http://kinige.com/kbook.php?id=2157
వంశీగారు పదములు తక్కువగా వాడి, "వాడి-వేడి" గల విశేషభావములను పొందుబరచగల శక్తిమంతుడు.
వీరు సంఘంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనలను పరిశీలించి తన హృదయాంతర్గత భావనలను కవితల రూపంలో "ప్రజానీకానికి - పాఠకులకు" తెలియజేయుటకు ఉత్సాహంతో కలం పట్టిన "నవకవి"
తెలుగు, ఆంగ్ల భాషలలో చిరుకవితల్లనిన ఈ యువకవి మరిన్ని కవితలల్లి పేరుప్రతిష్టలను పొందవలెనని ఆశిస్తున్నాను.
- శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ
* * *
శ్రీ ఆర్. యన్. వంశీధర్ గారి వచన కవితా సంపుటి "సాహిత్య ఝరి" ఒక ఝరిలాగా ప్రవహించింది.
ఉదాత్త భావనలను సరళమైన భాషలో వెల్లడించుట ఈ రచయిత యొక్క ప్రత్యేక ప్రతిభ. ఇది ఈ రచయిత యొక్క ప్రారంభదశ.
ముందు ముందు ఇతోధికమైన భాషాభావనలతో వీరి కవితా ఝరి పాఠకులకు హృదయానందమును కలిగించునని ప్రత్యయమేర్పడుచున్నది.
- శ్రీ కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళై
* * *
