Comment(s) ...

ఒక్కో వాక్యం చదువుతుంటే పాఠకులు గంధర్వలోకం వెళ్ళిపోతారు.మణిమేఘన కళ్ళముందు కనిపిస్తుంది.
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
*ఉద్యానవనంలో ఎవరో ప్రవేశించినట్టు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది.
కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడుతాయి. ...అయినా ఏమిటీ వైపరీత్యం
*అప్పుడే వెన్నెల భూమ్మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చిన వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద ప్రసరించింది. మరుక్షణం పెద్ద వెలుగు.... మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నంచింది మణిమేఘనగా మారిన మాయాశిల్పం
ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన జానపద నవల." మాయాశిల్పం-మంత్రఖడ్గం "

జైలు గోడలమధ్య హేవ్ సుమన్ పుస్తకం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు.డిప్రెషన్ ,చిన్న విషయాలకే కృంగిపోవడం,సమస్యలకు భయపడి ఆత్మహత్యకు పాల్పడడం లాంటి అనర్థాల నుంచి బయటకు తీసుకువస్తుంది ఈ పుస్తకం.స్టార్ స్టేటస్ అనుభవించి కూడా అకారణంగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లి నిర్దోషిగా నిరూపించుకుని బయటకు వచ్చిన వైనం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది.
ముఖ్యంగా జైలులో సుమన్ గడిపిన జీవితం చదువుతుంటే మనస్సు బాధగా ఉంటుంది.అదే సమయంలో సుమన్ చూపిన గుండె నిబ్బరానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
ఇది ఒక వ్యక్తిత్వవికాస రచనగా చదువుతగ్గ పుస్తకం.
ఎక్కడా బోర్ లేకుండా ఒక కథలా చెప్పిన విధానం బావుంది.

సూపర్ నవల.ఎమోషన్స్ క్రైమ్ ఉత్కంఠ అన్నీ కలగలిసిన ఎంటర్టైన్మెంట్ .లాక్ డౌన్ లో రిలాక్సేషన్.
నా పేరు ముగ్ద...కోనసీమ ఒడిలో పెరిగిన నేను తెల్లవారకముందే కోయిల కూజితంతో నిద్ర లేస్తాను...
ఇంటి ముందు ముగ్గుతో సూర్యుడి లేలేత కిరణాలను ఆహ్వానిస్తాను...
అమ్మ నేర్పించిన ఇంటి పని...
నాన్న వినిపించే భగవద్గీత...
తమ్ముడితో కలిసి జామచెట్టెక్కి చిలుక కొరికిన జామకాయలు కోసుకోవడం... ఇదే నా
ప్రపంచం...
నేనో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ని అన్నారు...
ఇంటర్‌పోల్ నా గురించి వెతుకుతుందిట... రెడ్ కార్నర్ నోటిస్ ఉందిట...
ముగ్ధ (మామూలు అమ్మాయి)
నా పేరు మోహన...
ఐ హేవ్ నో సెంటిమెంట్స్...
బ్లడ్ అన్నా, బ్లడీ మనీ అన్నా నాకిష్టం...
నా రివాల్వర్ మేగజైన్‌లో బుల్లెట్స్... నా చూపుల్లోని మిస్సయిల్స్ ఎప్పుడూ శత్రువులని టార్గెట్ చేస్తూనే ఉంటాయి.
"ది మోస్ట్ డేంజేరేస్ లేడీ" గా పేరున్న నన్ను "ఢిల్లీ ఎయిర్ పోర్ట్"లో నిలదీసిన ఒకే ఒక మగాడు...
అతన్ని ఇప్పుడు టార్గెట్ చేసాను...
నా మైండ్ గేమ్ పవర్ ఏంటో చూపిస్తాను...
అన్నట్టు మీకు ముగ్ధ అనే అమ్మాయి గురించి తెలుసా?
మోహన (అంతర్జాతీయ నేరస్తురాలు)
నవల చివరిపేజీ వరకూ విడవకుండా చదివించే కథనం.

