Comment(s) ...

శారదా శ్రీనివాసన్ గారిని సెక్సీ అని పిలవడం కొంతమందికి నచ్చకపోవచ్చు... కానీ చలం 'ఊర్వశి'ని సెక్సీ అనకుండా వుండగలనా? చిన్నప్పుడు ఆమె మధురమయిన కంఠం వింటూ పెరిగాను. కుర్రాడినయ్యాక నేనో పురూరవుడిని అయిపోయి ఆమెలో ఓ ఊర్వశిని విన్నాను. నా గాత్ర సుందరి ఎలా వుంటుందా గాత్రం వున్నంత మధురంగా మనిషి వుంటుందా లేదా అనే అనుమానంతో ఇన్ని ఏళ్ళూ గడిపాను. ఇన్నాళ్లకి, ఇన్నేళ్ళకి ఆమె ఫోటో చూసే అవకాశం కలిగింది. ఇప్పటి ఫోటోలే కాదు ఊర్వశి కాలం నాటి ఫోటోలు చూసే అవకాశం కలిగింది. శారద గారు ఎంత అందంగా వున్నారు! నా స్వప్నం చిరిగిపోలేదు. గాత్రం ఎంతో బావున్నా మనిషి బాగోకపోతే నాకు జీర్ణించుకోవడం కష్టమయ్యేదే.

నా చిన్నప్పుడు ఇప్పటిలా టివిలు, FM లు లేనందున ఆకాశవాణి మీదే ఆధారపడేవారం. అందులోని ఆర్టిస్టులే మాకు సెలబ్రెటీలు. ఒక్కొక్కరి వాచకం, స్వరం ఎంత బావుండేదని. వార్తలు, వ్యాఖ్యానాలూ ఆడా, మగా ఎవరు చదివినా వారి గాత్ర సౌందర్యాన్ని లేదా గాత్ర గాంభీర్యాన్ని రసాస్వాదన చేస్తూ మైమరచిపోయేవాడిని. ఇన్నాళ్ళకు శారదా శ్రీనివాసన్ గారి నా రేడియొ అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకం ద్వారా అప్పటి ఆకాశవాణి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. వారి ముచ్చట్లు చదువుతుంటే సమయమే తెలియలేదు. అందులో వారి ఫోటోలు కూడా వున్నాయి. అలా చూసానన్నమాట నా కలల స్వర సుందరిని. ఎన్నాళ్ళుగా వేచివిన్నా నా ఊర్వశి ఫోటో కోసం! వారు పుస్తకం వ్రాసేరని తెలిసి ఇండియా వెళ్ళినప్పుడు తప్పక కొనుక్కోవాలనుకున్నా. ఈలోగా కినిగే సైటులో లభ్యం అవడంతో అక్కడ తీసుకొని చదివేసాను.

ఆమె స్వరం ఎంత బావుంటుందని, ఎంత తియ్యగా వుంటుందనీ. రేడియో నాటకంలోనీ ఏ పాత్ర అయినా ఎంత బాగా వేస్తుందనీ. ఆ రోజుల్లో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చే ఓ గంట నాటకం కోసం అన్ని పనులూ మానుకొని ఎదురుచూసేవారం. అలా ఆమె హీరోయినుగా వేసిన ఎన్ని నాటకాలు విన్నానో. అవన్నీ గుర్తుకులేవు కానీ రచయిత చలం నవల ఉరూరవలో ఆమె వేసిన ఊర్వశి పాత్ర బాగా గుర్తుండిపోయింది. ఆ నాటకంలో రెండే రెండు పాత్రలు. పురూరవ రాజు మరియు దేవకన్య ఊర్వశి. (నాకు ఆ కథ అంతగా గుర్తుకులేదు). మన ఫేవరెట్ హీరోయిన్ను సినిమాలో సగం వేషం వేస్తే ఎంత ఆనందం పొందుతామో ఆ నాటకం విని అంత సంతోషం అనుభవించాను. అవును మరీ, ఆమెది మామూలు గొంతా? ఎంత సెక్సీగా వుంటుంది ఆ గొంతూ! పదహారేళ్ళ అందమయిన అమ్మాయి యవ్వనం ఆ గొంతులో తోణికిసలాడుతూవుంటే నాకు పిచ్చెక్కిపోయేది. అదే సమయాన ఆమె ఆకారం కూడా అంత అందంగా వుంటుందో లేక చుప్పనాతిలా వుంటుందో అనే అనుమానాలు పట్టిపీడించేవి. మొత్తానికి ఆ అనుమానం ఇన్నాళ్లకి తీరింది. ఆ గొప్ప స్వరానికి తగ్గట్టే ఆమె కూడా ఓ గొప్ప సుందరే. ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా తిరస్కరించిందట.

