మరోటి వ్యక్తిత్వ వికాస రచన.
నాలుగు విభిన్నమైన రచనలు వైవిధ్యంగా మాకు కానుకగా అందించారు. .పాఠకాభిరుచికి అనుగుణంగా పుస్తకాలను పాఠకులకు చేరువ చేస్తున్నందుకు కినిగె వారికీ ధన్యవాదాలు
కరోనా ఒత్తిడిలో మనసారా నవ్వుకునేలా చేసిన కథలు.విభిన్నమైన సబ్జక్ట్స్, అద్భుతమైన కథనం,పదాల్లో పంచ్ ,వెరసి నిజంగా నవ్వు దేవుడొచ్చి నవ్వమని వరమిచ్చినట్టే వుంది.
వేణుమాధవ్ గారు..మీ పుస్తకం ఒక జీవితం..ఒక చరిత్ర..మీరు సాధించిన విజయం అద్భుతం.ఏమీలేని స్థాయినుంచి ఎందరికో స్ఫూర్తిని ఇచ్చే స్థాయికి చేరిన మీ సక్సెస్ స్టోరీ,ఈ పుస్తకానికి అందమైన ముఖచిత్రం.ప్రతీఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలి.జీవితాన్ని జయించాలి.ఇంతమంచి పుస్తకాన్ని అందించినందుకు థాంక్యూ సర్.
క్యాన్సర్ ని జయించండి ఒక పుస్తకం కాదు,మన జీవితాన్ని మృత్యువు బారినుంచి రక్షించే ఆరోగ్యగీత .
రోజూ ఎన్నో పనికిరాని లేదా నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వని విషయాల మీద సమయాన్ని,డబ్బును ఖర్చు చేస్తున్నాం.
ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదివి క్యాన్సర్ అవేర్ నెస్ గురించి తెలుసుకోండి.ముందు జాగ్రత్తలు తీసుకోండి.
మా బంధువుల్లో కొందరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ తో మరణించారు.
వన్దరకాల క్యాన్సర్ల గురించే కాదు విలువైన వ్యక్తిత్వవికాస పాఠాలు వున్నాయి.
ఈ పుస్తకం మీద వెచ్చించే డబ్బు ఎక్కువేమీ ,ఈ కాదు మన ప్రాణాల కన్నా.
ఒక అమ్మగా చెబుతున్నాను.ఎవరు రాయగలరు సర్ ఇలా?
బిడ్డల నిర్లక్ష్యానికి స్వార్థానికి బలైన తల్లుల నాకు గురించి తెలుసు.
ఇది నవల కాదు అమ్మల జీవితం,నాన్నల ఆవేదనలు సారం.వృద్ధుల జీవితాల్లోని విషాదాలకు అక్షరరూపం.
మీ నవలలో ఒక తల్లి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తీర్పు కావాలి ,కొత్తమార్పుకు నాంది కావాలి,
ఇలాంటి అద్భుతమైన నవల రెండు దశాబ్దాలకు పూర్వమే ప్రచురించిన స్వాతి పత్రికకు,
తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకుని మీ అక్షరాలనుఆదరించిన కన్నడ పాఠకులకు,
మేన్ రోబో పబ్లికేషన్స్ కు
ఇ బుక్ గా అందించిన కినిగెకు
అభినందనలు కృతజ్ఞతలు.
దీనిని నవలగా కాదు తల్లిదండ్రుల ఆవేదనకు అక్షరాల అనువాదంగా చదవాలి.
అద్భుతమైన భావుకత,అత్యద్భుతమైన కథనం .
ప్రతీకథ మనసు కట్టిపడేస్తుంది.ప్రతీ వాక్యం మధురోహలను ఆహ్వానిస్తుంది.
దంపతుల మధ్య వుండే ఎమోషనల్ టచ్ ను టచ్ చేసే బ్యూటిఫుల్ స్టోరీస్
రెండుసార్లు చదివాను .హ్యూమన్ ఎమోషన్స్ సస్పెన్స్ ...వెరీ ఇంట్రెస్టింగ్.ముఖ్యంగా ఎర్విక్ పాత్ర మర్చిపోలేనిది. కీపిటప్
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి.
కళ్ళ ముందు మేఘాలు కన్పించాయి.గంధర్వలోకానికి తీసుకువెళ్లాయి.ఆహ్లాదాల వర్షాన్ని కురిపించాయి.
