Comment(s) ...

చక్కని కాలక్షేపం,ఆహ్లాదం,నాలుగు డిఫరెంట్ రచనలు.క్రైమ్ మాఫియా కామెడీ,వ్యక్తిత్వవికాసం వేటికవే ప్రత్యేకంగా వున్నాయి.పైసా వసూల్ ప్లజంట్ గా వుంది.జంధ్యాలగారి సినిమా చూస్తున్నట్టు వుంది.

ఈ బిజీ లైఫ్ లో ఒత్తిళ్ల మధ్య మనసారా నవ్వుకునే కథలు,మనస్సుకు ప్లజంట్ ను కలిగించే కథలు.ప్రతీకథ దృశ్యంలా కనిపిస్తుంది.మాటల్లో హాస్యం తొణికిసలాడుతుంది.కామెడీ వెబ్ సిరీస్ తీస్తే మనలోని ఒత్తిడికి మాంచి కిక్కు ఇచ్చే కామెడీ థెరపీ అవుతుంది.
నవ్వు కనబడుటలేవు అనే కంప్లైంట్ ఐడియా సూపర్బ్
నవ్వుచెట్టు ఉంటుందా,?అనే కాన్సెప్ట్ అదుర్స్ .ప్రతీకథలో నవ్వు అండర్ కరెంట్ గా సందేశాన్ని ఇస్తూ,నవ్విస్తుంది.మన ఆయుష్షును పొడిగిస్తుంది.

ఈ లాక్ డౌన్ లో మనఃస్ఫూర్తిగా నవ్వించిన కథల పుస్తకం " నరుడా...ఏమి నీకోరిక?"
నవ్వు ఆరోగ్యానికి మంచిది...
మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలూ లేదా,ప్రాచీన చరిత్ర
తిరగేయాలి..అనే పరిస్థితి వస్తుంది.
* నవ్వడంవల్ల రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసారం పెరగడంతో ఇది గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
* నవ్వడంవల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. తద్వారా క్యాన్సర్‌ కారణంగా దెబ్బతిన్న కణాల్ని బాగుచేసే శక్తీ నవ్వుకి ఉంది.
* నవ్వడంవల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్లకింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వేవాళ్లు నవ్వనివాళ్లకన్నా ఏడేళ్లు ఎక్కువగా జీవిస్తారట.
రోజుకి సుమారు 15 నిమిషాలు నవ్వితే దాదాపు 40 వరకూ క్యాలరీలు కరుగుతాయట.
ఇలా నవ్వు గురించి నవ్వుతూ బోల్డు చెప్పుకోవచ్చు..ఒక్కక్షణం మీరు అలోచించి ఈ పుస్తకంలోని కథలు చదివి.. నవ్వుతూ నవ్వు గురించి ఆలోచించండి..
ఇది నిజంగా నిజం...ఇందులోని కథలు చదివాక మనసు తేలికైంది.నవ్వు మాకు స్వంతమైంది.

కథల్లో జీవితాన్ని,అక్షరాల్లో దాంపత్యజీవితానికి అర్థాన్ని చెప్పిన అద్భుతమైన రొమాంటిక్ స్టోరీస్..ఫరెవర్ ఇందులో చాలాకథలు స్వాతి సపరివారపత్రికల్లో చదివినవి,అయినా మళ్ళీ మళ్ళీ అప్పుడు మిస్సయిన కథలు ఇప్పుడు చదువుతుంటే ఎమోషనల్ గా వుంది.ఇలాంటి పార్టనర్ దొరికితే ఎంత బావుండు అనిపిస్తుంది.అందమైన భావుకత్వం అంతకన్నా అందమైన రోమాంచితమైన కథనం.హేట్సాప్ గుడ్ నైట్ స్టోరీస్

