సమాజాన్ని జాగృతపరిచే నవల.యువత ఆశయాలకు నిలువుటద్దంలా నిలిచిన నవల.ఈ నవల 1992 లో అనుకుంటాను.ఆంధ్రభూమి వీక్లీలో సీరియల్ గా చదివాను.అప్పుడే విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన నాలాంటి వాళ్లకు ఈ నవల ఒక ఇన్స్పిరేషన్ .ఏదోలా బ్రతికేయడం కాదు.ఇదిగో ఇలా బ్రతికేయాలి అని చెప్పే నవల.ఒక వ్యక్తిత్వవికాసాన్ని నవలగా అందించిన రచన.హీరో పాత్ర మన పక్కింటి అబ్బాయిలా ఉంటూనే మనకు కొండంత ధైర్యాన్ని ఆకాశమంత స్ఫూర్తిని ఇస్తుంది.
ప్రారంభ సన్నివేశం ముఖ్యంగా సత్యవర్ధన్ ఉరికొయ్యకు వేలాడే దృశ్యంలో అతని చివరిమాటలు వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడమే కాదు ఒక సమాధానాన్ని చెవుతాయి.
ఆముక్త పాత్రలోని అమాయకత్వం చివరికి ఎదురు తిరిగినప్పుడు వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది.
పాత్రల్లోని ఔచిత్యం వ్యక్తివం,మాటల్లోని గాఢత చదువరులను ఒక కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.యువతకు ఒక ఐకాన్ లా అనిపిస్తుంది.ఈ నవల విడుదలై ఇన్నేళ్ళైనా నవల తాలూకూ పరిమళం పాఠకులను సమ్మోహనపరుస్తూనే వుంది. ,
