
Here is second part http://kinige.com/book/Marakata Manjusha 2
కినిగె బృందానికి నమస్కారం. "ఇంగ్లీషు కీకారణ్యంలోకి" చాలా ఉపయోగకరమైన పుస్తకం. మేము ఎన్నో పుస్తకాలు కొని రిషీవ్యాలీ చుట్టుప్రక్కల పల్లె పిల్లలకు బహుమతిగా ఇచ్చాము. ఇంకా ఇస్తున్నాము. గవర్నమెంట్ హైస్కూళ్ళ పిల్లలకి ప్రతి ఒక్కరికీ ఉచితంగా ప్రభుత్వం అందివ్వవలసిన పుస్తకం.
ధన్యవాదాలు
రాధ
The book is too good. Highly recommended for all ages!
Contemporary, witty, lucid translation, informative and those images, too good!!
News article about authors efforts http://www.newindianexpress.com/cities/hyderabad/Stories-From-a-Mother/2014/04/05/article2150146.ece1
డబ్బు సంపాదన మీద ఇదివరకే మార్కెట్ లోకి వచ్చిన పుస్తకాల కంటే ఇది భిన్నమయినది. బహుశా రచయితకు ఈ సబ్జెక్ట్ మీదున్న తీవ్రమైన తపన వల్లే కొత్త కోణాలను ఆవిష్కరించగలిగారు. ''అగ్గిపెట్టెకీ డబ్బుల్లేని బంజర్ దారు మనవడిగా, గుడిసె కూడా కట్టుకోలేని ఎమ్మెల్యే (వంగా సుబ్బారావు) గారి అబ్బాయిగా మొదలయిన బాల్యం - కసి-కోపం-నిజాయితీగా కూడా కోటీశ్వరులు కావచ్చన్న విశ్వాసం -ఆశ, ఆర్ధిక అన్వేషణే ఆర్ధిక సలహాలను పంచుకునే స్థితికి తీసికెళ్ళింది'' అని ఆయన చెప్పిన అనుభవం ఇందుకు నిదర్శనం. ఆర్ధిక సరళీకృత విధానాలు అమలయ్యాక .. కొత్త కొత్త ఆర్ధిక సంస్థలు, పొదుపు, మదుపు, బీమా, మ్యూచువల్ ఫండ్స్, ఈ టి ఎఫ్ తదితర పధకాలు, బ్యాంకింగ్ విధానాలు, రుణ సదుపాయాలు, రియల్ ఎస్టేట్ తీరుతెన్నుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వీటిలోని సంక్లిష్టతను అర్ధం చేసుకోవడం సామాన్యులకు కష్టంగా మారింది.ఆర్ధిక సాహిత్యాన్ని అరటిపండు ఒలిచి పెట్టినట్లు.. ప్రతి అంశాన్ని సాధికారికంగా వివరించారు వంగా రాజేంద్ర ప్రసాద్. చిట్ ఫండ్స్ లాభమా? నష్టమా? వంద రూపాయలతో పదివేల కోట్లు.. ఎలా? మంచి పాలసీలు ఎలా తీసుకోవాలి?, జీవిత బీమా ఎంత ఉండాలి?నేలను నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడా? వంటి కథనాలు చదివితే, మంచి నిర్ణయాలే తీసుకోగలుగుతాము. - ఆంద్ర జ్యోతి 23 మార్చి 2014.
లక్ష్మీ కటాక్షం.
'జీవితం 20-40-20 మాచ్ లాంటిది. ఇరవై ఏళ్ళు తల్లిదండ్రుల మీదా, నలభై ఏళ్ళు సొంత సంపాదన మీదా, చివరి ఇరవై ఏళ్ళూ 40 ఏళ్ళ సంపాదన మీదా ఆధారపడతాం. నలభై ఏళ్లలో మన సంపాదన - సంపద గా మారాలి. చివరి ఇరవై ఏళ్లలో శ్రమలేని ఆదాయాన్నిచ్చే సంపదగా మారాలి' అన్నది మనీ పర్స్-2 రచయిత వంగా రాజేంద్ర ప్రసాద్ ఆర్ధిక హితబోధ. ఆ దిశగా ఉపకరించే అనేకానేక చిట్కాలనీ, సలహాలని, సూచనల్నీ ఈ పుస్తకంలో వివరించారు. గృహ రుణాలు, బీమా పాలసీలు, పోస్టాఫీస్ పధకాలు, బంగారం,స్టాక్ మార్కెట్ వగైరా వగైరా పొదుపు-మదుపు మార్గాల మంచి చెడులను హృదయానికి హత్తుకునేలా వివరించారు. ముక్తాయింపుగా 'సంతృప్తే సంపద' అనీ గుర్తు చేశారు. తొలి జీతం అందుకున్న వారే కాదు ...మలి వయసులోనూ ఆర్ధికంగా తడబడుతున్న వారు కూడా చదవాల్సిన పుస్తకం. -ఈనాడు, ఆదివారం 16 మార్చి 2014
ఈ పుస్తకం గురించి వివిధ పత్రికలలో వచ్చిన రివ్యూలు చదవడానికి ఇక్కడ నొక్కండి. http://omprakashpublications.blogspot.in/2014/01/reviews-on-manasu-tadi-aaraneeku-book.html
Narayana Swamy
కినిగె స్మార్ట్ స్టోరీ పోటీ కథలు చదివేరా? మొదటి బహుమతి పొందిన సతీష్ పొలిశెట్టి కథ చాలా బావుంది. మిగతా కథలు కూడా ఇప్పుడు పత్రికల్లో వస్తున్న సగటు కథలకంటే ఓ మెట్టు పైనే ఉన్నై.