నాకు నచ్చిన కథలు.
ఈ ధాత్రిలో ప్రతీ రాత్రి మీదే ..ప్రతీ పగలు ప్రతీ క్షణం..ఒకరి సమక్షంలో మరొకరు సేద తీరండి..కలయిక శయ్యపై విశ్రమించండి.
ప్రతీ రాత్రి శోభనరాత్రి కావాలి ...
ఎప్పటికప్పుడు కొత్తగా,కొంగ్రొత్తగా మీ రొమాంటిక్ మెనూ ను మార్చుకోండి.కొత్త ఇష్టాలు సరికొత్త ఊహలు..ఆలోచనలు..కబుర్లు...మీ ఏకాంతంలో నేపథ్యసంగీతం కావాలి.
*ఆ దంపతులకు శోభనం రాత్రి
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం... క్యాండిల్ వెలుతురులో ..".అతను చెప్పడం మొదలుపెట్టాడు
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.ఇంతకూ ఆ పందెం ఏమిటంటే ..?
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది కథేమిటి?
ఈ కథలు దాంపత్య జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపే మధోరోహలు

ఈ కథలను దంపతులు చదివి తీరవలిసిందే..ఎందుకంటే ఇవి అందమైన కిలికించితాలు,
*ఆ దంపతులకు శోభనం రాత్రి
"ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం...
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి "హనీ "
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది...
భావోద్వేగాలను కలిగించే రసరమ్య సరసమైన కథలు

రెండురకాల అసంతృప్తులు వుంటాయని,నిర్మాణాత్మక నిరర్థక అసంతృప్తుల గురించి వివరించిన తీరు బావుంది,
బిన్‌లాడెన్‌లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రైట్ సోదరులు, గ్రాహంబెల్, ఐన్‌స్టీన్... చరిత్రలో విజయాన్ని సాధించిన ప్రతీ ఒక్కరూ నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించినవారే.
ఓటమిని విశ్లేషించుకోవడం, నిజమైన అసంతృప్తి తెలుసుకోవడం..
నిరర్ధకమైన అసంతృప్తిని వదిలి, నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించడమే నిజమైన గెలుపు.
విలువైన జీవిత సత్యాలు

కుబేరుడుడి అప్పు ఇవ్వడం అనే కాన్సెప్ట్ అదుర్స్...కుబేరుడు పైసా వసూల్ ఎలా చేసాడన్నది..ఎలా చేయాలో వైభవ్ చెప్పడం అన్నది..పూచీకత్తుగా శ్రీనివాసుడు సాక్షిగా నారదుడు..స్వామివారి సత్రం..కాల్ మనీ కాళీ వ్యవహారం..హాస్యం ఆర్థ్రత ఆలోచన గ్రేట్ ఫాంటసీ...డిఫరెంట్ థ్రిల్లర్ ...
కృత్తిక పాత్ర చాలా బావుంది.ముఖ్యంగా దేవుడిని నమ్మని వైభవ్ కు దేవుడే పూచీకత్తుదారుడు.ఏడుకొండలవాడ వేంకటరమణా..శ్రీనివాసా..నీ లీలలు అమోఘం .

" కడుపుబ్బా నవ్వుకున్నాం " అనే మాటలకు అర్థం తెలిసింది.చదువుతున్నంతసేపూ నవ్వుకుంటూనే వున్నాం.కొత్త కాన్సెప్ట్ ...ముఖ్యంగా బామ్మ ఇంట్లో బార్ ఓపెన్ చేసిన తీరు...అదరహో ...మైండ్ గేమ్ లో ఫన్నీ మూమెంట్స్...చికాగ్గా వున్నప్పుడు ఈ నవల చదివితే చికాకులు బాధలు హాంఫట్ ..జంధ్యాల గారి సినిమా చూస్తున్నట్టు వుంది,

superb ...రెండు గ్రహాలను కలిపే ప్రేమ కథ...కొత్తగా వున్న సైన్స్ థ్రిల్లర్...ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఎవరూ కనిపెట్టలేరన్న థాట్ గ్రేట్. ఆమె కనబడుట లేదు లో ఆసక్తి...క్యూ గ్రహం గురించి తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్...అన్నింటినీ కలిపి అందించిన నవల క్యూ...

ఆలోచన రేకెత్తిస్తూ యువతలో శక్తిని నింపి వ్యవస్థను నిలదీస్తూ ప్రతీఒక్కరినీ ఆలోచింపజేసే నవల.