ఇలా రాయడం మీకు మాత్రమే చెల్లింది.ప్రతీకథలో అనుభూతి మనసుపొరలను తాకుతూ అనుభవాలను అనుభవవేద్యం చేస్తుంది.
ఉదయమంతా అలసట ...వృత్తిపరమైన వ్యక్తిగతమైన సమస్యలు...వాటిని పడగ్గది బయటే వదిలేయండి.
స్పా లకు వెళ్లినా,విహారయాత్రలకు వెళ్లినా ఎంత ఖర్చుచేసినా లభించని గొప్ప అనుభవం..అనుభూతి మీ ఇద్దరి కలయికలోనే వుంది.
కౌగిలిని మించిన గొప్ప సెక్యూర్డ్ ఫీలింగ్ మరోటి ఉంటుందా?
వ్యాయామంతో ఖర్చుచేసే క్యాలరీలు రొమాన్స్ తో ఖర్చు చేయండి.అనుభవాలను రొమాంటిటిక్ మెమోరీస్ గా డిఫాజిట్ చేసుకోండి.అనుభూతి ఫ్రీజర్ లో మీ కలయికలు భద్రపర్చుకోండి.
ఈ ధాత్రిలో ప్రతీ రాత్రి మీదే ..ప్రతీ పగలు ప్రతీ క్షణం..ఒకరి సమక్షంలో మరొకరు సేద తీరండి..కలయిక శయ్యపై విశ్రమించండి.
ప్రతీ రాత్రి శోభనరాత్రి కావాలి ...
ఎప్పటికప్పుడు కొత్తగా,కొంగ్రొత్తగా మీ రొమాంటిక్ మెనూ ను మార్చుకోండి.కొత్త ఇష్టాలు సరికొత్త ఊహలు..ఆలోచనలు..కబుర్లు...మీ ఏకాంతంలో నేపథ్యసంగీతం కావాలి.

కళ్ళలో నీళ్లు తెప్పించే పుస్తకం.జీవితాన్ని జయించిన ఒక వ్యక్తి రాసుకున్న అంతరంగకథనం..పదిమందికి జీవితంలో గెలుపును సాధించడం ఎలానో చెప్పే వ్యక్తిత్వవికాసం.ప్రతీ అక్షరంలో తొణికిసలాడే ఆత్మవిశ్వసం.ప్రతీఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తి వ్యక్తిత్వం.. కష్టపడే తత్త్వం.. ఆత్మాభిమానం
మా తండ్రి సంపాదించినా ఆస్థి "మంచిపేరు"
వెంకటయ్య పంతులు అంటే చేతులెత్తి నమస్కరించే సంస్కారం వున్న జనంలో మంచి గుర్తింపు
డాక్టర్ వెంకటయ్య అంటే "మాకు ప్రాణదానం చేసిన మంచి మనిషి, మా ఇంట్లో దీపం పెట్టిన దేవుడు" అనేంత మంచిపేరు.
మా నాన్నగారి మరణం తరువాత ఆ పేరుతో పాటు పేదరికమే మిగిలింది.
మానవ సంబంధాల కన్నా "మనీ" బంధాలే ఎక్కువని అర్థం అయ్యేసరికి మేము నడివీధిలో నిలబడివున్నాం.
కష్టాలను అధిగమించిన ధీరత్వానికి నిలువెత్తు సాక్ష్యం ఈ పుస్తకం

ఒక పుస్తకం మనల్ని పూర్తిగా మార్చలేకపోవచ్చు.కానీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది.
అసంతృప్తిని జయించండి నన్ను ఆలోచించేలా చేసింది.అసంతృత్తి లో నిరర్థకమైనవి /నిర్మాణాత్మాకమైనవి ఏమిటో చెప్పిన తీరు బావుంది.

హాస్యం,మానవ సంబంధాలు , ఫిక్షన్,థ్రిల్లర్ కథలో వైవిధ్యం ,శైలిలో నిత్యనూతనము.
ప్రతీకథ మనసుపొరల్లో నిలిచిపోతుంది.మన జ్ఞాపకాల్లో జీవిస్తుంది.
*మీకు ఇల్లు కావాలా?ఆ పక్షులకు గూడు కావాలా?తేల్చుకోమని చెప్పిన కొడుకు మాటలకు ఆ తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ఏమిటి?ఆ తల్లిదండ్రుల త్యాగాన్ని చూసిన ఆ పక్షులు ఏం చేసాయి?
*యాభై సంవత్సరాలకు పైబడిన వాళ్ళు "బామ్మా లాలిపాట డాట్ కామ్ "కు కావలెను...పత్రికలో వచ్చిన ఆ ప్రకటన వెనుక వున్న ఆంతర్యం ఏమిటి ?ఇలాంటి డాట్ కామ్ లు ఉంటే...? వాంటెడ్ బామ్మ లాలిపాట డాట్ కామ్
*నగరంలో సంచలనం..మనుష్యుల నుంచి భరించలేను దుర్గంధం....అదీ కొందరిలోనే..ఎవరా కొందరు?ఎందుకా దుర్గంధం?
*మరణం సరిహద్దుల్లో వున్న మాధవరావు రాసిన వీలునామా..ఏమిటి?
కథల్లో పాత్రలు మన పక్కనే ఉన్నట్టు.గొప్పకథలు ,చదివించే కథలు,జీవితసత్యాలను ఆవిష్కరించే కథలు

