Comment(s) ...

నవల చదవడం మొదలుపెట్టాక చివరివరకూ చదివిస్తూనే వుంది.గంధర్వలోకంలో విహరిస్తున్నట్టే వుంది.మండే ఎండల్లో మంచు కురిసినట్టు వుంది.క్రైమ్ హారర్ టీవీ సీరియల్స్ పగప్రతీకారాల ఎంటర్టైన్మెంట్ మధ్య ఎవర్ గ్రీన్ ప్లజంట్ ఫీలింగ్ కలిగించింది మాయాశిల్పం నవల..మేఘాలతో మాట్లాడడం ,మణిమేఘన అమాయకత్వం,అందమైన శృంగారం,అద్భుతమైన కథనం,కరోనా కాలంలో అన్నీ మరిచి ఇంట్లో ఒంటరిగా డాబా మీద కూచోని ఆకాశం వంక చంద్రునివంక ఈ నవల చదువుతూ ఉండడం గొప్ప ఫీల్. కలిగిస్తుంది.మీరూ ప్రయత్నించండి..ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో..అయినా కొత్త ఫీలింగ్ .

విజయార్కె నాలుగు రచనలు చక్కని కాలక్షేపం,అంతకు మించి ఆహ్లాదం,ఆలోచన కలిగించే పుస్తకాలు.మీ ఇష్టంలో పుస్తకంలో మనిషి జీవితం కనిపించింది.అండర్ వరల్డ్ ఒక మాఫియా థ్రిల్లర్ సినిమా చూపించింది.
పైసా వసూల్ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే హాస్యరసాన్ని అద్భుతంగా అందించింది.ముఖ్యంగా వైభవ్ కుబేరుడిని కారుతో సహా తనలోకానికి తీసుకువెళ్లే సీన్ కొత్తగా చాలా బావుంది.
టార్గెట్ నవల ఒక వెబ్ క్రైమ్ సిరీస్ చూస్తున్నట్టు వుంది.ఒకే పుస్తకంలో నాలుగు విభిన్నమైన రచనలు అందించిన కినిగెకు ధన్యవాదాలు.

రహస్యం కథ ఒక ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేస్తుంది.
*కొన్ని దశాబ్దాలకు పూర్వమే నిర్మించిన ఆ విల్లా రాజా స్వరణేంద్రభూపతి రాచరికానికి నిలువెత్తు సంతకం.
అలాంటి రాజవంశానికి సంబంధించిన రాజా స్వరణేంద్రభూపతి అనుమానాస్పదరీతిలో మరణించాడు. రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదనకు సరైన అన్వేషణలో వున్నారు పోలీసులు. అనుమానితులందరూ ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు...
...కొన్ని వేలకోట్ల ఆస్తులను నిక్షిప్తపర్చుకున్న ఆ విల్లా రహస్యం ఏమిటి?
అన్న వాక్యాలు కథను పాఠకులను రాజా స్వరణేంద్రభూపతి విల్లాకు చేరుస్తుంది.
డివోచి సర్పం గురించి చదువుతుంటే అడ్వెంచర్ థిల్లర్ కళ్ళముందు కనిపిస్తుంది.
ప్రతీ కథలో కొసమెరుపు ఉత్కంఠ ఆకట్టుకుంటుంది.

వినాయచవితి రోజు మనసారా నవ్వుకునే కథలు చదివే అవకాశం కలిగింది.నవ్వుదేవుడు నిజంగా ఉంటే బావుండు.అందరి పెదవుల మీద నవ్వుదేవుడు ఉండాలని కోరుకుంటూ,వినాయకచవితి శుభాకాంక్షలు.మనలోని ఒత్తిడిని దూరంచేసి డిప్రెషన్ ను తరిమేసే నవ్వుకథలకు నవ్వుదేవుడికి స్వాగతం పలుకుదాం.