" జీవితం అంటే ఏమిటో .." అసలైన అర్థాన్ని చెబుతూ " మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి " పుస్తకాన్ని ఇప్పటివరకూ చదవలేకపోవడం అంటే నేను జీవితంలో ఎన్ని ఎమోషన్స్ ను మిస్ చేసుకున్నానో అర్థమైంది.ఇది నిజం...
ఈ వాక్యాలు సాక్షిగా...
"నువ్వు మరో ఇరవైనాలుగు గంటల్లోగా చనిపోతావని" దేవుడు చెప్పాడు.
ఆ క్షణం నుంచి అతనిలో అంతర్ఘర్షణ మొదలైంది.ఇప్పటివరకు తాను ఎవరిని బాధపెట్టాడో,ఎవరికీ తను అపకారం చేసాడో వారిని ఆఘమేఘాల మీద పిలిపించాడు.చాలాకాలం తర్వాత భార్యతో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్ళాడు.కలిసి టిఫిన్ చేసాడు.చాలాకాలం తర్వాత భార్యను దగ్గరికి తీసుకున్నాడు ఆ రాత్రి.అప్పుడు భార్య కళ్ళలో కనిపించిన కన్నీటి మెరుపును చూసాడు.
తన గడువుకు కొద్ది క్షణాల ముందు అతను దేవుడిని వేడుకున్నాడు...
"నా తప్పులు సరిదిద్దుకోవడానికి నన్నునేను అర్థం చేసుకోవడానికి మరికొంత ఆయుష్షును ఇవ్వమని...
కానీ అప్పటికే ....
ఇప్పటికైనా చదివాను.మీరు చదివిచూడండి...ప్రివ్యూ చదివాకా అయినా....

తల్లిదండ్రులను నిరాదరించే పిల్లలు ..పిల్లలను అమితంగా ప్రేమించే తల్లిదండ్రులు...వృద్ధాప్యాన్ని ప్రశ్నగా భావించేవాళ్లు...ప్రతీఒక్కరూ చదవవలిసిన నవల నిర్ణయం.ముఖ్యంగా జానకమ్మ వాసంతి పాత్రలు ప్రతీ ఇంట్లో ఉండాలి.

చాలా విలువైన పుస్తకం.సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ క్యాన్సర్ బారిన పడుతున్నారు.క్యాన్సర్ కు సంబంధిన విషయాలు మనల్ని ఆపమత్తులను చేస్తాయి.వ్యశక్తివవికాసాన్ని కూడా జోడించి క్యాన్సర్ ను ఎలా జయించాలో చెప్పడం ముదావహం.వైద్యనిపుణుడితో ( డాక్టర్ మోహనవంశీతో ) అందించిన క్యాన్సర్ సమాచారం ప్రతీఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుంది.కేన్సర్ నుంచి దూరంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదవాలి. డాక్టర్ మోహనవంశీకి,విజయార్కె గారికి అభినందనలు ..ఇలాంటి ప్రయోగాత్మక పుస్తకాన్ని హెల్త్ అవేర్ నెస్ గా అందించినందుకు ధన్యవాదాలు .

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Sir where can I find ఆకుపచ్చ అంటుకుంది as an e book.
Thank you
Kiran Vibhavari

చాలా బాగుంది సార్....

Please send names of latest books

మహాద్భుతం

మనసును పట్టికుదిపేసే అద్భుతమైన నవల.నిరుద్యోగ యువత ఆవేదనకు అక్షరరూపం.దొంగ స్వామీజీల వికృతరూపాన్ని కళ్ళకు కట్టిన నవల.ఆముక్తమాల్యద పాత్ర ది బెస్ట్.అమాయకత్వం,ఉక్రోషం,భావుకత్వం,కలగలిసిన పాత్ర.బామ్మ పాత్ర కొత్తదనానికి నాంది.కథానాయకుడి పోరాటం,స్నేహితుడు ఉరికొయ్యకు వేలాడే సందర్భంలో వచ్చిన సన్నివేశాలు ఉత్కంఠకు ప్రాణం పోస్తాయి.
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో

Subscribe
Browse