నాయకత్వ లక్షణాలు కోరుకునే తెలుసుకోవాలని అనుకునే ప్రతీ ఒక్కరూ చదువవలిసిన పుస్తకం .
జనం మెచ్చిన నాయకుడు
జనం జేజేలు అందుకున్న అధినాయకుడు
జయహో కేసీఆర్

ఎంత బాగా రాసారో,ఎర్విక్ పాత్ర తర్జని పాత్ర మనసును హత్తుకుంటుంది.సస్పెన్స్ క్రైమ్ హార్ట్ టచింగ్ అన్నీ కలిసిన సింప్లీ సూపర్బ్ నవల డెత్ సెంటెన్స్.
నార్త్ అవెన్యూ తరువాత నాకు బాగా నచ్చిన మీ మరో నవల.ఇది.

పెద్ద హీరోల సినిమాకు కథలు లేవు అనే దర్శక నిర్మాతలు హీరోలు ఒక్కసారి నవలా ప్రపంచంలోకి తొంగిచూడాలి.కొత్తదనంతో నావెల్టీ అన్న పదానికి అర్థం చెప్పే కథలు అన్వేషిస్తే దొరుకుతాయి,.
ఏసీల్లో నాలుగుగోడల మధ్య ఇతర భాష చిత్రాల సీడీలు చూస్తే ఆత్మల్లేని దేహాలు , మృతదేహాలే దొరుకుతాయి.కానీ...
ఈ నవల చదివితే కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
క్యూ , మేన్ రోబో లాంటి నవలలు " ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ " లా ఉంటాయి.కుబేరాయనమః చదివితే ఇలాంటి సినిమాలు మన కొత్త హీరోలు ఎందుకు ట్రై చేయరు ? అనిపిస్తుంది.

"ఇది అమ్మాయిల కోణంలో...బాధిత మహిళల కోణంలో రాసిన నవల
హారిక జీవితాన్ని విషాదాంతం చేయడం ఇష్టం లేదు. అప్పటి ఆంధ్రభూమి మంత్లీ ఎడిటర్ సికరాజు (శ్రీ కనకాంబరరాజు) గారి సూచన మేరకు అలా రాసాను..ఒక విధంగా కథను విషాదాంతం చేయడం వల్ల సెక్షన్ 494...తీవ్రత పాఠకులకు సరిగ్గా రీచ్ అయ్యింది. హారిక పాత్రతో కనెక్ట్ అయ్యారు...అప్పటి ట్రెండ్‌కు ఆ విషాదాంతం సరైనదే...కానీ ఇప్పుడైతే మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్ లో మార్చాలని అనిపించినా ఆ ఫ్లేవర్..ఆ ఫీల్ ని మార్చడం ఇష్టం లేక యథాతథంగా అందిస్తున్నాను.
ఇప్పుడైతే ఓ థ్రిల్లర్ గా ప్లాన్ చేసేవాడిని.మరో విధంగా....ప్లాన్ చేసేవాడిని"
రచయిత మాటల్లోని నిజాయితీ,ఇందులోని కథలు మనస్సుతో చదివిస్తాయి.మస్తిష్కంతో ఆలోచించేలా చేస్తాయి.

కొన్ని కథలు ఎన్నో భావాలను ఆవిష్కరించింది.మరికొన్ని కవితలు మా మనసులను స్పృశించాయి.హాస్యం మానవతా నేపథ్యం కవిత్వం ఇలా ఎన్నో ఫీలింగ్స్ ను అక్షరాల్లో కూర్చి ఒక పుస్తక పుష్పగుచ్ఛంగా అందించినందుకు ధన్యవాదాలు .

