Comment(s) ...

పుస్తక సమీక్ష

విలువలు మధ్యతరగతి జీవితాల వెలలు. ఆ పై తరగతికి సంతోషమే పరమావధి.. కింది తరగతికి బతుకీడ్చమే ప్రధానం. అందుకే ఆ రెండింటి భారాన్ని మధ్యతరగతి మోస్తూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘కామోత్సవ్‌’ ఈ విషయాన్నే వెల్లడిస్తుంది ఉన్నత వర్గపు జీవన శైలిని నవల రూపంలో. కథానాయకుడు జ్ఞాన్‌.. చిత్రకారుడు. చిత్రకళ మీదే కాదు సాహిత్యం, చరిత్ర, సమకాలీన రాజకీయాల మీదా పట్టున్నవాడు. లెఫ్ట్‌ ఐడియాలజీ ప్రేమికుడు. ఎలీట్‌ కుటుంబపు అల్లుడు. ఆ లైఫ్‌స్టయిల్‌లోని సుఖభోగాలన్నిటినీ అనుభవిస్తుంటాడు, ఆస్వాదిస్తుంటాడు.

పోలీసు నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తిని కలిసి పోలీసులకు పట్టుబడి.. వాళ్ల కన్నుగప్పి పారిపోయి నిందితుడిగా వాళ్ల గాలింపులో ఉంటాడు. భార్య కీర్తి జ్ఞాన్‌ను కాపాడుకునే ప్రయత్నంతో ముంబై తీసుకెళ్తుంది. అక్కడ స్టార్‌ హోటల బస, సినిమా, వ్యాపార, రాజకీయవేత్తల, కళాకారుల పార్టీలతో కాలం వెలిబుచ్చుతుంటారు. అది ఏ మలుపు తీసుకొని ఎక్కడికి వెళ్తుందనే గమనం ఆసక్తిగా సాగుతుంది. ఈ క్రమంలో ఉన్నత వర్గాల జీవితాలను, సంబంధాలను, చట్టాలకతీతమైన వాళ్ల వెసులుబాటునూ చెప్తుందీ నవల. 1987లో అప్పటి ఆంధ్రజ్యోతిలో సీరియల్‌గా వచ్చిన కామోత్సవ్‌ను ఈ యేడు నవలగా తీసుకొచ్చారు. కాలతీతం కాని రచన. వర్తమానాన్నే ప్రతిబింబిస్తుందేమో అనిపిస్తుంటుంది పాఠకులకు.

అప్పట్లో ఈ సీరియల్‌ ఒక సంచలనం. అశ్లీల రచనగా కోర్ట్‌ దాకా వెళ్లింది. కాని ఆ కేసును కోర్ట్‌ కొట్టిపారేసింది. ఇప్పటి సాహిత్యమే కాదు, సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని కథాంశాలు, చిత్రీకరణలతో పోల్చుకుంటే కామెత్సవ్‌ మీద అశ్లీల రచన ముద్ర హాస్యాస్పదం అనిపిస్తుంది. ‘పేజ్‌ త్రీ’ సినిమా కంటే ఎన్నో ఏళ్ల ముందే తెలుగులో ఆ కల్చర్‌ మీద ఈ రచన వచ్చింది. పేజ్‌ త్రీ కల్చర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న పాఠకులకు ఆ కుతూహలాన్ని తీర్చే నవల కామోత్సవ్‌.

కామోత్సవ్‌
రచయిత.. గుంటూరు శేషేంద్ర శర్మ
ప్రచురణ: గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌
పేజీలు: 198, వెల.. 200 రూపాయలు
ప్రతులకు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పుస్తక దుకాణాల్లో దొరుకుతుంది.
Fun Day : Sakshi : Telugu Dina Patrika : 14- 02 - 2021

కామోత్సవ్
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

How to download PDF I'm paid money for it

మాయాశిల్పం మంత్రఖడ్గం నవల చాలా బావుంది.చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లపోయాం.అద్భుతమైన కథనంతో ఆకట్టుకుంది.

అద్భుతమైన నవల.మణిమేఘన పాత్ర అద్భుతం.ఎక్కడా విసుగు లేకుండా ఆహ్లాదంగా చదివించిన నవల.

what is the meaning of రూకలేువ

Subscribe
Browse