నవల చదువుతున్నంత సేపు మనసును కట్టిపడేసిన నవల
నిద్ర పట్టడంలేదు ప్రవల్లికకు...ఈ రెండు మూడు రోజులుగా అనీజీగా వుంది.
ఎత్తులు, వాటికి పైఎత్తులు...రక్త పాతాలు ...ఎందుకో మనసంతా అనీజీగా వుంది.
ఎందుకీ రక్తపాతం? తన తండ్రి ఎం సాధించాలనుకుంటున్నాడు? ఓ మనిషికి సుఖంగా బ్రతకడానికి ఎం కావాలో, అవన్నీ తండ్రికి పుష్కలంగా వున్నాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వుంది.
కానీ ఇంకా ఈ కాంక్ష దేనికి?
ఎవర్ని ఉద్దరించాలని ఈ మారణహోమం?...మొదటిసారిగా ఎందుకో ఆమెలో వైరాగ్యం మెల్ల మెల్లగా చోటు చేసుకుంటున్నట్లనిపించింది.
డోర్ తీసి బయట కొచ్చింది....వరండాలో లైటు వెలుగుతోంది. కిందికి వచ్చి ఫ్రిజ్ లోని బాటిల్ తీసి నీళ్లు తాగింది. తండ్రి గాడి వేపు చూసింది. ఇంకా లైటు వెలుగుతోంది.
మెల్లగా అటువైపు అడుగులు వేసింది. లోపలనుండి మాటలు వినిపిస్తున్నాయి.
ఎక్కడ ప్రజలు అమయకత్వం ఊపిరి పోసుకుంటుందో అక్కడ అవకాశ వాదం విష సర్పం ఈ వ్యవస్థను విషపూరితం చేయడానికి సిద్ధమవుతున్నది.
ఇలాంటి అద్భుతమైన వాక్యాలు.జీవితసత్యాలు ,ఉత్కంఠ రేపే కథనం

ఈ కరోనా సమయంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఒత్తిడి నుంచి బయటకు రప్పించిన పుస్తకం.ఒత్తిడి ఎంత ప్రమాదకరమో ఆ ఒత్తిడిని నుంచి ఎలా బయటపడవచ్చో చెప్పే ఈ పుస్తకం చదవడం వసరం అన్నది నా ఉద్దేశం.ఇందులో కొన్ని వాక్యాలు నాకు .ప్రేరణ కలిగించాయి.
జీవితం చాలా విలువైనది.తాత్కాలికమైన బలహీనతకు ఒత్తిడికి లోను కాను..అని మొదటగా ప్రమాణం చేయండి .
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
డాన్సు పాటలు పద్డడం సంగీతం మంచి విషయాలు.వీటిలో శిక్షణ తీసుకుంటే మీ ఒత్తిడిని ఇచి దూరం చేస్తాయి.
యోగా వాళ్ళ ఒత్తిడి దూరం అవుతుంది
6నవ్వు వాళ్ళ ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.
ముఖ్యంగా మీలోని ఒత్తిడి దూరం అవుతుంది.
ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు మీలోని ఒత్తిడిని ఆత్మీయులతో షేర్ చేసుకోండి
మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అంశాలు ఒక డైరీలో రాసుకోండి.
వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవండి.ఒత్తిడికి సంబంధిన అంశాల గురించి తోటి వారితో చర్చించండి
ఇలాంటి చిన్నచిన్న విషయాలు మనకు పెద్ద రిలీఫ్

వ్యక్తిత్వవికాస లక్షణాలు వున్న అద్భుతపుస్తకం.ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు తిన్నా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో ఒక సుప్రసిద్ధ నటుడి జీవితమే ఒక ఉదాహరణ.ప్రతిచిన్న విషయానికి మరణమే శరణ్యం అనుకునేవాళ్లకు " జైలు గోడలమధ్య హీరో సుమన్" పుస్తకం...కనువిప్పు..ఒక ఉదాహరణ.
దాదాపు పాతికేళ్ళక్రింద ఆంధ్రభూమి వీక్లీలో సీరియల్ గా చదివిన ఈ పుస్తకం ఇప్పటికీ ఒక క్లాసిక్..ఒక అద్భుతమైన వ్యక్తిత్వవికాసం .

" గెలుపు ఓటమి " గెలుపునకు నిజమైన అర్థం చెప్పే పాఠ్యపుస్తకం.ఎక్కడో విదేశాల్లో వున్న వారిగురించి కాదు.మనచుట్టూ వున్న " గెలుపు సాధించిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అక్షరీకరించిన అద్భుతం ఈ పుస్తకం.
గిరిప్రకాష్ రెడ్డి వ్యక్తిత్వాన్ని పరిచయంచేయడం గొప్ప విషయం.,వారి జీవనశైలి ఆచరణీయం.
హీరో సుమన్ గురించి చదువుతుంటే మనం " కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలిసింది.
రామోజీరావు గారి గురించి చదువుతుంటే మనమూ ఏదైనా సాధించవచ్చు " అన్న ఉత్సాహం కలుగుతుంది.
ఆకాంక్ష వేణుమాధవ్ ఎదుగుదల ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది
మహేష్ భగవత్ గురించి చదువుతుంటే మనమూ ఐపీఎస్ అయితే బావుండు " అనిపిస్తుంది
ఒక చందమామ కథలా అద్భుత వ్యక్తిత్వ వికాస పుస్తకం...ప్రతీఒక్కరూ చదవాలి...జీవితంలో గెలుపు సాధించాలి.