ఆపిల్ సృష్టి రహస్యాన్ని అక్షరాలతో ఆవిష్కరించింది .రసరమ్యంగా దంపతుల శృంగారజీవితానికి అర్థాన్ని విడమర్చి అశ్లీలతకు తావులేకుండా చెప్పిన సరసమైన కథలు .
ఇ రొమాన్స్ కనువిప్పు కలిగిస్తూ, అద్భుతమైన విషయాన్నీ రోమాంచితంగా చెప్పిన కథ.
ఇలాంటి ఎన్నో బోల్డు కథలు బోల్డ్ గా చెప్పిన కథలు.

గ్రేట్..ఇలా మీరు మాత్రమే రాయగలరేమో....ప్రతీకథలో ప్రాణం పోసుకున్న ఎమోషన్స్ కనిపిస్తున్నాయి....
" చీకటి ముసుగేసాక ధాత్రిని రాత్రి చుట్టుముట్టాక మీ ప్రపంచంలో మీరూ ,మీ జీవితభాగస్వామి....పడగ్గది .మీ వ్యక్తిగత సామ్రాజ్యం.
ఆ సామ్రాజ్యంలో రాజు రాణి సైన్యమూ సర్వమూ సమస్తమూ మీరే.
ఫీలింగ్స్ ఎమోషన్స్ అనుభవాలు అనుభూతులు కలబోసిన కలర్ ఫుల్ రెయిన్ బో ...
ఆ ఇంధ్రధనుసులో ...
ప్రేమ ఇష్టం కోరిక స్పర్శ మాట అనుభవం అనుభూతి ..సప్తవర్ణాల ఇంధ్రధనుసులో చేరిన మరో వర్ణం రొమాంటిక్ ఫ్లేవర్ మీకు శుభరాత్రి చెబుతుంది.
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో...
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.
నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ ల,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి.
ఈ కథల్లోని కథానాయికలు మీరే..
ఈ కథల్లోని కథానాయకులూ మీరే..."

శుభరాత్రి చదువుతుంటే లైఫ్ పార్టనర్ కు ఇంత అద్భుతమైన గుడ్ నైట్ చెప్పొచ్చా అనిపిస్తుంది
ఓన్లీ ఫర్ యువర్ సేక్ ...కథ చదివితే ఇంత గొప్పగా ప్రేమించే భార్యకు ఇంత గొప్పని పెళ్లిరోజు కానుక ఇచ్చే భర్త ఉంటాడా అనిపిస్తుంది

జానపద నవలలు కనుమరుగయ్యాయని అనుకుంటున్న సమయంలో కినిగెలో జానపద నవలలు రావడం బావుంది.
" మాయాశిల్పం...మంత్రఖడ్గం " నవల చదువుతుంటే నాకళ్ళ ముందు రాజులు రాజ్యాలు అడవులు జలపాతాలు గంధర్వలోకం కనిపించాయి.చదివినంతసేపు కొత్త ప్రపంచంలో విహరించాం.
విజయార్కె గారూ మీ నుంచి మరిన్ని జానపద నవలలు రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
" పైసావసూల్. అండర్ వరల్డ్, మేన్ రోబో , క్యూ , సెక్షన్ 494 , టార్గెట్ 789 ... మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మరణశాసనం,జైలుగోడల మధ్య హీరో సుమన్ , ది లీడర్ , " ఇలా వేటికవే వైవిధ్యం .. మీ రచనాశైలికి నిలువెత్తు సంతకం.

కాలక్షేపం కోసం ఎన్నో పుస్తకాలు చదువుతాం." అసంతృప్తిని జయించండి " పుస్తకంలో జీవితం కనిపించింది.
అసంతృప్తులలో కూడా నిరర్థకమైన నిర్మాణాత్మక అసంతృప్తులు వుంటాయని ఈ పుస్తకజం చదివాక అర్థమైంది.సినిమా టికెట్ దొరక్కపోతే కలిగే అసంతృత్తికి ,సివిల్స్ లో ఓటమి ఎదురైతే కలిగే అసంతృత్తికి తేడా తెలిసింది.
నిర్మాణాత్మకమైన అసంతృప్తిని గుర్తించేలా చేసిన ఈ పుస్తకాన్ని ,రచయితకు కృతఙ్ఞతలు.
అసంతృత్తిని జయించాలని ( నిర్మాణాత్మక అసంతృప్తిని ) ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని నా నమ్మకం.

