
నాకు పుస్తకాలు చదివే అలవాటు అస్సలు లేదు. ఎక్కడో నెట్ లో ఒక చోట రామ్ అనే అతను బుక్ చాలా బాగా రాశాడు అని చదివాను. ఏదో తెలియని ఆసక్తి ఆ పుస్తకాని చదవాలి అనిపించిపించి, ఆ పుస్తకాని డౌన్లోడ్ చేసుకొని చదివాను. బాగుంది అనడం కంటే మనసుకు హతుకుంది. ఇది బహుశా రామ్ గారి ఊహ అయివుండవచ్చు, ఈ పుస్తకం లోని పాత్రలు మన చుట్టు వుండే(ముఖ్యంగా ఇంజనీరింగ్ మరియు ఐటీ ఉద్యోగులలు) చాలా దగ్గరగా వున్నాయి. అతను సనివేశాన్ని మలిచిన తీరు చాలా బాగా ఆకట్టుకుంది. చివరగా విడిపోవాలనుకునే ప్రేమ జంటలలు కానీ ఈ బుక్ ను చదివితే కచ్చితంగా వాళ్ళు మల్లీ ఒకటయి తీరుతారు. ఒక్క మంచి ప్రేమ కథ రామ్@శృతి .కామ్. మరిన్ని నవలలు ఆశిస్తున్నాను