వావ్...చాలా చాలా అద్భుతమైన జానపద నవల ,పదిపైసల అద్దెతో నేను చిన్నప్పుడు చదివిన జానపద నవలలు .ఇప్పుడు గుర్తుకు తెచ్చిన విజయార్కె గారి " మాయాశిల్పం-మంత్రఖడ్గం " .
సర్ మీ నుంచి మరిన్ని జానపద నవలలు రావాలి.
ఈ పుస్తకం ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను...నేర్చుకున్నాను.చిన్నచిన్న నిరర్థకమైన అసంతృప్తులను వదిలేసాను.నిర్మాణాత్మకమైన అసంతృప్తిని తెలుసుకోవాలని అనుకునేవారు,జయించాలనుకునేవారు ఈ పుస్తకం చదువవచ్చు.
something different awesome ...ఇలాంటి డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ ఫస్ట్ టైం చదివా ...
తల్లిదండ్రులు భార్యాభర్తలు అన్నాచెల్లెళ్లు అక్కాతమ్ముళ్ళు స్నేహితులు బంధువులు...ప్రతీ ఒక్కరూ చదవాల్సిన కథలు.కనుల ముందు జీవితాలను ఆవిష్కరించారు రచయిత.
ఒక్కో కథ ఒక్కో జీవితసత్యం...మానవసంబంధాలు ,మానవతా విలువలు ,మనుష్యుల మధ్య వుండవలిసిన బంధాలు అనుబంధాలు ...మనసుకు కంటికి మేధస్సుకు అనిర్వచనీయమైన ఆహ్లాదాన్ని అనుభూతిని సరికొత్త అనుభవాలను అందించిన కథలు..
నిజమే మనిషే దేవుడయ్యాడు కానీ...అద్భుతాల కథల పూలతోటలో విహరించండి.
నవలను చదవడం మినహా మాట్లాడ్డానికి మాటలు లేవు..కొత్తదనానికి సరైన అర్థం.ఇలాంటి నవలలు తెలుగులో అరుదుగా వస్తాయి.ప్రహేళిక భూమ్మీద పుట్టి ఉంటే బావుండేది.
ఇలాంటి నవలలు అరుదుగా వస్తాయి...పాతికేళ్ల క్రిందటి నేను కాలేజీరోజుల్లో చదివిన నవల ( ఆంధ్రభూమి వీక్లీ లో సీరియల్ ) ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను.అయినా అదే కొత్తదనం.ఇప్పటికీ దొంగస్వాములు పుడుతూనే వున్నారు.సత్యవర్ధన్ భార్య పాత్ర ఈ సమాజాన్ని వ్యవస్థను నిలదీస్తుంది.
ఆముక్తలోని అమాయకత్వం..సాకేత్ లోని మైండ్ గేమ్ కాన్సెప్ట్..సూపర్బ్ ...విజయార్కె గారి స్వాతిలో కథలు ,కామెడీ సరసమైన కథలు...ముఖ్యంగా మనసును కదిలించే నిర్ణయం నవల..( స్వాతి మంత్లీ అనుబంధ నవల ,ఈ నవల కన్నడ అనువాదాన్ని చదివాను ) మర్చిపోలేను.
భార్యాభర్తల వుండే సున్నితమైన రొమాన్స్ ను భావోద్వేగాలతో చాలా గొప్పగా రాసిన " క్యాండిల్ లైట్ శోభనం " దంపతులకు మంచి గిఫ్ట్ అని నా ఉద్దేశం.
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృష్టించాడు ..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్? ఇలాంటి కథలు మనసును టచ్ చేస్తాయి.ఎమోషన్స్ ను హగ్ చేసుకుంటున్నట్టు ఉంటుంది.
మంచి ఫీల్ వున్న నవల..అమితాబ్ లాంటి నటుడు పోషించవలిసిన పాత్ర..తెలుగులో ఇలాంటి పాత్రలను సూపర్ స్టార్ కృష్ణ పోషిస్తే చూడాలని వుంది.యస్సార్కె పాత్ర అద్భుతంగా తీర్చిదిద్దారు విజయార్కె గారు...యాంటీ మాఫియా స్క్వాడ్ కు " ఒక మాఫియా అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ " ను చీఫ్ చేసే ఆలోచన సూపర్బ్ ..విభ్రమ పాత్ర " ఏ బహుత్ అన్యాయ్ హై " శ్రీదేవిని గుర్తుకు తెప్పించింది.నాన్ స్టాప్ గా చదివించిన నవల..,ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ చదువుతున్నట్టు వుంది.