మాయాశిల్పం చదువరులను కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్ళింది.ఇలాంటి జానపద నవలలు ఇప్పుడు రాసేవారిని వ్రేళ్లమీద లెక్కించవచ్చు.చందమామ కథలా ,అమ్మజోలపాటలా వుంది.తెలుగుభాష మీద అభిమానాన్ని,జానపద నవలల మీద మక్కువను.సాహిత్యం పట్ల ఆసక్తిని అభిమానాన్ని పెంచేలా వుంది.కథనంలో కొత్తదనం బావుంది.
శృంగారాన్ని వీరత్వాన్ని భయానకాన్ని మంత్రతంత్రాలను ,అలనాటి రాచరికాన్ని,రాజ్యాలను ,పులి చేసే విన్యాసాలను..బాలన్స్ చేస్తూ కళ్ళు నవల వెంట పరుగులు తీసేలా వుంది.మేఘాలు తప్పుకోవడం,చక్కని ఆలోచన.నవల అలా చదువుతుంటే సమయం తెలియనంత బాగా వుంది.మనసుకు కళ్ళకు రిలీఫ్.చందమామ బాలమిత్ర వసంతబాల బొమ్మరిల్లు...వీటిలోటును తీర్చేలా చేసింది.ఇలాంటి నవలలు కినిగెలో మరిన్ని రావాలి.