నవ్వడం ఆషామాషీ కాదని పందెం వేసిన హీరోతో
"అయితే ఒకరోజంతా పాచిపోయిన పేస్ట్ లా కాకుండా కోల్గేట్ పేస్ట్ యాడ్ లా నవ్వి చూపించమంటూ.....సవాలు విసిరింది సుస్మిత...పందెం మొదలైంది..అతగాడికి నవ్వడం కూడా ఎంత కష్టమో తెలిసొచ్చింది..హౌ..ఎలా?
మనఃస్పూర్తజిగా నవ్వడం ఎంత కష్టమో నవ్విస్తూ చెప్పిన రాసిన ఈ కథ అప్పుడెప్పుడో ఈనాడులో చదివాను.ఇప్పుడు విజయార్కె గారి నవ్వు కథలు ఇలా " నరుడా ఏమి నీ కోరిక? అంటూ రావడం సంతోషంగా వుంది.
మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలు లేదా,ప్రాచీన చరిత్ర
తిరగేయాలి..అనే పరిస్థితి వస్తుంది." అన్నది నిజ్జం.

జానపద నవలలు చదివి ఎన్నాళ్లయింది.రాకుమారులు .
అద్భుతమైన ఆనాటి ఉద్యానవనాలు గంధర్వలోకం,మేఘాలు కదిలిరావడం,చండ్రుడు పక్కకు తప్పుకోవడం..
మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే అద్భుతమైన శైలితో మనసును కాలనీ వెనక్కి తిప్పింబ నవల "మాయాశిల్పం .మంత్రఖడ్గం "
థాంక్స్ టు కినిగె

కేసీఆర్ అభిమానులే కాదు ముందుతరం రాజకీయనాయకులకు ఒక సిలబస్ లాంటిది.
ఒక నాయకుడికి వుండవలిసిన లక్షణాలను విశ్లేషణాత్మకంగా వివరించిన తీరు బావుంది.
ప్రముఖరచయితగా జర్నలిస్ట్ గా విజయార్కెగారి శైలి పరిశీలనాత్మక కథనం విశ్లేషణ చాలా బావుంది.

మనం పిల్లల కోసం ఖరీదైన కానుకలు వయస్సుకు మించిన కానుకలు..నిరర్థకమైన కానుకలూ కొనిస్తాం.చిన్న వయస్సులోనే సెల్ ఫోన్,గట్రా...పిల్లల మెదడుకు పదును పెట్టి వ్యక్తిత్వాన్ని పెంపొందించే పుస్తకాలను చదివిస్తున్నామా? వారికి కానుకగా అందిస్తున్నామా ?
మీ పిల్లలకు ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో తెలుసా?
మీ పిల్లలకు టైం చూడ్డం వచ్చా?
మీ పిల్లలకు ఈత వచ్చా?
తెలుగునెలల గురించి తెలుసా?
పిన్ని బాబాయ్ అత్తమ్మ బామ్మా తాతయ్య మేనత్తలు మేనమామలు ఈ వరసలు తెలుసా?
మీ పిల్లలు పల్లెటూళ్ళు ఎలా వుంటాయో ఎప్పుడైనా చూసారా?
మీతోపాటు ఎప్పుడైనా కూరగాయల మార్కెట్ కు వచ్చారా ?
మీ పిల్లల్లో వున్న తెలివితేటలను ఎప్పుడైనా గుర్తించారా?
చదువు మినహా,ఇతర విషయాల్లో మీ పిల్లలను ప్రోత్సహించారా?
ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకపోతే ఈ పుస్తకాన్ని మీరు చదివి మీ పిల్లల చేత కూడా చదివించవచ్చు.