ఇంట్రెస్టింగ్
కారు సరాసరి కుబేరుడి లోకంలో ల్యాండ్ అయ్యింది సేఫ్ గా.
హాస్యం
కుబేరుడు చిద్విలాసంగా చూసి "వాట్ అబౌట్ మై వడ్డీ అండ్ అసలు" అని నిలదీసాడు.
సెటైర్
* *వెంటనె కృత్తిక "మీ టూ" అంది తనను కూడా ఆశీర్వదించమన్నట్టు కిందికి వంగి
"మీ టూ"అంటే కుబేరుడు అపార్థం చేసుకుని భయపడిపోతారు అన్నాడు లోగొంతుకతో కృత్తికతో
వావ్
* "మీలోకం కరెన్సీ కాదు..మా ఇండియా కరెన్సీ ...అదీ రద్దైన నోట్లు కాదు.. మోదీ గవర్నమెంట్ కొత్తగా అచ్చుగుద్దిన నోట్లు" చెప్పాడు వైభవ్
హహహ
* "ఇలా అడుగుతున్నందుకు క్షమించాలి. మీకు బిపి షుగర్ గట్రా ఉన్నాయా? అడిగాడు వైభవ్
" అనగా ..?” అడిగాడు కుబేరుడు
"మా లోకమునందు వుండు మాయరోగములు...జన్యుపరంగా, స్ట్రెస్ పరంగా వచ్చును" అన్నాడు వైభవ్
"మాకు శాపములు తప్ప రోగములు వుండవు.." చెప్పాడు కుబేరుడు
చదువుతున్నంతసేపూ నవ్వుకున్నాను ..ఆ తర్వాత నిజమే కదా అనుకున్నాను..ఇలా జరిగితే ఎంత బావుండు కదా..అని శ్రీనివాసుడ్ని కోరుకున్నాను...
జయహో కుబేరాయనమః
పైసా వసూల్ జిందాబాద్

క్యూ నవల చదవడం గొప్ప అనుభూతి.ఏలియన్ తో ప్రేమ,ఎమోషన్స్ ఆసక్తి కలిగించే సన్నివేశాలు....అన్నింటినీ సమపాళ్లలో అందించిన ఎంటర్టైనెర్...మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే టైం మిషన్ .

ఎప్పుడెప్పుడు " ఎప్పుడెప్పుడు చదవాలా...? " అన్నంత బావుంది. మీ నార్త్ అవెన్యూ కూడా చదివా...రెండు నవలలు ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వున్నాయి.

రంగస్థలం మీద నటించే హీరో జీవితంలో నటిస్తే...అమ్మాయిలు అబ్బాయిలు అమ్మలు బామ్మలు నాన్నలు అందరూ చదవవలిసిన నవల.చాలా ఆలస్యంగా చదివాను.అద్భుతమైన నవల...కొన్ని పాత్రలు మనల్ని వెన్నాడుతూనే ఉంటాయి.నా మనసును హత్తుకున్న నవల

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I read COROAASTALGIA Book written by Mr.Venkoo. It is very informative and interesting to read.
Whatever information we read in news papers from the beginning of the spread of corona is presented in this book blended with the author's bio-graphy.. Its a good book worth reading.

మీకు శతకోటి ధన్యవాదాలు, ఇంత మంచి పుస్తకాన్ని మాకు ఉచితంగా అందిచినందుకు. నిజంగా మీ సేకరణ, కూర్పు ప్రశంసనీయం. అంగ్ల రైమ్స్ చదువుతున్న మన తెలుగు ప్రజానీకం తప్పక పిల్లలకు నేర్పించవలిసిన గేయాలు అందిచిన మీమ్మలను ఎలా పొగిడినా తక్కువే.

T.Abhi says...

International relations pai telugulo upsc ki use ayevidanga books rayandi sir, I'm the one fan of you
Thank you sir
Mobile no 9966642966

Sir I want this book pls

Good one but not so great. Story is good, suspense is nicely implemented. Intelligent investigation/analysis by heroes, appreciated... Good time pass.

Plot can be improved and pages can be more. But with good suspense deserved 3/5.

Subscribe
Browse