సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుంది.ముఖ్యంగా హీరో అనగానే ఆరడుగుల ఆజానుభావుడు గాల్లో ఎగిరి ఫైట్ చేయడం అని కాకుండా వీల్ చైర్ ( చక్రాల కుర్చీ ) కి పరిమితమైన వ్యక్తి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించడం ఆ పాత్ర శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లినట్టు వుంది.అదే వ్యక్తి అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ "యాంటీ మాఫియా" కు చీఫ్ గా మారి ముల్లును ముల్లుతూనే తీయాలి అన్నట్టు మాఫియాను ధీ కొట్టే పాత్రగా మార్చడం సూపర్బ్ గా వుంది.
జర్నలిస్ట్ గా విభ్రమ పాత్ర అల్లరిగా ఉంటూ సీరియస్ గా పాత్రలో ఒదిగిపోయింది.నవల ప్రారంభంలో ప్రపంచంలో మాఫియా కనిపించని క్షణానికి అంకితం " అన్న రచయిత మాటలు ప్రతీఒక్కరిని ఆలోచింపజేస్తాయి.ఈ నవల గాడ్ ఫాదర్ పేరుతో ఆంధ్రభూమి లో కొన్నివారాలు చదివిన గుర్తు.నవల చిన్నదిగా ఉండడం కొంత నిరాశ.కానీ నవలలో ఉత్కంఠ ఎమోషన్స్ అద్భుతం.ఒక సినిమాను చూస్తున్నట్టు అనిపించింది.