అనగనగా ధన్వి....
ధన్వి నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడు.వస్తూ డిజిటల్ వాచీ తెచ్చాడు.ధన్వి వాచీకి వున్న గుండులాంటి బటన్ తో ఆడుకుంటుంది.టైం పన్నెండు దాటగానే ఏఎమ్ అని వస్తుంది.మళ్ళీ మరో పన్నెండు గంటలు తిప్పగానే పిఎమ్ అని వస్తుంది.
అసలే తెలివైన పిల్ల..అందులోనే తెలియని విషయాన్నీ తెలుసుకోకపోతే ఊరుకునే రకం కాదు. వంటగదిలో పని చేసుకుంటున్న తల్లిని హాలులోకి లాక్కొచ్చింది.
"అమ్మా నాకో డౌట్ ?అంది సీరియస్ గా ధన్వి.
"చెప్పు బంగారుతల్లీ "కూతురు డౌట్స్ తెలివైనవే అని నమ్మకం.అందుకే ఏ మాత్రం విసుక్కోకుండా అడిగింది .
"ఈ వాచీకి మెదడు లేదు "అంది తండ్రి తెచ్చిన వాచీని తల్లి చేతిలో పెడుతూ
"ఎందుకని?అడిగింది నవ్వుతూ తల్లి.
ఎందుకంటే...
***
మా ఇంట్లో కూడా ఒక అల్లరి ధన్వి వుంది.ధన్విలాంటి చిన్నారులు వున్న ఇంట్లో ఈ పుస్తకం వుంది తీరవలిసిందే...చాలా ఉపయుక్తమైన పుస్తకం.థాంక్యూ విజయార్కె గారూ .

ఇది ఒక నాయకుడి సక్సెస్ స్టోరీ కాదు...ఎందరికో పనికివచ్చే ఒక వ్యక్తిత్వవికాసం.కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని సునిశితంగా విశ్లేషణచిన తీరు అభినందనీయం.
ముందుతరాలకు ఈ పుస్తకం ఒక సిలబస్.
ముఖ్యంగా రాజకీయనాయకులకు..నాయకత్వ లక్షణాలను తెలుసుకొని విజయాన్ని గమ్యాన్ని చేరుకోవాలని అనుకునేవారికి.

వావ్ ...ఢిఫరెంట్ సబ్జెక్టు ఢిఫరెంట్ అప్రోచ్ ..అద్భుతమైన శైలి...అప్పు తీసుకోమని కుబేరుడు వెంటపడడం...స్వయంగా శ్రీనివాసుడి ప్రామిసరీ నోటు రాయడం.నారదుడు సాక్షిగా ఉండడం..కుబేరాయనమః టీవీ ఛానెల్...కాల్ మనీ కాలనాగుల ప్రస్తావన ,కంటతడి పెట్టిస్తూనే మనసారా నవ్విస్తూ పాఠకులను కొత్తప్రప్రపంచంలోకి తీసుకువెళ్లే ఫాంటసీల మహాద్భుతం.
మా అభిమానరచయిత సృష్టించిన మరో అద్భుతం "పైసా వసూల్ @కుబేరాయనమః "

మంచిపుస్తకాలు,మనసును హత్తుకునే పుస్తకాలు అరుదుగా వస్తాయి.ఈ పుస్తకంలో రచయిత జీవితం వుంది.వ్యక్తిత్వవికాసం అంటే ఏమిటో విడమర్చి చెప్పే అర్థం వుంది.మన జీవితాన్ని అద్దంలో చూపించిన పుస్తకం " మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి "
ఆపుస్తకంలో ఈ ప్రారంభం మన జీవితానికి అన్వయించుకుంటే అద్భుతంగా జీవించడం ఎలాగో అర్థం అవుతుంది.

మేన్ రోబో పబ్లికేషన్స్ నవలలు విభిన్నంగా ఉంటాయి.వైవిధ్యమైన సబ్జక్ట్స్...కొంగుచాటు ప్రేమ లో ఆ ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది.పేస్ బుక్ స్వయంవరం..కొంగు గోపాల్ ప్రేమాయణం..ప్రేమ ఆరిందాతనం...బామ్మల అల్లరి వావ్....జంధ్యాల గారి సినిమా చూస్తున్నంత ఆహ్లాదంగా వుంది.ఇలకంటి మంచి నవలలు అందిస్తున్న కినిగెకు,మంచి ఫీల్ వున్న నవల రాసిన రచయిత్రి తేజారాణి తిరునగరికి ,మేన్ రోబో పబ్లికేషన్స్ కు థాంక్స్

కథల్లో జీవితాలను ప్రదర్శించడం అద్భుతమైన సాహితీ ప్రక్రియ.ఎలాంటి సబ్జెక్టు అయినా అటెంప్ట్ చేయగల విజయార్కె గారి " మనిషే దేవుడయ్యాడు కానీ " నిజంగా కంచిలో కూడా కనిపించని కథలే.
కొడుకుల యవ్వనాన్ని స్వీకరించి వారికీ ( కొడుకులకు ) వృద్ధాప్యాన్ని ఇవ్వాలన్న కోరిక వెనుక కన్నీటితడి కథ చదివితేనే అర్థం అవుతుంది.
అప్పుడప్పుడు ఇలాంటి కథలు చదవాలి.మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవాలి.