ఈ పుస్తకం రివ్యూ కినిగె పత్రికలో ఇక్కడ
రచయిత మధురాంతకం నరేంద్ర ఇంటర్వ్యూ కినిగె పత్రికలో ఇక్కడ
ఈ పుస్తకం రివ్యూ కినిగె పత్రికలో ఇక్కడ
ఈ పుస్తకం గురించి కినిగె పత్రికపై ఒక అభిప్రాయం.
@Raghavendra,
ఆనందో బ్రహ్మ చదివారా?
ప్రియమైన ఖదీర్ బాబు,
వైజాక్ నుండి వస్తూ ఇప్పుడే మీ పుస్తకం చదివాను. బియాండ్ కాఫీ. రెండు తప్ప అన్ని కథలూ మైండ్ బ్లోయింగ్. నాకు తెలిసినంతవరకూ ఆత్మ ఒంటరితనాన్ని కెలెడోస్కోపులో చూపిన తొలి రచయితవు నువ్వే.
మచ్చ సింబాలిక్ గా అప్పీలింగ్ గా ఉంది.
‘టాక్ టైమ్’ లేడీస్ కొత్త కాదు. ఫోనులో ఇబ్బంది పెడుతున్న వారిపై నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ కేసులు కోర్టులో పెండిగులో ఉన్నాయి. నీ కథలు చదువుతున్నప్పుడు మెటాఫిజికల్ శూన్యం పై వ్రాసిన శామ్యూల్ బాకెట్ మరియు అతని డ్రామా వెయిటింగ్ ఫర్ గోడోట్ మదిలో మెదిలాయి. ఇంకా నేను వ్రాసిన ఆనందో బ్రహ్మ నీ వహీద్ కథ చదువుతున్నప్పుడు గుర్తు వచ్చింది. యూ హేవ్ డన్ ఏ గ్రేట్ జాబ్.
అభినందనలు.
యండమూరి.
భలే కథ. సైన్స్ ఫిక్సన్ అభిమానులు వేగంగా సరదాగా చదువుకోవచ్చు. ముగ్గురు శాస్త్రవేత్తలు, మనుష్యులను పూర్తిగా మార్చేద్దామని పంతం కట్టుకున్నోళ్లు. ఒక జీనియస్, అతని కూతురు, ఒక అపరాధపరిశోధకుడు కావల్సినంత సస్పెన్స్, థ్రిల్లింగ్, చంద్రుడిపై పోరాటాలు. కమ్యునిస్టు అమెరికా, కాపిటలిస్ట్ చైనాల కోల్డ్ వార్! ఒక్క మాటలో మాంచి సరదా అయిన సైన్స్ ఫిక్సన్ నవల.
మంచి పుస్తకం.
@skolachi
Use WinRAR.
నిఘంటు నిర్మాణం కష్టతరం. అనుభవం ఉండాలి. ఓర్పు ఉండాలి. ఇతరులు రాసిన రాతలతోటీ, చేసిన ప్రయోగాల తోటీ పరిచయం ఉండాలి. కాని ఎవ్వరో ఒకరు ప్రయత్నం చెయ్యక పోతే ఎలా? అందుకని ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను. నాకు చేతనయినంత మేరకి ఇందులో దొరికిన కొన్ని కొత్త మాటలని వాడి చూస్తాను. ఈ ప్రయోగం పలుకుతుందో లేదో ప్రజలే నిర్ణయించాలి. పుస్తకం తయారీ బాగుంది. చదవడానికి తేలికగా ఉంది. ఇలాంటి ప్రయత్నాలని మనమే ప్రోత్సహించాలి.
- వేమూరి వేంకటేశ్వరరావు
http://lolakam.blogspot.in/2013/07/blog-post.html