http://sarath-kaalam.blogspot.com/2012/03/blog-post_19.html

నాయొక్క ఈ క్రింది టపాలో ఉరి నవల గురించి ఒక పేరా:
http://sarath-kaalam.blogspot.com/2011/02/blog-post_5417.html

"అవును. ఇలాంటి కథలని అసంపూర్తి కథలు అంటారు. రచయిత తన కథని లేదా నవలని ఒక పాయింట్ దగ్గర ఆపేస్తాడు. పాఠకులు తమకు తోచినట్లుగా తమకు నచ్చినట్లుగా ఎంచక్కా ముగింపులు ఊహించుకోవచ్చును. మీరు యండమూరి తులసీదళం చదివే వుంటారు. అది చదివాక ఆ అమ్మాయి తులసి చివరికి ఎలా బాగుపడింది అన్నది ఎవరి విశ్వాసాల ప్రకారం వారు కాంక్లూజనుకి వస్తారు. అలాగే శరత్ కాలం రచన ఉరి నవలలో మూల కథలో కూడా అందులోని ముఖ్యపాత్ర ఉరి నుండి ఎలా బయటపడిందీ పాఠకులు పలు విధాలుగా ఆలోచించుకోవడానికి అవకాశం వుంటుంది. పాఠకులని సంతృప్తి పడనివ్వకుండా వారి మెదడులకు ఆ కథ లేదా నవల పూర్తి అయ్యాక కూడా పని కల్పించడమే రచయిత లేదా అసంపూర్తి నవలా విధానం యొక్క ఉద్దేశ్యంగా వుంటుంది. ఈ టెక్నిక్ తో రచనలు చెయ్యడం నాకు బాగా ఇష్టం"

నా 'శరత్ కాలం' బ్లాగులో ఉరి నవల గురించి కాయ గారి అభిప్రాయం:

"మీ కథలు నిజాలో కల్పితాలో తెలియటం లేదు... అంత వాస్తవికం గా ఉన్నాయి...
మీ నవలల లింకు అప్పుడెప్పుడో చూసినట్లు ఉరి పై క్లిక్ చేస్తే తెలిసింది... మొదలు పెట్టిన ... 51 వ పేజీ దాకా వచ్చి.. నన్ను చిన్న పిల్లవాన్ని చేసి అలా సాగతీస్తున్నారని... జంప్ లు చేస్తూ ఇదిగొ ఇప్పుడే ఒడగొట్టిన...
చదువుతుంటే సూపర్ గా అనిపించింది గురువు గారు... నా ఇంటర్ తరువాత ఎంసెట్ లొ 25000 రాంక్ రావటం... ఎంసెట్ లాంగ్టర్మ్ కోచింగ్ కి పోవటం... డిప్రెషన్ లో కి పోవటం... అది నా బీటెక్ అంతా కంటిన్యూ అవటం... తర్వాత నా మాస్టర్స్ కోసం ఇక్కడికి రావటం అన్ని ఒకసారి ఫ్లాష్ అయ్యాయి,, కాకపోతే ఏదో శాపం ఉంది అని సరిపెట్టుకుంటున్నాను.. నమ్మను .. కాకపోతే అనుకూలం ఐతే అబద్దం నిజమనుకుంటే బానే ఉంటుంది కదా.. "

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Print book kavali sir

Very Good Poems on Abdul Kalam SIR. SIR we miss you.

వ్యక్తిత్వ వికాసానికి,జీవితంలో ఎదగడానికి,ప్రపంచాన్ని చదవడానికి పనికివచ్చే పుస్తకం ...మీ ఇష్టం.!

Subscribe
Browse