గొప్ప ఫీల్ వున్న నవల. " ఇగో " లతో లైఫ్ ను మిస్ లీడ్ చేసుకునేవాళ్లకు కనువిప్పు కలిగించే నవల.భార్యాభర్తలు ఇంత లవ్లీ గా వుంటారా..? చాలా బావున్న నవల శ్రీ

Oh my God ,,,.ఫీలింగ్స్ ఎమోషన్స్ అనుభవాలు అనుభూతులు కలబోసిన కలర్ ఫుల్ రెయిన్ బో ...
ఆ ఇంధ్రధనుసులో ...
ప్రేమ ఇష్టం కోరిక స్పర్శ మాట అనుభవం అనుభూతి ..సప్తవర్ణాల ఇంధ్రధనుసులో చేరిన మరో వర్ణం రొమాంటిక్ ఫ్లేవర్ మీకు శుభరాత్రి చెబుతుంది.
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో...
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.
నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
ఎవరు రాయగలరు ..?ఇంత అద్భుతంగా..మార్వలెస్ ...రొమాన్స్ ను ఇంత అందంగా భావుకత్వంతో కిలికించితాల స్వరాల అక్షరాలు రాయగలరు...హ్యాట్సాఫ్

కులాల మధ్య మతాల మధ్య ప్రేమ కథలు సినిమాలు కామన్..కానీ గ్రహాంతరవాసి ప్రేమ కొత్తదనం ..అంతకు మించి అంతర్లీనంగా సందేశం.హ్యూమన్ ఎమోషన్స్ ను ముఖ్యంగా కన్నీళ్లను ఇండియన్ సెంటిమెంట్స్ గొప్పతనాన్ని ...ఎవరు సృష్టించగలరు ?
గ్రహాంతరవాసుల అన్వేషణ..సిద్ధార్థను ప్రేమించి ( క్యూ గ్రహం ఆదేశం మేరకు )అతని ద్వారా గర్భం ధరించి అతడినే చంపాలనుకున్న ప్రహేళికలో సెంటిమెంట్స్ రావడం..ఆమె కనిపించకుండా అదృశ్యం అవ్వడం..ఆమెను అన్వేషిస్తూ సిద్దార్థ వెళ్లడం...ఇలా ప్రతీ సన్నివేశం మనసును పట్టి కుదిపేస్తోంది.
తెలుగులో ఇలాంటి నవల దాదాపు పదిహేనేళ్ల క్రితమే రాయడం గొప్ప విషయం.రెండుసార్లు ఏకబిగిన చదివిన నవల.క్యూ...న మనసును హత్తుకున్న థ్రిల్లర్...

చాలా అద్భుతమైన నవల..ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.అముక్త సాకేత్ పాత్రల్లో నవ్యత వుంది.సాకేత్ పాత్రలో ధీరోదాత్తత ఉట్టిపడుతుంది.స్వామీజీ పాత్ర ఇప్పటి దొంగబాబాల స్వామీజీల వికృతరూపాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. డాలర్ విలువ బంగారం విలువతోపాటు ఒక మేథావి సంపాదించిన డిగ్రీల విలువ ప్రకటించాలన్న నిష్టుర నిజాలు ఆలోచింపజేస్తాయి.
సత్యవర్ధన్ ఉరికొయ్యకు వేలాడుతూ మాట్లాడిన చివరిమాటలు మన సమాజాన్ని ప్రశ్నిస్తాయి.దాదాపు పాతికేళ్ల క్రితమే ఆంధ్రభూమి వీక్లీలో చదివిన నవల ఇది.

మనసును శరీరాన్ని ఒకేసారి స్పందింపజేసే " క్యాండిల్ లైట్ శోభనం " దాంపత్యజీవితంలోని మధురిమలు కొత్త అర్థాన్ని చెప్పింది.సెక్స్ అంటే కేవలం రెండు శరీరాల రాపిడి మాత్రమే కాదని ఎమోషన్స్ తో రిలాక్స్ అయ్యే బెస్ట్ ఎక్సర్సైజ్ అని సరికొత్తగా చెప్పింది.
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న రొమాంటిక్ క "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
ఇవి కథలు కాదు..మనసును మత్తెక్కించి దంపతుల ఊహలకు రెక్కలు తొడిగే కథనాలు..

Don't miss!
Free goodies!
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

How can we download purchased book

I tried to read your book online but couldn't succeed madam. Please send link or soft copy to my WhatsApp madam.

Rangachari, Hyderabad

Where is the buy option on all the books ?

Writing style should be In past tense. But this author is writing in future tense.

Subscribe
Browse