
బియాండ్ కాఫీలో బియాండ్ కాఫీ అన్నిటికంటే నచ్చిన, బాగా గుర్తుండిపోయే కథ. స్పైన్ చిల్లింగ్ సైకో థ్రిల్లర్ రంగులో వేసిన నగర జీవితపు వాస్తవిక జీవన చిత్రం. వెతికితే మన చుట్టూ ఇలాంటి కథలెన్నో. విస్మరించడం కేవలం మనలోని ఎస్కేపిజం లేక గుడ్డితనం వల్ల. వహీద్ చాలా నిజాయితీగా రాసిన కథ అని అర్థమవడానికి అట్టే శ్రమ పడక్కర్లేదు. ఆస్తి, ఘటన కూడా బాగా నచ్చాయి. ఖదీర్ బాబు గారికి అభినందనలు.