నా పుస్తకం 'సాహిత్య ఝరి' గూర్చి నా మాటల్లో:
ప్రతి పలుకొక, వ్రాత చినుకై;
ప్రతి భావమొక, స్వాతి ముత్యమై;
ప్రతి స్పందనొక, వర్ష ధారయై;
ప్రతి ఊహొక, అక్షర రూపమై;
ప్రతి తలపొక, పద మొలకై;
ప్రతి కినుకొక, వాఖ్య మలుపై;
ప్రతి వలపొక, తేనె బిందువై;
ప్రతి విషాదమొక, మోక్ష గుళికై;
ప్రతి కవితొక, వచన సరోజమైన,
నా తొలితెన్గు కవనసంపుటీ
ప్రవాహమొక 'సాహిత్య ఝరి';
