నిఘంటు నిర్మాణం కష్టతరం. అనుభవం ఉండాలి. ఓర్పు ఉండాలి. ఇతరులు రాసిన రాతలతోటీ, చేసిన ప్రయోగాల తోటీ పరిచయం ఉండాలి. కాని ఎవ్వరో ఒకరు ప్రయత్నం చెయ్యక పోతే ఎలా? అందుకని ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను. నాకు చేతనయినంత మేరకి ఇందులో దొరికిన కొన్ని కొత్త మాటలని వాడి చూస్తాను. ఈ ప్రయోగం పలుకుతుందో లేదో ప్రజలే నిర్ణయించాలి. పుస్తకం తయారీ బాగుంది. చదవడానికి తేలికగా ఉంది. ఇలాంటి ప్రయత్నాలని మనమే ప్రోత్సహించాలి.
- వేమూరి వేంకటేశ్వరరావు
http://lolakam.blogspot.in/2013/07/blog-post.html
